స్క్రీన్ రీడర్‌తో Google Chatను ఉపయోగించండి

మీరు Google Chatతో ఒక వ్యక్తికి లేదా పలు వ్యక్తులకు డైరెక్ట్ మెసేజ్‌లను పంపవచ్చు. టీమ్‌తో ప్రస్తుతం కొనసాగుతున్న సంభాషణల కోసం, మీరు అందరికీ ఒకేసారి మెసేజ్ పంపడానికి స్పేస్‌ను క్రియేట్ చేయవచ్చు.

అందుబాటులో ఉంటే, మీరు మీ వర్క్‌ను ఆటోమేట్ చేయడానికి యాప్‌లను కూడా ఉపయోగించవచ్చు. Google Chatలో యాప్‌లను ఉపయోగించడానికి, మీరు తప్పనిసరిగా వర్క్ లేదా స్కూల్ ఖాతాను ఉపయోగించాలి, అలాగే యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి మీ Google Workspace అడ్మినిస్ట్రేటర్ మీకు తప్పనిసరిగా అనుమతి ఇవ్వాలి.

పరిచయం

ఈ ఆర్టికల్, హెడ్డింగ్‌లతో విభాగాలుగా విభజించబడింది. ఆర్టికల్‌లోని నిర్దిష్ట విభాగానికి వెళ్లడానికి కింది లింక్‌లను ఉపయోగించండి.

క్విక్ స్టార్ట్

ఈ ఆర్టికల్ chat.google.com పేజీకి సంబంధించినది, అలాగే Chatను ఉపయోగించడంలో మీకు సహాయం చేయడానికి చాలా గొప్ప సమాచారాన్ని కలిగి ఉంది. మొత్తం ఆర్టికల్‌ను చదవడానికి సమయం పట్టవచ్చు. మీరు త్వరగా ప్రారంభించాలనుకుంటే, డైరెక్ట్ మెసేజ్‌లలో, స్పేస్‌లలో మెసేజ్‌లను చదవడానికి, పంపడానికి ఈ క్విక్ చిట్కాలను ఉపయోగించండి.

  • JAWSలో: వర్చువల్ కర్సర్‌ను ఆఫ్ చేయండి.
  • NVDAలో: ఫోకస్ మోడ్‌కు మారండి.
  • ChromeOSలో: స్టిక్కీ మోడ్‌ను ఆఫ్ చేయండి.
  • MacOSలో: క్విక్ నావిగేషన్‌ను ఆఫ్ చేయండి.

మీరు అందుకునే చాట్‌లను చదవడానికి:

  1. చాట్‌ల లిస్ట్‌కు ఫోకస్‌ను తరలించడానికి h కీని, ఆపై c నొక్కండి.
  2. కావాలనుకున్న చాట్‌పై ఫోకస్ కేంద్రీకరించబడే వరకు పై వైపు బాణం లేదా కింది వైపు బాణం కీని నొక్కండి.
  3. చాట్‌ను తెరిచి, మెసేజ్‌లను టైప్ చేయడానికి మెసేజ్ ఎడిట్ ఫీల్డ్‌కు ఫోకస్‌ను తరలించడానికి Enter నొక్కండి.
  4. మెసేజ్ ఎడిట్ ఫీల్డ్ నుండి నిష్క్రమించి, మెసేజ్‌ల లిస్ట్‌కు ఫోకస్‌ను తరలించడానికి Escape నొక్కండి.
  5. మెసేజ్‌లను రివ్యూ చేయడానికి పై వైపు లేదా కింది వైపు బాణం కీని నొక్కండి.
  6. ఫోకస్‌ను తిరిగి మెసేజ్ ఎడిట్ ఫీల్డ్‌కు తరలించడానికి r కీని నొక్కండి.

ఇటీవలి మెసేజ్‌లను రివ్యూ చేసున్న సమయంలో, మెసేజ్ ఎడిట్ ఫీల్డ్‌పై ఫోకస్ ఉంచడానికి:

  • Windowsలో: Alt + {నంబర్} నొక్కండి.
  • ChromeOSలో: Alt + Shift + {నంబర్} నొక్కండి.
  • MacOSలో: Option + {నంబర్} నొక్కండి.
  • 9 ఇటీవలి మెసేజ్‌ల కోసం {నంబర్}ను 1 నుండి 9తో రీప్లేస్ చేయండి.

ఎవరితోనైనా చాట్‌ను ప్రారంభించడానికి:

  1. "1 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులను జోడించండి" కాంబో బాక్స్‌ను తెరవడానికి Ctrl + k నొక్కండి.
  2. వ్యక్తి పేరు లేదా ఈమెయిల్ అడ్రస్‌ను టైప్ చేయండి. మీరు ఖచ్చితమైన మ్యాచ్‌ను విన్నట్లయితే, Ctrl + Enter నొక్కండి. దగ్గరి మ్యాచ్‌లను అన్వేషించడానికి, కింది వైపు బాణం కీని నొక్కండి.
  3. మెసేజ్ ఎడిట్ ఫీల్డ్‌కు ఫోకస్ తరలించబడుతుంది. మెసేజ్‌ను టైప్ చేసి, Enter నొక్కండి.
చిట్కా: మీరు ఎడిట్ మోడ్‌లో లేకుంటే, q షార్ట్‌కట్ Ctrl + k లాగానే పని చేస్తుంది.

స్పేస్‌లను చదవడానికి:

  1. ఫోకస్‌ను స్పేస్‌ల లిస్ట్‌కు తరలించడానికి h, ఆపై r నొక్కండి.
  2. కావాల్సిన స్పేస్‌ను కనుగొనడానికి పై వైపు లేదా కింది వైపు బాణం కీని నొక్కండి.
  3. స్పేస్ కోసం టాపిక్‌ల లిస్ట్‌కు ఫోకస్‌ను తరలించడానికి Enter నొక్కండి.
  4. విభిన్న టాపిక్‌లపై ఫోకస్ చేయడానికి పై వైపు లేదా కింది వైపు బాణం కీని నొక్కండి.
  5. కావాల్సిన టాపిక్‌పై, టాపిక్‌ను తెరవడానికి కుడి వైపు బాణం కీని నొక్కండి. టాపిక్‌లోని మెసేజ్‌లను చదవడానికి పై వైపు లేదా కింది వైపు బాణం కీని ఉపయోగించండి.
  6. టాపిక్‌ల లిస్ట్‌కు తిరిగి రావడానికి ఎడమ వైపు బాణం కీని నొక్కండి.
  7. ఫోకస్‌ను మెసేజ్ ఎడిట్ ఫీల్డ్‌కు తరలించడానికి r నొక్కండి. మెసేజ్‌ను టైప్ చేయండి. టాపిక్‌కు మెసేజ్‌ను జోడించడానికి Enter నొక్కండి.
  8. కొత్త టాపిక్‌ను ప్రారంభించడానికి Ctrl + s నొక్కండి.

