ఎమర్జెన్సీ సమయంలో మీ Android ఫోన్ ద్వారా సహాయం పొందండి

మీ ఎమర్జెన్సీ సమాచారాన్ని సేవ్ చేయడానికి, అలాగే షేర్ చేయడానికి మీరు Personal Safety యాప్‌ను ఉపయోగించవచ్చు. కొన్ని దేశాలలో, ప్రాంతాలలో, అలాగే కొన్ని క్యారియర్‌లతో మీ ఫోన్ ఆటోమేటిక్‌గా ఎమర్జెన్సీ సర్వీస్‌లను కూడా సంప్రదించగలదు.

ముఖ్యమైనది:

ఎమర్జెన్సీ పరిస్థితులకు సిద్ధం కండి

ముఖ్య గమనిక: మీ ఫోన్‌ను తీసుకున్న వారు ఎవరైనా కానీ, మీ ఫోన్ లాక్ చేసి ఉన్నా కూడా, మీ లాక్ స్క్రీన్ మెసేజ్‌ను, ఎమర్జెన్సీ సమాచారాన్ని చూడగలరు. ఈ సెట్టింగ్‌ను మీరు Safety యాప్ లో ఆఫ్ చేయవచ్చు.

Personal Safety యాప్‌ను ఉపయోగించండి

Personal Safety యాప్ కొన్ని Android పరికరాలలో అందుబాటులో ఉంది. Play Storeలో, అలాగే సెట్టింగ్‌లలో ఈ యాప్ Personal Safety యాప్‌గా కనిపిస్తుంది. కానీ ఇది మీ యాప్‌ల లిస్ట్‌లో Safety యాప్ గా మాత్రమే కనిపిస్తుంది.

చిట్కా: Safety యాప్‌ను మీ యాప్‌ల లిస్ట్ నుండి తీసేయడానికి, మీరు దానిని డిజేబుల్ చేయవచ్చు. మీ Android ఫోన్‌లో ఆటోమేటిక్‌గా సెట్ చేయబడి ఉన్న యాప్‌లను ఎలా డిజేబుల్ చేయాలో తెలుసుకోండి.

మీరు ఏమి చేయవచ్చు

  • Android 12, అంత కన్నా పాత వెర్షన్‌లు ఉన్న ఫోన్‌లో Personal Safety యాప్ ఇన్‌స్టాల్ చేసి ఉండకపోతే: మీ Google ఖాతాతో సైన్ ఇన్ చేయవచ్చు, ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లను జోడించవచ్చు, వైద్య సమాచారాన్ని ప్రొవైడ్ చేయవచ్చు.
  • Safety యాప్ ఇన్‌స్టాల్ చేసి ఉన్నప్పుడు: మీరు ఎమర్జెన్సీ సహాయాన్ని, ఎమర్జెన్సీ షేరింగ్‌ను, సేఫ్టీ చెక్‌ను, విపత్తు హెచ్చరికలను ఉపయోగించవచ్చు.

మీకు అవసరమైనవి

కొన్ని Personal Safety యాప్ ఫీచర్‌లు ఆన్ కావాలంటే, వాటికి లొకేషన్ సర్వీస్‌లు, ఇంకా అనుమతులు అవసరం అవుతాయి, ఉదాహరణకు ఎమర్జెన్సీ షేరింగ్, కారు ప్రమాద గుర్తింపు, విపత్తు హెచ్చరికల వంటి ఫీచర్‌లు. కొందరు యూజర్లకు సంబంధించి, లొకేషన్ షేరింగ్, నిర్దిష్ట దేశాలలో, ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. లొకేషన్ షేరింగ్ గురించి మరింత తెలుసుకోండి.

మీ పరికరాల నుండి మీ రియల్-టైమ్ లొకేషన్‌ను లొకేషన్ షేరింగ్ ద్వారా ఇతరులకు షేర్ చేయవచ్చు. మీ లొకేషన్‌ను ఎవరికి అయినా షేర్ చేసినప్పుడు, ఆ వ్యక్తి Google Mapsతో సహా Google ప్రోడక్ట్‌లలో మీ పేరును, ఫోటోను, రియల్-టైమ్ లొకేషన్‌ను చూడగలరు. షేర్ చేయబడిన మీ లొకేషన్ సమాచారంలో ఈ కింద పేర్కొన్నవి ఉండవచ్చు:

  • మీ ప్రస్తుత, లేదా గత లొకేషన్‌లు
  • డ్రైవింగ్ లేదా నడవడం వంటి మీ ప్రస్తుత యాక్టివిటీలు
  • బ్యాటరీ లైఫ్ లేదా GPS కనెక్షన్‌ల వంటి మీ పరికరానికి సంబంధించిన సమాచారం
  • మీరు వెళ్లే ప్రదేశాలు - ఉదాహరణకు మీ ఇల్లు, ఆఫీస్, లేదా గమ్యస్థానాలు మొదలైనవి
Personal Safety యాప్‌నకు ఎమర్జెన్సీ సమాచారాన్ని జోడించండి
మీ బ్లడ్ గ్రూప్, అలర్జీలు, అలాగే మందుల వంటి వ్యక్తిగత ఎమర్జెన్సీ సమాచారాన్ని, మీ ఫోన్ లాక్ స్క్రీన్‌కు మీరు జోడించవచ్చు.
  1. మీ ఫోన్‌లో Safety యాప్ ను తెరవండి.
  2. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  3. మీ సమాచారం ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీ ఎమర్జెన్సీ సమాచారాన్ని జోడించండి.
    • వైద్య సమాచారం కోసం:
      • వైద్య సమాచారాన్ని ట్యాప్ చేయండి.
      • బ్లడ్ గ్రూప్, అలర్జీలు, లేదా మందుల వంటి సమాచారాన్ని జోడించడానికి, మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న ఐటెమ్‌ను లిస్ట్‌లో ట్యాప్ చేయండి.
    • ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ల కోసం:
      • ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లు ఆ తర్వాత కాంటాక్ట్‌ను జోడించండిని ట్యాప్ చేసి, మీరు జోడించాలనుకుంటున్న ప్రస్తుత కాంటాక్ట్‌ను ఎంచుకోండి.
చిట్కాలు:
  • మీ స్క్రీన్ లాక్ చేసి ఉన్నప్పుడు మీ ఎమర్జెన్సీ సమాచారాన్ని చూపడానికి, ఎమర్జెన్సీ సమాచారం యాక్సెస్ ఆ తర్వాత లాక్ చేసి ఉన్నప్పుడు చూపించాలి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  • మీ ఫోన్‌లో SIM కార్డ్ గానీ లేదా eSIM గానీ లేకపోతే, ఎమర్జెన్సీ కాల్స్ చేసే అవకాశం మీకు ఉండవచ్చు, కానీ ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లకు మాత్రం కాల్ చేయలేరు. SIM కార్డ్‌ను ఎలా ఇన్‌సర్ట్ చేయాలో తెలుసుకోండి.
ఎమర్జెన్సీ సహాయాన్ని సెటప్ చేసి, ఆన్ లేదా ఆఫ్ చేయండి
మీరు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్‌లో ఉంటే, మీ ఫోన్‌ను ఉపయోగించి అత్యవసర చర్యలను ట్రిగ్గర్ చేయవచ్చు. అంటే తగు సహాయం పొందడానికి కాల్ చేయడం, మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లకు మీ లొకేషన్‌ను షేర్ చేయడం, వీడియోను రికార్డ్ చేయడం లాంటివి చేయవచ్చు.
ముఖ్య గమనిక:
  • కారు ప్రమాద గుర్తింపు పని చేయడానికి మీ ఫోన్‌లో తప్పనిసరిగా SIM ఉండాలి. SIMను ఎలా జోడించాలో తెలుసుకోండి.
  • విమానం మోడ్‌లో ఉంటే లేదా బ్యాటరీ సేవర్‌ను ఆన్ చేసి ఉంటే ఎమర్జెన్సీ సహాయం పని చేయదు.
  • ఎమర్జెన్సీ సహాయం Android 12, ఆపై వెర్షన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఎమర్జెన్సీ సహాయాన్ని సెటప్ చేసి, ఆన్ చేయండి

