మీ టాబ్లెట్‌తో ఫిజికల్ కీబోర్డ్‌ను ఉపయోగించండి

మీరు Android-అనుకూల ఫిజికల్ కీబోర్డ్‌ను కొనుగోలు చేయవచ్చు, దానిని మీ టాబ్లెట్‌కు కనెక్ట్ చేయవచ్చు. దీనితో మీరు క్విక్‌గా డాక్యుమెంట్‌లను కంపోజ్ చేయవచ్చు, ఈమెయిల్స్‌ను రాయవచ్చు, ఇంకా మీ టాబ్లెట్ ఇంటర్‌ఫేస్‌ను నావిగేట్ చేయవచ్చు.

ముఖ్య గమనిక: ఈ దశలలో కొన్ని, Android 14లో, అలాగే ఆ తర్వాత వచ్చిన వెర్షన్‌లలో మాత్రమే పని చేస్తాయి. మీ Android వెర్షన్‌ను ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి.

మీ టాబ్లెట్‌కు ఫిజికల్ కీబోర్డ్‌ను కనెక్ట్ చేయండి

బ్లూటూత్ కీబోర్డ్‌ను మీ టాబ్లెట్‌కు కనెక్ట్ చేయడానికి:

  1. కీబోర్డ్‌ను పెయిరింగ్ మోడ్‌లో ఉంచండి. సహాయం కోసం, కీబోర్డ్ తయారీదారు అందించిన సూచనలను రెఫర్ చేయండి.
  2. మీ పరికర సెట్టింగ్‌లు ను తెరవండి.
  3. సెట్టింగ్‌లు ఆ తర్వాత కనెక్ట్ అయిన పరికరాలు ఆ తర్వాత కొత్త పరికరాన్ని పెయిర్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. “అందుబాటులో ఉన్న పరికరాలు” పక్కన, మీరు కనెక్ట్ చేయాలనుకుంటున్న కీబోర్డ్‌ను ట్యాప్ చేయండి.

మీ ఫిజికల్ కీబోర్డ్ సెట్టింగ్‌లను మార్చండి

  1. మీ పరికర సెట్టింగ్‌లు ను తెరవండి.
  2. సిస్టమ్ ఆ తర్వాత కీబోర్డ్ ఆ తర్వాత ఫిజికల్ కీబోర్డ్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. “ఫిజికల్ కీబోర్డ్" కింద:
    • ఫిజికల్ కీబోర్డ్ లేఅవుట్‌ను మార్చండి: మీ ప్రస్తుత ఫిజికల్ కీబోర్డ్‌ను ఎంచుకోండి ఆ తర్వాత మీరు లేఅవుట్‌ను మార్చాలనుకుంటున్న భాషను ఎంచుకోండి ఆ తర్వాత లేఅవుట్‌ను ఎంచుకోండి.
  4. “ఆప్షన్‌లు” కింద, సెట్టింగ్‌ను మార్చండి:
    • స్క్రీన్‌పై కీబోర్డ్‌ను ఉపయోగించండి: ఫిజికల్ కీబోర్డ్ యాక్టివ్‌గా ఉన్నప్పుడు మీ వర్చువల్ కీబోర్డ్‌ను టాబ్లెట్ స్క్రీన్‌పై ఉంచాలనుకుంటే దీన్ని ఆన్ చేయండి.
    • కీబోర్డ్ షార్ట్‌కట్‌లు: ఉపయోగకరమైన కీబోర్డ్ షార్ట్‌కట్‌ల లిస్ట్‌ను చూడటానికి ఈ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • మోడిఫయర్ కీలు: Caps lock, Ctrl, Alt వంటి ఫిజికల్ కీబోర్డ్ కీల ప్రవర్తనను మార్చడానికి ఈ సెట్టింగ్‌ను ట్యాప్ చేయండి.

చిట్కా: మీ టాబ్లెట్‌కు మీ స్క్రీన్‌పై కీబోర్డ్‌ను కనెక్ట్ చేశాక, దానికి సంబంధించిన భాషా సెట్టింగ్‌లు ఆటోమేటిక్‌గా మీ ఫిజికల్ కీబోర్డ్‌కు వర్తింపజేయబడతాయి.

టచ్‌ప్యాడ్ సెట్టింగ్‌లను మార్చండి

మీ ఫిజికల్ కీబోర్డ్‌లో టచ్‌ప్యాడ్ ఉంటే, మీరు దాన్ని మీ టాబ్లెట్‌కు కనెక్ట్ చేసిన తర్వాత టచ్‌ప్యాడ్ సెట్టింగ్‌లను సర్దుబాటు చేయవచ్చు:

  1. మీ పరికర సెట్టింగ్‌లు ను తెరవండి.
  2. సిస్టమ్ ఆ తర్వాత టచ్‌ప్యాడ్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. సెట్టింగ్‌ను మార్చండి:
    • క్లిక్-కోసం-ట్యాప్: ఈ సెట్టింగ్ ఆన్‌లో ఉన్నప్పుడు, మీరు మౌస్‌పై ఎడమ క్లిక్ చేసినట్టుగానే దేనినైనా ఎంచుకోవడానికి మీ టచ్‌ప్యాడ్‌ను ట్యాప్ చేయవచ్చు.
    • రివర్స్ స్క్రోలింగ్: మీరు కంటెంట్‌ను కిందికి స్క్రోల్ చేస్తున్నప్పుడు అది పైకి వెళ్లేలా చేయడానికి ఈ సెట్టింగ్‌ను ఆన్ చేయండి.
    • దిగువ-కుడి ట్యాప్: మీ టచ్‌ప్యాడ్ దిగువ-కుడి మూలన ట్యాప్ చేయడం ద్వారా మరిన్ని ఆప్షన్‌లను యాక్సెస్ చేయడానికి ఈ సెట్టింగ్‌ను ఆన్ చేయండి.
    • పాయింటర్ వేగం: వేగాన్ని మార్చడానికి ఎడమ, కుడి వైపునకు లాగండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2630073896981486442
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
false
false