Google Chat స్వతంత్ర యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి

Google Chatను ఉపయోగించడానికి సులభమైన మార్గం కోసం, మీ Chrome బ్రౌజర్‌లో Google Chat స్వతంత్ర యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి. ఇది స్థానిక యాప్ అనుభవాన్ని అందిస్తుంది, అలాగే ఇది ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్ (PWA)

ముఖ్య గమనిక: Google Chat Chrome ఎక్స్‌టెన్షన్ అందుబాటులో ఉండదు. అదే రకమైన అనుభవం కోసం, స్వతంత్ర యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి.

మీరు ప్రారంభించే ముందు

Chat PWA స్వతంత్ర యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి, వీటిని నిర్ధారించుకోండి:

  • మీ పరికరం Google Chrome 73 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్‌ను రన్ చేస్తోందని నిర్దారించుకోండి.
    • Chrome మీ ఆటోమేటిక్ బ్రౌజర్ కానవసరం లేదు, కానీ Chat స్వతంత్ర యాప్‌ను ఉపయోగించడానికి అది తెరిచి ఉండాలి.
  • మీరు మీ కంప్యూటర్‌లో Chrome ఎక్స్‌టెన్షన్‌లను, యాప్‌లను ఇన్‌స్టాల్ చేయవచ్చు.
    • మీరు ఇన్‌స్టాలేషన్‌ను పూర్తి చేయలేకపోతే, అలాగే మీరు ఆఫీస్ లేదా స్కూల్ ఖాతాను ఉపయోగిస్తే, మీ Google Workspace అడ్మినిస్ట్రేటర్‌ను కాంటాక్ట్ చేయండి.

మీ కంప్యూటర్‌లో స్వతంత్ర యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి

  1. chat.google.com కు సైన్ ఇన్ చేయండి.
  2. మీ కంప్యూటర్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి, ఈ పద్ధతుల్లో ఒక దాన్ని ట్రై చేయండి:
    • యాప్‌ను ఇప్పటికే ఇన్‌స్టాల్ చేయకపోతే, యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి పాప్-అప్ విండో తెరుచుకుంటుంది.
      • చిట్కా: మీరు మొదట Google Chatను ఉపయోగించిన తర్వాత కొద్దిసేపటికి ఈ పాప్-అప్ విండో కనిపించవచ్చు.
    • Google Chromeకు పైన కుడి వైపున, URL బార్‌లో, ఇన్‌స్టాల్ చేయండి ఆ తర్వాత ఇన్‌స్టాల్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • Google Chromeకు పైన కుడి వైపున, Google Chromeను అనుకూలంగా మార్చండి, అలాగే కంట్రోల్ చేయండి ఆ తర్వాత Google Chatను ఇన్‌స్టాల్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కాలు:

  • మీరు ఇప్పటికే chat.google.com కు Google Chrome షార్ట్‌కట్‌ను క్రియేట్ చేసినట్లయితే, స్వతంత్ర యాప్ ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అవుతుంది. యాప్‌ను మాన్యువల్‌గా ఇన్‌స్టాల్ చేసే ఆప్షన్ మీకు ఉండదు.
  • Google Chrome నుండి యాప్‌ను తెరవడానికి, అడ్రస్ బార్‌లో, chrome://apps అని ఎంటర్ చేసి, Google Chatను క్లిక్ చేయండి.
  • Chromebookలో, మీరు లాంచర్ నుండి యాప్‌ను కనుగొనవచ్చు.

స్టార్టప్‌లో ఆటోమేటిక్‌గా స్వతంత్ర యాప్ తెరుచుకునేలా చేయండి

ముఖ్య గమనిక: ఈ దశలు Chrome OSలో పని చేయవు.

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. అడ్రస్ బార్‌లో, chrome://apps అని ఎంటర్ చేయండి.
  3. Chat స్వతంత్ర యాప్ పై కుడి క్లిక్ చేయండి.
  4. మీరు సైన్ ఇన్ చేసినప్పుడు యాప్‌ను ప్రారంభించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

Mac, Windows లేదా Linuxలో స్వతంత్ర యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. అడ్రస్ బార్‌లో, chrome://apps అని ఎంటర్ చేయండి.
  3. Chat స్వతంత్ర యాప్ పై కుడి క్లిక్ చేయండి.
  4. Chrome నుండి తీసివేయండి ఆ తర్వాత తీసివేయండి ఆప్షన్‌లను ఎంచుకోండి.

Chrome OSలో స్వతంత్ర యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, లాంచర్ ను తెరవండి.
  2. సెర్చ్ బార్‌లో, Google Chat కోసం సెర్చ్ చేయండి.
  3. సెర్చ్ ఫలితాల్లో, Chat స్వతంత్ర యాప్ పై కుడి క్లిక్ చేయండి.
  4. Chrome నుండి తీసివేయండి ఆ తర్వాత తీసివేయండి ఆప్షన్‌లను క్లిక్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7176236036460207823
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
1026838
false
false