  1. మీ ఫోన్‌లో, సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. భద్రత & ఎమర్జెన్సీ ఆ తర్వాత ఎమర్జెన్సీ సహాయాన్ని ట్యాప్ చేయండి.
  3. దిగువ కుడి వైపు, సెటప్‌ను ప్రారంభించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీకు సహాయం కావాలంటే, మీ ఫోన్ ఎమర్జెన్సీ చర్యలను ప్రారంభించవచ్చు.
    1. మీ ఎమర్జెన్సీ సర్వీసుల నంబర్‌ను సెటప్ చేయడానికి, ఈ ప్రారంభించు ట్యాప్ చేయండి.
      1. మీరు లోకల్ ఎమర్జెన్సీ నంబర్‌ను మార్చాలనుకుంటే, నంబర్‌ను మార్చు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
      2. మీకు సరైన లోకల్ నంబర్ ఉంటే, తర్వాత ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    2. మీ లొకేషన్ సమాచారాన్ని షేర్ చేయడానికి, అప్‌డేట్‌లను మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లకు పంపడానికి, సెటప్‌ను ప్రారంభించు ఆ తర్వాత సెటప్ చేయి ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
      1. కాంటాక్ట్‌ను జోడించు ఆప్షన్‌ను ట్యాప్ చేసి, కాంటాక్ట్‌ను ఎంచుకోవడం ద్వారా ఎమర్జెన్సీ సమయంలో సమాచారాన్ని షేర్ చేయండి.
      2. మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్‌తో ఎమర్జెన్సీ సహాయం ఎలాంటి సమాచారాన్ని షేర్ చేయాలో ఎంచుకోండి. 
      3. తర్వాత ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    3. ఎమర్జెన్సీ సమయంలో మీ లొకేషన్‌ను షేర్ చేయడానికి, యాప్‌ను ఉపయోగిస్తున్న సమయంలో మీ లొకేషన్‌ను యాక్సెస్ చేసేందుకు మీరు Personal Safety యాప్‌ను తప్పనిసరిగా అనుమతించాలి.
      1. యాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు తర్వాత ఆ తర్వాత ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    4. మీ ఫోన్ ఇతర ఫీచర్‌లను ఉపయోగిస్తూనే ఎమర్జెన్సీ సహాయం ద్వారా ఎమర్జెన్సీ రికార్డింగ్‌ను ప్రారంభించడానికి, కిందికి స్క్రోల్ చేసి, ఈ సెటప్‌ను ప్రారంభించు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
      1. మీరు ఎమర్జెన్సీ వీడియోను రికార్డ్ చేయాలనుకుంటే, యాప్‌ను వినియోగించే సమయంలో ఆన్ చేయి ఆ తర్వాత ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
      2. మీ వీడియోను మీ పరికరంలో బ్యాకప్ చేసిన తర్వాత మీ వీడియోను ఆటోమేటిక్‌గా మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లతో షేర్ చేసే విధంగా ఎంచుకోవచ్చు. బ్యాకప్ తర్వాత ఆటోమేటిక్‌గా షేర్ చేయండి  ఆ తర్వాత తర్వాత ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
    5. ఎమర్జెన్సీ సహాయం చర్యలను ప్రారంభించడానికి, కింది ఆప్షన్‌లలో ఒకదాన్ని ఎంచుకోండి:
      1. చర్యలను ప్రారంభించడానికి తాకి, నొక్కి ఉంచే ఆప్షన్‌ను ఉపయోగించు ఎంచుకోండి.
      2. కౌంట్‌డౌన్ తర్వాత చర్యలను వెంటనే ప్రారంభించు ఎంచుకోండి. ఈ ఆప్షన్‌తో అలారం సౌండ్ చేయాలని మీరు కోరుకునేట్లయితే, అలారం సౌండ్‌ను ప్లే చేయి ఆప్షన్‌ను ఆన్ చేయండి.
  5. పూర్తయింది ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

ఎమర్జెన్సీ సహాయాన్ని ఎలా ప్రారంభించాలో ఎంచుకోండి

మీరు ఎమర్జెన్సీ సహాయాన్ని సెటప్ చేయవచ్చు, తద్వారా ఎమర్జెన్సీ చర్యలు ఆటోమేటిక్‌గా ప్రారంభం అవుతాయి. సెటప్ చేయకపోతే అత్యవసర చర్యలను మొదలు పెట్టే ముందు నిర్ధారణ దశను పూర్తి చేయాల్సి ఉంటుంది.

  1. మీ ఫోన్‌లో ఉన్న సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. సేఫ్టీ & ఎమర్జెన్సీ ఆ తర్వాత ఎమర్జెన్సీ సహాయం ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. "ఇది ఎలా పని చేస్తుంది" అనే ఆప్షన్ దిగువున, సెట్టింగ్‌ల చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  4. మీరు రెండు మార్గాలలో ఎమర్జెన్సీ సహాయాన్ని సెటప్ చేయవచ్చు:
    • ఎమర్జెన్సీ చర్యను ప్రారంభించడానికి ముందు నిర్ధారణ దశను జోడించడం కోసం, చర్యలను ప్రారంభించడానికి తాకి, నొక్కి ఉంచండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • ఎమర్జెన్సీ చర్యలను 5 సెకన్ల కౌంట్‌డౌన్ తర్వాత ఆటోమేటిక్‌గా ప్రారంభించడానికి, చర్యలను ఆటోమేటిక్‌గా ప్రారంభించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

ఎమర్జెన్సీ సహాయాన్ని ఆఫ్ చేయండి

  1. మీ ఫోన్‌లో ఉన్న సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. సేఫ్టీ & ఎమర్జెన్సీ ఆ తర్వాత ఎమర్జెన్సీ సహాయం ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. "ఇది ఎలా పని చేస్తుంది" అనే ఆప్షన్ దిగువున, సెట్టింగ్‌ల చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  4. ఎమర్జెన్సీ సహాయాన్ని ఆఫ్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
మీ లాక్ స్క్రీన్‌పై ఒక మెసేజ్‌ను ఉంచండి
  1. మీ ఫోన్‌లో, 'సెట్టింగ్‌లు యాప్'‌ను తెరవండి.
  2. డిస్‌ప్లేను ట్యాప్ చేయండి.
  3. "లాక్ డిస్‌ప్లే" కింద, లాక్ స్క్రీన్ ఆ తర్వాత లాక్ స్క్రీన్‌లో టెక్స్ట్‌ను జోడించండిని ట్యాప్ చేయండి.
  4. మీ మెసేజ్‌ను ఎంటర్ చేయండి, మీ ఫోన్‌ను మీరు పోగొట్టుకున్నప్పుడు, అది ఎవరికైనా దొరికితే, వారు దానిని తిరిగి ఇవ్వడానికి సహాయపడే విధంగా ఉండే సమాచారం ఆ మెసేజ్‌లో ఉండాలి.
  5. సేవ్ చేయండిని ట్యాప్ చేయండి.
ఎమర్జెన్సీ ప్రసార నోటిఫికేషన్‌లను కంట్రోల్ చేయండి
ముఖ్య గమనిక: విపత్తు హెచ్చరికలు, ప్రమాదానికి సంబంధించిన నోటిఫికేషన్‌లు, ఇంకా యాంబర్ అలర్ట్‌ల వంటి నిర్దిష్ట ఎమర్జెన్సీ మెసేజ్‌లను మేనేజ్ చేయడానికి, మీరు ఎమర్జెన్సీ ప్రసార నోటిఫికేషన్‌లను ఉపయోగించవచ్చు.

మీరు అలర్ట్ రకాలను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు, పాత అలర్ట్‌ల కోసం చూడవచ్చు, అలాగే సౌండ్ ఇంకా వైబ్రేషన్‌ను కంట్రోల్ చేయవచ్చు.

  1. మీ ఫోన్‌లో, సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. నోటిఫికేషన్‌లు ఆ తర్వాత వైర్‌లెస్ ఎమర్జెన్సీ అలర్ట్‌లను ట్యాప్ చేయండి.
  3. మీరు ఎంత తరచుగా అలర్ట్‌లను పొందాలనుకుంటున్నారో, అలాగే ఏ సెట్టింగ్‌లను ఆన్ చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి.

నెలవారీ టెస్ట్‌లను కంట్రోల్ చేయండి

"డెవలపర్ ఆప్షన్‌ల"లో నెలవారీ టెస్ట్ సెట్టింగ్‌ను మీరు మార్చవచ్చు. "డెవలపర్ ఆప్షన్‌ల"ను ఆన్ చేసినప్పుడు మీ ఫోన్‌లోని ఇతర సెట్టింగ్‌లు మారవచ్చు. డెవలపర్ ఆప్షన్‌ల గురించి మరింత తెలుసుకోండి.
  1. మీ ఫోన్‌లో, సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. ఫోన్ గురించి పరిచయంను ట్యాప్ చేయండి.
  3. బిల్డ్ నంబర్ను 7 సార్లు ట్యాప్ చేయండి.
  4. డెవలపర్ ఆప్షన్‌లను ఆన్ చేయడానికి, మీ PINను, పాస్‌వర్డ్‌ను, లేదా ఆకృతిని ఎంటర్ చేయండి.
  5. మీ ఫోన్‌లోని సెట్టింగ్‌ల యాప్‌లో, నోటిఫికేషన్‌లు ఆ తర్వాత వైర్‌లెస్ ఎమర్జెన్సీ అలర్ట్‌లను ట్యాప్ చేయండి.
  6. టెస్ట్ అలర్ట్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయండి.
"డెవలపర్ ఆప్షన్‌ల"ను ఆఫ్ చేయడానికి, మీ ఫోన్‌లోని సెట్టింగ్‌ల యాప్‌లో సిస్టమ్ ఆ తర్వాత డెవలపర్ ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.

ఎమర్జెన్సీ సమయంలో సహాయం పొందండి

సహాయం కోసం కాల్ చేయడానికి, మీ కాంటాక్ట్‌లను అలర్ట్ చేయడానికి, ఇంకా వీడియోలను రికార్డ్ చేయడానికి, ఎమర్జెన్సీ సహాయాన్ని ఉపయోగించండి

ముఖ్య గమనిక: మీకు Wi-Fi లేదా మొబైల్ నెట్‌వర్క్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే తప్ప, ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లకు మీ రియల్-టైమ్ లొకేషన్‌ను షేర్ చేయలేరు.

మీరు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్‌లో ఉంటే, మీ ఫోన్‌ను ఉపయోగించి అత్యవసర చర్యలను ట్రిగ్గర్‌ చేయవచ్చు. అంటే తగు సహాయం పొందడానికి కాల్ చేయడం, మీ లొకేషన్‌ను మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లకు షేర్ చేయడం, వీడియోను రికార్డ్ చేయడం లాంటివి చేయవచ్చు.

  1. మీ ఫోన్‌లో, పవర్ బటన్‌ను 5 సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు నొక్కండి.
  2. మీ సెట్టింగ్‌లను బట్టి, ఎరుపు సర్కిల్ లోపల 3 సెకన్లు నొక్కి, పట్టుకోండి లేదా ఎమర్జెన్సీ కాల్‌ను ప్రారంభించడానికి ఆటోమేటిక్ కౌంట్‌డౌన్ కోసం వేచి ఉండండి.
  3. మీరు ఎమర్జెన్సీ కాల్‌ను ప్రారంభించిన తర్వాత, మీ సెట్టింగ్‌ల ఆధారంగా ఇతర ఎమర్జెన్సీ చర్యలు ప్రారంభం అవుతాయి.

