Google Calendar నోటిఫికేషన్‌లను నిర్వహించండి

రాబోయే ఈవెంట్‌ల గురించి రిమైండ్ చేయడంలో మీకు సహాయపడటానికి మీ ఫోన్, కంప్యూటర్ లేదా ఇమెయిల్‌తో నోటిఫికేషన్‌లను పొందవచ్చు. మీరు ఒకే ఈవెంట్ కోసం లేదా అనేక ఈవెంట్‌ల కోసం మీ నోటిఫికేషన్ సెట్టింగ్‌లను మార్చవచ్చు.

మీ నోటిఫికేషన్ సెట్టింగ్‌లను మార్చండి

మీరు ఈవెంట్ నోటిఫికేషన్‌లను పొందవచ్చు:

  • ఇమెయిల్‌లు.
  • మీ వెబ్ బ్రౌజర్‌ల బయట కనిపించే డెస్క్‌టాప్ నోటిఫికేషన్‌లు. మీ క్యాలెండర్‌ను తప్పనిసరిగా తెరవాలి.
  • మీ Google Calendar విండో లోపల కనిపించే అలర్ట్‌లు.

చిట్కా: Google Calendarను ఉపయోగించని వ్యక్తులకు వారు ఆహ్వానించబడిన ఈవెంట్‌లు క్రియేట్, అప్‌డేట్ చేయబడినప్పుడు లేదా తొలగించినప్పుడు Google Calendar వారికి నోటిఫికేషన్‌లను ఇమెయిల్ చేస్తుంది.

నోటిఫికేషన్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయండి

అన్ని ఈవెంట్‌ల కోసం

ముఖ్య విషయం మీరు నోటిఫికేషన్ సెట్టింగ్‌లను మార్చడానికి Google Chrome లేదా Safari లాంటి ఇంటర్నెట్ బ్రౌజర్‌లో Google Calendarని తెరవాలి. నోటిఫికేషన్‌లను చూపేందుకు calendar.google.comను అనుమతించాల్సిందిగా మిమ్మల్ని అడగవచ్చు.

మీ అన్ని ఈవెంట్‌లకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రాధాన్యతలను Google Calendarలో మార్చవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, Google Calendarను తెరవండి.
  2. పైన కుడి వైపున, సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆ తర్వాత సెట్టింగ్‌లు ‌ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  3. ఎడమ వైపున, సాధారణం” దిగువున ఉన్న, నోటిఫికేషన్ సెట్టింగ్‌లు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. “నోటిఫికేషన్ సెట్టింగ్‌లు” దిగువున ఉన్న, మీరు వీటిని చేయవచ్చు:
    • నోటిఫికేషన్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయండి: నోటిఫికేషన్‌లు డ్రాప్-డౌన్‌ను క్లిక్ చేసి, మీరు నోటిఫికేషన్‌లను ఎలా పొందాలనుకుంటున్నది ఎంచుకోండి.
    • తాత్కాలికంగా వాయిదా వేయబడిన నోటిఫికేషన్‌ల సమయాన్ని సర్దుబాటు చేయండి: “డెస్క్‌టాప్ నోటిఫికేషన్‌లు” ఆప్షన్‌ను ఆన్ చేయండి, ఆ తర్వాత తాత్కాలికంగా వాయిదా వేయబడిన నోటిఫికేషన్‌లను చూపించు ఆప్షన్‌ను క్లిక్ చేసి, మీ సమయాన్ని అనుకూలంగా మార్చండి.
    • మీరు ఈవెంట్‌కు “అవును” లేదా “హాజరు కావచ్చు” అని సమాధానం ఇస్తేనే నోటిఫికేషన్‌లను పొందండి: "అవును లేదా హాజరు కావచ్చు అని నేను సమాధానం ఇస్తేనే నాకు తెలియజేయండి" పక్కన ఉన్న బాక్స్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: తాత్కాలికంగా వాయిదా వేసిన నోటిఫికేషన్‌లు కేవలం Google Chrome బ్రౌజర్‌లో మాత్రమే కనిపిస్తాయి. మీకు ఒకే ఈవెంట్ కోసం అనేక నోటిఫికేషన్ అలర్ట్ సమయాలు ఉంటే, చివరి నోటిఫికేషన్‌లో మాత్రమే తాత్కాలిక వాయిదా కనిపిస్తుంది.

ఒకే ఈవెంట్‌ల కోసం

  1. Google Calendarను తెరవండి
  2. ఈవెంట్ ఆ తర్వాత ఈవెంట్‌ను ఎడిట్ చేయండి Edit event క్లిక్ చేయండి.
  3. నోటిఫికేషన్‌లకు పక్కన: 
    • మీ నోటిఫికేషన్‌లను ఎడిట్ చేయడానికి: మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటున్నారో లేదా ఇమెయిల్ కావాలనుకుంటున్నారో ఎంచుకోండి. మీరు ముందస్తుగా ఎంత తరచుగా అలర్ట్‌లు పొందాలనుకునేది మార్చవచ్చు.
    • మరొక నోటిఫికేషన్ పద్ధతిని జోడించడానికి: నోటిఫికేషన్‌ను జోడించు ఎంపికను క్లిక్ చేయండి
    • నోటిఫికేషన్‌ను తీసివేయడానికి: తీసివేయి తీసివేయండి క్లిక్ చేయండి.
  4. పేజీకి ఎగువ, సేవ్ చేయి క్లిక్ చేయండి.