ప్రారంభించడం

సిఫార్సు చేయబడిన బ్రౌజర్‌లు, స్క్రీన్ రీడర్‌లు

Google Chat Chromeను, అలాగే కింద పేర్కొన్న వాటిని సిఫార్సు చేస్తోంది:

  • Windowsలో NVDA లేదా JAWS
  • ChromeOSలో ChromeVox
  • MacOSలో VoiceOver

Chatను వెబ్ అప్లికేషన్‌గా ఉపయోగించండి

మీరు chat.google.com ను వెబ్‌పేజీగా కాకుండా వెబ్ అప్లికేషన్‌గా ఉపయోగించవచ్చు. మీరు chat.google.com ను వెబ్ అప్లికేషన్‌గా ఉపయోగించినప్పుడు:

  • స్క్రీన్ రీడర్ వెబ్ బ్రౌజింగ్ షార్ట్‌కట్‌లను ఆఫ్ చేయండి. వివరాల కోసం, కింద పేర్కొన్న మీ స్క్రీన్ రీడర్‌ను సెటప్ చేయండి అనే లింక్‌కు వెళ్లండి.
  • మీ స్క్రీన్ రీడర్ కమాండ్‌లకు బదులుగా నావిగేట్ చేయడానికి, చదవడానికి Chat కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించండి. వివరాల కోసం, కింద పేర్కొన్న Chatను నావిగేట్ చేయండి అనే లింక్‌కు వెళ్లండి.

చిట్కా: మీరు chat.google.com ను వెబ్ పేజీగా, అలాగే స్క్రీన్ రీడర్ బ్రౌజర్ కమాండ్‌లను ఉపయోగించాల్సిన సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భాలు వచ్చినప్పుడు మేము తెలియజేస్తాము.

మీ స్క్రీన్ రీడర్‌ను సెటప్ చేయండి

Chatను వెబ్ అప్లికేషన్‌గా ఉపయోగించడానికి కొంత స్క్రీన్ రీడర్ సెటప్ అవసరం:

  • JAWS: వర్చువల్ కర్సర్‌ను ఆఫ్ చేయండి. "ఆఫ్ చేయబడింది" అని వినే వరకు Insert + z నొక్కండి.
  • NVDA: ఫోకస్ మోడ్‌ను ఆన్ చేయండి. కీబోర్డ్‌లో టైప్ చేస్తున్నట్లుగా మీకు క్లిక్ సౌండ్ వినిపించే వరకు Insert + Spacebar నొక్కండి.
  • ChromeVox: స్టిక్కీ మోడ్‌ను ఆఫ్ చేయండి. మీకు "స్టిక్కీ మోడ్ డిజేబుల్ చేయబడింది" అని వినిపించే వరకు క్విక్‌గా Searchను రెండుసార్లు నొక్కండి.
  • VoiceOver: క్విక్ నావిగేషన్‌ను ఆఫ్ చేయండి. మీకు "క్విక్ నావిగేషన్ ఆఫ్ చేయబడింది" అని వినిపించే వరకు ఎడమ వైపు + కుడి వైపు బాణం కీని నొక్కండి.

Chatను తెరవండి

chat.google.com లింక్‌కు వెళ్లండి. మీరు Chatను తెరిచినప్పుడు, కీబోర్డ్ ఫోకస్ అనేది బ్యానర్ ల్యాండ్‌మార్క్ లోపల, ఎగువున ఉన్న ప్రధాన మెనూ బటన్‌పై ఉంటుంది. మీరు మొదటిసారి Chatను తెరిచినప్పుడు, తర్వాతి విభాగంలో వివరించిన విధంగా మీరు దానిని వెబ్‌పేజీగా అన్వేషించాలనుకోవచ్చు. మీరు మీ అన్వేషణను పూర్తి చేసిన తర్వాత, ఎగువున మీ స్క్రీన్ రీడర్‌ను సెటప్ చేయండి లింక్‌లో వివరించిన విధంగా Chatను వెబ్ అప్లికేషన్‌గా ఉపయోగించేందుకు మారాలని మేము సిఫార్సు చేస్తున్నాము.

Chat ఇంటర్‌ఫేస్ గురించి పరిచయం

Chatలో, 4 ప్రధాన ఏరియాలు ఉన్నాయి:

  • ఎగువున ఉండే ఏరియా, బ్యానర్ ల్యాండ్‌మార్క్‌గా మీ స్క్రీన్ రీడర్ ద్వారా అందించబడింది: ఈ ఏరియా ఇతర యాప్‌లకు, యూజర్ ఖాతాలకు మారడానికి మీ స్టేటస్, సెర్చ్ బార్, Google బార్ వంటి సాధారణ సెట్టింగ్‌లను, కంట్రోల్స్‌ను కలిగి ఉంటుంది.
  • ఎడమ వైపు నావిగేషన్ ఏరియా, ఇది నావిగేషన్ ల్యాండ్‌మార్క్‌గా అందించబడింది: ఎడమ వైపున, మీరు Chat సంభాషణలను, స్పేస్‌లకు సంబంధించిన కంటెంట్, Meet హెడ్డింగ్‌లను కనుగొనవచ్చు.
  • Chat కంటెంట్, ఇది ప్రధాన ల్యాండ్‌మార్క్‌గా అందించబడింది: ప్రస్తుతం ఎంచుకున్న Chat సంభాషణ, స్పేస్ కంటెంట్ లేదా మీటింగ్ సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఈ ఏరియాలో గత మెసేజ్‌ల లిస్ట్, కొత్త మెసేజ్‌ల కోసం మెసేజ్ ఎడిట్ ఫీల్డ్, యాక్షన్ బటన్‌లు కూడా ఉంటాయి.
  • కుడి వైపు సైడ్ ప్యానెల్, ఇది కాంప్లిమెంటరీ ల్యాండ్‌మార్క్‌గా అందించబడింది: క్యాలెండర్, Keep, Tasks, Contacts వంటి ఇతర Google ప్రోడక్ట్‌లకు పొందుపరిచిన యాక్సెస్‌ను అందిస్తుంది.

ఒక వ్యక్తి లేదా గ్రూప్‌తో చేసే చాట్‌లు మెసేజ్‌ల లిస్ట్‌ను క్రియేట్ చేస్తాయి. ఆటోమేటిక్‌గా, హిస్టరీ ఆఫ్‌లో ఉంటే, మెసేజ్‌లు వచ్చిన 24 గంటల తర్వాత అవి అదృశ్యమవుతాయి. స్పేస్‌లు అనేవి టీమ్ లేదా వ్యక్తుల గ్రూప్‌తో యాక్టివ్ దీర్ఘ-కాల సంభాషణల కోసం ఉద్దేశించబడినవి. హిస్టరీ ఆటోమేటిక్‌గా ఆన్‌లో ఉంటుంది. మీరు 2-స్థాయి ట్రీ సంభాషణలను క్రియేట్ చేసే టాపిక్‌లుగా స్పేస్‌లను ఆర్గనైజ్ చేయవచ్చు.

ప్రధాన Chat కంటెంట్‌ను నావిగేట్ చేయండి

చాట్, స్పేస్‌ల కంటెంట్ 2 మోడ్‌లను కలిగి ఉంటుంది, అవి: ఎడిట్ మోడ్, నావిగేషన్ మోడ్. మెసేజ్ ఎడిట్ ఫీల్డ్‌పై ఫోకస్ ఉన్నప్పుడు, చాట్ ఎడిట్ మోడ్‌లో ఉంటుంది. ఎడిట్ నుండి నావిగేషన్ మోడ్‌కు మారడానికి, Escape నొక్కండి.