ముఖ్య గమనిక: మీరు ఎమర్జెన్సీ సహాయ షేరింగ్‌ను, వీడియో రికార్డింగ్‌ను ఆన్ చేసి ఉంటే, మీ కాల్, ఎమర్జెన్సీ సర్వీసులకు వెళ్లినప్పుడు ఈ చర్యలు ప్రారంభం అవుతాయి. ఎమర్జెన్సీ సమయంలో వీడియోను రికార్డ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

ఎమర్జెన్సీ సమయంలో వీడియోను రికార్డ్ చేయండి

ఎమర్జెన్సీ రికార్డింగ్ ఎలా పని చేస్తుంది

ఎమర్జెన్సీ రికార్డింగ్ కొనసాగుతున్నప్పుడు కూడా మీ లొకేషన్‌ను ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లకు షేర్ చేయడం, స్థానిక ఎమర్జెన్సీ సర్వీస్‌ల నుండి సహాయం పొందడం వంటి ఇతర టాస్క్‌లను చేయడానికి మీరు మీ ఫోన్‌ను ఉపయోగించవచ్చు.

ముఖ్య గమనిక:

  • మీ వ్యక్తిగత భద్రతను మెరుగుపరచడానికి, ఎమర్జెన్సీ పరిస్థితులను, అలాగే సంబంధిత ఈవెంట్‌లను రికార్డ్ చేసే వీలును మీకు కల్పించడానికి వీడియో రికార్డింగ్ డిజైన్ చేయబడింది. మా గోప్యతా పాలసీకి అదనంగా, ఎమర్జెన్సీ పరిస్థితిలో వీడియో, ఆడియో కంటెంట్‌ను రికార్డ్ చేయడానికి, అప్‌లోడ్ చేయడానికి మరియు/లేదా షేర్ చేయడానికి మీరు మా ప్రోడక్ట్‌ల ఫీచర్‌లను ఉపయోగించినప్పుడు, అప్లికేషన్ వినియోగ సమాచారాన్ని, ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లకు షేర్ చేసిన తీరును, వీడియో లింక్ వీక్షణలను, డౌన్‌లోడ్‌ల సమాచారాన్ని మేము లాగ్ (డాక్యుమెంట్) చేసే అవకాశం ఉంది.
  • ఎమర్జెన్సీ ఈవెంట్‌ల రికార్డింగ్‌లు, మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లకు చేరినప్పుడు వారు తీవ్ర ఆందోళనకు లోనయ్యే అవకాశం ఉంది. అవి, వారిని మానసిక వేదనకు గురి చేయవచ్చు.
  • వీడియో షేరింగ్ ఫీచర్‌ను దయచేసి జాగ్రత్తగా ఉపయోగించండి. ఈ ఫీచర్‌ను మీరు ఉపయోగించేటప్పుడు, చట్టాన్ని నూటికి నూరు శాతం పాటించేలా చూసుకోవలసిన బాధ్యత మీపైనే ఉంటుంది, వీడియో రికార్డింగ్‌కు లేదా వైర్‌ట్యాపింగ్‌కు సంబంధించి వర్తించే ఏవైనా రాష్ట్ర, కేంద్ర చట్టాలను కూడా మీరు పాటించవలసి ఉంటుంది.
  • ఈ ఫీచర్‌ను మీరు ఉపయోగించినప్పుడు, పైన పేర్కొన్న స్టేట్‌మెంట్‌లను ధృవీకరించి, అంగీకరిస్తున్నారని అర్థం. మా నియమాలు, షరతుల గురించి తెలుసుకోండి.

మీ కెమెరాను ఉపయోగించే మరొక యాప్‌ను మీరు తెరిస్తే, ఎమర్జెన్సీ రికార్డింగ్ పాజ్ చేయబడుతుంది. ఎమర్జెన్సీ రికార్డింగ్ పాజ్ అయినప్పుడు, మీ రికార్డింగ్ బూడిద రంగులోని స్క్రీన్‌ను చూపుతుంది. మీ ఎమర్జెన్సీ రికార్డింగ్‌కు తిరిగి వెళ్లడానికి, Safety యాప్‌ను మళ్లీ తెరవండి లేదా మీ స్క్రీన్ ఎగువున ఉన్న నోటిఫికేషన్‌ను ట్యాప్ చేయండి.

ఎమర్జెన్సీ రికార్డింగ్ ద్వారా గరిష్ఠంగా 45 నిమిషాల వీడియోను రికార్డ్ చేసి, సేవ్ చేయవచ్చు. వీడియో క్వాలిటీ, నిమిషానికి దాదాపు 10 MB ఉంటుంది.

ఆటోమేటిక్ షేరింగ్ ఎలా పని చేస్తుంది

ఆటోమేటిక్ షేరింగ్‌ను ఆన్ చేస్తే, ప్రతి రికార్డింగ్ పూర్తయిన తర్వాత మీ వీడియో లింక్, ఆటోమేటిక్‌గా మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లందరికీ షేర్ చేయబడుతుంది. మీరు ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లను సెటప్ చేసి ఉండకపోతే, మీ వీడియో ఎవరికీ షేర్ అవదు. మీరు వీడియోను షేర్ చేయకూడదు అనుకుంటే, రికార్డింగ్ తర్వాత షేరింగ్‌ను రద్దు చేయడానికి మీకు 15 సెకన్ల సమయం ఉంటుంది. షేరింగ్ అనేది మీ ఇంటర్నెట్ కనెక్షన్‌పై ఆధారపడి ఉంటుంది, మీ రికార్డింగ్ పూర్తి అయిన సమయానికి, వీడియో అప్‌లోడ్ అయ్యి, షేర్ అయిన సమయానికి మధ్య కొంత గ్యాప్ ఉండవచ్చు. మీరు వీడియోను ఏ ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లకు అయితే షేర్ చేశారో, వారు ఆ వీడియో కాపీని డౌన్‌లోడ్ చేసుకోగలరు.

ఏ సమయంలోనైనా, ఒక వీడియోకు ఒక షేరింగ్ లింక్ మాత్రమే యాక్టివ్‌గా ఉంటుంది. క్రియేట్ అయిన ప్రతి లింక్ గడువు 7 రోజులు ఉంటుంది, మీ గోప్యతను సంరక్షించడానికి ఈ గడువు సెట్ చేయబడింది. ఏ సమయంలోనైనా మీరు లింక్‌ను డీయాక్టివేట్ చేయవచ్చు. గడువుకు సంబంధించిన టైమర్‌ను రిఫ్రెష్ చేయడానికి, ప్రస్తుత లింక్‌ను డీయాక్టివేట్ చేసి, ఒక కొత్త లింక్‌ను క్రియేట్ చేయండి.

