Androidలో యాప్‌లను కనుగొనడం, తెరవడం, మూసివేయడం

మీరు మీ మొదటి స్క్రీన్‌లలో కొన్ని యాప్‌లను, అలాగే అన్ని యాప్‌లలో మీ మొత్తం యాప్‌లను కనుగొంటారు. మీరు యాప్‌లను తెరవవచ్చు, యాప్‌ల మధ్య స్విచ్ చేయవచ్చు, ఒకేసారి 2 యాప్‌లను కనుగొనవచ్చు.

ముఖ్య గమనిక: ఈ దశలలో కొన్ని, Android 9లో, అలాగే ఆ తర్వాత వచ్చిన వెర్షన్‌లలో మాత్రమే పని చేస్తాయి. మీ Android వెర్షన్‌ను ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

యాప్‌లను తెరిచి, కనుగొనండి

ఎక్కడి నుండి అయినా

  1. మీ స్క్రీన్ దిగువ నుండి పైకి స్వైప్ చేయండి. మీరు అన్ని యాప్‌లు  ఆప్షన్‌ను పొందితే, దానిపై నొక్కండి.
  2. మీరు తెరవాలనుకుంటున్న యాప్‌ను నొక్కండి.

చిట్కా: మీరు ఆఫీస్ లేదా స్కూల్ కోసం Google ఖాతాను ఉపయోగిస్తున్నట్లయితే, మీ యాప్‌లను "ఆఫీస్" ట్యాబ్‌లో కనుగొనవచ్చు.

షార్ట్‌కట్‌ల నుండి

  1. యాప్‌ని నొక్కి, పట్టుకోండి.
  2. మీకు ఆప్షన్‌లు ఉంటే, ఒకదాన్ని ఎంచుకోండి.
ఇటీవలి యాప్‌ల మధ్య స్విచ్ చేయండి
  1. కింది నుండి పైకి స్వైప్ చేసి, పట్టుకుని, ఆపై వదిలివేయండి. 
    • మీరు 3-బటన్ నావిగేషన్‌ను కలిగి ఉన్న Android Goను కలిగి ఉంటే, ఇటీవలి యాప్‌లు ను ట్యాప్ చేయండి.
  2. మీరు తెరవాలనుకుంటున్న యాప్‌నకు మారడానికి ఎడమ లేదా కుడి వైపునకు స్వైప్ చేయండి.
  3. మీరు తెరవాలనుకుంటున్న యాప్‌ను ట్యాప్ చేయండి.
యాప్‌లను మూసివేయండి

ముఖ్యమైనది: Google Play సర్వీసులు లేదా సిస్టమ్ యాప్‌లు వంటి కొన్ని యాప్‌లు ఆపివేయడం సాధ్యం కాదు. Google Play సర్వీసుల గురించి మరింత తెలుసుకోండి.

  • ఒక యాప్‌ను మూసివేయండి: కింది నుండి పైకి స్వైప్ చేసి, పట్టుకుని, ఆపై వదిలివేయండి. యాప్‌పై స్వైప్ చేయండి.
  • అన్ని యాప్‌లను మూసివేయండి: కింది నుండి పైకి స్వైప్ చేసి, పట్టుకుని, ఆపై వదిలివేయండి. ఎడమ నుండి కుడి వైపునకు స్వైప్ చేయండి. ఎడమ వైపున, అన్నింటినీ క్లియర్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  • Android Goలో అన్ని యాప్‌లను మూసివేయండి: కింది నుండి పైకి స్వైప్ చేసి, పట్టుకుని, ఆపై వదిలివేయండి. దిగువున ఉన్న, అన్నింటినీ క్లియర్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  • మీ మొదటి స్క్రీన్‌ను కనుగొనండి: హోమ్ లేదా హోమ్ ఆప్షన్‌ను నొక్కండి.
  • బ్యాక్‌గ్రౌండ్‌లో పని చేసే యాప్‌లను ఆపివేయండి:
    1. క్విక్ సెట్టింగ్‌లను తెరవడానికి, స్క్రీన్ పై నుండి రెండుసార్లు కిందకి స్వైప్ చేయండి.
    2. బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న యాక్టీవ్ యాప్‌ల సంఖ్యను చూడటానికి:
      • దిగువ ఎడమ వైపున ఉన్న, # యాక్టివ్ యాప్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
      • లేదా, దిగువ కుడి వైపున ఉన్న సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు, పవర్ ఆప్షన్ పక్కన ఉన్న నంబర్‌ను ట్యాప్ చేయండి.
    3. ప్రతి యాక్టీవ్ యాప్‌ను మూసివేయడానికి, స్టాప్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

చిట్కా: మీరు యాప్‌లను మూసివేయకపోయినా కూడా, మీ మెమరీ లేదా బ్యాటరీ అయిపోదు. Android వీటని ఆటోమేటిక్‌గా మేనేజ్ చేస్తుంది.

కొత్త యాప్‌లను పొందండి

మీరు Play Store యాప్ Google Playలో మరిన్ని యాప్‌లను పొందవచ్చు. యాప్‌లను ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16398351657324229040
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
false
false