మీ Android కెమెరా లేదా మైక్రోఫోన్ ఆన్‌లో ఉందో లేదా ఆఫ్‌లో ఉందో చెక్ చేయండి

మీ కెమెరాను లేదా మైక్రోఫోన్‌ను ఏదైనా యాప్ ఉపయోగిస్తున్నప్పుడు, మీ Android ఫోన్‌లో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ ఫోన్‌ను ఏయే యాప్‌లు యాక్సెస్ చేయవచ్చో మీరు కంట్రోల్ చేయవచ్చు. 

ముఖ్య గమనిక: ఈ దశలలో కొన్ని, Android 12లో, అలాగే ఆ తర్వాత వచ్చిన వెర్షన్‌లలో మాత్రమే పని చేస్తాయి. మా Android వెర్షన్‌ను ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి

మీ కెమెరా, మైక్రోఫోన్ ఆన్‌లో ఉన్నప్పుడు వీటిని చెక్ చేయండి:

  1. యాప్‌లు మీ కెమెరాను లేదా మైక్‌ను ఉపయోగించినప్పుడు, మీ స్క్రీన్ ఎగువున కుడి మూలలో ఆకుపచ్చ ఇండికేటర్ కనిపిస్తుంది.
  2. కిందికి స్వైప్ చేసి, ఇండికేటర్‌పై ట్యాప్ చేయండి.
    • మీ కెమెరాను లేదా మైక్రోఫోన్‌ను ఏ యాప్ లేదా సర్వీస్ ఉపయోగిస్తోందో చెక్ చేయడానికి ఒకసారి ట్యాప్ చేయండి.
    • అనుమతులను మేనేజ్ చేయడానికి మళ్లీ ఒకసారి ట్యాప్ చేయండి.

మీ కెమెరాను లేదా మైక్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి

కెమెరాను, మైక్రోఫోన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి, కిందికి స్వైప్ చేసి, కెమెరా లేదా మైక్ కంట్రోల్‌ను ట్యాప్ చేయండి.

చిట్కాలు:

  • కిందికి స్వైప్ చేయడం అనేది అన్ని పరికరాలలో పని చేయకపోవచ్చు.
  • కెమెరాను లేదా మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేయడంలో మీకు సమస్యలు ఉంటే, మీరు వాటిని అన్‌బ్లాక్ చేశారని నిర్ధారించుకోండి.

క్విక్ సెట్టింగ్‌లలో మీ కెమెరాను, మైక్రోఫోన్‌ను మేనేజ్ చేయండి

మీరు క్విక్ సెట్టింగ్‌ల టైల్స్ నుండి కూడా కెమెరా, మైక్రోఫోన్ కంట్రోల్స్‌ను యాక్సెస్ చేయవచ్చు.

  1. మీ స్క్రీన్ పై నుండి, రెండుసార్లు కిందికి స్వైప్ చేయండి.
  2. కెమెరా, మైక్ యాక్సెస్‌ను ఆఫ్ చేయడానికి, కెమెరా లేదా మైక్రోఫోన్ టైల్‌ను ట్యాప్ చేయండి.
    • మీ క్విక్ సెట్టింగ్‌ల టైల్ అక్కడ లేకుంటే, క్విక్ సెట్టింగ్‌ల దిగువున, ఎడిట్ చేయండి సవరించండి లేదా జోడించండి ని ట్యాప్ చేయండి.
    • టైల్‌ను మీ క్విక్ సెట్టింగ్‌లకు జోడించడానికి దాన్ని తాకి, పట్టుకుని లాగండి.

సంబంధిత రిసోర్స్‌లు

మీ Android ఫోన్‌లో యాప్ అనుమతులను మార్చండి

మీ Android వెర్షన్‌ను చెక్ చేయండి, అలాగే దాన్ని అప్‌డేట్ చేయండి

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14996153110877509007
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
false
false