షేరింగ్ లింక్‌ను డీయాక్టివేట్ చేయడానికి:

  1. మీ ఫోన్‌లో Safety యాప్ ను తెరవండి.
  2. ఎగువున ఎడమ వైపున, మీ సమాచారం ఆ తర్వాత మీ వీడియోలు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. వీడియో పక్కన, మరిన్ని ఆ తర్వాత షేర్ చేయడాన్ని ఆపివేయండి ఆ తర్వాత షేర్ చేయడాన్ని ఆపివేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

చిట్కా: మీ షేరింగ్ లింక్‌ను రిఫ్రెష్ చేయడానికి, షేర్ చేయడానికి లింక్‌ను పొందండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

ఎమర్జెన్సీ రికార్డింగ్ అనేది మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి ఎమర్జెన్సీ సిచ్యుయేషన్‌లలో వ్యక్తిగతంగా ఉపయోగించడం కోసం ఉద్దేశించబడింది. షేర్ అయ్యి ఉన్న యాక్టివ్ లింక్‌ను మరీ ఎక్కువగా షేర్ చేస్తున్నప్పుడు, Google దాన్ని ఆటోమేటిక్‌గా డిజేబుల్ చేస్తుంది.

ఆటో బ్యాకప్ ఎలా పని చేస్తుంది

ఎమర్జెన్సీ రికార్డింగ్‌లు ఆటోమేటిక్‌గా క్లౌడ్‌కు అప్‌లోడ్ చేయబడతాయి, ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితిలో మీ ఫోన్ పోయినా లేదా నాశనమైనా, డేటా నష్టాన్ని నివారించడంలో ఇది సహాయపడుతుంది. క్లౌడ్‌కు అప్‌లోడ్ చేయడానికి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం అవుతుంది, మీకు డేటా యాక్సెస్ పరిమితంగా మాత్రమే ఉంటే, మీకు డబ్బు ఖర్చు కావచ్చు. అప్‌లోడ్ చేయబడిన ఎమర్జెన్సీ రికార్డింగ్‌లను ఇంటర్నెట్ కనెక్షన్‌తో ఎప్పుడైనా మేనేజ్ చేయవచ్చు.

మీ వీడియోలను మేనేజ్ చేయడానికి:

  1. మీ ఫోన్‌లో Safety యాప్ ను తెరవండి.
  2. ఎగువున ఎడమ వైపున, మీ సమాచారం ఆ తర్వాత మీ వీడియోలు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. వీడియో పక్కన, మరిన్ని ఆ తర్వాత షేర్ చేయండి లేదా తొలగించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
చిట్కా: మీరు ఫైల్‌ను తొలగిస్తే, అది మీ Google ఖాతా నుండి శాశ్వతంగా తొలగించబడుతుంది, ఇంకా ఈ చర్య రద్దు చేయబడదు.
పొరపాటున చేసే కాల్స్

మీరు అనుకోకుండా ఎమర్జెన్సీ సర్వీసులకు కాల్ చేసి ఉంటే, కట్ చేయకండి. కాల్ అనుకోకుండా చేసారని, మీకు సహాయం అవసరం లేదని ఎమర్జెన్సీ ఆపరేటర్‌తో చెప్పండి.

ఎమర్జెన్సీ సమాచారాన్ని కనుగొనండి
  1. లాక్ చేసి ఉన్న స్క్రీన్ మీద, పైకి స్వైప్ చేయండి.
  2. ఎమర్జెన్సీ ఆ తర్వాత ఎమర్జెన్సీ సమాచారాన్ని చూడండిని ట్యాప్ చేయండి.
మీ లొకేషన్‌ను ఆటోమేటిక్‌గా పంపండి

మిమ్మల్ని త్వరగా కనుగొనడంలో ఎమర్జెన్సీ సిబ్బందికి సహాయపడటానికి, మీరు ఎమర్జెన్సీ నంబర్‌కు డయల్ చేసినప్పుడు లేదా SMS పంపినప్పుడు మీ ఫోన్ లొకేషన్ పంపబడవచ్చు, ఉదాహరణకు మీరు USలో 911కి, లేదా యూరప్‌లో 112కు డయల్ చేసినప్పుడు.

Android ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్ (ELS) మీ దేశంలో లేదా ప్రాంతంలో, అలాగే మీ మొబైల్ నెట్‌వర్క్‌లో పని చేస్తూ ఉండి, మీరు ELSను ఆఫ్ చేయకుంటే, మీ ఫోన్ ఆటోమేటిక్‌గా ELS ద్వారా ఎమర్జెన్సీ సహాయక సిబ్బందికి దాని లొకేషన్‌ను పంపుతుంది. ELS ఆఫ్‌లో ఉన్నప్పటికీ, ఎమర్జెన్సీ కాల్ లేదా SMSను పంపే సమయంలో మీ మొబైల్ క్యారియర్ పరికర లొకేషన్‌ను పంపవచ్చు.

ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి

  1. మీ ఫోన్‌లో, సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. లొకేషన్ ఆ తర్వాత లొకేషన్ సర్వీస్‌లు ఆ తర్వాత ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్ లేదా Google ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్‌ను ట్యాప్ చేయండి.
  3. ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్‌ను లేదా Google ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్ ఎలా పని చేస్తుంది

మీరు ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేసినప్పుడు లేదా టెక్స్ట్ మెసేజ్ పంపినప్పుడు మాత్రమే మీ ఫోన్, ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్‌ను (ELS) ఉపయోగిస్తుంది. 

మీ ఫోన్‌లో ELS ఆన్ చేసి ఉంటే, ఎమర్జెన్సీ కాల్ సమయంలో మీ ఫోన్‌కు సంబంధించిన అత్యంత ఖచ్చితమైన లొకేషన్‌ను గుర్తించడానికి, Google లొకేషన్ సర్వీస్‌లను, అలాగే ఇతర సమాచారాన్ని ELS ఉపయోగించవచ్చు. మీ పరికరం ఏ భాషతో సెటప్ అయింది లాంటి అదనపు సమాచారాన్ని కూడా ELS పంపవచ్చు.

మిమ్మల్ని లొకేట్ చేసి, మీకు సహాయం చేయడంలో ఎమర్జెన్సీ ప్రతిస్పందన సర్వీస్‌లకు సహాయపడటానికి, మీ ఫోన్ ఈ డేటాను, ప్రామాణీకరించిన ఎమర్జెన్సీ ప్రతిస్పందన సర్వీస్‌లకు అందుబాటులో ఉంచుతుంది. ఎమర్జెన్సీ ప్రతిస్పందన సర్వీస్‌లు, ఈ డేటాను Google ద్వారా కాకుండా నేరుగా మీ ఫోన్ నుండి అందుకుంటాయి.

ELS యాక్టివ్‌గా ఉన్న సమయంలో మీరు కాల్ చేయడాన్ని లేదా టెక్స్ట్ మెసేజ్ పంపడాన్ని పూర్తి చేసిన తర్వాత, మీ ఫోన్ Google Play సర్వీసుల ద్వారా వినియోగం, ఎనలిటిక్స్, ఇంకా సమస్య విశ్లేషణలకు సంబంధించిన డేటాను Googleకు పంపుతుంది. ELS ఎంత బాగా పని చేస్తుందో విశ్లేషించడానికి Google ఈ సమాచారాన్ని ఉపయోగిస్తుంది, అలాగే Google మీ లొకేషన్‌తో సహా మిమ్మల్ని గుర్తించగలిగే ఎలాంటి సమాచారాన్ని అందుకోదు.

