స్పేస్‌ల గురించి తెలుసుకోండి

ముఖ్య గమనిక: చాట్ సర్వీస్‌కు యాక్సెస్ ఉన్న డొమైన్‌లోని మెంబర్‌లందరికీ స్పేస్ పేర్లు కనిపిస్తాయి.

ఒక టాపిక్, ప్రాజెక్ట్ లేదా ఉమ్మడి ఆసక్తి గురించి వ్యక్తుల గ్రూప్ లేదా సంస్థతో కమ్యూనికేట్ చేయడానికి, Google Chatలో స్పేస్‌ను క్రియేట్ చేయండి. ఉదాహరణకు, మీరు భవిష్యత్తు మార్కెటింగ్ క్యాంపెయిన్‌కి సంబంధించిన టైమ్‌లైన్‌ల గురించి చర్చలు జరపడానికి స్పేస్‌ను క్రియేట్ చేయవచ్చు.

స్పేస్‌లతో, మీరు వీటిని చేయవచ్చు:

  • ఉమ్మడి ఆసక్తి ఉండే అంశం ప్రధానంగా లేదా మీ ప్రాజెక్ట్‌ల చుట్టూ మీ సంభాషణను జరపవచ్చు లేదా ఆర్గనైజేషన్‌కి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌లు చేయవచ్చు.
  • వివరణాత్మక చర్చ అవసరమయ్యే అంశాల కోసం థ్రెడ్‌లను క్రియేట్ చేయవచ్చు.
  • ఫైల్‌లను షేర్ చేయవచ్చు, మెంబర్‌లకు టాస్క్‌లను కేటాయించవచ్చు.
  • మీ స్పేస్ లోపల సులభమైన వర్క్‌ఫ్లోలను క్రియేట్ చేయడానికి యాప్‌లను జోడించవచ్చు.

ఇతరులతో కలిసి పని చేయడానికి లేదా అనౌన్స్‌మెంట్‌లు చేయడానికి స్పేస్‌లను ఉపయోగించండి

ముఖ్య విషయం: మీరు మీ వ్యక్తిగత Google ఖాతాతో Chatని ఉపయోగిస్తుంటే, ఇతరులతో కలిసి పని చేయడానికి మాత్రమే స్పేస్‌లను క్రియేట్ చేయవచ్చు.

ఇతరులతో కలిసి పని చేయడానికి స్పేస్‌లను ఉపయోగించండి

  • వ్యక్తిగత, ఆఫీస్ లేదా స్కూల్ సంబంధిత ఖాతాలకు అందుబాటులో ఉంది.
  • ముఖ్యమైన ప్రాజెక్ట్ లేదా టీమ్ అప్‌డేట్‌ల కోసం లేదా పర్యాటకం, వంటకాలు లాంటి ఉమ్మడి ఆసక్తులు ఉండే వారితో కనెక్ట్ కావడానికి ఈ రకమైన స్పేస్‌ని ఉపయోగించండి.
  • గ్రూప్‌లోని అందరూ మెసేజ్‌లను పోస్ట్ చేయగలరు, రియాక్షన్ తెలియజేయగలరు, రిప్లయి ఇవ్వగలరు.
  • మీరు ప్రధాన సంభాషణ విండోలో మొత్తం గ్రూప్‌కి మెసేజ్‌ని పంపవచ్చు లేదా మెసేజ్‌కి డైరెక్ట్‌గా రిప్లయి ఇవ్వవచ్చు, అలాగే థ్రెడ్‌ను క్రియేట్ చేయవచ్చు.

అనౌన్స్‌మెంట్‌ల కోసం స్పేస్‌లను ఉపయోగించండి

  • ఆఫీస్ లేదా స్కూల్ ఖాతాలకు అందుబాటులో ఉంది.
  • ముఖ్యమైన వార్తలు, అప్‌డేట్‌లను మీ టీమ్‌తో షేర్ చేసుకోవడానికి ఈ రకమైన స్పేస్‌ని ఉపయోగించండి.
  • స్పేస్ మేనేజర్‌గా, మీరు వీటిని చేయవచ్చు:
    • ప్రధాన సంభాషణ విండోలో అనౌన్స్‌మెంట్‌లను పోస్ట్ చేయవచ్చు.
    • మీ అనౌన్స్‌మెంట్‌పై స్పేస్ మెంబర్ కామెంట్‌లకు ప్రతిస్పందించవచ్చు.
    • రిప్లయిలను ఆఫ్ చేయండి.
  • స్పేస్ మెంబర్‌గా, మీరు నేరుగా మాత్రమే అనౌన్స్‌మెంట్‌లకు రియాక్ట్ కావచ్చు, రిప్లయి ఇవ్వవచ్చు.
  • మీరు అనౌన్స్‌మెంట్‌ల కోసం స్పేస్‌ను క్రియేట్ చేసిన తర్వాత, స్పేస్ రకాన్ని మీరు మార్చలేరు.

