మీ క్యాలెండర్‌ను ఎవరితో అయినా షేర్ చేయండి

ముఖ్యమైనది: మీ క్యాలెండర్‌ను షేర్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి, అలాగే ఇతరులు ఏమి యాక్సెస్ చేయగలరో ఎంపిక చేయండి. మీ క్యాలెండర్‌కు పూర్తి యాక్సెస్ అనుమతులు కలిగి ఉన్న ఎవరైనా వీటిని చేయగలరు:

  • ఆహ్వానాలకు ప్రతిస్పందించడం
  • ఈవెంట్‌లను క్రియేట్ చేసి, ఎడిట్ చేయడం
  • ఇతరులతో మీ క్యాలెండర్‌ను షేర్ చేయడం
  • మీ క్యాలెండర్‌లో మార్పుల గురించి ఇమెయిల్‌లను అందుకోవడం
  • మీ క్యాలెండర్‌ను తొలగించడం

చిట్కా: మీ ఖాతా ఆఫీస్ లేదా స్కూల్ ద్వారా మేనేజ్ చేయబడుతున్నట్లయితే, మీ ఖాతా అడ్మిన్ సంస్థ వెలుపల షేరింగ్ చేయడాన్ని పరిమితం చేసి ఉండవచ్చు లేదా ఆఫ్ చేసి ఉండవచ్చు. మరింత తెలుసుకోవడానికి, మీ అడ్మిన్‌ను సంప్రదించండి.

మీ క్యాలెండర్‌ను షేర్ చేయండి

మీరు క్రియేట్ చేసిన ఏ క్యాలెండర్‌ను అయినా మీరు షేర్ చేయవచ్చు, అలాగే మీరు ప్రతి క్యాలెండర్‌కు విభిన్న యాక్సెస్ అనుమతులను సెట్ చేయవచ్చు. కొత్త క్యాలెండర్‌ను క్రియేట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

నిర్దిష్ట వ్యక్తులతో క్యాలెండర్‌ను షేర్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Calendarను తెరవండి. మీరు Google Calendar యాప్ నుండి క్యాలెండర్‌లను షేర్ చేయలేరు.
  2. ఎడమ వైపున ఉన్న, “నా క్యాలెండర్‌లు” విభాగాన్ని కనుగొనండి. దాన్ని విస్తరించడానికి, కింది వైపు బాణం కిందికి బాణంను క్లిక్ చేయండి.
  3. మీరు షేర్ చేయాలనుకునే క్యాలెండర్‌పై మౌస్ కర్సర్ ఉంచి, ఆపై మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు, అలాగే షేరింగ్ ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  4. “నిర్దిష్ట వ్యక్తులతో షేర్ చేయి” కింద, వ్యక్తులను జోడించు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. ఒక వ్యక్తి లేదా Google గ్రూప్‌‌నకు చెందిన ఇమెయిల్ అడ్రస్‌ను జోడించండి. వారి అనుమతి సెట్టింగ్‌లను సర్దుబాటు చేయడానికి డ్రాప్-డౌన్ మెనూను ఉపయోగించండి. యాక్సెస్ అనుమతుల గురించి మరింత తెలుసుకోండి.
  6. పంపు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  7. క్యాలెండర్‌ను వారి లిస్ట్‌కు జోడించడానికి, ఇమెయిల్ చేసిన లింక్‌ను స్వీకర్త క్లిక్ చేయాలి. వేరొకరి క్యాలెండర్‌ను ఎలా జోడించాలో తెలుసుకోండి.

చిట్కా: మీ స్వంతం కాని క్యాలెండర్‌ను షేర్ చేయడానికి, మీరు ఓనర్‌ను “మార్పులు చేసి, షేరింగ్‌ను మేనేజ్ చేయండి” ఆప్షన్‌కు అనుమతిని ఇవ్వమని అడగాలి.