Tab, బాణం కీలు ఒక్కో మోడ్‌లో ఒక్కో విధంగా పని చేస్తాయి:

  • ఎడిట్ మోడ్‌లో: పై వైపు బాణం చివరిగా పోస్ట్ చేసిన మెసేజ్‌కు తీసుకెళ్తుంది, అలాగే దాన్ని ఎడిట్ చేసి, మళ్లీ పంపడానికి మీకు వీలు కల్పిస్తుంది.
  • నావిగేషన్ మోడ్‌లో:
    • పై వైపు బాణం అత్యంత ఇటీవలి మెసేజ్‌కు, ఆపై పాత మెసేజ్‌లకు తీసుకెళ్తుంది.
    • మెసేజ్‌లో, Tab కీ ఇక్కడ పేర్కొన్నటువంటి బటన్‌లకు నావిగేట్ చేస్తుంది: రియాక్షన్‌ను జోడించండి (ఎమోజి), మెసేజ్‌ను ఎడిట్ చేయండి (మీరు దాన్ని పోస్ట్ చేసినట్లయితే), చదవనిదిగా మార్క్ చేయండి, అలాగే మరిన్ని చర్యలు.
    • టాపిక్‌లతో కూడిన స్పేస్‌లో:
      • పై వైపు లేదా కింది వైపు బాణం కీతో టాపిక్‌లోనే ఒక దాని నుండి మరొక దానికి మారండి.
      • ఎడమ వైపు బాణంతో టాపిక్‌ల లిస్ట్‌కు వెళ్లండి, ఆపై టాపిక్‌ల మధ్య మారడానికి పై వైపు లేదా కింది వైపు బాణం కీని ఉపయోగించండి.
      • కుడి వైపు బాణంతో టాపిక్‌లోని మెసేజ్‌లకు వెళ్లండి.

ప్రాథమిక నావిగేషన్

ప్రాథమిక నావిగేషన్ కోసం Tab, బాణం కీలు ఉపయోగించబడతాయి. అదనపు Chat నావిగేషన్ కోసం, మీరు ఈ కమాండ్‌లను ఉపయోగించవచ్చు:

  • చాట్, స్పేస్‌ల కోసం ఎడమ వైపు నావిగేషన్ ఏరియాలో:
    • వేర్వేరు సంభాషణలను ఎంచుకోవడానికి ఫై వైపు లేదా కింది వైపు బాణం కీని నొక్కండి.
    • మునుపటి లేదా తర్వాతి చదవని సంభాషణకు వెళ్లడానికి Shift + పై వైపు లేదా కింది వైపు బాణం కీని నొక్కండి.
    • చాట్, స్పేస్‌లు, లేదా Meetల మధ్య మారడానికి Ctrl + పై వైపు లేదా కింది వైపు బాణం కీని నొక్కండి.
    • చాట్ లేదా స్పేస్ సంభాషణపై ఫోకస్ ఉన్నట్లయితే: యాక్టివేట్ చేయడానికి కుడి వైపు బాణం లేదా Enter నొక్కండి.
  • ప్రధాన మెసేజ్ ఏరియాలో: వేర్వేరు ఆప్షన్‌లకు వెళ్లడానికి Tab, పై వైపు లేదా కింది వైపు బాణం కీని నొక్కండి.
  • ఫోకస్ మెసేజ్ ఎడిట్ ఫీల్డ్‌పై ఉన్నప్పుడు:
    • మీరు పంపిన చివరి మెసేజ్‌ను ఎడిట్ చేయడానికి పై వైపు బాణం కీని నొక్కండి.
    • అన్ని మెసేజ్‌ల గుండా వెళ్లడానికి Escape నొక్కి, ఆపై పై వైపు లేదా కింది వైపు బాణం కీని నొక్కండి.
  • ఫోకస్ స్పేస్‌కు సంబంధించిన టాపిక్‌లపై ఉన్నప్పుడు:
    • ఎడమ వైపు నావిగేషన్‌కు వెళ్లడానికి ఎడమ వైపు బాణం కీని నొక్కండి.
    • ఎంచుకున్న టాపిక్‌కు సంబంధించిన మెసేజ్‌లకు వెళ్లడానికి కుడి వైపు బాణం కీని నొక్కండి.
  • స్పేస్‌లో, ఫోకస్ మెసేజ్‌పై ఉన్నట్లయితే: టాపిక్‌లకు ఫోకస్‌ను తరలించడానికి ఎడమ వైపు బాణం కీని నొక్కండి.
  • మీరు టాపిక్‌లు లేకుండా ఉన్న స్పేస్‌ను యాక్టివేట్ చేసినప్పుడు, ఫోకస్ అనేది మెసేజ్ ఎడిట్ ఫీల్డ్‌కు వెళుతుంది.

అధునాతన నావిగేషన్

మీకు Chat గురించి తెలిసిన తర్వాత, Chatను ఉపయోగించడానికి అత్యంత సమర్థవంతమైన మార్గం కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించడం.

Chatలో కీబోర్డ్ షార్ట్‌కట్‌ల పూర్తి లిస్ట్‌ను చూడండి

  1. మీ స్క్రీన్ రీడర్‌లో వర్చువల్ కర్సర్ లేదా బ్రౌజ్ మోడ్‌ను ఆఫ్ చేయండి.
  2. ఫోకస్ మెసేజ్ ఎడిట్ ఫీల్డ్‌పై ఉన్నట్లయితే Escape నొక్కండి.
  3. ప్రశ్న గుర్తు కీని (Shift + స్లాష్) నొక్కండి.

కీబోర్డ్ షార్ట్‌కట్‌లను చదవడానికి, Chatను వెబ్ పేజీగా ఉపయోగించండి. మీ స్క్రీన్ రీడర్‌లో వర్చువల్ కర్సర్ లేదా బ్రౌజ్ మోడ్‌ను ఆన్ చేయండి. టేబుల్‌లో కీబోర్డ్ షార్ట్‌కట్‌ల లిస్ట్ ఉంటుంది, కాబట్టి సులభమైన నావిగేషన్ కోసం మీ స్క్రీన్ రీడర్‌కు సంబంధించిన టేబుల్-రీడింగ్ కమాండ్‌లను ఉపయోగించండి. మొదటి ట్యాబ్ స్టాప్ అనేది కొన్ని కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఎనేబుల్ చేయడానికి లేదా డిజేబుల్ చేయడానికి మీరు యాక్టివేట్ చేయగల లింక్. లింక్ డిజేబుల్ చేయబడిందని నిర్ధారించుకోండి, తద్వారా అదనపు కీబోర్డ్ షార్ట్‌కట్‌లు అందుబాటులో ఉంటాయి.

మీరు కొత్త బ్రౌజర్ ట్యాబ్‌లో Google Chat కీబోర్డ్ షార్ట్‌కట్‌లను తెరవవచ్చు.

జనాదరణ పొందిన షార్ట్‌కట్‌లు

షార్ట్‌కట్‌లు Chrome, Windows పరికరాల కోసం ఉద్దేశించబడినవి. Macలో, Ctrlకు బదులుగా Command కీని, అలాగే Altకు బదులుగా Option కీని ఉపయోగించండి.

