క్యాలెండర్ నుంచి తొలగించండి లేదా సభ్యత్వాన్ని తీసివేయండి

మీకు ఇక క్యాలెండర్ అవసరం లేకుంటే, మీరు దాన్ని శాశ్వతంగా తొలగించవచ్చు లేదా దాని సభ్యత్వాన్ని తీసివేయవచ్చు. తర్వాత ఎప్పుడైనా మీకు క్యాలెండర్ అవసరమని భావిస్తే, బదులుగా మీరు దాన్ని దాచవచ్చు.

క్యాలెండర్‌లను తీసివేయడం కోసం ఎంపికలు

క్యాలెండర్‌ను తాత్కాలికంగా దాచండి

ఇది క్యాలెండర్‌లను మీరు మాత్రమే సందర్భానుసారం చూసేందుకు మంచి ఎంపిక.

  1. మీ కంప్యూటర్‌లో, Google Calendarను తెరవండి.
  2. ఎడమవైపున, మీరు దాచాలనుకునే క్యాలెండర్‌ను కనుగొనండి. అది "నా క్యాలెండర్‌లు" లేదా "ఇతర క్యాలెండర్‌లు" కింద ఉండవచ్చు.
  3. క్యాలెండర్‌ను దాచడానికి లేదా చూపడానికి దానిపై క్లిక్ చేయండి.
మీ లిస్ట్ నుంచి క్యాలెండర్‌ను తాత్కాలికంగా తీసివేయండి

మీరు మీ లిస్ట్ నుంచి క్యాలెండర్‌ను తీసివేస్తే, మీకు అది "నా క్యాలెండర్‌లు" లేదా "ఇతర క్యాలెండర్‌లు" కింద కనిపించదు.

క్యాలెండర్‌ను తీసివేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Calendarను తెరవండి.
  2. ఎడమ వైపున, మీరు తీసివేయాలనుకునే క్యాలెండర్‌ను కనుగొనండి. అది "నా క్యాలెండర్‌లు" లేదా "ఇతర క్యాలెండర్‌లు" కింద ఉండవచ్చు.
  3. మీ మౌస్ కర్సర్‌ను క్యాలెండర్ పేరుపై ఉంచి, మరిన్ని మరిన్ని‌ని క్లిక్ చేయండి.
  4. లిస్ట్‌లో కనిపించకుండా దాచండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీరు తీసివేసిన క్యాలెండర్‌ను తిరిగి పొందండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Calendarను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆ తర్వాత సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. ఎడమ నిలువు వరుసలో, మీరు తిరిగి పొందాలనుకునే క్యాలెండర్‌ను కనుగొనండి.
  4. ప్రివ్యూ Preview‌ను క్లిక్ చేయండి.
మీ లిస్ట్ నుంచి క్యాలెండర్‌ను శాశ్వతంగా తీసివేయండి

మీరు క్యాలెండర్ నుంచి సబ్‌స్క్రిప్షన్‌ను తీసివేసినప్పుడు, క్యాలెండర్‌ను మీతో మళ్లీ షేర్ చేయగల మరొక యజమాని ఉంటే తప్ప మీరు దాన్ని మళ్లీ చూడలేరు.

  1. మీ కంప్యూటర్‌లో, Google Calendarను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆ తర్వాత సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. ఎడమ నిలువు వరుసలో, మీరు తీసివేయాలనుకునే క్యాలెండర్‌ను ఎంచుకోండి.
  4. క్యాలెండర్‌ను తీసివేయి క్లిక్ చేయండి.
  5. సభ్యత్వాన్ని తీసివేయి క్లిక్ చేయండి.
  6. క్యాలెండర్‌ను తీసివేయి క్లిక్ చేయండి.
మీరు సభ్యత్వాన్ని తీసివేసిన క్యాలెండర్‌ను పునరుద్ధరించండి

మీరు సభ్యత్వాన్ని తీసివేసిన క్యాలెండర్‌ను తిరిగి పొందుతారో లేదో అనే విషయం క్యాలెండర్ మీ స్వంతమా లేదా వేరొకరు షేర్ చేసారా అనే విషయంపై ఆధారపడి ఉంటుంది.

క్యాలెండర్ వేరొకరి స్వంతమైనది

మీరు సభ్యత్వం తీసివేసిన క్యాలెండర్ వేరొకరికి చెందినది అయితే, మీరు వారి క్యాలెండర్‌ను మీతో మళ్లీ షేర్ చేయమని వారిని అడగవచ్చు.

క్యాలెండర్ మీ స్వంతం, షేర్ చేయబడలేదు

దురదృష్టవశాత్తూ, మీరు సభ్యత్వం తీసివేసిన క్యాలెండర్‌ను పునరుద్ధరించలేరు. భవిష్యత్తులో, బదులుగా క్యాలెండర్‌ను మీ జాబితా నుంచి తీసివేయడం ప్రయత్నించండి.

