Google Chatలో మీ లభ్యత స్టేటస్‌ను మార్చండి

మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటారో ఇతరులకు తెలియజేయడానికి, మీరు మీ Google Chat స్టేటస్‌ను మార్చవచ్చు.
స్టేటస్ చిహ్నం స్టేటస్ టెక్స్ట్ స్టేటస్ అర్థం
యాక్టివ్‌గా ఉన్నారు Gmail లేదా Google Chat తెరవబడి ఉంది.
అంతరాయం కలిగించవద్దు

Google Chat నోటిఫికేషన్‌లు మ్యూట్ చేయబడ్డాయి.

Google Workspace ఖాతాల విషయంలో, మీ స్టేటస్ డొమైన్ స్థాయిలో మాత్రమే కనిపిస్తుంది.

అందుబాటులో లేరు

మీరు ఇంటర్నెట్‌కు కనెక్ట్ కాలేదు.

మీరు 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఇన్‌యాక్టివ్‌గా ఉన్నారు.

మీరు "అందుబాటులో లేరు అని సెట్ చేయండి"ని మీ స్టేటస్‌గా ఎంచుకున్నారు.

ఇన్‌యాక్టివ్‌గా ఉన్నారు

మీరు గత 5 నిమిషాల నుండి Gmail లేదా Google Chatలో ఇన్‌యాక్టివ్‌గా ఉన్నారు.

ఇది డెస్క్‌టాప్‌లో మాత్రమే కనిపిస్తుంది.

 

చిట్కాలు:

  • మీరు స్పేస్‌ను ఏ వ్యక్తులతో అయితే షేర్ చేశారో ఆ వ్యక్తులు, మీరు ఎవరి చాట్ ఆహ్వానాన్ని అయితే ఆమోదించారో వారు, లేదా బ్లాక్ చేయబడని వ్యక్తులు మాత్రమే మీ స్టేటస్‌ను చూడగలరు.
  • మీ స్టేటస్ “అంతరాయం కలిగించవద్దు” అయితే:
    • మీ స్టేటస్‌ను “యాక్టివ్”కు మార్చే వరకు మీరు Chat లేదా Gmail నుండి మీ అన్ని పరికరాలలో నోటిఫికేషన్‌లను తాత్కాలికంగా మ్యూట్ చేస్తారు.
    • మీరు నోటిఫికేషన్‌లను ఎంత కాలం పాజ్ చేశారో వ్యక్తులకు తెలుస్తుంది, తద్వారా వారు తక్షణ ప్రతిస్పందనను ఆశించరు.
స్టేటస్ చిహ్నం స్టేటస్ టెక్స్ట్ స్టేటస్ అర్థం
యాక్టివ్‌గా ఉన్నారు Gmail లేదా Google Chat తెరవబడి ఉంది.
అంతరాయం కలిగించవద్దు

Google Chat నోటిఫికేషన్‌లు మ్యూట్ చేయబడ్డాయి.

*Workspace ఖాతాల కోసం ఇది డొమైన్ స్థాయిలో మాత్రమే కనిపిస్తుంది

అందుబాటులో లేరు
  • మీరు ఇంటర్నెట్‌కు కనెక్ట్ కాలేదు.
  • మీరు 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఇన్‌యాక్టివ్‌గా ఉన్నారు.
  • మీరు "అందుబాటులో లేరు అని సెట్ చేయండి"ని మీ స్టేటస్‌గా ఎంచుకున్నారు.
ఇన్‌యాక్టివ్‌గా ఉన్నారు మీరు గత 5 నిమిషాల నుండి Gmail లేదా Google Chatలో ఇన్‌యాక్టివ్‌గా ఉన్నారు.

మీ స్టేటస్‌ను మార్చండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmailను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, మీ స్టేటస్ ఇండికేటర్ పక్కన, కింది వైపు బాణం గుర్తును క్లిక్ చేయండి.
  3. ఈ ఆప్షన్‌లలో ఒక దాన్ని ఎంచుకోండి: ఆటోమేటిక్, అంతరాయం కలిగించవద్దు, లేదా అందుబాటులో లేరని సెట్ చేయండి.

అనుకూల స్టేటస్‌ను సెట్ చేయండి

  1. Chat లేదా Gmail‌కు వెళ్లండి.
  2. ఎగువున ఉన్న స్టేటస్ ఇండికేటర్ నుండి, కింది వైపు బాణం గుర్తును క్లిక్ చేయండి.
  3. 'స్టేటస్‌ను జోడించండి'ని క్లిక్ చేయండి
  4. ఎమోజిని ఎంపిక చేసుకోవడానికి, ప్రాంప్ట్‌ను ఫాలో అవ్వండి, స్టేటస్ మెసేజ్‌ను రాయండి, లేదంటే స్టేటస్‌ను ముగించండి లేదా క్లియర్ చేయండి.
  5. పూర్తయింది ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

అనుకూల స్టేటస్‌ను తొలగించండి

  1. Chat లేదా Gmail‌కు వెళ్లండి.
  2. ఎగువున ఉన్న స్టేటస్ ఇండికేటర్ నుండి, కింది వైపు బాణం గుర్తును క్లిక్ చేయండి.
  3. తొలగించడానికి, స్టేటస్‌ను క్లిక్ చేయండి.
  4. 'X'ను క్లిక్ చేయండి.
  5. పూర్తయింది ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

Workspace ఖాతాల కోసం క్యాలెండర్ స్టేటస్‌ను ఆఫ్ చేయండి

Workspace ఖాతాల కోసం, మీ క్యాలెండర్ స్టేటస్ ఆధారంగా మీ చాట్ స్టేటస్ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది. ఉదాహరణకు, మీరు మీటింగ్‌లో ఉన్నప్పుడు లేదా మీరు ఆఫీస్‌లో లేనప్పుడు మీ స్టేటస్ అప్‌డేట్ అవుతుంది. 