పబ్లిక్‌తో క్యాలెండర్‌ను షేర్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Calendarను తెరవండి. మీరు Google Calendar యాప్ నుండి క్యాలెండర్‌లను షేర్ చేయలేరు.
  2. ఎడమ వైపున ఉన్న, “నా క్యాలెండర్‌లు” విభాగాన్ని కనుగొనండి. దాన్ని విస్తరించడానికి, కింది వైపు బాణం కిందికి బాణంను క్లిక్ చేయండి.
  3. మీరు షేర్ చేయాలనుకునే క్యాలెండర్‌పై మౌస్ కర్సర్ ఉంచి, ఆపై మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు, అలాగే షేరింగ్ ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  4. “యాక్సెస్ అనుమతుల” కింద, పబ్లిక్‌కు అందుబాటులో ఉంచండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. “పబ్లిక్‌కు అందుబాటులో ఉంచండి” పక్కన, డ్రాప్-డౌన్ మెనూలో మీరు ఇవ్వదలచిన యాక్సెస్ స్థాయిని ఎంచుకోండి. యాక్సెస్ అనుమతుల గురించి మరింత తెలుసుకోండి.

చిట్కా: Google Calendarను ఉపయోగించని వ్యక్తులు మీ క్యాలెండర్‌ను కనుగొనాలంటే దాన్ని పబ్లిక్‌గా ఉంచడం ఒక్కటే మార్గం. పబ్లిక్‌గా షేర్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

మీ సంస్థలోని అందరితో క్యాలెండర్‌ను షేర్ చేయండి

మీరు మీ ఆఫీస్, స్కూల్ లేదా ఇతర సంస్థ ద్వారా Google Calendarను ఉపయోగిస్తుంటే, మీరు “యాక్సెస్ అనుమతుల” కింద మీ క్యాలెండర్‌ను మీ సంస్థలోని అందరికీ అందుబాటులో ఉంచడానికి ఒక ఆప్షన్‌ను కనుగొంటారు. యాక్సెస్ అనుమతుల గురించి మరింత తెలుసుకోండి.

ఈ సెట్టింగ్ ఎలా పని చేస్తుంది

మీ క్యాలెండర్‌కు, వ్యక్తిగత ఈవెంట్‌లకు యాక్సెస్‌ను కంట్రోల్ చేయండి

షేర్ చేసిన క్యాలెండర్‌ల కోసం అనుమతి సెట్టింగ్‌లను అర్ధం చేసుకోండి
మీరు మీ క్యాలెండర్‌ను ఎవరికైనా షేర్ చేసినప్పుడు, వారు మీ ఈవెంట్‌లను ఎలా కనుగొనాలి, అలాగే వారు ఈవెంట్‌లను జోడించడం లేదా ఎడిట్ చేయడం వంటి మార్పులు చేయవచ్చా అనేది మీరు ఎంచుకోవచ్చు.

యాక్సెస్ అనుమతి

ఇతరులు ఏమి చేయగలరు

ఖాళీగా ఉన్నారు/బిజీగా ఉన్నారు మాత్రమే చూడండి (వివరాలను దాచండి)

  • మీ క్యాలెండర్ ఎప్పుడు బుక్ చేయబడింది, అలాగే అది ఖాళీగా ఎప్పుడు ఉందో చెక్ చేయండి, అయితే మీ ఈవెంట్‌ల పేర్లు లేదా వివరాలను చెక్ చేయవద్దు.

మొత్తం ఈవెంట్ వివరాలను చూడటం

  • కింది వాటికి మినహా, అన్ని ఈవెంట్‌ల కోసం వివరాలను కనుగొనగలరు:
    • ప్రైవేట్‌గా మార్క్ చేసిన ఈవెంట్‌ల వివరాలు కనిపించవు.
    • "గెస్ట్ లిస్ట్ చూడండి" అనుమతి లేని ఈవెంట్‌ల గెస్ట్‌ లిస్ట్ కనిపించదు.
  • క్యాలెండర్ కోసం టైమ్ జోన్ సెట్టింగ్‌ను కనుగొనండి.
  • ఈవెంట్‌లు క్రియేట్ చేసినప్పుడు, మార్చినప్పుడు, రద్దు చేసినప్పుడు, ఆహ్వానాన్ని అంగీకరించినప్పుడు లేదా రాబోయే ఈవెంట్‌లకు సంబంధించిన ఇమెయిల్ అలర్ట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేయండి.