క్యాలెండర్ మీ స్వంతం, వేరొకరితో షేర్ చేయబడింది

మీ స్వంత క్యాలెండర్‌కు ఇప్పటికీ వేరొకరు యాక్సెస్‌ను కలిగి ఉంటే, క్యాలెండర్ చిరునామాను కనుగొనమని మీరు వారిని అడగవచ్చు. క్యాలెండర్‌ను తిరిగి మీ ఖాతాకు జోడించడానికి మీరు ఆ చిరునామాను ఉపయోగించవచ్చు.

దశ 1: ఈ దశలను ఫాలో అవ్వమని మీరు మరొక వ్యక్తిని అడగవచ్చు
  1. మీ కంప్యూటర్‌లో, Google Calendarను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆ తర్వాత సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. ఎడమ నిలువు వరుసలో, మీరు రిస్టోర్ చేయాలనుకునే షేర్ చేసిన క్యాలెండర్‌ను కనుగొనండి.
  4. క్యాలెండర్ పేరుపై క్లిక్ చేయండి.
  5. "క్యాలెండర్‌ను ఏకీకృతం చేయి" విభాగంలో, రహస్య లేదా పబ్లిక్ iCal చిరునామాను క్లిక్ చేయండి.
  6. లింక్‌ను కాపీ చేసి, దాన్ని మీకు పంపండి.
దశ 2: ఈ దశలను అనుసరించండి
  1. మీ కంప్యూటర్‌లో, Google Calendarను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆ తర్వాత సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. ఎడమవైపున, క్యాలెండర్‌ను జోడించండి ఆ తర్వాత URL నుండి క్లిక్ చేయండి.
  4. మరొక వ్యక్తి నుంచి మీరు స్వీకరించిన క్యాలెండర్ అడ్రస్‌ను లింక్‌ను URL ఫీల్డ్‌లో పేస్ట్ చేయండి.
  5. క్యాలెండర్‌ను జోడించండి‌ని క్లిక్ చేయండి. Google Calendar ఎడమవైపున లిస్ట్ చేయబడిన క్యాలెండర్ మీకు కనిపిస్తుంది.
క్యాలెండర్‌ను తొలగించండి (చర్య రద్దు చేయబడదు)

మీరు క్యాలెండర్‌ను తొలగించినప్పుడు ఏమి జరుగుతుంది

  • క్యాలెండర్, అలాగే అందులోని ఈవెంట్‌లు అన్నీ శాశ్వతంగా తొలగించబడతాయి.
  • క్యాలెండర్‌ను ఇతర వ్యక్తులతో షేర్ చేసి ఉంటే, వారు కూడా క్యాలెండర్‌ను, అందులోని ఈవెంట్‌లను యాక్సెస్ చేయలేరు.

గమనిక: మీరు మీ ప్రధాన (డిఫాల్ట్) క్యాలెండర్‌ను తొలగించలేరు, అయితే మీరు అందులోని ఈవెంట్‌లను తీసివేయగలరు.

క్యాలెండర్‌ను తొలగించండి

  1. మీ కంప్యూటర్‌లో, Google క్యాలెండర్ తెరవండి.
  2. ఎగువన కుడివైపు, సెట్టింగ్‌లు క్లిక్ చేయండి సెట్టింగ్‌లు ఆ తర్వాత సెట్టింగ్‌లు.
  3. ఎడమ నిలువు వరుసలో, మీరు తొలగించాలనుకునే క్యాలెండర్‌ను కనుగొనండి.
  4. క్యాలెండర్ పేరుపై క్లిక్ చేయండి.
  5. క్యాలెండర్‌ను తీసివేయండి ఆ తర్వాత తొలగించండి ఆ తర్వాత శాశ్వతంగా తొలగించండి  ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
మీ ప్రధాన క్యాలెండర్‌లోని అన్ని ఈవెంట్‌లను తొలగించండి

మీరు మీ ప్రధాన క్యాలెండర్‌ను తొలగించలేరు, అయితే మీరు అందులోని అన్ని ఈవెంట్‌లను తొలగించగలరు.

  1. మీ కంప్యూటర్‌లో, Google Calendarను తెరవండి.
  2. పేజీ ఎగువున, సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆ తర్వాత సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. లిస్ట్ ఎగువున మీ ప్రధాన క్యాలెండర్ పేరుపై క్లిక్ చేయండి. ఇది సాధారణంగా మీ మొదటి మరియు చివరి పేరుగా లేబుల్ చేయబడింది.
  4. పేజీ దిగువున, తొలగించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. మీ ప్రధాన క్యాలెండర్‌ను తీసివేసిన తర్వాత Google Calendar ఫీచర్‌లను పూర్తిగా యాక్సెస్ చేయడానికి దీనికి కొన్ని నిమిషాల సమయం పట్టవచ్చు.

సంబంధిత కథనాలు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15565559632505406311
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
88
false
false