Google Chatలోని స్పేస్‌లో చేరండి

మీరు స్పేస్‌లో చేరడానికి ఆహ్వానించబడినప్పుడు, ఆ స్పేస్‌ను ప్రివ్యూ చేసి, దాని మెసేజ్ హిస్టరీని చూడవచ్చు.

మీరు స్పేస్ నుండి నిష్క్రమించినప్పుడు, కింద పేర్కొన్నవి చేయలేరు:

  • మరొక యూజర్ మిమ్మల్ని జోడించడం లేదా ఆహ్వానించడం చేస్తే మినహా మీరు మళ్లీ ఆ స్పేస్‌లో చేరలేరు.
  • యాక్టివ్ సంభాషణ థ్రెడ్‌లకు సంబంధించిన అప్‌డేట్‌లను పొందరు.

మీరు స్పేస్‌లో మళ్లీ చేరినట్లయితే, మీరు మొత్తం మెసేజ్ హిస్టరీని చూడగలరు. ఎవరైనా మిమ్మల్ని స్పేస్ నుండి తీసివేస్తే, మీరు మళ్లీ ఆహ్వానించబడాలి.

చిట్కా: స్పేస్ అనేది ఎవరైనా చేరగల స్పేస్‌గా ఉంటే, మీరు ఎప్పుడైనా మళ్లీ అందులో చేరవచ్చు. సంస్థలోని వారు చేరగల స్పేస్‌ల గురించి తెలుసుకోండి.

స్పేస్‌లో చేరండి

  1. మీ iPhoneలో లేదా iPadలో, Chat యాప్ ను లేదా Gmail యాప్ ను తెరవండి.
    • Gmailలో: కింద, Chat ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  2. కింది నావిగేషన్ మెనూలో, కొత్త చాట్ ఆ తర్వాత స్పేస్‌లను బ్రౌజ్ చేయండి ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  3. స్పేస్ కోసం సెర్చ్ చేయండి.
    • మిమ్మల్ని ఆహ్వానించిన స్పేస్‌లు లిస్ట్‌లో పైన కనిపిస్తాయి.
  4. స్పేస్‌లో చేరడానికి, జోడించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • లేదా ప్రివ్యూలో, చేరండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. ఆప్షనల్: స్పేస్ ప్రివ్యూను చూడటానికి, స్పేస్ పేరును ట్యాప్ చేయండి.
    • మీరు స్పేస్ ప్రివ్యూను చూసినప్పుడు, మెసేజ్‌లను చదవగలరు, కానీ మీరు సంభాషణలో పాల్గొనలేరు లేదా నోటిఫికేషన్‌లను పొందలేరు.

చిట్కా: మరిన్ని ఆప్షన్‌ల కోసం సంభాషణను నొక్కి, పట్టుకోండి.

స్పేస్ నుండి నిష్క్రమించండి

  1. మీ iPhoneలో లేదా iPadలో, Chat యాప్ ను లేదా Gmail యాప్ ను తెరవండి.
    • Gmailలో: కింద, Chat ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  2. కింద నావిగేషన్ మెనూలో, Spaces ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు నిష్క్రమించాలనుకుంటున్న స్పేస్‌ను తెరవండి.
  4. ఎగువున, స్పేస్ పేరును ట్యాప్ చేయండి.
  5. నిష్క్రమించండి ఆ తర్వాత స్పేస్ నుండి నిష్క్రమించండి ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.

చిట్కా: మరిన్ని ఆప్షన్‌ల కోసం సంభాషణను నొక్కి, పట్టుకోండి.

స్పేస్‌లో మళ్లీ చేరండి

  1. మీ iPhoneలో లేదా iPadలో, Chat యాప్ ను లేదా Gmail యాప్ ను తెరవండి.
    • Gmailలో: కింద, Chat ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  2. కింది నావిగేషన్ మెనూలో, కొత్త చాట్ ఆ తర్వాత స్పేస్‌లను బ్రౌజ్ చేయండి ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  3. స్పేస్ కోసం సెర్చ్ చేయండి.
  4. జోడించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

చిట్కా: మీరు క్రియేట్ చేసిన స్పేస్‌ను తొలగించవచ్చు. స్పేస్‌ను తొలగించడం ఎలాగో తెలుసుకోండి.

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5511647442829793470
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
1026838
false
false