మీ Android పరికరంలో స్క్రీన్‌షాట్‌ను తీయండి లేదా మీ స్క్రీన్‌ను రికార్డ్ చేయండి

మీరు మీ ఫోన్ స్క్రీన్ ఇమేజ్‌ను (స్క్రీన్‌షాట్) తీయవచ్చు లేదా వీడియోను రికార్డ్ చేయవచ్చు. మీరు మీ స్క్రీన్‌ను క్యాప్చర్ చేసిన తర్వాత, మీరు ఇమేజ్‌ను లేదా వీడియోను చూడవచ్చు, ఎడిట్ చేయవచ్చు, ఇంకా షేర్ చేయవచ్చు.

ముఖ్యమైనది: ఈ దశలలో కొన్ని, Android 11లో, అలాగే ఆ తర్వాత వచ్చిన వెర్షన్‌లలో మాత్రమే పని చేస్తాయి. మీ Android వెర్షన్‌ను ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

స్క్రీన్‌షాట్‌ను తీయండి

  1. మీరు క్యాప్చర్ చేయాలనుకుంటున్న స్క్రీన్‌ను తెరవండి.
  2. మీ ఫోన్ మీద ఆధారపడి, కింది పద్దతులలో ఏదైనా ఒక దానిని ఫాలో అవ్వండి:
    • పవర్, అలాగే వాల్యూమ్ తగ్గింపు బటన్‌లను ఒకే సమయంలో నొక్కండి.
    • అది పని చేయలేకుంటే, పవర్ బటన్‌ను కొన్ని సెకెన్ల పాటు అలాగే నొక్కి, పట్టుకోండి. ఆపై, స్క్రీన్‌షాట్‌ను ట్యాప్ చేయండి.
    • వీటిలో ఏదీ పని చేయట్లేదు అంటే, సహాయం కోసం మీ ఫోన్ తయారీదారు సపోర్ట్ సైట్‌కు వెళ్లండి.
  3. కింద ఎడమ వైపున, మీకు మీ స్క్రీన్‌షాట్ ప్రివ్యూ కనిపిస్తుంది. కొన్ని ఫోన్‌లలో, స్క్రీన్ పైన, మీకు స్క్రీన్‌షాట్ క్యాప్చర్ కనిపిస్తుంది.

పూర్తి స్క్రీన్‌షాట్‌ను తీసుకోండి

ముఖ్య విషయం: ఈ దశలు Android 12, అంతకంటే ఎక్కువ స్థాయి వెర్షన్ రన్ అయ్యే పరికరాలలో, చాలా వరకు స్క్రోల్‌ను అనుమతించే స్క్రీన్‌లపై పని చేస్తాయి.
  1. మీరు క్యాప్చర్ చేయాలనుకుంటున్న స్క్రీన్‌ను తెరవండి.
  2. పవర్, అలాగే వాల్యూమ్ తగ్గింపు బటన్‌లను ఒకే సమయంలో నొక్కండి.
  3. దిగువున, మరిన్ని క్యాప్చర్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీరు క్యాప్చర్ చేయాలనుకుంటున్న కంటెంట్‌ను ఎంచుకోవడానికి, కత్తిరింపు గైడ్‌లైన్స్‌ను ఉపయోగించండి.

మీ స్క్రీన్‌షాట్‌ను కనుగొనండి, షేర్ చేయండి & ఎడిట్ చేయండి

చిట్కా: మీ దగ్గర Photos యాప్ లేకుంటే, మీరు పాత Android వెర్షన్‌ను రన్ చేస్తూ ఉండవచ్చు. మీ ఫోన్ Gallery యాప్‌ను తెరిచి, ఆల్బమ్ వీక్షణ ఆ తర్వాత స్క్రీన్‌షాట్‌ల ఫోల్డర్‌ను ట్యాప్ చేయండి.

  1. Photos యాప్ ను తెరవండి.
  2. లైబ్రరీ ఆ తర్వాత స్క్రీన్‌షాట్‌లను ట్యాప్ చేయండి.
    • స్క్రీన్‌షాట్‌ను షేర్ చేయడానికి, షేర్ చేయండి Shareని ట్యాప్ చేయండి.
    • స్క్రీన్‌షాట్‌ను ఎడిట్ చేయడానికి ఎడిట్ చేయండి Editని ట్యాప్ చేయండి.

మీ ఫోన్ స్క్రీన్‌ను రికార్డ్ చేయండి

  1. మీ స్క్రీన్ పైభాగం నుండి కిందికి స్వైప్ చేయండి.
  2. స్క్రీన్ రికార్డ్ ను ట్యాప్ చేయండి.
    • దాన్ని కనుగొనడానికి మీరు కుడి వైపునకు స్వైప్ చేయాల్సి రావచ్చు.
    • అది అక్కడ లేకుంటే, ఎడిట్ చేయండి ని ట్యాప్ చేసి, స్క్రీన్ రికార్డ్ ను మీ క్విక్ సెట్టింగ్‌లకు లాగండి.
  3. మీరు రికార్డ్ చేయాలనుకుంటున్న దాన్ని ఎంచుకుని, ప్రారంభించండిని ట్యాప్ చేయండి. కౌంట్‌డౌన్ తర్వాత రికార్డింగ్ ప్రారంభమవుతుంది.
    • మీరు ఆడియోను రికార్డ్ చేయడం, ప్రారంభించే ముందు స్క్రీన్‌పై టచ్‌లను చూపించడం ఎంచుకోవచ్చు.
  4. రికార్డింగ్‌ను ఆపివేయడానికి, స్క్రీన్ పై నుండి కిందికి స్వైప్ చేసి, స్క్రీన్ రికార్డర్ నోటిఫికేషన్ ను ట్యాప్ చేయండి.

స్క్రీన్ రికార్డింగ్‌లను కనుగొనండి

  1. Photos యాప్ ను తెరవండి.
  2. లైబ్రరీ ఆ తర్వాత సినిమాలను ట్యాప్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13480952291532155717
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
false
false