చిట్కా: మీరు ఇమెయిల్, డెస్క్‌టాప్ అలర్ట్ లేదా రెండింటి ద్వారా నోటిఫికేషన్ పంపే విధంగా ఎంచుకోవచ్చు. మీరు చేసే మార్పులు ఈవెంట్‌కు ఆహ్వానించబడిన వారికి మినహా ఇంకెవరికీ కనిపించవు.

నిర్దిష్ట క్యాలెండర్‌ల కోసం

మీరు యజమానిగా ఉన్న నిర్దిష్ట క్యాలెండర్‌ల కోసం నోటిఫికేషన్ ప్రాధాన్యతలను మార్చవచ్చు.

  1. Google Calendarను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆ తర్వాత సెట్టింగ్‌లు క్లిక్ చేయండి.
  3. ఎడమ వైపున, "నా క్యాలెండర్‌ల సెట్టింగ్‌లు" కింద, మీరు మార్చాలనుకుంటున్న క్యాలెండర్ ఆ తర్వాత క్యాలెండర్ సెట్టింగ్‌లు క్లిక్ చేయండి.
  4. "ఈవెంట్ నోటిఫికేషన్‌లు", "రోజంతా జరిగే ఈవెంట్ నోటిఫికేషన్‌లు”కు దిగువున: 
    • మీ నోటిఫికేషన్‌లను ఎడిట్ చేయడానికి: మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటున్నారో లేదా ఇమెయిల్ కావాలనుకుంటున్నారో ఎంచుకోండి. మీరు ముందస్తుగా ఎంత తరచుగా అలర్ట్‌లు పొందాలనుకునేది మార్చవచ్చు.
    • మరొక నోటిఫికేషన్ పద్ధతిని జోడించడానికి: నోటిఫికేషన్‌ను జోడించు ఎంపికను క్లిక్ చేయండి
    • నోటిఫికేషన్‌ను తీసివేయడానికి: నోటిఫికేషన్‌ను తీసివేయి తీసివేయండి క్లిక్ చేయండి.

"బ్రౌజర్‌లో నోటిఫికేషన్‌లకు మద్దతు లేదు" ఎర్రర్

ఈ ఎర్రర్ ప్రకారం ఈవెంట్ నోటిఫికేషన్‌లను పొందడానికి, మీరు మీ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్ పొందలేదు
  • మీ క్యాలెండర్ కోసం మీరు తప్పకుండా నోటిఫికేషన్‌లను ఆన్ చేసారని నిర్ధారించుకోండి. పైన సూచనలు ఫాలో అవ్వండి.
  • మీరు మీ బ్రౌజర్ అనుమతి సెట్టింగ్‌లలో నోటిఫికేషన్‌లను చూపేందుకు ఎంచుకున్నట్లు నిర్ధారించుకోండి. అలా ఎంచుకోకుంటే, డెస్క్‌టాప్ నోటిఫికేషన్‌లను ఆన్ చేయండి.
  • మీ ఇంటర్నెట్ బ్రౌజర్‌లో Google Calendar తెరవబడే ఉందని నిర్ధారించండి.

Google Chrome

  1. Google Chromeని తెరవండి.
  2. ఎగువ కుడివైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లును క్లిక్ చేయండి.
  3. గోప్యత, భద్రత ఆ తర్వాత సైట్ సెట్టింగ్‌లు ఆ తర్వాత నోటిఫికేషన్‌లు ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  4. "అనుమతించండి" పక్కన, జోడించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. calendar.google.comని నమోదు చేసి, ఆ తర్వాత, జోడించు క్లిక్ చేయండి.

మిగతా అన్ని ఇతర బ్రౌజర్‌లు

నిర్దిష్ట సూచనల కోసం మీ బ్రౌజర్ మద్దతు సైట్‌ను చూడండి.

  1. మీ వెబ్ బ్రౌజర్‌ను తెరవండి.
  2. మీ బ్రౌజర్ నోటిఫికేషన్ ప్రాధాన్యతలకు వెళ్లండి.
  3. calendar.google.com కోసం అనుమతులను జోడించండి.

చిట్కా: మీరు మీ సంస్థలోని ఎవరికైనా మీ క్యాలెండర్‌ను డెలిగేట్ చేస్తే, ఆ వ్యక్తి మీ క్యాలెండర్‌లో ఈవెంట్‌ను మార్చినప్పుడు మీకు నోటిఫికేషన్ రాదు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1247831786980727688
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
88
false
false