థ్రెడ్‌లతో స్పేస్‌లను ఆర్గనైజ్ చేయండి

స్పేస్‌లోని ప్రధాన సంభాషణతో పాటు, మీరు ఎలాంటి మెసేజ్‌కి అయినా రిప్లయి ఇవ్వవచ్చు, విడిగా థ్రెడ్‌ను క్రియేట్ చేయవచ్చు. మీరు ముఖ్యమైన చర్చలను ట్రాక్ చేయడానికి థ్రెడ్‌లను ఉపయోగిస్తూ, ప్రధాన సంభాషణను గందరగోళం లేకుండా ఉంచవచ్చు.

థ్రెడ్‌లో, మీరు వీటిని చేయవచ్చు:

  • మెసేజ్‌లను పంపవచ్చు, వాటికి రిప్లయి ఇవ్వవచ్చు
  • థ్రెడ్‌ను ఫాలో చేయవచ్చు లేదా అన్‌ఫాలో చేయవచ్చు.
  • థ్రెడ్‌లో కొత్త మెసేజ్‌ల గురించి మీకు ఎలా తెలియజేయాలనేది మార్చవచ్చు.

స్పేస్‌లో థ్రెడ్‌లను ఉపయోగించండి.

స్పేస్ యాక్సెస్‌ను మేనేజ్ చేయండి

ఆఫీస్ లేదా స్కూల్ ఖాతాలలో, మీరు స్పేస్‌ను ప్రైవేట్‌గా ఉండేలా లేదా అందరికీ కనిపించేలా లేదా మీ సంస్థలోని టార్గెట్ ప్రేక్షకులకు కనిపించేలా సెట్ చేసుకోవచ్చు.

ప్రైవేట్ స్పేస్‌ల గురించి తెలుసుకోండి

  • టీమ్‌లు, ప్రాజెక్ట్‌లు, గ్రూప్‌ల మధ్య చర్చల కోసం తగినది.
  • స్పేస్‌లో చేరాలంటే తప్పనిసరిగా స్పేస్ మెంబర్ మిమ్మల్ని ఆహ్వానించాలి లేదా మిమ్మల్ని స్పేస్‌కి జోడించాలి.
  • మీరు మెంబర్ అయితే లేదా స్పేస్‌కి ఆహ్వానం అందుకుని ఉంటే తప్పితే, మీరు Chatలో దాని కోసం బ్రౌజ్ చేయలేరు.

సంస్థలోని వారు చేరగల స్పేస్‌ల గురించి తెలుసుకోండి

  • నిర్దిష్ట వ్యక్తులు లేదా టీమ్‌లకు పరిమితం కాని అంశాల కోసం తగినది.
  • స్పేస్ కనిపించినప్పుడు, మీరు స్పేస్‌ను బ్రౌజ్ చేయవచ్చు, ప్రివ్యూ చూడవచ్చు, అందులో చేరవచ్చు.
  • మీకు స్పేస్‌కి లింక్ ఉంటే, ఆ లింక్‌తో మీరు అందులో చేరవచ్చు.

స్పేస్‌లు, డైరెక్ట్ మెసేజ్‌ల మధ్య తేడాలు

మీరు వ్యక్తుల గ్రూప్‌తో స్పేస్‌ల ద్వారా కమ్యూనికేట్ చేయవచ్చు లేదా Chatలో డైరెక్ట్ మెసేజ్‌లు పంపవచ్చు. రెండు రకాల కమ్యూనికేషన్ భిన్న మార్గాలలో పనికొస్తుంది, అలాగే విభిన్నమైన ప్రయోజనాలు ఉంటాయి:

  • Spaces: ఇది వ్యక్తులు ఫైల్స్‌ను షేర్ చేయడం, టాస్క్‌లను కేటాయించడం, కనెక్ట్ అయ్యి ఉండటం కోసం రూపొందించిన ఉమ్మడి స్థలం.
  • డైరెక్ట్ మెసేజ్‌లు: గ్రూప్‌తో డైరెక్ట్‌గా చాట్ చేయవచ్చు. ఉదాహరణకు, మీటింగ్ తర్వాత, త్వరగా చర్చించడం కోసం డైరెక్ట్ మెసేజ్‌లను ఉపయోగించండి.
  Spaces డైరెక్ట్ మెసేజ్‌లు
మెసేజ్ హిస్టరీ

హిస్టరీ ఆటోమేటిక్‌గా ఆన్ చేయబడి ఉంటుంది, అలాగే మీ సంస్థ పాలసీ ఆధారంగా ఉంచబడుతుంది. మెసేజ్ హిస్టరీ గురించి మరింత తెలుసుకోండి.