  • స్క్రీన్ రీడర్‌తో, మీరు చాట్ సంభాషణలోని చివరి 9 మెసేజ్‌లను లేదా స్పేస్‌ల టాపిక్‌ను Alt + {నంబర్}తో చదవవచ్చు. ChromeVox కోసం, Alt + Shift + {నంబర్}ను ఉపయోగించండి. VoiceOver కోసం, Option + {నంబర్}ను ఉపయోగించండి. {నంబర్}ను అత్యంత ఇటీవలి మెసేజ్ కోసం 1తో, తర్వాతి అత్యంత ఇటీవలి మెసేజ్ కోసం 2తో రీప్లేస్ చేయండి, అలాగే ఇతర మెసేజ్‌ల విషయంలో కూడా ఫాలో అవ్వండి. ఫోకస్ తరలించబడదు.
  • సంభాషణలో ఇటీవలి మెసేజ్‌కు ఫోకస్‌ను తరలించడానికి, Ctrl + j నొక్కండి. ఇది ఎడిట్ మోడ్‌తో సంబంధం లేకుండా పని చేస్తుంది, అలాగే దీన్ని ఎగువున పేర్కొన్న ప్రాథమిక నావిగేషన్‌లో వివరించిన విధంగా Escape స్థానంలో ఉపయోగించవచ్చు.
  • ఎడమ వైపు నావిగేషన్ ఏరియాలో మీ చాట్ మెసేజ్‌లకు ఫోకస్‌ను తరలించడానికి, h నొక్కి, ఆపై c నొక్కండి.
  • ఎడమ వైపు నావిగేషన్ ఏరియాలో మీ స్పేస్‌ల మెసేజ్‌లకు ఫోకస్‌ను తరలించడానికి, h నొక్కి, ఆపై r నొక్కండి.
  • ఒక వ్యక్తిని, గ్రూప్‌ను, లేదా స్పేస్‌ను జోడించడానికి, క్రియేట్ చేయడానికి లేదా కనుగొనడానికి, Ctrl + k నొక్కండి. మీరు ఎడిట్ మోడ్‌లో లేకుంటే, q షార్ట్‌కట్ Ctrl + k లాగానే పని చేస్తుంది.
    • జోడించడానికి లేదా క్రియేట్ చేయడానికి, కావాల్సిన ఆప్షన్‌కు వెళ్లడానికి కింది వైపు బాణం కీని నొక్కండి.
    • ఇప్పటికే ఉన్న సంభాషణను కనుగొనడానికి, పేరులో కొంత భాగాన్ని టైప్ చేసి, ఆపై కావాల్సిన మ్యాచ్‌కు వెళ్లడానికి కింది వైపు బాణం కీని నొక్కండి.
  • వ్యక్తులను, స్పేస్‌లను, లేదా మెసేజ్‌లను కనుగొనడానికి, ఎడిట్ మోడ్‌లో లేనప్పుడు స్లాష్ కీని నొక్కండి.
  • స్పేస్‌లో కొత్త టాపిక్‌ను లేదా చాట్‌లో కొత్త మెసేజ్‌ను ప్రారంభించడానికి, Ctrl + s నొక్కండి.
  • చాట్ లేదా స్పేస్ మెనూను తెరవడానికి, Ctrl + g నొక్కండి. వివరాల కోసం, కింద పేర్కొన్న మెసేజ్, స్పేస్‌ల ఆప్షన్‌లను యాక్సెస్ చేయండి అనే లింక్‌కు వెళ్లండి.
  • సంభాషణ లేదా టాపిక్‌కు రిప్లయి ఇవ్వడానికి, అలాగే మెసేజ్ ఎడిట్ ఫీల్డ్‌కు ఫోకస్‌ను తరలించడానికి, r నొక్కండి.

విభిన్న ఎలిమెంట్‌లతో ఇంటరాక్షన్‌ల గురించి మరింత తెలుసుకోవడానికి, కింద పేర్కొన్న Chatలో సాధారణ టాస్క్‌లను పూర్తి చేయండి అనే లింక్‌కు వెళ్లండి, అలాగే మీ స్క్రీన్ రీడర్ కోసం డాక్యుమెంటేషన్‌ను చూడండి.

స్క్రీన్ రీడర్‌తో Chatలో సాధారణ టాస్క్‌లను పూర్తి చేయండి

డైరెక్ట్ మెసేజ్‌లు

DMలు, చాట్ అని కూడా పిలువబడే డైరెక్ట్ మెసేజ్‌లు అనేవి మీకు, అలాగే ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య సంభాషణలు. డైరెక్ట్ మెసేజ్‌లలో, మెసేజ్ లిస్ట్ ఒక స్థాయిని మాత్రమే కలిగి ఉంటుంది.

డైరెక్ట్ మెసేజ్‌ను చదవండి

  1. ఎడమ వైపు నావిగేషన్ ఏరియాలోని చాట్ విభాగానికి వెళ్లడానికి Escape నొక్కి, ఆపై h, ఆపై c నొక్కండి.
  2. మీరు ఎవరి మెసేజ్‌ను చదవాలనుకుంటున్నారో ఆ వ్యక్తిని ఎంచుకోవడానికి పై వైపు లేదా కింది వైపు బాణం కీని నొక్కి, ఆపై Enter నొక్కండి.
  3. నావిగేషన్ మోడ్‌కు మారడానికి Escape నొక్కండి.
  4. చాట్‌లోని మునుపటి మెసేజ్‌లను రివ్యూ చేయడానికి పై వైపు లేదా కింది వైపు బాణం కీని నొక్కండి.
  5. మెసేజ్ లింక్‌ను కలిగి ఉన్నట్లయితే, లింక్‌పై ఫోకస్‌ను తరలించడానికి Tab నొక్కి, ఆపై లింక్‌ను తెరవడానికి Enter నొక్కండి.

ఇటీవలి మెసేజ్‌లను రివ్యూ చేసున్న సమయంలో, మెసేజ్ ఎడిట్ ఫీల్డ్‌పై ఫోకస్ ఉంచడానికి:

  • Windowsలో: Alt + {నంబర్} నొక్కండి.
  • ChromeOSలో: Alt + Shift + {నంబర్} నొక్కండి.
  • MacOSలో: Option + {నంబర్} నొక్కండి.
  • 9 ఇటీవలి మెసేజ్‌ల కోసం {నంబర్}ను 1 నుండి 9తో రీప్లేస్ చేయండి.

డైరెక్ట్ మెసేజ్‌ల మధ్య మారండి

మీరు మెసేజ్ పంపిన వ్యక్తిని లేదా గ్రూప్‌ను కనుగొనడానికి:

  1. "1 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులను జోడించండి" కాంబో బాక్స్‌ను తెరవడానికి Ctrl + k నొక్కండి.
  2. మీరు కనుగొనాలనుకుంటున్న వ్యక్తి లేదా గ్రూప్ పేరును టైప్ చేయండి. మీరు టైప్ చేస్తున్నప్పుడు, Chat పేరును మాటల రూపంలో వినిపిస్తుంది.
  3. పేరును ఎంచుకోండి:
    • Chat మీకు కావాల్సిన పేరును మాటల రూపంలో వినిపిస్తే, Ctrl + Enter నొక్కండి.
    • Chat మీకు కావాల్సిన పేరును మాటల రూపంలో వినిపించకుంటే, మీరు పేరు వినిపించే వరకు కింది వైపు బాణం కీని నొక్కి, ఆపై Ctrl + Enter నొక్కండి.
    • మీరు ఇప్పటికీ వ్యక్తి పేరు వినకపోతే, వారి పూర్తి యూజర్‌నేమ్‌ను టైప్ చేసి, Enter నొక్కండి.

మునుపటి మెసేజ్‌ల లిస్ట్‌లో మెసేజ్‌ను తెరవడానికి:

  1. ఎడమ వైపు నావిగేషన్ ఏరియాకు వెళ్లడానికి Escape నొక్కి, ఆపై ఎడమ వైపు బాణం కీని నొక్కండి.
  2. మీరు మెసేజ్ పంపాలనుకుంటున్న వ్యక్తిని కనుగొనే వరకు పై వైపు లేదా కింది వైపు బాణం కీని నొక్కండి.
  3. Enter నొక్కండి.

చిట్కా: మీరు ఎడమ వైపు నావిగేషన్ ఏరియా గుండా వెళుతున్నప్పుడు, డైరెక్ట్ మెసేజ్ లేదా స్పేస్‌కు సంబంధించి ఏవైనా చదవని మెసేజ్‌లు ఉన్నట్లయితే, వాటి గురించి మీకు తెలియజేయబడుతుంది. తర్వాతి చదవని మెసేజ్‌కు వెళ్లడానికి, Shift + కింది వైపు బాణం కీని నొక్కండి.

