మీరు ఒకే రీతిలో ఉండే “పరిచయం” లేదా “కాంటాక్ట్” లాంటి కంటెంట్ కోసం పేజీలను క్రియేట్ చేయవచ్చు. పేజీలు మీ బ్లాగ్‌లో ట్యాబ్‌లుగా లేదా పక్క వైపు లింక్‌లుగా కనిపిస్తాయి.
గమనిక: మీరు నిర్దిష్ట పోస్ట్‌లను పేజీలుగా ఉపయోగించలేరు.
దశ 1: మీ పేజీలను చూపించండి
- Bloggerకి సైన్ ఇన్ చేయండి.
- ఎగువ ఎడమవైపున, కిందికి ఉన్న బాణం గుర్తును క్లిక్ చేయండి.
- అప్డేట్ చేయాల్సిన బ్లాగ్‌ని ఎంచుకోండి.
- ఎడమ వైపు మెనూలో ఉన్న, 'లేఅవుట్' క్లిక్ చేయండి.
- మీరు మీ పేజీలను చూపాలనుకుంటున్న విభాగంలో, 'గాడ్జెట్‌ని యాడ్ చేయి' క్లిక్ చేయండి.
- విండోలో, "పేజీలు" పక్కన, 'యాడ్ చేయి' క్లిక్ చేయండి.
- మీ సెట్టింగ్‌లు సెట్ చేసి, 'సేవ్ చేయి' క్లిక్ చేయండి.
- ఎగువున కుడి వైపు, 'అరేంజ్‌మెంట్‌ని సేవ్ చేయి' క్లిక్ చేయండి.
మీ పేజీలు ఎక్కడ కనిపించాలన్నది మార్చడానికి, గాడ్జెట్‌ని దాని కొత్త లొకేషన్‌కి లాగండి.
దశ 2: పేజీలను క్రియేట్ చేయండి, ఎడిట్ చేయండి లేదా తొలగించండి
- Bloggerకి సైన్ ఇన్ చేయండి.
- ఎగువ ఎడమవైపున, కిందికి ఉన్న బాణం గుర్తును క్లిక్ చేయండి.
- అప్డేట్ చేయాల్సిన బ్లాగ్‌ని ఎంచుకోండి.
- ఎడమ వైపు మెనూలో, పేజీలు క్లిక్ చేయండి.
- కొత్త పేజీని క్రియేట్ చేయండి: కొత్త పేజీని క్లిక్ చేయండి. పేజీ టైటిల్, ఇతర సమాచారం ఎంటర్ చేసి, సేవ్ చేయి, ప్రివ్యూ చూపించు, లేదా పబ్లిష్ చేయి క్లిక్ చేయండి.
- పేజీని ఎడిట్ చేయండి: మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న పేజీ దిగువున, ఎడిట్ చేయి క్లిక్ చేయండి. మీ పేజీని అప్డేట్ చేసి, సేవ్ చేయి, ప్రివ్యూ చూపించు, లేదా పబ్లిష్ చేయి క్లిక్ చేయండి.
- పేజీని తొలగించండి: మీరు తీసివేయాలనుకుంటున్న పేజీ దిగువున, తొలగించు సరే క్లిక్ చేయండి.
మరొక వెబ్‌సైట్‌కి లింక్‌ని క్రియేట్ చేయండి
- ఎగువ ఎడమవైపున, కిందికి ఉన్న బాణం గుర్తును క్లిక్ చేయండి.
- అప్డేట్ చేయాల్సిన బ్లాగ్‌ని ఎంచుకోండి.
- ఎడమ వైపు మెనూలో ఉన్న, 'లేఅవుట్' క్లిక్ చేయండి.
- “పేజీలు” విభాగంలో, 'ఎడిట్ చేయి ' క్లిక్ చేయండి.
- "చూపాల్సిన పేజీలు" దిగువున, '+ బయటి లింక్‌ని యాడ్ చేయి' క్లిక్ చేయండి.
- పేజీ టైటిల్, URLని ఎంటర్ చేసి, 'లింక్‌ని సేవ్ చేయి' క్లిక్ చేయండి.
దశ 3: చూపాల్సిన పేజీలను ఎంచుకోండి
- ఎడమ వైపు మెనూలో ఉన్న, 'లేఅవుట్' క్లిక్ చేయండి.
- “పేజీలు” విభాగంలో, 'ఎడిట్ చేయి ' క్లిక్ చేయండి.
- మీరు చూపాలనుకుంటున్న పేజీలను ఎంచుకోండి.
- 'సేవ్ చేయి' క్లిక్ చేయండి.
- ఎగువున కుడి వైపు, 'అరేంజ్‌మెంట్‌ని సేవ్ చేయి' క్లిక్ చేయండి.
మీరు ఒక బ్లాగ్‌లో కలిగి ఉండగలిగే పేజీల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు.