మీ Android వెర్షన్‌ను చెక్ చేయండి, అలాగే దాన్ని అప్‌డేట్ చేయండి

ముఖ్య గమనిక: సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ తర్వాత మీ Android పరికరంలో బ్యాటరీ, సాధారణం కంటే వేగంగా డ్రెయిన్ కావడం సహజం. ఎందుకంటే అప్‌డేట్‌లను డౌన్‌లోడ్ చేసి, ఆప్టిమైజ్ చేసి, ఇన్‌స్టాల్ చేయడానికి సిస్టమ్‌కు ఎక్కువ బ్యాటరీ అవసరం.

మీ సెట్టింగ్‌ల యాప్‌లో మీ పరికరానికి సంబంధించిన Android వెర్షన్ నంబర్‌ను, సెక్యూరిటీ అప్‌డేట్ స్థాయిని, ఇంకా Google Play సిస్టమ్ స్థాయిని మీరు చూడవచ్చు. అప్‌డేట్‌లు అందుబాటులోకి వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్‌లు అందుతాయి. మీరు కూడా అప్‌డేట్‌ల కోసం చెక్ చేయవచ్చు.

మీ దగ్గర ఏ Android వెర్షన్ ఉందో చెక్ చేసుకోండి

  1. మీ ఫోన్‌లో ఉన్న సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. దిగువ భాగం సమీపంలో, ఫోన్ గురించి ఆ తర్వాత Android వెర్షన్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీ "Android వెర్షన్," "Android సెక్యూరిటీ అప్‌డేట్", "బిల్డ్ నంబర్‌"ను కనుగొనండి.

మీకు అందుబాటులో ఉన్న తాజా Android అప్‌డేట్‌లను పొందండి

మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు, దానిని తెరిచి, అప్‌డేట్ చర్యను ట్యాప్ చేయండి.

మీ నోటిఫికేషన్‌ను మీరు క్లియర్ చేసి ఉంటే లేదా మీ పరికరం ఆఫ్‌లైన్‌లో ఉంటే:

  1. మీ పరికర సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. సిస్టమ్ ఆ తర్వాత సిస్టమ్ అప్‌డేట్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీ అప్‌డేట్ స్టేటస్‌ను మీరు కనుగొంటారు. స్క్రీన్‌పై కనిపించే దశలలో వేటినైనా ఫాలో అవ్వండి.

సెక్యూరిటీ అప్‌డేట్‌లను, ఇంకా Google Play సిస్టమ్ అప్‌డేట్‌లను పొందండి

అత్యధిక శాతం సిస్టమ్ అప్‌డేట్‌లు, ఇంకా సెక్యూరిటీ ప్యాచ్‌లు ఆటోమేటిక్‌గా జరుగుతాయి. అప్‌డేట్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేయడానికి:

  1. మీ పరికర సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. సెక్యూరిటీ & గోప్యత ఆ తర్వాత సిస్టమ్ & అప్‌డేట్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • సెక్యూరిటీ అప్‌డేట్‌ల కోసం, సెక్యూరిటీ అప్‌డేట్ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • Google Play సిస్టమ్ అప్‌డేట్‌ల కోసం, Google Play సిస్టమ్ అప్‌డేట్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. స్క్రీన్‌పై కనిపించే దశలలో వేటినైనా ఫాలో అవ్వండి.

చిట్కా: అందుబాటులో ఉన్న అప్‌డేట్ కనిపించకపోతే, మీ ఫోన్‌ను రీస్టార్ట్ చేయడానికి మీరు ట్రై చేయవచ్చు.

మీకు Android అప్‌డేట్‌లు ఎప్పుడు అందుతాయి

పరికరం, తయారీదారు, ఇంకా మొబైల్ క్యారియర్‌ను బట్టి అప్‌డేట్ షెడ్యూల్స్ మారతాయి.

ముఖ్య గమనిక: పాత పరికరాలు కొత్తగా వచ్చే Android వెర్షన్‌లను ఎల్లప్పుడూ సపోర్ట్ చేయకపోవచ్చు.

అప్‌డేట్‌లకు సంబంధించిన సమస్యను పరిష్కరించండి

తగినంత స్పేస్ అందుబాటులో లేదు

మీకు "తగినంత స్పేస్ అందుబాటులో లేదు" అనే నోటిఫికేషన్‌ను పొందినట్లయితే, ఈ కింద పేర్కొన్న పరికరాలలో స్టోరేజ్‌ను ఎలా ఖాళీ చేయాలో తెలుసుకోండి:

ఒక అప్‌డేట్ డౌన్‌లోడ్ అవ్వలేదు

మీ పరికరాన్ని ఆటోమేటిక్‌గా మళ్లీ అప్‌డేట్‌ను ట్రై చేయనివ్వండి

ఏదైనా అప్‌డేట్ డౌన్‌లోడ్ అవ్వడం ప్రారంభమయి, అది పూర్తి అవ్వకపోతే, కొన్ని రోజులలో మీ పరికరం ఆ ప్రక్రియను మళ్లీ ఆటోమేటిక్‌గా ట్రై చేస్తుంది.
అది మళ్లీ ట్రై చేసినప్పుడు, మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్‌ను తెరిచి, అప్‌డేట్ చర్యను ట్యాప్ చేయండి.

సెక్యూరిటీ అప్‌డేట్‌ల కోసం Android వెర్షన్‌ను అప్‌డేట్ చేయండి

మీ పరికరానికి అందుబాటులో ఉన్న తాజా సెక్యూరిటీ అప్‌డేట్‌ను పొందడానికి, మీ పరికరానికి తాజా Android వెర్షన్ అందుబాటులో ఉందని నిర్ధారించుకోండి.
అప్‌డేట్‌లు ఎపుడు యాక్టివ్ అవుతాయి

Pixel ఫోన్‌లు & Pixel Tablet

డౌన్‌లోడ్ చేసిన Android అప్‌డేట్‌లను Pixel ఫోన్‌లు, Pixel Tablet బ్యాక్‌గ్రౌండ్‌లో ఇన్‌స్టాల్ చేస్తాయి. మీ పరికరాన్ని మీరు తర్వాతిసారి రీస్టార్ట్ చేసినప్పుడు, ఇన్‌స్టాల్ అయిన అప్‌డేట్‌లు యాక్టివ్ అవుతాయి. 

ఇతర Android పరికరాలు

అనేక Android ఫోన్‌లు, టాబ్లెట్‌లు, డౌన్‌లోడ్ చేయబడిన Android అప్‌డేట్‌లను అవి ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అవుతాయి. ఇన్‌స్టాలేషన్ పూర్తి అయినప్పుడు అప్‌డేట్‌లు యాక్టివ్ అవుతాయి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5245330049406900372
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
false
false