ఈవెంట్‌లకు మార్పులు చేయండి

  • ప్రైవేట్ ఈవెంట్‌లతో సహా అన్ని ఈవెంట్‌ల కోసం వివరాలను కనుగొనండి.
  • ఈవెంట్‌లను జోడించండి, అలాగే ఎడిట్ చేయండి.
  • క్యాలెండర్ ట్రాష్ నుంచి ఈవెంట్‌లను రీస్టోర్ చేయండి లేదా శాశ్వతంగా తొలగించండి.
  • క్యాలెండర్ కోసం టైమ్ జోన్ సెట్టింగ్‌ను కనుగొనండి.
  • ఈవెంట్‌లు క్రియేట్ చేసినప్పుడు, మార్చినప్పుడు, రద్దు చేసినప్పుడు, ఆహ్వానాన్ని అంగీకరించినప్పుడు లేదా రాబోయే ఈవెంట్‌లకు సంబంధించిన ఇమెయిల్ అలర్ట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేయండి.

మార్పులు చేయండి & షేరింగ్‌ను మేనేజ్ చేయండి

  • ప్రైవేట్ ఈవెంట్‌లతో సహా అన్ని ఈవెంట్‌ల కోసం వివరాలను కనుగొనండి.
  • ఈవెంట్‌లను జోడించండి, అలాగే ఎడిట్ చేయండి.
  • క్యాలెండర్ ట్రాష్ నుంచి ఈవెంట్‌లను రీస్టోర్ చేయండి లేదా శాశ్వతంగా తొలగించండి.
  • క్యాలెండర్ కోసం టైమ్ జోన్ సెట్టింగ్‌ను కనుగొనండి.
  • షేరింగ్ సెట్టింగ్‌లను మార్చండి.
  • ఈవెంట్‌లు క్రియేట్ చేసినప్పుడు, మార్చినప్పుడు, రద్దు చేసినప్పుడు, ఆహ్వానాన్ని అంగీకరించినప్పుడు లేదా రాబోయే ఈవెంట్‌లకు సంబంధించిన ఇమెయిల్ అలర్ట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేయండి.
  • క్యాలెండర్‌ను శాశ్వతంగా తొలగించండి.

చిట్కాలు

  • మీ ఖాతా ఆఫీస్ లేదా స్కూల్ ద్వారా మేనేజ్ చేయబడుతున్నట్లయితే, మీ ఖాతా అడ్మిన్ అనుమతి సెట్టింగ్‌లను పరిమితం చేసి ఉండవచ్చు లేదా ఆఫ్ చేసి ఉండవచ్చు. మరింత తెలుసుకోవడానికి, మీ అడ్మిన్‌ను సంప్రదించండి.
  • మీరు ఈవెంట్ కోసం షేరింగ్ సెట్టింగ్‌లను లేదా Gmail నుండి ఈవెంట్‌ల కోసం ఆటోమేటిక్ సెట్టింగ్‌ను మార్చితే తప్ప వ్యక్తులకు “మార్పులు చేయి” యాక్సెస్ ఉన్నప్పటికీ “నాకు మాత్రమే” విజిబిలిటీ సెట్టింగ్ ఉన్న Gmail నుండి ఈవెంట్‌లు మీరు మీ క్యాలెండర్‌ను షేర్ చేసిన ఎవరికీ కనిపించవు. Gmail నుండి ఈవెంట్‌లు గురించి మరింత తెలుసుకోండి.

“యాక్సెస్ అనుమతులు” & “నిర్దిష్ట వ్యక్తులతో షేర్ చేయండి” సెట్టింగ్‌లు

మీ షేర్ చేసిన క్యాలెండర్‌కు సంబంధించిన సెట్టింగ్‌లలో, మీరు సాధారణ “యాక్సెస్ అనుమతులు”, “నిర్దిష్ట వ్యక్తులతో షేర్ చేయండి” అనుమతులను సెట్ చేయవచ్చు. ఈ రెండింటి మధ్య, నిర్దిష్ట వ్యక్తులకు బోర్డర్ అనుమతి వర్తిస్తుంది.

ఉదాహరణకు, మీరు ఒక క్యాలెండర్‌ను పబ్లిక్‌కు అందుబాటులో ఉంచి, “అన్ని ఈవెంట్ వివరాలను చూడండి” ఆప్షన్‌ను ఎంచుకుని, ఆపై మీరు క్యాలెండర్‌ను ఒక నిర్దిష్ట వ్యక్తితో షేర్ చేసి, “ఖాళీగా ఉన్నారు/బిజీగా ఉన్నారు మాత్రమే చూడండి” ఆప్షన్‌ను ఎంచుకుంటే, ఆ వ్యక్తి ఇప్పటికీ మీ ఈవెంట్ వివరాలను కనుగొనగలుగుతారు.