వ్యక్తిగత ఖాతాల కోసం, మీరు హిస్టరీని ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. Google Workspace ఖాతాల కోసం, హిస్టరీ అన్నది మీ సంస్థ సెట్టింగ్‌లపై ఆధారపడి ఉంటుంది. మెసేజ్ హిస్టరీ గురించి మరింత తెలుసుకోండి.

పేరు

స్పేస్ మేనేజర్ స్పేస్ పేరును ఎంచుకుంటారు.

మీరు Google Workspace ఖాతాను ఉపయోగిస్తూ, మీ సంస్థలో ఎవరైనా స్పేస్‌ను క్రియేట్ చేసినట్లయితే, మీరు స్పేస్ పేరును మార్చవచ్చు.

ఒకవేళ స్పేస్ వ్యక్తిగత ఖాతా ద్వారా క్రియేట్ అయి ఉంటే, ఎవరైనా స్పేస్ మెంబర్ స్పేస్ పేరును మార్చవచ్చు.

మెంబర్పే ర్లు లిస్ట్ చేయబడతాయి.

వివరణ స్పేస్ మేనేజర్ రూమ్ వివరణను ఎంచుకుంటారు. డైరెక్ట్ మెసేజ్‌లకు వివరణలు ఉండవు.
ఆటోమేటిక్ నోటిఫికేషన్‌లు సంభాషణలో ఉన్న మెంబర్‌లు లేదా @తో మెంబర్‌లను పేర్కొన్నప్పుడు వారికి తెలియజేయబడుతుంది. ప్రతి మెసేజ్‌కు మెంబర్‌లకు నోటిఫికేషన్ వస్తుంది.
మెంబర్‌షిప్

మెంబర్‌లు స్పేస్ నుండి నిష్క్రమించవచ్చు. స్పేస్‌లో తిరిగి చేరడానికి తప్పనిసరిగా మరొక మెంబర్ జోడించాలి లేదా వారిని తిరిగి ఆహ్వానించాలి.


చిట్కా: స్పేస్ అనేది ఎవరైనా చేరగల స్పేస్‌గా ఉంటే, మీరు ఎప్పుడైనా మళ్లీ అందులో చేరవచ్చు.

మెంబర్‌లు వెళ్లిపోవచ్చు, మళ్లీ చేరవచ్చు.

చిట్కా: డిసెంబర్ 2020కి ముందు క్రియేట్ అయిన డైరెక్ట్ మెసేజ్‌ల విషయంలో, మెంబర్‌లు వెళ్లిపోలేరు.
అదే వ్యక్తులతో పలు చాట్ స్పేస్‌లు అదే గ్రూప్‌తో 2 లేదా అంతకంటే ఎక్కువ స్పేస్‌లను కలిగి ఉండవచ్చు. అదే గ్రూప్‌తో 2 లేదా అంతకంటే ఎక్కువ సంభాషణలను కలిగి ఉండవచ్చు.
టాస్క్‌లను క్రియేట్ చేయడం లేదా కేటాయించడం ఇతర స్పేస్ మెంబర్‌ల కోసం టాస్క్‌లను క్రియేట్ చేయవచ్చు, కేటాయించవచ్చు. పేరు లేని గ్రూప్ సంభాషణలకు టాస్క్ ఫీచర్‌లు ఉండవు.
షేర్ చేసిన ఫైల్స్ ఫైల్స్‌ను షేర్ చేయవచ్చు, స్పేస్‌తో షేర్ చేసిన ఫైల్స్ లిస్ట్‌ను కనుగొనవచ్చు. గ్రూప్‌తో ఫైల్స్‌ను షేర్ చేయవచ్చు, కానీ ఫైల్స్ లిస్ట్‌ను కనుగొనడం సాధ్యం కాదు.

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8613368253583900840
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
1026838
false
false