మీరు ELS ద్వారా మీ లొకేషన్‌ను పంపినప్పుడు, మీరు Google Mapsతో మీ లొకేషన్‌ను షేర్ చేసే ప్రాసెస్ కంటే ఇది భిన్నంగా ఉంటుంది. Google Mapsతో లొకేషన్ షేరింగ్ గురించి మరింత తెలుసుకోండి.

మీ లొకేషన్‌ను మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లతో షేర్ చేయండి
మీ లొకేషన్‌ను కనుగొనే వీలుతో పాటు, మీరు ఎక్కడ ఉన్నారు, అలాగే మీ బ్యాటరీ శాతం ఎంత ఉంది అనే వాటి గురించి అప్‌డేట్‌లను పొందే వీలును కూడా మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లకు మీరు కల్పించవచ్చు. మీ లొకేషన్‌ను యాక్సెస్ చేయడానికి మీరు తప్పనిసరిగా Personal Safety యాప్‌నకు అనుమతి ఇవ్వాలి.

ఎమర్జెన్సీ షేరింగ్‌ను ఉపయోగించడానికి, మీకు ఈ కింద ఉన్నవి అవసరం అవుతాయి:

  • కనీసం ఒక ఎమర్జెన్సీ కాంటాక్ట్
  • Safety యాప్‌నకు "ఉపయోగంలో ఉన్నప్పుడు" లొకేషన్ అనుమతులను ఇచ్చి ఉండాలి
  • లొకేషన్ సర్వీస్‌లు ఆన్ చేసి ఉన్న ఒక ఇంటర్నెట్ కనెక్షన్

ఎమర్జెన్సీ షేరింగ్‌ను ప్రారంభించండి

  1. మీ ఫోన్‌లో Safety యాప్ ను తెరవండి.
  2. ఎమర్జెన్సీ షేరింగ్‌ను ట్యాప్ చేయండి.
  3. మీ రియల్-టైమ్ లొకేషన్‌ను మీరు ఎవరితో అయితే షేర్ చేయాలనుకుంటున్నారో, వారిని ఎంచుకోండి.
    • మీరు ఒక ఆప్షనల్ మెసేజ్‌ను కూడా జోడించవచ్చు.
  4. షేర్ చేయండిని ట్యాప్ చేయండి
    • మీ "ఎమర్జెన్సీ షేరింగ్" వివరాలను చూడటానికి మీరు నోటిఫికేషన్ బ్యానర్‌ను ట్యాప్ చేయవచ్చు.

చిట్కా: మీ దేశంలో లేదా ప్రాంతంలో లొకేషన్ షేరింగ్ అందుబాటులో లేకుంటే, Safety యాప్‌లో ఒక మెసేజ్ కనిపిస్తుంది.

ఎమర్జెన్సీ షేరింగ్‌ను ఆపివేయండి

  1. మీ ఫోన్‌లో Safety యాప్ ను తెరవండి.
  2. ఎగువున ఎడమ వైపున, ఎమర్జెన్సీ సహాయ షేరింగ్ ఆ తర్వాత ఆపివేయండి ఆ తర్వాత షేర్ చేయడాన్ని ఆపివేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • ఎమర్జెన్సీ సహాయ షేరింగ్‌ను ఎందుకు ఆపివేశారో వివరించడానికి మీరు ఒక నోట్‌ను జోడించవచ్చు.

చిట్కా: 24 గంటల తర్వాత ఎమర్జెన్సీ షేరింగ్ ఆటోమేటిక్‌గా ముగుస్తుంది.

ఎమర్జెన్సీ సహాయ షేరింగ్ సెట్టింగ్‌లు మేనేజ్ చేయబడ్డాయి

  1. మీ పరికరంలో, Safety యాప్ ను తెరవండి.
  2. భద్రత & ఎమర్జెన్సీ > ఎమర్జెన్సీ సహాయ షేరింగ్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. స్క్రీన్ దిగువకు స్క్రోల్ చేసి, సెట్టింగ్‌లను ట్యాప్ చేయండి.
  4. ఎమర్జెన్సీ సహాయ షేరింగ్ సమయంలో మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లతో మీరు షేర్ చేయాలనుకుంటున్న సమాచారాన్ని ఎంచుకోండి.
  5. మల్టీ-డివైజ్ లొకేషన్ షేరింగ్ ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

చిట్కా: పరికరంలో మల్టీ-డివైజ్ లొకేషన్ షేరింగ్ ఆన్ చేయబడి ఉంటే, మేము ఆ పరికర లొకేషన్‌ను బ్యాకప్‌గా ఉపయోగిస్తాము, మీరు ఒకవేళ వేరొక పరికరంలో ఎమర్జెన్సీ సహాయ షేరింగ్‌ను ప్రారంభిస్తే ఇది జరుగుతుంది, కానీ ఆ మరొక పరికరం ఇక దాని లొకేషన్‌ను షేర్ చేయలేదు.

భద్రతా చెకప్‌ను షెడ్యూల్ చేయండి
మీ ఫోన్ మీ స్టేటస్‌ను చెక్ చేసి, ఏదైనా సమస్య ఉంటే మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లకు నోటిఫికేషన్ పంపడానికి, మీరు భద్రతా చెకప్‌ను షెడ్యూల్ చేయవచ్చు. ఉదాహరణకు, మీరు ఏదైనా తెలియని కొత్త ప్రదేశంలో నడుస్తూ ఉన్నప్పుడు లేదా ఏదైనా పార్టీకి వెళ్లినప్పుడు, మీరు భద్రతా చెకప్‌ను ఉపయోగించవచ్చు. మీరు తప్పనిసరిగా Safety యాప్‌నకు "ఉపయోగంలో ఉన్నప్పుడు" లొకేషన్ అనుమతులను ఇవ్వాలి.
  1. మీ ఫోన్‌లో Safety యాప్ ను తెరవండి.
  2. భద్రతా చెకప్‌ను ట్యాప్ చేయండి.
  3. మీ కారణాన్ని, ఇంకా వ్యవధిని ఎంచుకోండి.
    • గరిష్ఠంగా 24 గంటల వరకు, ఎంత వ్యవధికి అయినా మీరు చెకప్‌ను సెట్ చేయవచ్చు.
  4. తర్వాతను ట్యాప్ చేయండి.
  5. మీ కాంటాక్ట్‌లను ఎంచుకోండి.
  6. ప్రారంభించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

చిట్కా: మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లకు మీరు నోటిఫికేషన్‌లను ఆన్ చేస్తే, సేఫ్టీ చెక్ చేయబడినప్పుడు, అలాగే అది ముగిసినప్పుడు వారికి తెలియజేయబడుతుంది.