డైరెక్ట్ మెసేజ్‌కు రిప్లయి ఇవ్వండి

  1. మీరు రిప్లయి ఇవ్వాలనుకుంటున్న వ్యక్తిని కనుగొనడానికి లేదా నావిగేట్ చేయడానికి మునుపటి విభాగాలలోని దశలను ఉపయోగించండి. నావిగేషన్ మోడ్ నుండి, ఫోకస్‌ను తిరిగి మెసేజ్ ఎడిట్ ఫీల్డ్‌కు తరలించడానికి r నొక్కండి.
  2. మెసేజ్ టెక్స్ట్‌ను టైప్ చేసి, ఆపై Enter నొక్కండి.
  3. ఎడిట్ మోడ్‌లో లేనప్పుడు, మీరు ఎమోజితో మెసేజ్‌కు ప్రతిస్పందించవచ్చు:
    1. “రియాక్షన్‌ను జోడించండి” బటన్‌కు వెళ్లడానికి Tabను నొక్కి, Space నొక్కండి.
    2. ఎమోజి పేరులో కొంత భాగాన్ని టైప్ చేయండి.
    3. మ్యాచ్‌ల లిస్ట్‌కు వెళ్లడానికి Tabను రెండుసార్లు నొక్కండి.
    4. మీకు కావాల్సిన ఎమోజికి వెళ్లడానికి కింది వైపు బాణం కీని నొక్కి, ఆపై Enter నొక్కండి.

స్మార్ట్ రిప్లయిని ఉపయోగించండి

ముఖ్య గమనిక: కొన్ని మెసేజ్‌లకు స్మార్ట్ రిప్లయిలు అందుబాటులో ఉండవు.

  1. మెసేజ్ ఎడిట్ ఫీల్డ్‌పై ఫోకస్‌ను ఉంచి, 3 సూచించిన రిప్లయి బటన్‌లలో మీరు ఒక దానిని చేరుకునే వరకు Shift + Tab నొక్కండి.
  2. రిప్లయిని ఎంచుకుని, దానిని మెసేజ్ ఎడిట్ ఫీల్డ్‌లో లోడ్ చేయడానికి Spacebar నొక్కండి.
  3. కావాలనుకుంటే అదనపు కంటెంట్‌ను జోడించండి, ఆపై రిప్లయిని పంపడానికి Enter నొక్కండి.

పలు వ్యక్తులకు డైరెక్ట్ మెసేజ్‌ను పంపండి

  1. "1 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులను జోడించండి" కాంబో బాక్స్‌ను తెరవడానికి Ctrl + k నొక్కండి.
  2. మీరు జోడించాలనుకుంటున్న వ్యక్తి పేరును టైప్ చేయండి. మీరు టైప్ చేస్తున్నప్పుడు, Chat పేరును మాటల రూపంలో వినిపిస్తుంది.
  3. పేరును ఎంచుకోండి:
    • Chat మీకు కావాల్సిన పేరును మాటల రూపంలో వినిపిస్తే, Ctrl + Enter నొక్కండి.
    • Chat మీకు కావాల్సిన పేరును మాటల రూపంలో వినిపించకుంటే, మీరు పేరు వినిపించే వరకు కింది వైపు బాణం కీని నొక్కి, ఆపై Ctrl + Enter నొక్కండి.
    • మీరు ఇప్పటికీ వ్యక్తి పేరు వినకపోతే, వారి పూర్తి యూజర్‌నేమ్‌ను టైప్ చేసి, Enter నొక్కండి.
  4. వ్యక్తులందరినీ మెసేజ్‌కు జోడించడానికి 3వ, 4వ దశలను రిపీట్ చేయండి.
  5. కొత్త చాట్‌లోని మెసేజ్ ఎడిట్ ఫీల్డ్‌కు ఫోకస్‌ను తరలించడానికి Enter నొక్కండి.
  6. మీ మెసేజ్‌ను టైప్ చేసి, ఆపై Enter నొక్కండి.

పోస్ట్ చేసిన మెసేజ్‌ను ఎడిట్ చేయండి

మీరు పోస్ట్ చేసిన అత్యంత ఇటీవలి మెసేజ్‌ను ఎడిట్ చేయడానికి, మెసేజ్ ఎడిట్ ఫీల్డ్ నుండి పై వైపు బాణం కీని నొక్కండి. మెసేజ్‌ను ఎడిట్ చేసి, మళ్లీ పోస్ట్ చేయడానికి Enter నొక్కండి లేదా మార్పులను రద్దు చేయడానికి Escape నొక్కండి.

డైరెక్ట్ మెసేజ్ కోసం హిస్టరీని ఆన్ లేదా ఆఫ్ చేయండి

మీ అడ్మినిస్ట్రేటర్ అనుమతించినట్లయితే, మీరు మీ మెసేజ్ హిస్టరీని సేవ్ చేయడాన్ని ఎంచుకోవచ్చు. మీరు సంభాషణకు సంబంధించిన మెసేజ్ ఎడిట్ ఫీల్డ్‌పై ఫోకస్ చేసినప్పుడు హిస్టరీ ఆన్ లేదా ఆఫ్‌లో ఉందో లేదో మీరు వింటారు.

  1. ఎడమ వైపు నావిగేషన్ ఏరియాలో, మీరు దేని హిస్టరీ సెట్టింగ్‌లను మార్చాలనుకుంటున్నారో ఆ సంభాషణను ఎంచుకుని, Enter నొక్కండి.
  2. సంభాషణ మెనూను తెరవడానికి Ctrl + g నొక్కండి.
  3. "హిస్టరీ"కి వెళ్లడానికి కింది వైపు బాణం కీని నొక్కి, ప్రస్తుత సెట్టింగ్‌ను మార్చడానికి Spacebar లేదా Enter నొక్కండి. కొన్ని హిస్టరీ సెట్టింగ్‌లను మార్చడం సాధ్యపడదు.

స్పేస్‌లు

స్పేస్‌లు అనేవి టీమ్ లేదా వ్యక్తుల గ్రూప్‌తో యాక్టివ్ దీర్ఘ-కాల సంభాషణల కోసం ఉద్దేశించబడినవి. కాలక్రమేణా వ్యక్తులు సంభాషణలో చేరినప్పుడు లేదా నిష్క్రమించినప్పుడు స్పేస్ మెంబర్‌షిప్ మారవచ్చు.

స్పేస్‌లు 1 స్థాయి లేదా 2 స్థాయిలను కలిగి ఉండవచ్చు. టాపిక్‌లు లేని స్పేస్‌లు చాట్ సంభాషణల వంటి 1 స్థాయిని కలిగి ఉంటాయి, అలాగే మెసేజ్ ఎడిట్ ఫీల్డ్‌పై ప్రాథమిక ఫోకస్ ఉంటుంది. టాపిక్‌లతో కూడిన స్పేస్‌లు 2 స్థాయిలను కలిగి ఉంటాయి. స్థాయి 1 అనేది సంభాషణ టాపిక్‌ల లిస్ట్. స్థాయి 2 అనేది టాపిక్‌లోని మెసేజ్‌లు. మీరు స్పేస్‌ను తెరిచినప్పుడు, అత్యంత పాత చదవని టాపిక్‌పై ఫోకస్ ఉంటుంది. చదవని టాపిక్‌లు లేకుంటే, ఇటీవలి టాపిక్‌పై ఫోకస్ ఉంటుంది.

