"Ok Google"తో ఉన్న సమస్యలను పరిష్కరించండి

Android ఫోన్‌లు, ఇంకా టాబ్లెట్‌లలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించండి

మీ Android పరికరంలో, "Ok Google" అన్నప్పుడు మీ Google Assistant పని చేయకపోతే లేదా ప్రతిస్పందించకపోతే, Google Assistant, Ok Google, అలాగే వాయిస్ మ్యాచ్ ఆన్ చేసి ఉన్నాయని నిర్ధారించుకోండి:

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Assistant యాప్ Assistantను తెరిచి, "Assistant సెట్టింగ్‌లు" అని అనండి.
  2. "ప్రముఖ సెట్టింగ్‌ల"కు దిగువున వాయిస్ మ్యాచ్‌ను ట్యాప్ చేయండి.
  3. Ok Googleను ఆన్ చేసి, వాయిస్ మ్యాచ్‌ను సెటప్ చేయండి.

మరింత సహాయం కోసం లేదా, iPhoneలు లేదా iPadలలోని సమస్యలను పరిష్కరించడానికి, ఫోన్ లేదా టాబ్లెట్‌లో సమస్యలను పరిష్కరించడం ఎలాగో తెలుసుకోండి.

చిట్కా: మీరు మీ పరికరంలో Google Workspace for Education ఖాతాకు సైన్ ఇన్ చేసినప్పటికీ, "Ok Google"ను ఆన్ చేయలేకపోతున్నట్లయితే, "Ok Google" పని చేయడానికి కావాల్సిన సెట్టింగ్‌లను అడ్మిన్ ఆఫ్ చేసి ఉండవచ్చు. మరిన్ని వివరాల కోసం దయచేసి మీ అడ్మిన్‌ను సంప్రదించండి.

స్పీకర్‌లు, స్మార్ట్ డిస్‌ప్లేలు, అలాగే స్మార్ట్ గడియారాలలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించండి

మీరు సమస్యలను ఎదుర్కొంటున్న స్పీకర్‌ను, స్మార్ట్ డిస్‌ప్లేను లేదా స్మార్ట్ గడియారాన్ని చెక్ చేయండి.

  1. అది ప్లగ్ ఇన్ చేసి ఉన్నట్లు, అలాగే పవర్ ఆన్‌లో ఉన్నట్లు నిర్ధారించుకోండి.
  2. అది ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యి ఉందని, అలాగే మీ మొబైల్ పరికరం కనెక్ట్ అయ్యున్న Wi-Fi నెట్‌వర్క్‌కే అది కూడా కనెక్ట్ అయ్యుందని నిర్ధారించుకోండి.
  3. మైక్రోఫోన్ ఆన్ చేసి ఉందని నిర్ధారించుకోండి:
    • స్పీకర్‌లు (Google Home కాకుండా), స్మార్ట్ డిస్‌ప్లేలు, లేదా స్మార్ట్ గడియారాలు: మీ పరికరం వెనుక, మైక్రోఫోన్‌కు సంబంధించిన స్విచ్, ఆన్ చేసి ఉందని నిర్ధారించుకోండి. మైక్రోఫోన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు, సాధారణంగా ఆ స్విచ్ నారింజ రంగులో లేదా ఎరుపు రంగులో ఉంటుంది.
    • Google Home: మైక్రోఫోన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి, మీ స్పీకర్ వెనుక ఉండే మైక్రోఫోన్ మ్యూట్ బటన్‌ను నొక్కండి. మీరు మైక్రోఫోన్‌ను ఆన్ చేశారా లేదా మ్యూట్ చేశారా అన్నది మీ Assistant చెప్తుంది.

స్పీకర్‌లు, స్మార్ట్ డిస్‌ప్లేలు, ఇంకా స్మార్ట్ గడియారాల విషయంలో మరింత సహాయం కోసం, స్పీకర్, స్మార్ట్ డిస్‌ప్లే, లేదా స్మార్ట్ గడియారంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం ఎలాగో, లేదా "Ok Google"కు Google Assistant ఎంత సెన్సిటివ్‌గా ఉండాలో సర్దుబాటు చేయడం ఎలాగో తెలుసుకోండి.

సంబంధిత ఆర్టికల్స్

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11136494507271269704
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
1633398
false
false