మీరు సురక్షితంగా ఉన్నట్టు మార్క్ చేయండి

మీ భద్రతను చెక్ చేయాల్సిన సమయం వచ్చినప్పుడు, ఎమర్జెన్సీ షేరింగ్ మొదలయ్యే ముందు 60 సెకన్ల పాటు మీకు ఒక అలర్ట్ వస్తుంది. మీరు సురక్షితంగా ఉన్నట్టు మార్క్ చేస్తే, ఎమర్జెన్సీ సహాయ షేరింగ్ రద్దు అవుతుంది. నోటిఫికేషన్ ద్వారా, మీరు ఎప్పుడైనా భద్రతా చెకప్‌ను ఆపివేయవచ్చు. మీరు 60 సెకన్లలో అందుబాటులో ఉన్న ఆప్షన్‌ల నుండి ఒక దాన్ని ఎంచుకోకపోతే, ఎమర్జెన్సీ షేరింగ్ ప్రారంభమవుతుంది.

  1. మీకు నోటిఫికేషన్ అందినప్పుడు, ఈ కింద ఉన్న ఆప్షన్‌లలో ఒక దాన్ని ఎంచుకోండి:
    • నేను బాగానే ఉన్నాను
    • ఇప్పుడే షేర్ చేయ డం ప్రారంభించండి
    • 911కు కాల్ చేయండి
  2. మీ ఫోన్ లాక్ అయ్యి ఉంటే, దాన్ని మీరు అన్‌లాక్ చేయాల్సి రావచ్చు.

మీ ఫోన్ ఆఫ్ అయినా లేదా దానికి సిగ్నల్ అందకపోయినా, భద్రతా చెకప్ యాక్టివ్‌గానే ఉంటుంది, షెడ్యూల్ చేయబడిన చెక్ ఇన్ సమయానికి, చివరిగా గుర్తించబడిన లొకేషన్‌తో ఎమర్జెన్సీ సహాయ షేరింగ్‌ను అది ప్రారంభిస్తుంది.

ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లకు ఎలా తెలియజేయబడుతుంది
భద్రతా చెకప్ ప్రారంభం అయినప్పుడు, మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లకు మీరు నోటిఫికేషన్‌లను ఆన్ చేసి ఉంటే, వారికి ఒక SMS అందుతుంది, అందులో మీ పేరు, మీ భద్రతా చెకప్ తాలూకు వ్యవధి, అలాగే మీరు కారణం ఏదైనా అందించి ఉంటే, అది కూడా ఉంటుంది. తర్వాత, మీరు మాన్యువల్‌గా ఎమర్జెన్సీ సహాయ షేరింగ్‌ను ప్రారంభించినా, లేదా మీ ఫోన్ మీ స్టేటస్‌ను చెక్ చేసినప్పుడు 'నేను బాగానే ఉన్నాను' అని మిమ్మల్ని మీరు మార్క్ చేసుకోలేకపోయినా, మీ రియల్-టైమ్ లొకేషన్‌ను, అలాగే మిగిలి ఉన్న బ్యాటరీ శాతాన్ని చూడటానికి ఒక లింక్‌ను Google Mapsలో Google షేర్ చేస్తుంది.
మీరు ఎమర్జెన్సీ షేరింగ్‌ను, అలాగే భద్రతా చెకప్‌లను ఆపివేసినప్పుడు లేదా మీరు సురక్షితంగానే ఉన్నారని మార్క్ చేసినప్పుడు, అవి ఆగిపోతాయి. అవి ఆగిపోయినప్పుడు, ఆ విషయం మీ కాంటాక్ట్‌లకు తెలియజేయడానికి Google మరొక టెక్స్ట్ మెసేజ్ పంపుతుంది.
ఎమర్జెన్సీ సర్వీసులతో ఎమర్జెన్సీ సమాచారాన్ని షేర్ చేయండి
ఎమర్జెన్సీ సర్వీసులకు సమాచారాన్ని పంపడానికి Personal Safety యాప్‌ను ఉపయోగించండి.
మీ ఫోన్‌లో:
  1. మీ Personal Safety యాప్‌ను తెరవండి.
  2. మీ సమాచారం ఆ తర్వాత ఎమర్జెన్సీ సమాచారం యాక్సెస్ ఆ తర్వాత ఎమర్జెన్సీ కాల్ సమయంలో షేర్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
విపత్తు హెచ్చరికలను పొందండి
మీరు విపత్తు హెచ్చరికలకు సమ్మతించినప్పుడు, పబ్లిక్ ఎమర్జెన్సీలు లేదా స్థానిక విపత్తుల (ఉదాహరణకు, ప్రకృతి వైపరీత్యాలు) గురించి మీకు Safety యాప్‌లో తెలియజేయబడుతుంది. విపత్తు హెచ్చరిక నోటిఫికేషన్‌లలో Safety యాప్ హోమ్ పేజీకి లింక్ ఉంటుంది, అక్కడ మీరు ఈవెంట్ గురించి అదనపు సమాచారాన్ని చూడవచ్చు.
విపత్తు హెచ్చరికలు దేశాలు, ప్రాంతాలన్నింటిలో, అలాగే భాషలన్నింటిలో అందుబాటులో ఉంటాయి. మీ ఫోన్ స్థానిక భాషకు కాకుండా వేరే భాషకు సెట్ చేసి ఉంటే, అలర్ట్ అనేది మీరు సెట్ చేసిన భాషలో కాకుండా మీ ప్రస్తుత లొకేషన్‌లోని అధికారిక భాషలో ప్రదర్శించబడవచ్చు.

విపత్తు హెచ్చరికలను ఆన్ లేదా ఆఫ్ చేయండి

  1. మీ ఫోన్‌లో Safety యాప్ ను తెరవండి.
  2. ఫీచర్‌లు ఆ తర్వాత విపత్తు హెచ్చరికలు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. విపత్తు హెచ్చరికలు ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

విపత్తు హెచ్చరికలను Google ఎలా పంపుతుంది

Google అధికారిక స్థానిక సోర్స్‌ల నుండి విపత్తు సంబంధిత సమాచారాన్ని మేనేజ్ చేస్తుంది. మీ లొకేషన్‌ను ప్రభావితం చేసే విపత్తు ఏదైనా పోస్ట్ చేయబడితే, ఆ విషయాన్ని మీకు Safety యాప్ తెలియజేస్తుంది. ప్రభావిత ప్రాంతంలోని ఇంటర్నెట్ కనెక్టివిటీ, ప్రభుత్వాలు, అలాగే ఇతర అధికార సంస్థల నుండి అధికారిక కంటెంట్ లభ్యత, సమస్య వాస్తవంగా చూపిన ప్రభావం వంటి వివిధ అంశాల ఆధారంగా Google విపత్తు హెచ్చరికలను పోస్ట్ చేస్తుంది. అలర్ట్‌లు సాధారణంగా ప్రభావిత ప్రాంతంలోని ప్రధాన భాషలలో, ఇంకా ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉంటాయి. విపత్తు హెచ్చరికల గురించి తెలుసుకోండి.