స్పేస్‌లలో మెసేజ్‌లను చదవండి

  1. ఎడిట్ ఫీల్డ్‌పై (ఎడిట్ మోడ్) ఫోకస్ ఉన్నట్లయితే, నావిగేషన్ మోడ్‌కు మారడానికి Escape నొక్కండి.
  2. ఎడమ వైపు నావిగేషన్ ఏరియాలోని స్పేస్‌ల విభాగానికి వెళ్లడానికి h, ఆపై r నొక్కండి.
  3. మీరు కోరుకున్న స్పేస్‌ను చేరుకునే వరకు పై వైపు లేదా కింది వైపు బాణం కీని నొక్కి, ఆపై Enter నొక్కండి. చదవని కంటెంట్‌ను కలిగి ఉన్న స్పేస్‌లకు వెళ్లడానికి, మీరు Shift + పై వైపు లేదా కింది వైపు బాణం కీని ఉపయోగించవచ్చు.
  4. స్పేస్‌లో టాపిక్‌లు లేనట్లయితే, చాట్ మెసేజ్ లాగా మెసేజ్ ఎడిట్ ఫీల్డ్‌కు ఫోకస్ తరలించబడుతుంది.
  5. స్పేస్‌లో టాపిక్‌లు ఉన్నట్లయితే, వివిధ టాపిక్‌లను నావిగేట్ చేయడానికి పై వైపు లేదా కింది వైపు బాణం కీని నొక్కండి.
  6. టాపిక్‌ను తెరవడానికి కుడి వైపు బాణం కీని నొక్కండి.
  7. మెసేజ్‌లను చదవడానికి పై వైపు లేదా కింది వైపు బాణం కీని నొక్కండి.
  8. టాపిక్ స్థాయికి తిరిగి రావడానికి ఎడమ వైపు బాణం కీని నొక్కండి.

ఇటీవలి మెసేజ్‌లను రివ్యూ చేయడానికి, కానీ ఎడిట్ ఫీల్డ్‌పై ఫోకస్ ఉంచడానికి:

  • Windowsలో: Alt + {నంబర్} నొక్కండి.
  • ChromeOSలో: Alt + Shift + {నంబర్} నొక్కండి.
  • MacOSలో: Option + {నంబర్} నొక్కండి.
  • 9 ఇటీవలి మెసేజ్‌ల కోసం {నంబర్}ను 1 నుండి 9తో రీప్లేస్ చేయండి.

Spacesలో మెసేజ్‌లకు రిప్లయి ఇవ్వండి

  1. ఫోకస్‌ను ఎడిట్ ఫీల్డ్‌కు తరలించడానికి r షార్ట్‌కట్‌ను నొక్కండి.
  2. మీ మెసేజ్‌ను టైప్ చేసి, ఆపై Enter నొక్కండి.
  3. మరొక టాపిక్‌కు వెళ్లడానికి, చివరి టాపిక్‌కు వెళ్లడానికి Ctrl + j (Macలో ⌘ + j) నొక్కండి, ఆపై కొత్త టాపిక్‌కు వెళ్లడానికి పై వైపు బాణం కీని నొక్కండి. ఈ టాపిక్‌కు రిప్లయి ఇవ్వడానికి, ఫోకస్‌ను ఎడిట్ ఫీల్డ్‌కు తరలించడానికి r షార్ట్‌కట్‌ను నొక్కండి.
చిట్కా: స్పేస్‌లలో, మీరు స్మార్ట్ రిప్లయిని కూడా ఉపయోగించవచ్చు.

స్పేస్‌లో సంభాషణ టాపిక్‌ను క్రియేట్ చేయండి

  1. ఫోకస్‌ను ఏదైనా టాపిక్‌కు తరలించండి.
  2. మెసేజ్ ఎడిట్ ఫీల్డ్‌ను తెరవడానికి Ctrl + s నొక్కండి.
  3. మీ కొత్త టాపిక్‌ను వివరించే మెసేజ్ టెక్స్ట్‌ను టైప్ చేసి, ఆపై Enter నొక్కండి.

మీ మెసేజ్ టాపిక్‌లో మొదటి మెసేజ్, అలాగే అది టాపిక్ పేరు అవుతుంది.

చిట్కా: ఫోకస్ చేసిన ఎడిట్ ఫీల్డ్ పేరుతో మీరు కొత్త టాపిక్‌ను క్రియేట్ చేస్తున్నారని మీరు వెరిఫై చేసుకోవచ్చు:

  • కొత్త టాపిక్‌కు "మెసేజ్" అని పేరు పెట్టబడి, దాని తర్వాత స్పేస్ పేరు ఉంటుంది.
  • ఇప్పటికే ఉన్న టాపిక్‌కు ఇచ్చే రిప్లయికి "రిప్లయి" అని పేరు పెట్టడం జరుగుతుంది.

స్పేస్‌ను క్రియేట్ చేయండి

  1. "స్పేస్‌ను క్రియేట్ చేయండి" డైలాగ్‌ను తెరవడానికి Ctrl + i నొక్కండి.
  2. కావాల్సిన "స్పేస్ పేరు"ను టైప్ చేయండి.
  3. మీరు మాత్రమే మెంబర్‌గా ఉండే స్పేస్‌ను క్రియేట్ చేయడానికి, Enter నొక్కండి.
  4. ఇతర ఆప్షన్‌ల కోసం, కింద పేర్కొన్న పనులు చేయడానికి Tab నొక్కండి:
    • స్పేస్ వివరణను జోడించడానికి.
    • స్పేస్‌కు వ్యక్తులను లేదా గ్రూప్‌లను జోడించడానికి.
    • కొత్త స్పేస్‌లో ఎవరు చేరగలరో పేర్కొనడానికి.
    • మీ వర్క్ లేదా స్కూల్ వెలుపలి వ్యక్తులు స్పేస్‌లో చేరగలరో లేదో పేర్కొనడానికి.
    • "టాపిక్ ఆధారంగా సంభాషణను ఆర్గనైజ్ చేయండి" అనే చెక్‌బాక్స్‌ను కనిపించేలా చేయడం కోసం అధునాతన బటన్‌ను యాక్టివేట్ చేయడానికి.
    • 'రద్దు చేయండి' లేదా 'క్రియేట్ చేయండి' బటన్‌లను యాక్టివేట్ చేయడానికి.

ఇప్పటికే ఉన్న స్పేస్‌లో చేరండి

  1. Ctrl + o నొక్కండి.
  2. పేరులోని ఏదైనా భాగాన్ని టైప్ చేయండి.
  3. స్పేస్‌ల లిస్ట్ గుండా వెళ్లడానికి పై వైపు లేదా కింది వైపు బాణం కీని ఉపయోగించండి.
  4. మీకు కావాల్సిన స్పేస్‌ను కనుగొన్నప్పుడు, "స్పేస్‌లో చేరండి" చెక్‌బాక్స్‌కు వెళ్లడానికి Tab నొక్కి, దాన్ని ఎంచుకోవడానికి Spacebar నొక్కండి.
  5. కొత్త స్పేస్‌లో చేరి దాన్ని తెరవడానికి Enter నొక్కండి.

