మీ Android ఫోన్‌లో సెట్టింగ్‌లను త్వరగా మార్చండి

మీరు క్విక్ సెట్టింగ్‌లతో మీ ఫోన్‌లోని ఏదైనా స్క్రీన్ నుండి మీ సెట్టింగ్‌లను కనుగొని, వాటిని మార్చవచ్చు. మీరు తరచుగా మార్చే సెట్టింగ్‌లకు వెళ్లడానికి, మీరు వాటిని క్విక్ సెట్టింగ్‌లకు జోడించవచ్చు లేదా తరలించవచ్చు.

ముఖ్యమైనది:

ఈ దశల్లో కొన్నింటి కోసం మీరు స్క్రీన్‌ను తాకాల్సి ఉంటుంది.

క్విక్ సెట్టింగ్‌లను తెరవండి

  1. మీ మొదటి కొన్ని సెట్టింగ్‌లను కనుగొనడానికి, మీ స్క్రీన్ పై నుండి కిందికి స్వైప్ చేయండి.
  2. మీ అన్ని క్విక్ సెట్టింగ్‌లను కనుగొనడానికి, మళ్లీ కిందికి స్వైప్ చేయండి.

సెట్టింగ్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయండి

  • సెట్టింగ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి, దాన్ని ట్యాప్ చేయండి. డిమ్ చేయబడిన సెట్టింగ్‌లు ఆఫ్ చేయబడ్డాయి.
  • సెట్టింగ్ కోసం మరిన్ని ఆప్షన్‌లను పొందడానికి, దాన్ని నొక్కి, పట్టుకోండి.

సెట్టింగ్‌ను జోడించండి, తీసివేయండి లేదా తరలించండి

  1. మీ స్క్రీన్ పై నుండి, రెండుసార్లు కిందికి స్వైప్ చేయండి.
  2. కింద ఎడమ వైపున, ఎడిట్ చేయండి ఆప్షన్‍ను ట్యాప్ చేయండి.
  3. సెట్టింగ్‌ను నొక్కి, పట్టుకోండి.
  4. మీకు కావలసిన చోటుకు విడ్జెట్‌ను లాగండి.
    • సెట్టింగ్‌ను జోడించడానికి, "టైల్స్‌ను జోడించడం కోసం పట్టుకుని, లాగండి" నుండి దాన్ని పైకి లాగండి.
    • సెట్టింగ్‌ను తీసివేయడానికి, "తీసివేయడానికి ఇక్కడికి లాగండి" నుండి దాన్ని కిందికి లాగండి.

చిట్కా:

  • మీరు మీ క్విక్ సెట్టింగ్‌ల మెనూలో వాటి చిహ్నాన్ని టైల్‌గా జోడించాలనుకుంటున్నారా అని కొన్ని యాప్‌లు అడగవచ్చు. మీరు వీటిని ఎప్పుడైనా తీసివేయవచ్చు లేదా మళ్లీ జోడించవచ్చు. 
  • మీరు అనేక సెట్టింగ్‌లను ఆన్ చేసి ఉంటే, స్క్రీన్ స్పేస్‌ను ఆదా చేయడానికి మీ ఫోన్ కొన్నిసార్లు చిహ్నాలను దాచిపెడుతుంది. దాచిన చిహ్నాలను కనుగొనడానికి, మీ ఫోన్ స్క్రీన్ పైభాగంలో, మీకు ఒక డాట్ కనిపిస్తుంది.

ఆడియో, వీడియోను కంట్రోల్ చేయండి

  • మీ ఫోన్‌లో ఏమి ప్లే అవుతుందో కనుగొనడానికి, మీ స్క్రీన్ పై భాగం నుండి కిందికి స్వైప్ చేయండి.
  • మీడియా ప్లే అవుతున్న యాప్‌ను తెరవడానికి, ప్యానెల్‌ను ట్యాప్ చేయండి.
  • మీరు ఒకటి కంటే ఎక్కువ మీడియా యాప్‌లను ఉపయోగిస్తుంటే, వాటిని కనుగొనడానికి కుడి లేదా ఎడమ వైపునకు స్వైప్ చేయండి.
  • సౌండ్ ఎక్కడ ప్లే అవుతుందో మార్చడానికి, ప్యానెల్ పైన కుడి వైపున, మీ ఆడియో యాక్సెసరీ పేరును ట్యాప్ చేయండి. ఉదాహరణకు, "స్పీకర్‌లు" లేదా "Pixel బడ్స్."
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6729117897116909699
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
false
false