మీ ప్రాంతంలో భూకంపాల గురించి తెలుసుకోండి

మీ ప్రాంతంలో సంభవించే భూకంపాలను మీ ఫోన్ గుర్తించగలదు. దగ్గర్లోని భూకంపాల గురించి మరింత తెలుసుకోవడానికి, Google Searchను తెరిచి, "[మీ నగరం లేదా ప్రాంతం]‌లో భూకంపం" అని సెర్చ్ చేయండి.

భూకంపాన్ని గుర్తించేందుకు మీ ఫోన్ అందించే కంట్రిబ్యూషన్‌ను ఆపడానికి, మీ ఫోన్‌లో Google లొకేషన్ ఖచ్చితత్వాన్ని ఆఫ్ చేయండి.

సమీపంలోని భూకంపాల గురించి హెచ్చరికలను పొందండి
4.5, అంతకంటే ఎక్కువ తీవ్రతతో సంభవించే సమీపంలోని భూకంపాల గురించి మీకు హెచ్చరికలను పంపడానికి మీ ఫోన్ మీ రమారమి లొకేషన్‌ను ఉపయోగించవచ్చు.

ShakeAlert

ఈ భూకంప హెచ్చరికలు ShakeAlert నుండి వచ్చిన డేటాపై ఆధారపడి ఉన్నాయి, ప్రస్తుతం కింది US రాష్ట్రాల్లో యాక్టివ్‌గా ఉన్నాయి: కాలిఫోర్నియా, ఓరెగాన్, వాషింగ్టన్.

Android భూకంప హెచ్చరికల సిస్టమ్

ఈ భూకంప హెచ్చరికలు Android భూకంప హెచ్చరికల సిస్టమ్ మీద ఆధారపడి ఉంటాయి.
Android భూకంప హెచ్చరికల సిస్టమ్ యాక్టివ్‌గా ఉన్న చోట
  • ఆప్ఘనిస్తాన్
  • అల్బేనియా
  • అల్జీరియా
  • యాంగ్విల్లా
  • ఆంటిగ్వా అండ్ బార్బుడా
  • అర్జెంటీనా
  • ఆర్మేనియా
  • అరుబా
  • ఆస్ట్రేలియా
  • ఆస్ట్రియా
  • అజర్‌బైజాన్
  • బార్బాడోస్
  • బంగ్లాదేశ్
  • బెలిజ్
  • భూటాన్
  • బొలీవియా
  • బోస్నియా & హెర్జెగోవినా
  • బ్రెజిల్
  • బల్గేరియా
  • చిలీ
  • కొలంబియా
  • క్రొయేషియా
  • క్యూబా
  • సైప్రస్
  • చెకియా (చెక్ రిపబ్లిక్)
  • జిబౌటి
  • డొమినికా
  • డొమినికన్ రిపబ్లిక్
  • ఈక్వెడార్
  • ఈజిప్ట్
  • ఎల్ సాల్వడోర్
  • ఎరిట్రియా
  • ఇథియోపియా
  • ఫాక్‌ల్యాండ్ దీవులు
  • ఫ్రాన్స్
  • జార్జియా
  • జర్మనీ
  • గ్రీస్
  • గ్రెనడా
  • గ్వాడలూప్
  • హైతీ
  • హోండురాస్
  • హంగేరి
  • ఐస్‌ల్యాండ్
  • భారతదేశం
  • ఇరాన్
  • ఇరాక్
  • ఇజ్రాయిల్
  • జమైకా
  • జోర్డాన్
  • కజకిస్థాన్
  • కొసావో
  • కిర్గిజ్‌స్తాన్
  • లావోస్
  • లెబనాన్
  • మలేషియా
  • మోల్డోవా
  • మంగోలియా
  • మోంటెనెగ్రో
  • మయన్మార్
  • నేపాల్
  • న్యూజిలాండ్
  • నికరాగువా
  • ఉత్తర మాసిడోనియా
  • ఒమన్
  • పాకిస్థాన్
  • పాలస్తీనా
  • పాపువా న్యూ గినియా
  • పెరూ
  • ఫిలిప్పీన్స్
  • పోర్చుగల్
  • రొమేనియా
  • సెయింట్ బర్త్‌లెమీ
  • సెయింట్ మార్టిన్
  • శాన్ మారినో
  • సౌదీ అరేబియా
  • సెర్బియా
  • సింట్ మార్టెన్
  • స్లోవేకియా
  • స్లోవేనియా
  • సోలమన్ దీవులు
  • సోమాలియా
  • స్పెయిన్
  • స్విట్జర్లాండ్
  • తజికిస్థాన్
  • టాంజానియా
  • థాయ్‌లాండ్
  • తైమూర్-లెస్టే
  • ట్రినిడాడ్ మరియు టొబాగో
  • ట్యునీషియా
  • టర్కీ
  • తుర్క్‌మెనిస్థాన్
  • ఉక్రెయిన్
  • యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
  • ఉజ్బెకిస్తాన్
  • వాన్వాటు
  • వెనిజులా

భూకంప హెచ్చరికలు ఆటోమేటిక్‌గా ఆన్‌లో ఉన్నాయి. మీ ప్రాంతంలోని అన్ని భూకంపాల గురించి మీరు అలర్ట్‌లను పొందలేకపోవచ్చు, మీరు సపోర్ట్ ఉన్న దేశాలలో మాత్రమే అలర్ట్‌లను అందుకుంటారు. అప్పుడప్పుడు, మీ లొకేషన్‌లో భూకంపం సంభవించినట్లు మీకు అనిపించకపోయినా, మీరు అలర్ట్‌లను పొందే అవకాశం ఉంది.

భూకంప హెచ్చరికలను ఆన్ లేదా ఆఫ్ చేయండి
ముఖ్య గమనిక: హెచ్చరికలను పొందడానికి, మీరు తప్పనిసరిగా Wi-Fi లేదా డేటాను ఆన్ చేసి ఉండాలి.
  1. మీ ఫోన్‌లో ఉన్న సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. భద్రత & ఎమర్జెన్సీ ఆ తర్వాత భూకంప హెచ్చరికలను ట్యాప్ చేయండి.
    • మీరు భద్రత & ఎమర్జెన్సీ ఆప్షన్ కనిపించకపోతే, లొకేషన్ ఆ తర్వాత అధునాతన ఆ తర్వాత భూకంప హెచ్చరికలు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. భూకంప హెచ్చరికల ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16899426534271156467
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
false
false