Google Chat మెసేజ్‌ల కోసం సెర్చ్ చేయండి

Google Chatలో, మీరు వీటిని సెర్చ్ చేయవచ్చు:

  • మీ అన్ని మెసేజ్‌లలో.
  • నిర్దిష్ట వ్యక్తులకు సంబంధించిన మెసేజ్‌ల కోసం.
  • ఇమేజ్‌లు లాంటి నిర్దిష్ట రకాల కంటెంట్ ఉండే మెసేజ్‌ల కోసం.

ముఖ్య గమనికలు:

  • Gmailలో Chat మెసేజ్‌ల కోసం సెర్చ్ చేయడానికి, Gmailలో Chatను ఆన్ చేయండి.
  • మీరు చేరిన లేదా చేరగల సంభాషణలలో మెసేజ్‌ల కోసం సెర్చ్ చేయవచ్చు.
  • మీ సెర్చ్ ఫలితాలను ఫిల్టర్ చేయడానికి, మీరు సెర్చ్ ఆపరేటర్‌లను కూడా ఉపయోగించవచ్చు.
  • మీరు Gmail APIని ఉపయోగించి మెసేజ్‌లను సెర్చ్ చేయలేరు.
  • మిమ్మల్ని చేరడానికి ఆహ్వానించినా కూడా, మీరు వేరే సంస్థకు చెందిన సంభాషణలలో లేదా స్పేస్‌లలో మెసేజ్‌ల కోసం సెర్చ్ చేయలేరు.

Chat, Gmailలలో మెసేజ్‌ల కోసం సెర్చ్ చేయండి

  1. మీ Android ఫోన్‌లో లేదా టాబ్లెట్‌లో, Chat యాప్ ను లేదా Gmail యాప్ ను తెరవండి.
    • Gmailలో: దిగువున, Chat ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  2. ఎగువున, సెర్చ్ టెక్స్ట్‌ను ఎంటర్ చేయండి.
  3. ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • దిగువ, మీ కీబోర్డ్‌లో, Search ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • ఇటీవలి సెర్చ్‌ను ట్యాప్ చేయండి.
  4. ఫలితాన్ని తెరవడానికి, దీన్ని ట్యాప్ చేయండి.

స్పేస్‌లో లేదా సంభాషణలో మెసేజ్‌ల కోసం సెర్చ్ చేయండి

  1. Chatలో, సెర్చ్ చేయడానికి సంభాషణను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున, మరిన్ని ఆప్షన్‌లు and then ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీ సెర్చ్ టెక్స్ట్‌ను ఎంటర్ చేయండి.
  4. ఫలితాన్ని తెరవడానికి, దాన్ని ట్యాప్ చేయండి.

మెసేజ్‌లను ఫిల్టర్ చేసి, క్రమపద్ధతిలో అమర్చండి

  1. Chatలో, ఎగువున, సెర్చ్ టెక్స్ట్‌ను ఎంటర్ చేయండి.
    • మీరు టెక్స్ట్‌ను ఎంటర్ చేసేటప్పుడు, కింద ఫిల్టర్‌లు కనిపిస్తాయి.
  2. ఈ కింది రకాల మెసేజ్‌లను కనుగొనడానికి ఒక ఫిల్టర్‌ను ఎంచుకోండి:
    • పంపిన వారు: నిర్దిష్ట వ్యక్తుల నుండి వచ్చిన మెసేజ్‌లు.
    • దీనిలో చెప్పినవి: నిర్దిష్ట సంభాషణ లేదా స్పేస్‌లో చెప్పబడిన మెసేజ్‌లు.
    • అటాచ్‌మెంట్: డాక్యుమెంట్‌లు, స్ప్రెడ్‌షీట్‌లు, స్లయిడ్‌లు మొదలైనవి ఉండే మెసేజ్‌లు.
    • తేదీ: నిర్దిష్ట తేదీల పరిధిలో పంపబడిన మెసేజ్‌లు.
    • లింక్ గలవి: లింక్‌లు ఉన్న మెసేజ్‌లు.
    • నన్ను పేర్కొన్నవి: మిమ్మల్ని పేర్కొన్న మెసేజ్‌లు.
    • నేను మాత్రమే ఉన్న సంభాషణలు: మీరు మెంబర్‌గా ఉన్న సంభాషణలలోని మెసేజ్‌లు.
  3. ఆప్షనల్: మెసేజ్‌లను క్రమపద్ధతిలో అమర్చడానికి, ఫిల్టర్‌ల కింద, మెనూను క్రమపద్ధతిలో అమర్చండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • అత్యంత సందర్భోచితం: మెసేజ్‌లను అవి మీ సెర్చ్ టెక్స్ట్‌కు సంబంధించి ఎంత సందర్భోచితంగా ఉన్నాయనే దాని ఆధారంగా క్రమపద్ధతిలో అమర్చండి.
    • అత్యంత ఇటీవలివి: మెసేజ్‌లను అవి ఎంత ఇటీవలివి అనే అంశం ఆధారంగా క్రమపద్ధతిలో అమర్చండి.
  4. సెర్చ్ ఫలితాన్ని ట్యాప్ చేయండి.
    • మీరు చేరని స్పేస్‌లలోని ఫలితాలు కనిపించవచ్చు. చేరడానికి, మెసేజ్ పక్కన, చేరండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

సూచించిన సెర్చ్ ఫలితాలను తొలగించండి

మీరు Chat సెర్చ్ బార్‌లో ఎంటర్ చేసినప్పుడు, మీ సెర్చ్ హిస్టరీ ఆధారంగా సూచనలు కనిపించవచ్చు. మెసేజ్‌లను కనుగొనడానికి, మీరు సూచించిన సెర్చ్ ఫలితాన్ని ఎంచుకోవచ్చు.

  • సూచనలు అనేవి వాటి వినియోగం తర్వాత 90 రోజుల పాటు స్టోర్ చేయబడతాయి.
  • సూచనలకు సంబంధించిన సెర్చ్ హిస్టరీ అనేది Chat, Gmailలోని Chatల మధ్య షేర్ చేయబడదు.
  • మీరు మీ ఇటీవలి సెర్చ్‌లను లేదా మీ మొత్తం సెర్చ్ హిస్టరీని తొలగించవచ్చు.
  1. Chatలో, సెర్చ్ బార్‌ను ట్యాప్ చేయండి.
  2. “ఇటీవలి సెర్చ్‌లు” అనే విభాగంలో, మీరు కింద పేర్కొన్న పనులు చేయవచ్చు:
    • ఇటీవలి సెర్చ్‌ను తొలగించడం: సెర్చ్ ఐటెమ్‌ను ట్యాప్ చేసి ఉంచండి ఆ తర్వాత తొలగించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • అన్ని సెర్చ్‌లను తొలగించడం: అన్నింటిని తొలగించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
18338708448105995990
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
1026838
false
false