కొత్త Android పరికరానికి మారండి

మీరు మరొక రకమైన ఫోన్ నుండి ఒక కొత్త Android పరికరానికి మీ డేటాను తరలించవచ్చు, లేదా మీ కొత్త Android పరికరంతో కొత్తగా ప్రారంభించవచ్చు.

ముఖ్యమైనది: ఈ దశలలో కొన్ని, Android 10లో, అలాగే ఆ తర్వాత వచ్చిన వెర్షన్‌లలో మాత్రమే పని చేస్తాయి. మీ Android వెర్షన్‌ను ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

మీరు ప్రారంభించే ముందు

Google, Android పరికరాల స్థిరమైన పునర్వినియోగం, రీసైక్లింగ్‌కు సపోర్ట్ చేయదు. పర్యావరణం పట్ల Google నిబద్ధత గురించి మరింత తెలుసుకోండి.

చిట్కా: మీరు మీ పాత పరికరాన్ని రీసైకిల్ చేయడానికి, డొనేట్ చేయడానికి లేదా డివైజ్-ఎక్స్‌చేంజ్ చేయడానికి ముందు, మీ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడానికి మీ డేటాను క్లియర్ చేయండి, ఫ్యాక్టరీ సెట్టింగ్‌లకు మీ పరికరాన్ని రీసెట్ చేయండి. డేటాను తీసివేయడం, డివైజ్-ఎక్స్‌చేంజ్, రీసైక్లింగ్ సూచనల కోసం, మీ పరికర తయారీదారు, మొబైల్ క్యారియర్ నుండి సహాయం పొందండి.

 

Android పరికరం నుండి మారండి
  1. మీ కొత్త పరికరాన్ని ఆన్ చేయండి.
  2. ప్రారంభించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. మీకు “ప్రారంభించండి” అనే ఆప్షన్ కనిపించకపోతే, మీరు మీ డేటాను మాన్యువల్‌గా కాపీ చేసుకోవచ్చు.
  3. అడిగినప్పుడు, మీరు Wi-Fi నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయ్యారని నిర్ధారించుకోండి.
  4. మీ పాత పరికరం నుండి యాప్‌లు, డేటాను కాపీ చేయడానికి ఎంచుకోండి.
    • మీ పరికరాలను కనెక్ట్ చేయడానికి మీ వద్ద కేబుల్ ఉంటే, మీ డేటాను కాపీ చేయడానికి స్క్రీన్‌పై కనిపించే సూచనలను ఫాలో అవ్వండి.
    • మీ వద్ద కేబుల్ లేకపోతే:
      1. కేబుల్ లేదా? అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి ఆ తర్వాత సరే.
      2. Android ఫోన్ నుండి బ్యాకప్ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
      3. మీ డేటాను కాపీ చేయడానికి, స్క్రీన్‌పై కనిపించే సూచనలను ఫాలో అవ్వండి.
iPhone నుండి మారండి
  1. మీ కొత్త పరికరాన్ని ఆన్ చేయండి.
  2. ప్రారంభించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. అడిగినప్పుడు, మీరు Wi-Fi నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయ్యారని నిర్ధారించుకోండి.
  4. మీ పాత పరికరం నుండి యాప్‌లు, డేటాను కాపీ చేయడానికి ఎంచుకోండి.
    • సిఫార్సు చేయబడినవి: మీ పరికరాలను కనెక్ట్ చేయడానికి మీ వద్ద కేబుల్ ఉంటే, మీ డేటాను కాపీ చేయడానికి స్క్రీన్‌పై సూచనలను అనుసరించండి.
    • మీ వద్ద కేబుల్ లేకపోతే:
      1. కేబుల్ లేదా? అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి ఆ తర్వాత సరే.
      2. iPhone పరికరాన్ని ఉపయోగించి ట్యాప్ చేయాలా?
      3. మీ డేటాను కాపీ చేయడానికి, స్క్రీన్‌పై కనిపించే సూచనలను ఫాలో అవ్వండి.
  5. మీ టెక్స్ట్‌లు, ఫోటోలు, ఇంకా వీడియోలను చెక్ చేయండి.
క్లౌడ్ నుండి డేటాను రీస్టోర్ చేయండి
ముఖ్య గమనిక: మీ వద్ద మీ పాత పరికరం లేకపోతే, డేటాను రీస్టోర్ చేయడానికి, మీ Google ఖాతా, ఇంకా పాస్‌వర్డ్ మీకు తెలియాల్సిన అవసరం ఉంది.
  1. మీ కొత్త పరికరాన్ని ఆన్ చేయండి.
  2. ప్రారంభించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. పాత పరికరం లేకుండా మీ పరికరాన్ని సెటప్ చేయడానికి, ప్రాంప్ట్‌లను ఫాలో అవ్వండి.
  4. ప్రాంప్ట్ వచ్చినప్పుడు, మీ Google ఖాతాతో సైన్ ఇన్ చేయండి. 
డేటాను మాన్యువల్‌గా కాపీ చేయండి

ముఖ్య గమనిక: పైన పేర్కొన్న ఆప్షన్‌లు అత్యధిక శాతం డేటాను రీస్టోర్ చేయడంలో మీకు సహాయపడవచ్చు. ఇతర దశలు ఏవీ పని చేయకపోతే, స్వయంగా మీరే మీ డేటాను కాపీ చేసుకోవడానికి ట్రై చేయండి.

మీ కాంటాక్ట్‌లను సింక్ చేయండి

మీ మ్యూజిక్‌ను కాపీ చేయండి

YouTube Music, Apple Music, ఇంకా Spotify వంటి మ్యూజిక్ సర్వీస్‌ల కోసం, యాప్‌ను మీ కొత్త పరికరంలోకి డౌన్‌లోడ్ చేసుకోండి, మీ మ్యూజిక్ ఆటోమేటిక్‌గా సింక్ చేయబడుతుంది.

ఫోటోలను, వీడియోలను, ఫైల్స్‌ను, ఇంకా ఫోల్డర్‌లను కాపీ చేయండి

క్యాలెండర్ ఈవెంట్‌లను కాపీ చేయండి

చిట్కా: మీ కొత్త పరికరం Pixel అయితే, మా Pixel సెటప్ గైడ్‌కు వెళ్లండి.

మీ ఖాతాను బదిలీ చేసేటప్పుడు, మీ డేటా ఎలా హ్యాండిల్ చేయబడుతుంది

మీరు మీ ఖాతాను కొత్త పరికరానికి బదిలీ చేసినప్పుడు, మీ పరికరంలో సర్వీస్‌లను అమలు చేయడానికి నిర్దిష్ట సమాచారం సేకరించబడుతుంది. ఈ ఫంక్షనాలిటీలో కొన్ని Google Play సర్వీసులను ఉపయోగిస్తాయి. ఉదాహరణకు, దిగువున పేర్కొన్న సమాచారం సేకరించబడుతుంది:

  • యాప్ ఫంక్షనాలిటీ ప్రయోజనాల కోసం ఈమెయిల్ అడ్రస్‌లు. ఉదాహరణకు, ఫోన్ సెటప్ సమయంలో, మీరు బదిలీ చేయాల్సిన ఖాతాలను ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతించేందుకు మేము ఖాతా పేర్లను చూపుతాము. 
  • ఎనలిటిక్స్ ప్రయోజనాల కోసం వినియోగ సమాచారం ఇంకా పరికరం లేదా ఇతర ఐడెంటిఫైయర్‌లు.

సేకరించిన డేటా బదిలీ చేయబడుతున్నప్పుడు, ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉంటుంది.

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14290013167784353780
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
false
false