యాప్‌లను మీ Android పరికరంలోకి డౌన్‌లోడ్ చేయండి

మీరు మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లోని Google Play నుండి ఛార్జీ విధించని, అలాగే పెయిడ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయవచ్చు. మీరు Google Play నుండి యాప్‌లను పొందాల్సిందిగా సిఫార్సు చేస్తున్నాము, కానీ మీరు వాటిని ఇతర సోర్స్‌ల నుండి కూడా పొందగలరు.

మీ Android పరికరంలో ఒక సెక్యూరిటీ సెట్టింగ్ (Google Play Protect) ఉంది, అది హానికరంగా పరిణమించగల యాప్‌లను చెక్ చేస్తుంది, మిమ్మల్ని హెచ్చరిస్తుంది, ఒకవేళ అవసరమైతే యాప్‌లను తీసివేస్తుంది. హానికరమైన యాప్‌ల నుండి ఎలా రక్షించుకోవాలో తెలుసుకోండి.

ముఖ్యమైనది: ఈ దశలలో కొన్ని Android 8.0, ఆపైన వెర్షన్‌లలో మాత్రమే పని చేస్తాయి. మీ Android వెర్షన్‌ను ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

Google Play నుండి యాప్‌లను డౌన్‌లోడ్ చేయండి

  1. Google Playను తెరవండి.
    • మీ పరికరంలో, Play Store యాప్ Google Play‌ను ఉపయోగించండి.
    • మీ కంప్యూటర్‌లో, play.google.comకు వెళ్లండి.
  2. మీరు కోరుకునే యాప్‌ను కనుగొనండి.
  3. యాప్ నమ్మకమైందో కాదో తెలుసుకోవడానికి, ఇతరులు దాని గురించి ఏమి చెబుతున్నారో చూడండి.
    • యాప్ టైటిల్ కింద, స్టార్ రేటింగ్‌లు, డౌన్‌లోడ్‌ల సంఖ్యను చెక్ చేయండి.
    • వ్యక్తిగత రివ్యూలను చదవడానికి, "రేటింగ్‌లు, రివ్యూలు" విభాగానికి స్క్రోల్ చేయండి.
  4. మీరు యాప్‌ను ఎంచుకున్నప్పుడు, ఇన్‌స్టాల్ చేయండి (ఛార్జీ విధించని యాప్‌ల కోసం) ఆప్షన్‌ను లేదా యాప్ ధరను ట్యాప్ చేయండి.

చెడు Google Play యాప్‌ల గురించి Googleకి రిపోర్ట్ చేయండి

మీకు హానికరంగా అనిపించే యాప్‌ను గుర్తిస్తే, దాని గురించి మాకు రిపోర్ట్ చేయండి. చెడు యాప్‌ల గురించి ఎలా రిపోర్ట్ చేయాలో తెలుసుకోండి.

ఇతర సోర్స్‌ల నుండి యాప్‌లను డౌన్‌లోడ్ చేయండి 

ముఖ్య గమనిక: మీరు తెలియని సోర్స్‌ల నుండి యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తే, మీ పరికరం, వ్యక్తిగత సమాచారం రిస్క్‌లో పడవచ్చు.

  • మీ పరికరం డ్యామేజీ కావచ్చు లేదా డేటాను కోల్పోవచ్చు.
  • మీ వ్యక్తిగత సమాచారానికి హాని కలగవచ్చు లేదా హ్యాకింగ్‌కి గురి కావచ్చు.
ఇతర సోర్స్‌లలోని చెడు యాప్‌ల నుండి రక్షించడంలో Googleకి సహాయపడండి
  • మీరు Google Play బయటి నుండి యాప్‌లను ఇన్‌స్టాల్ చేస్తే, మీ పరికరం ఆ యాప్‌ల గురించి Google సమాచారాన్ని పంపుతుంది.

  • ఈ సమాచారం సహాయంతో Google హానికరమైన యాప్‌ల నుండి ప్రతి ఒక్కరినీ మరింత మెరుగ్గా రక్షిస్తుంది. ఈ సమాచారంలో భాగంగా లాగ్ వివరాలు, యాప్‌‌నకు సంబంధించిన URLలు, పరికర ID, Android వెర్షన్, IP అడ్రస్ అందించబడతాయి. Learn about Google Play Protect.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12829907000384917701
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
false
false