Android పరికరంలో ఖాతాను జోడించండి లేదా తీసివేయండి

మీ ఈమెయిల్, కాంటాక్ట్‌లు, ఇంకా క్యాలెండర్‌ను యాక్సెస్ చేయడానికి, Google Play Store నుండి యాప్‌లను పొందడానికి, మీరు మీ ఫోన్‌కు ఖాతాలను జోడించవచ్చు. మీరు ఒక Google ఖాతాను జోడించినప్పుడు, ఆ ఖాతాతో అనుబంధించబడిన సమాచారం మీ ఫోన్‌తో ఆటోమేటిక్‌గా సింక్ అవుతుంది.

మీరు ఒక ఖాతాను తీసివేసినప్పుడు, ఆ ఖాతాతో అనుబంధించబడిన ప్రతి ఒక్కటి కూడా మీ ఫోన్ నుండి తొలగించబడుతుంది. ఇందులో ఈమెయిల్, కాంటాక్ట్‌లు, సెట్టింగ్‌లు ఉంటాయి.

ముఖ్య గమనిక: ఈ దశలలో కొన్ని, Android 9లో, అలాగే ఆ తర్వాత వచ్చిన వెర్షన్‌లలో మాత్రమే పని చేస్తాయి. మీ Android వెర్షన్‌ను ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

మీ ఫోన్‌కు Google లేదా ఇతర ఖాతాను జోడించండి

  1. మీ ఫోన్‌లో ఉన్న సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. పాస్‌వర్డ్‌‌లు & ఖాతాలు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. మీకు "ఖాతాలు" కనిపించకపోతే, యూజర్‌లు & ఖాతాలుపై ట్యాప్ చేయండి.
  3. "ఖాతాల కోసం" ఆప్షన్ కింద, ఖాతాను జోడించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీరు జోడించాలనుకుంటున్న ఖాతా రకాన్ని ట్యాప్ చేయండి.
    • మీ Google ఖాతాను జోడించడానికి, Google అనే ఆప్షన్ ట్యాప్ చేయండి. మీరు Google ఖాతాతో సైన్ ఇన్ చేసినప్పుడు, ఆ ఖాతాతో అనుబంధించబడిన ఈమెయిల్, కాంటాక్ట్‌లు, క్యాలెండర్ ఈవెంట్‌లు, ఇతర డేటా మీ ఫోన్‌తో ఆటోమేటిక్‌గా సింక్ చేయబడతాయి.
    • వేరొక వ్యక్తిగత ఖాతాను జోడించడానికి, వ్యక్తిగత (IMAP) లేదా వ్యక్తిగత (POP3) అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. మీరు Microsoft Outlook లేదా Apple Mail వంటి ఈమెయిల్ ప్రోగ్రామ్‌ను ఉపయోగిస్తుంటే మీరు సాధారణంగా వీటిని ఎంచుకోవచ్చు. Gmailతో IMAP లేదా POP3ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
  5. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.
  6. మీరు ఖాతాలను జోడిస్తున్నట్లైతే, సెక్యూరిటీ కోసం మీ ఫోన్ ఆకృతి, PIN లేదా పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి రావచ్చు.

చిట్కా: మీరు మీ పరికరాన్ని స్నేహితునికి ఇవ్వాలనుకుంటే, మీరు ఖాతాను జోడించడానికి బదులుగా learn how to create a separate user లేదా temporary guest.

మీ ఫోన్ నుండి Google లేదా ఇతర ఖాతాను తీసివేయండి

  1. మీ పరికరంలోని సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. పాస్‌వర్డ్‌‌లు & ఖాతాలు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. మీకు "ఖాతాలు" కనిపించకపోతే, యూజర్‌లు & ఖాతాలుపై ట్యాప్ చేయండి.
  3. "ఖాతాలు" ఆప్షన్ కింద, మీరు తీసివేయాలనుకుంటున్న ఖాతాను ట్యాప్ చేయండి ఆ తర్వాత ఖాతాను తీసివేయండి.
  4. నిర్ధారించడానికి, ఖాతాను తీసివేయండి ఆ తర్వాత ఖాతాను తీసివేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. పరికరంలో ఇదొక్కటే Google ఖాతా ఉంటే, సెక్యూరిటీ కోసం మీ పరికరం ఆకృతి, PIN లేదా పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16209176411394818872
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
false
false