స్పేస్‌కు వ్యక్తులను జోడించండి

  1. మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న స్పేస్‌ను తెరవండి.
  2. స్పేస్ మెనూను తెరవడానికి Ctrl + g నొక్కండి.
  3. "మెంబర్‌లను మేనేజ్ చేయండి"కి వెళ్లడానికి కింది వైపు బాణం కీని నొక్కండి, ఆపై Enter నొక్కండి.
  4. 'బటన్‌ను జోడించండి'కి వెళ్లడానికి Tab నొక్కి, ఆపై Enter నొక్కండి.
  5. మీరు జోడించాలనుకుంటున్న వ్యక్తి పేరును టైప్ చేయండి. మీరు టైప్ చేస్తున్నప్పుడు, మ్యాచ్ అయ్యే మొదటి పేరు మీకు వినిపిస్తుంది.
  6. పేరును ఎంచుకోండి:
    • Chat మీకు కావాల్సిన పేరును మాటల రూపంలో వినిపిస్తే, Ctrl + Enter నొక్కండి.
    • Chat మీకు కావాల్సిన పేరును మాటల రూపంలో వినిపించకుంటే, మీరు పేరు వినిపించే వరకు కింది వైపు బాణం కీని నొక్కి, ఆపై Ctrl + Enter నొక్కండి.
    • మీరు ఇప్పటికీ వ్యక్తి పేరు వినకపోతే, వారి పూర్తి యూజర్‌నేమ్‌ను టైప్ చేసి, Enter నొక్కండి.
  7. మీరు 'జోడించండి' బటన్‌కు వెళ్లే వరకు Tabను నొక్కి, ఆపై Enter నొక్కండి.

స్పేస్‌లో ఫైళ్లు

మీరు ఫైళ్లను, చర్చించడం కోసం లేదా స్పేస్ మెంబర్‌లతో షేర్ చేయడానికి స్పేస్‌లో పోస్ట్ చేయవచ్చు. మీరు స్పేస్‌ను తెరిచినప్పుడు, ఫోకస్ అనేది మెసేజ్ ఎడిట్ ఫీల్డ్‌కు లేదా అత్యంత ఇటీవలి టాపిక్ ప్రారంభానికి తరలించబడుతుంది. ఎడిట్ ఫీల్డ్ నుండి, "Google Workspace టూల్స్" బటన్‌కు ఫోకస్‌ను తరలించడానికి Shift + Tab నొక్కండి, ఇక్కడ మీరు Drive ఫైల్ లేదా Calendar ఆహ్వానాన్ని జోడించవచ్చు.

ఇతరులు పోస్ట్ చేసిన ఫైళ్లను చూడటం కోసం, స్పేస్ మెనూకు వెళ్లడానికి Ctrl + g నొక్కండి, ఆపై చాట్ ట్యాబ్‌కు వెళ్లడానికి పలుమార్లు Tab నొక్కండి. ఫైల్స్ ట్యాబ్‌కు వెళ్లడానికి కుడి వైపు బాణం కీని నొక్కి, ఆపై Enter నొక్కండి. మీరు ఫైల్స్ ట్యాబ్‌ను తెరిచినప్పుడు, ఫోకస్ అనేది "ఫైల్‌ను జోడించండి" బటన్‌కు తరలించబడుతుంది. ఏవైనా ఫైళ్లు షేర్ చేయబడితే, మీరు ప్రతి ఫైల్‌కు సంబంధించిన 3 ఎలిమెంట్‌ల ద్వారా వెళ్లడానికి Tab నొక్కవచ్చు:

  1. ఫైల్ వివరాలు: ఫైల్ పేరు, ఎవరు పోస్ట్ చేశారు, ఎప్పుడు పోస్ట్ చేశారు అనే వివరాలు. కొత్త బ్రౌజర్ ట్యాబ్‌లో ఫైల్‌ను తెరవడానికి Enter నొక్కండి.
  2. "Driveలో తరలించండి" లేదా "Driveకు షార్ట్‌కట్‌ను జోడించండి"కి వెళ్లడానికి Option నొక్కండి.
  3. "చాట్‌లో చూడండి"కి వెళ్లడానికి, ఇది సందర్భాన్ని అందించడానికి ఫైల్ జోడించబడిన చోటికి ఫోకస్‌ను తరలిస్తుంది.

యాప్‌లు

ముఖ్య గమనిక: Google Chatలో యాప్‌లను ఉపయోగించడానికి, మీరు తప్పనిసరిగా వర్క్ లేదా స్కూల్ ఖాతాను ఉపయోగించాలి, అలాగే యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి మీ Google Workspace అడ్మినిస్ట్రేటర్ తప్పనిసరిగా అనుమతి ఇవ్వాలి.

యాప్‌లు అనేవి మీరు వ్యక్తులతో చేసే విధంగానే మీరు చాట్ చేయగల ప్రత్యేక ఖాతాలు. మీరు సమాచారాన్ని చూసేందుకు, మీటింగ్‌లను షెడ్యూల్ చేయడానికి లేదా ఇతర టాస్క్‌లు చేయడానికి సంభాషణ పద్ధతిలో యాప్‌లతో కనెక్ట్ కావచ్చు. Google Meet, Google Drive యాప్‌ల వంటి కొన్ని యాప్‌లను Google క్రియేట్ చేసి, వాటిని నిర్వహిస్తుంది. థర్డ్-పార్టీ సాఫ్ట్‌వేర్ వెండర్‌లు ఇతర యాప్‌లను క్రియేట్ చేసి, వాటిని నిర్వహిస్తారు.

యాప్‌లను కనుగొనండి

  1. "1 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులను జోడించండి" కాంబో బాక్స్‌ను తెరవడానికి Ctrl + k నొక్కండి.
  2. మీరు "యాప్‌లను కనుగొనండి"కి వెళ్లే వరకు కింది వైపు బాణం కీని నొక్కి, ఆపై Enter నొక్కండి.
  3. పేరులోని కొత్త భాగాన్ని టైప్ చేయండి, లేదా అందించిన కంటెంట్‌ను అన్వేషించడానికి Tab, బాణం కీలను ఉపయోగించండి.
  4. యాప్‌పై Enter నొక్కి, డైలాగ్‌లోని వివరణను అన్వేషించండి. యాప్‌ను చాట్‌కు జోడించడానికి మొదట్లో ఫోకస్ అనేది బటన్‌పై ఉంటుంది.
  5. మీ చాట్ సంభాషణల సెట్‌కు ఈ యాప్‌ను జోడించడానికి Enter నొక్కండి.
  6. యాప్‌ను స్పేస్‌కు జోడించడానికి:
    1. "స్పేస్‌కు జోడించండి" బటన్‌కు వెళ్లడానికి Tab నొక్కండి.
    2. "స్పేస్ పేరును ఎంటర్ చేయండి" డైలాగ్‌ను తెరవడానికి Enter నొక్కండి.
    3. మీరు యాప్‌ను జోడించాలనుకుంటున్న స్పేస్‌కు సంబంధించిన పేరులోని కొంత భాగాన్ని టైప్ చేయండి లేదా కింది వైపు బాణం కీని నొక్కండి.
  7. బటన్‌లలో ఒక దాన్ని యాక్టివేట్ చేసిన తర్వాత, యాప్ జోడించబడి, డైలాగ్ తీసివేయబడుతుంది.

చిట్కా: ఈ విధానం చాట్ లేదా స్పేస్‌కు యాప్‌ను ఎలా జోడించాలో తెలియజేస్తుంది. తర్వాతి విభాగంలో అదనపు దశలు లేకుండా ఇప్పటికే ఉన్న స్పేస్‌కు యాప్‌ను ఎలా జోడించాలి అనే దాని గురించి తెలుసుకోండి.