ఒక్కో ఈవెంట్ కోసం విజిబిలిటీ సెట్టింగ్‌లను మార్చండి
మీ ఈవెంట్‌లు ఆటోమేటిక్‌గా మీ క్యాలెండర్ మాదిరిగానే యాక్సెస్ అనుమతులను కలిగి ఉంటాయి. అయితే, మీరు ప్రతి ఈవెంట్‌కు విజిబిలిటీని ఎడిట్ చేయవచ్చు. ఈవెంట్ కోసం విజిబిలిటీ సెట్టింగ్‌ను మార్చడం గురించి మరింత తెలుసుకోండి.

క్యాలెండర్‌ను షేర్ చేయడాన్ని ఆఫ్ చేయండి

మీ క్యాలెండర్‌ను పబ్లిక్‌గా షేర్ చేయడం ఆపివేయండి
  1. మీ కంప్యూటర్‌లో, Google Calendarను తెరవండి.
  2. ఎడమ వైపున ఉన్న, "నా క్యాలెండర్‌లు" విభాగాన్ని కనుగొనండి. దాన్ని విస్తరించడానికి, మీరు కింది వైపు బాణం కిందికి బాణంను క్లిక్ చేయాల్సి ఉంటుంది.
  3. మీరు షేరింగ్‌ తీసివేయాలనుకొనే క్యాలెండర్‌పై మౌస్ కర్సర్ ఉంచి, ఆపై మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు, అలాగే షేరింగ్ ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
    • పబ్లిక్‌గా షేర్ చేయడాన్ని ఆపివేయడానికి: “యాక్సెస్ అనుమతులు” కింద, పబ్లిక్‌కు అందుబాటులో ఉంచు ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.
    • మీ సంస్థతో షేర్ చేయడాన్ని ఆపివేయడానికి: “యాక్సెస్ అనుమతులు” కింద, నా సంస్థలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచు ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.
    • నిర్దిష్ట వ్యక్తులతో షేర్ చేయడాన్ని ఆపివేయడానికి: “నిర్దిష్ట వ్యక్తులతో షేర్ చేయి” కింద, మీరు తీసివేయాలనుకునే వ్యక్తికి పక్కన, తీసివేయి తీసివేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: మీరు అనేక క్యాలెండర్‌లను షేర్ చేస్తే, మీరు షేరింగ్‌ను ఆపివేయాలనుకునే ఏవైనా ఇతర క్యాలెండర్‌ల కోసం ఈ దశలను రిపీట్ చేయండి.

షేరింగ్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించండి

మీరు క్యాలెండర్‌ను షేర్ చేసిన వ్యక్తి మీ క్యాలెండర్‌ను కనుగొనలేకపోయారు
  1. మీరు సరైన ఈమెయిల్ అడ్రస్‌ను జోడించారో లేదో చెక్ చేయండి.
  2. వారు ఇమెయిల్‌లో అందుకున్న లింక్‌ను క్లిక్ చేసినట్లు నిర్ధారించుకోండి. వారు దాన్ని కనుగొనలేకపోతే వారు తమ స్పామ్ ఫోల్డర్‌ను చెక్ చేయాలి.
  3. క్యాలెండర్ షేరింగ్ సెట్టింగ్‌ల నుండి వ్యక్తిని తీసివేసి, వారిని మళ్లీ జోడించండి.
  4. మీ ఖాతా ఆఫీస్ లేదా స్కూల్ ద్వారా మేనేజ్ చేయబడుతుందా అనేది చెక్ చేయండి. మీ ఖాతా అడ్మిన్ సంస్థ వెలుపల షేర్ చేయడాన్ని పరిమితం చేసి ఉండవచ్చు లేదా ఆఫ్ చేసి ఉండవచ్చు. మీ అడ్మిన్‌ను ఎలా కనుగొనలో అనేది తెలుసుకోండి.

సంబంధిత రిసోర్స్‌లు

 
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
9438820893830654369
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
88
false
false