  • ఎవరైనా మీకు డైరెక్ట్ మెసేజ్ పంపినప్పుడు, వారు ఎగువన మీ పేరు పక్కన మీ క్యాలెండర్ స్టేటస్‌ను చూస్తారు. 
  • గ్రూప్ సంభాషణలు, స్పేస్‌లు క్యాలెండర్ స్టేటస్‌ను చూపవు.

మీ అడ్మినిస్ట్రేటర్ కింద పేర్కొన్న వాటిని కంట్రోల్ చేస్తారు:

  • “ఆఫీస్‌లో లేరు” లేదా “ఫోకస్ టైమ్‌లో ఉన్నారు” వంటి Chatలో స్టేటస్ లభ్యత ఆప్షన్‌లు
  • Chatలో క్యాలెండర్ స్టేటస్ ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే కావాలా వద్దా.

మీ క్యాలెండర్ స్టేటస్‌ను షేర్ చేయాలని మీకు లేకపోతే, మీరు దాన్ని ఆఫ్ చేయవచ్చు.

  1. Google Calendarకు వెళ్లండి.
  2. ఎగువ కుడి వైపున, సెట్టింగ్‌ల మెనూ ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. ఎడమ వైపున, “నా క్యాలెండర్ కోసం సెట్టింగ్‌లు” ఆప్షన్ కింద, మీ క్యాలెండర్‌ను ఎంచుకోండి.
  4. “ఈవెంట్‌ల కోసం యాక్సెస్ అనుమతుల” కింద “యాక్సెస్ అనుమతుల ద్వారా పరిమితం చేయబడిన ఇతర Google యాప్‌లలో క్యాలెండర్ సమాచారాన్ని చూడండి” పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకోండి. 

చిట్కా: మీరు చేసిన మార్పులు ఆటోమేటిక్‌గా సేవ్ చేయబడ్డాయి.

Google Chat లేదా Gmailలో నోటిఫికేషన్‌లను తాత్కాలికంగా ఆపివేయండి

  1. Chat లేదా Gmail‌కు వెళ్లండి.
  2. ఎగువున, మీ స్టేటస్‌ను క్లిక్ చేయండి.
  3. అంతరాయం కలిగించవద్దు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.  
  4. మీ ప్రాధాన్య వ్యవధిని సెట్ చేయడానికి, లిస్ట్ నుండి వ్యవధిని ఎంచుకోండి లేదా "నిర్దిష్ట సమయం వరకు" అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.  
  5. సెట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: మ్యూట్ వ్యవధి గడువు ముగిసిన తర్వాత నోటిఫికేషన్‌లు ఆటోమేటిక్‌గా తిరిగి ఆన్ అవుతాయి. ఎంచుకున్న సమయ వ్యవధి కంటే ముందే మ్యూట్‌ను ముగించడానికి, మీ స్టేటస్ and then అంతరాయం కలిగించవద్దు and then అంతరాయం కలిగించవద్దును ఆఫ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

Google Chat లేదా Gmailలో పాజ్ చేయబడిన నోటిఫికేషన్‌ల కోసం సమయాన్ని షెడ్యూల్ చేయండి

  1. Google Chat లేదా మీ Gmail ఖాతాఅనే ఆప్షన్‌కు వెళ్లండి.
  2. పైన, మీ స్టేటస్‌ను క్లిక్ చేయండి.
  3. అంతరాయం కలిగించవద్దు ఆ తర్వాత అంతరాయం కలిగించవద్దు షెడ్యూల్‌ను సెట్ చేయండి అనే ఆప్షన్‌లను ఎంచుకోండి.
  4. “అంతరాయం కలిగించవద్దు షెడ్యూల్స్” కింద కొత్తది క్రియేట్ చేయండి ఆప్షన్‌ను క్రియేట్ చేయండి.
  5. మీరు నోటిఫికేషన్‌లను పాజ్ చేయాలనుకుంటున్న సమయాల వివరాలను ఎంటర్ చేసి, ఆపై సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  6. ఆప్షనల్: మీ టైమ్ జోన్‌ను మీ అంతరాయం కలిగించవద్దు షెడ్యూల్‌కు సరిపోల్చడానికి:
    1. సెట్టింగ్‌ల మెనూను తెరవండి settings
    2. బాక్స్‌ను ఎంపిక చేసి, సేవ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: మీరు పలు షెడ్యూల్స్‌ను క్రియేట్ చేయవచ్చు, ప్రతి షెడ్యూల్‌కు నోటిఫికేషన్‌లు పాజ్ చేయబడతాయి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10632550883051346728
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
1026838
false
false