స్పేస్‌కు యాప్‌ను జోడించండి

  1. మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న స్పేస్‌ను తెరవండి.
  2. మెనూను తెరవడానికి Ctrl + g నొక్కండి.
  3. మీరు "యాప్‌లు & ఇంటిగ్రేషన్‌లు" ఆప్షన్‌కు వెళ్లే వరకు కింది వైపు బాణం కీని నొక్కి, ఆపై Enter నొక్కండి.
  4. “యాప్‌లను జోడించండి” బటన్‌కు వెళ్లడానికి Tabను నొక్కి, ఆపై Enter నొక్కండి.
  5. మీరు జోడించాలనుకుంటున్న యాప్ పేరును టైప్ చేయండి. మీరు టైప్ చేస్తున్నప్పుడు, మ్యాచ్ అయ్యే మొదటి పేరు మీకు వినిపిస్తుంది.
  6. పేరును ఎంచుకోండి:
    • మీకు కావాల్సిన పేరు వినబడితే, Enter నొక్కండి.
    • మీకు కావాల్సిన పేరు వినబడే వరకు కింది వైపు బాణం కీని నొక్కి, ఆపై Enter నొక్కండి.
  7. మీరు 'జోడించండి' బటన్‌కు వెళ్లే వరకు Tabను నొక్కి, ఆపై Enter నొక్కండి.

స్పేస్‌లో యాప్‌నకు మెసేజ్ చేయండి

  1. యాప్‌ను కలిగి ఉన్న స్పేస్‌ను తెరవండి.
  2. కొత్త టాపిక్‌ను తెరవడానికి Ctrl + s నొక్కండి.
  3. "@appname" అని టైప్ చేసి, ఆపై మీ మెసేజ్‌ను టైప్ చేయండి. యాప్ పేరుతో "appname"ను రీప్లేస్ చేయండి.
  4. Enter నొక్కి, అది ప్రతిస్పందించడం కోసం వేచి ఉండండి.

మీరు యాప్‌తో ఉపయోగించగల కమాండ్‌ల గురించి ఇక్కడ తెలుసుకోండి

  • యాప్‌తో డైరెక్ట్ మెసేజ్‌లో, "సహాయం" అని టైప్ చేయండి.
  • స్పేస్‌లో, "@appname సహాయం" అని టైప్ చేయండి. యాప్ పేరుతో "appname"ను రీప్లేస్ చేయండి.

సెర్చ్ చేయండి

చాట్ లేదా స్పేస్‌లో కంటెంట్ కోసం సెర్చ్ చేయడానికి:

  1. ఎడిట్ మోడ్‌లో లేనప్పుడు స్లాష్ నొక్కండి.
  2. సెర్చ్ క్వెరీని టైప్ చేయండి, అప్పుడు అందించబడే మొదటి మ్యాచ్‌లు వ్యక్తులు, గ్రూప్‌లు, లేదా స్పేస్‌లను సూచిస్తాయి.
  3. "మరిన్ని సెర్చ్ ఫలితాలు" అనే చివరి ఆప్షన్‌కు వెళ్లడానికి పై వైపు బాణం కీని నొక్కండి.
  4. మీ సెర్చ్ క్వెరీని కలిగి ఉన్న అన్ని మెసేజ్‌లను డిస్‌ప్లే చేయడానికి Enter నొక్కండి. ఫలితాలు అనేవి ముందుగా అత్యంత ఇటీవలి ఫలితంతో ప్రారంభం అయ్యి కాలానుగత క్రమంలో ఉంటాయి.
  5. మీ సెర్చ్ క్వెరీని కలిగి ఉన్న మెసేజ్‌లకు వెళ్లడానికి కింది వైపు బాణం కీని నొక్కండి.

చిట్కా: ఫలితాన్ని కలిగి ఉన్న చాట్ మెసేజ్ లేదా స్పేస్‌ల టాపిక్‌కు వెళ్లడానికి ఫలితాన్ని యాక్టివేట్ చేయండి. సెర్చ్ ఫలితాలకు తిరిగి రావడానికి బ్రౌజర్‌కు సంబంధించిన 'వెనుకకు' షార్ట్‌కట్‌ను ఉపయోగించండి. సెర్చ్ ఫలితాల నుండి నిష్క్రమించడానికి బ్రౌజర్‌కు సంబంధించిన 'వెనుకకు' షార్ట్‌కట్‌ను మళ్లీ ఉపయోగించండి.

నోటిఫికేషన్ సెట్టింగ్‌లను మార్చండి

మీరు Chat యాప్ నుండి, లేదా ఒక్కో సంభాషణకు సంబంధించి మీకు ఎలా తెలియజేయబడాలి అనే దాన్ని మార్చవచ్చు. దిగువున పేర్కొన్న మెసేజ్, స్పేస్‌ల ఆప్షన్‌లను యాక్సెస్ చేయండి లింక్‌లో సంభాషణ ఆప్షన్‌లు వివరించబడ్డాయి.

Chat యాప్ కోసం సెట్టింగ్‌లను తెరవండి:

  1. నావిగేషన్ మోడ్‌కు మారడానికి Escape నొక్కండి.
  2. "వ్యక్తులను, స్పేస్‌లను, అలాగే మెసేజ్‌లను కనుగొనండి" ఫీల్డ్‌కు ఫోకస్‌ను తరలించడానికి స్లాష్ నొక్కండి.
  3. సెట్టింగ్‌ల బటన్‌కు వెళ్లడానికి Tab నొక్కి, నోటిఫికేషన్ ఆప్షన్‌లను కలిగి ఉన్న సెట్టింగ్‌ల డైలాగ్‌ను తెరవడానికి Enter నొక్కండి.
  4. మీకు కావాల్సిన మార్పులు చేసి, ఆపై పూర్తయింది బటన్‌కు వెళ్లడానికి Tab నొక్కి, Enter నొక్కండి.

మెసేజ్, స్పేస్‌ల ఆప్షన్‌లను యాక్సెస్ చేయండి

చాట్ మెసేజ్‌లు, స్పేస్‌ల కోసం ఆప్షన్‌ల మెనూను తెరవడానికి Ctrl + g నొక్కండి. ఈ మెనూలో కింద పేర్కొన్న వాటికి సంబంధించిన ఆప్షన్‌లు ఉంటాయి:

  • మెంబర్‌లను చూడటం లేదా మెంబర్‌లను మేనేజ్ చేయడం
  • యాప్‌లు, ఇంటిగ్రేషన్‌లు
  • చాట్‌కు లేదా స్పేస్‌లకు సంభాషణను పిన్ చేయడం
  • ఈ సంభాషణ కోసం నోటిఫికేషన్ ఆప్షన్‌లు
  • హిస్టరీని టోగుల్ చేయడం
  • సంభాషణను బ్లాక్ చేయడం

స్మార్ట్ రిప్లయిలను ఉపయోగించండి

మీరు అందుకునే నిర్దిష్ట మెసేజ్‌ల కోసం, క్విక్ రిప్లయిలను పంపడానికి మీరు ఉపయోగించగల సూచనలను Chat అందిస్తుంది.

స్మార్ట్ రిప్లయి ఆప్షన్ ఆన్ చేసి ఉందని నిర్ధారించుకోండి

  1. మునుపటి విభాగంలో వివరించిన విధంగా సెట్టింగ్‌లను తెరవండి.
  2. "వెబ్, డెస్క్‌టాప్‌లో స్మార్ట్ రిప్లయి సదుపాయాన్ని ప్రారంభించండి" చెక్‌బాక్స్‌కు వెళ్లడానికి Tab నొక్కండి.
  3. టోగుల్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి Spacebarను నొక్కండి.


Google, Google Workspace, and related marks and logos are trademarks of Google LLC. All other company and product names are trademarks of the companies with which they are associated.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
18154551060100686709
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
1026838
false
false