Google Chatలో అనుకూల ఎమోజిల గురించి తెలుసుకోండి

Google Chat ద్వారా మీ సంస్థతో అనుకూల ఎమోజిలను క్రియేట్ చేసి, షేర్ చేయండి. మెసేజ్‌లను వ్యక్తిగతీకరించడానికి, అలాగే మీ టీమ్ కల్చర్‌ను షేర్ చేసుకోవడానికి మీ అనుకూల ఎమోజిలను ఉపయోగించండి.

ముఖ్య గమనికలు:

  • అనుకూల ఎమోజిలు వర్క్, స్కూల్ ఖాతాలకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
  • మీ అడ్మినిస్ట్రేటర్ అనుకూల ఎమోజిలను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. మీ అడ్మినిస్ట్రేటర్ ఎవరో తెలుసుకోండి.
  • మీరు మీ సంస్థకు చెందని వ్యక్తులతో అనుకూల ఎమోజిలను షేర్ చేయలేరు.

అనుకూల ఎమోజిని క్రియేట్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Chatకు లేదా Gmailకు వెళ్లండి.
  2. చాట్ సంభాషణను తెరవండి.
  3. దిగువ కుడి వైపున, ఎమోజిని జోడించండి Emojiని క్లిక్ చేయండి.
  4. “ఎమోజిలను సెర్చ్ చేయండి” పక్కన, క్రియేట్ చేయండి  ఆ తర్వాత ఇమేజ్‌ను అప్‌లోడ్ చేయండి ఆ తర్వాత సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

Chatలో అనుకూల ఎమోజిలను ఉపయోగించండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Chatకు లేదా Gmailకు వెళ్లండి.
  2. చాట్ సంభాషణను తెరవండి.
  3. దిగువ కుడి వైపున, ఎమోజిని జోడించండి Emojiని క్లిక్ చేయండి.
  4. మీ సంస్థకు చెందిన అన్ని అనుకూల ఎమోజిలను తెరవడానికి, అనుకూల ఎమోజిలు  అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: అనుకూల ఎమోజి పేరును చూడటానికి మీరు దానిపై కర్సర్ ఉంచవచ్చు.

మీ అనుకూల ఎమోజిలను కనుగొనండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Chatకు లేదా Gmailకు వెళ్లండి.
  2. చాట్ సంభాషణను తెరవండి.
  3. దిగువ కుడి వైపున, ఎమోజిని జోడించండి Emojiని క్లిక్ చేయండి.
  4. అనుకూల ఎమోజిలు  ఆ తర్వాత మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: మీరు పేరు ఆధారంగా అనుకూల ఎమోజిల కోసం సెర్చ్ చేయవచ్చు.

మీ అనుకూల ఎమోజిలను తొలగించండి

ముఖ్య గమనికలు:

  • మీరు అనుకూల ఎమోజిని తొలగించినప్పుడు, అది మీ సంస్థలోని ప్రతి ఒక్కరికీ తీసివేయబడుతుంది. తొలగించిన ఎమోజి, మెసేజ్‌లు లేదా ప్రతిస్పందనల నుండి తీసివేయబడుతుంది.
  • మీరు క్రియేట్ చేసిన అనుకూల ఎమోజిలను మాత్రమే మీరు తొలగించవచ్చు.
  • ఎమోజి మేనేజర్‌లు సంస్థలోని ఎవరైనా క్రియేట్ చేసిన అనుకూల ఎమోజిలను తొలగించగలరు.

అనుకూల ఎమోజిని తొలగించడానికి:

  1. మీ కంప్యూటర్‌లో, Google Chatకు లేదా Gmailకు వెళ్లండి.
  2. చాట్ సంభాషణను తెరవండి.
  3. దిగువ కుడి వైపున, ఎమోజిని జోడించండి Emojiని క్లిక్ చేయండి.
  4. అనుకూల ఎమోజిలు  ఆ తర్వాత మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. ఎమోజి కుడి వైపున, తొలగించండి  ఆ తర్వాత తొలగించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీ సంస్థకు చెందిన అనుకూల ఎమోజీలను కనుగొనండి

ఎమోజీ మేనేజర్‌గా, మీరు కింద పేర్కొన్న వాటిని చేయవచ్చు:

  • మీరు మీ సంస్థలోని వ్యక్తులు క్రియేట్ చేసే అనుకూల ఎమోజీలను కనుగొనవచ్చు.
  • ఎమోజీల వివరాలను చూడవచ్చు:
    • ఇమేజ్
    • పేరు
    • క్రియేటర్ పేరు
    • క్రియేట్ చేసిన తేదీ

అనుకూల ఎమోజీని కనుగొనడానికి:

  1. మీ కంప్యూటర్‌లో, Google Chatకు లేదా Gmailకు వెళ్లండి.
  2. సెట్టింగ్‌లు ఆ తర్వాత అనుకూల ఎమోజీని మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

 చిట్కా: మీరు సెర్చ్ బార్‌లో ఎమోజీల కోసం పేరు ఆధారంగా సెర్చ్ చేయవచ్చు.

మీ సంస్థకు చెందిన అనుకూల ఎమోజీలను తొలగించండి

ఎమోజీ మేనేజర్‌గా, మీరు సమస్యాత్మకమైన లేదా మీ సంస్థ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా లేని ఎమోజీలను తొలగించవచ్చు.

ముఖ్య గమనిక: తొలగించబడిన ఎమోజీలు మెసేజ్‌లలో, ప్రతిస్పందనలలో రీప్లేస్ చేయబడతాయి. సంస్థలోని ఎవరైనా వాటిని షేర్ చేయలేరు లేదా ఉపయోగించలేరు.

  1. మీ కంప్యూటర్‌లో, Google Chatకు లేదా Gmailకు వెళ్లండి.
  2. సెట్టింగ్‌లు ఆ తర్వాత అనుకూల ఎమోజీని మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. మీరు తొలగించాలనుకుంటున్న ఎమోజీ కుడి వైపున, మరిన్ని చర్యలు ఆ తర్వాత ఎమోజీని తొలగించండి  ఆ తర్వాత తొలగించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10411161556338362045
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
1026838
false
false