ఫోటో సెలెక్టర్

ఫోటో సెలెక్టర్‌ను ఉపయోగించి, వ్యక్తిగత ఫోటోలను, వీడియోలను ఏ యాప్‌లతో షేర్ చేయాలో మీరు ఎంచుకోవచ్చు.

ముఖ్యమైనది:

ఫోటోలను ఎంచుకోండి

ఈ యాప్, సింగిల్ లేదా మల్టీ-సెలెక్ట్ మోడ్‌లలో ఫోటోలను చూపిస్తుంది.

సింగిల్ సెలెక్ట్ మోడ్

  1. మీరు ఫోటోలను లేదా వీడియోలను షేర్ చేయాలనుకుంటున్న యాప్‌ను తెరవండి.
  2. Photos వీక్షణ నుండి, మీరు చేర్చాలనుకుంటున్న ఫోటోను లేదా వీడియోను ఎంచుకోండి.

చిట్కా: మీరు ఎంచుకునే ఫోటోను లేదా వీడియోను ఫుల్ స్క్రీన్ మోడ్‌లో ప్రివ్యూ చేయడానికి, థంబ్‌నెయిల్‌ను నొక్కి, పట్టుకోండి.

మల్టీ-సెలెక్ట్ మోడ్

  1. మీరు ఫోటోలను లేదా వీడియోలను షేర్ చేయాలనుకుంటున్న యాప్‌ను తెరవండి.
  2. అనేక ఫోటోలను లేదా వీడియోలను ఎంచుకోండి.
  3. మీరు ఎంచుకున్న ఫైల్స్‌ను ఫుల్ స్క్రీన్ ప్రివ్యూలో ప్రదర్శించడానికి ఎంచుకున్న వాటిని చూడండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • ఎంచుకున్న ఫైల్స్‌ను ప్రదర్శించడానికి, వాటిపై క్విక్‌గా కుడి వైపునకు స్వైప్ చేయండి.
  4. మీకు కావలసిన ఫోటోలను లేదా వీడియోలను ఎంచుకోండి లేదా వాటి ఎంపికను తొలగించండి.
  5. జోడించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

చిట్కా: మీరు ఎంచుకునే ఫోటోలను లేదా వీడియోలను ఫుల్ స్క్రీన్ మోడ్‌లో ప్రివ్యూ చేయడానికి, మీరు థంబ్‌నెయిల్‌ను నొక్కి పట్టుకోవచ్చు లేదా ఎంచుకున్న వాటిని చూడండి ఎంచుకున్న వాటిని చూడండిని ట్యాప్ చేయవచ్చు. ఎంచుకున్న ఫోటోలను, వీడియోలను చూడటానికి కుడి, ఎడమ వైపునకు స్వైప్ చేయండి. మీరు ఇకపై ఫోటోను లేదా వీడియోను చేర్చకూడదనుకుంటే, ఎంపికను తొలగించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

ముఖ్య గమనిక: మీరు యాప్ కాన్ఫిగరేషన్‌ను బట్టి, గరిష్టంగా 100 లేదా అంతకంటే తక్కువ ఫోటోలను లేదా వీడియోలను ఎంచుకోవచ్చు.

వ్యక్తిగత, వర్క్ ప్రొఫైల్స్‌తో షేర్ చేయడానికి ఎంచుకోండి

మీరు వర్క్, వ్యక్తిగత ప్రొఫైల్స్ కోసం వేర్వేరు యాప్‌లలో మీ ఫోటోలను, వీడియోలను చూపించడానికి ఎంచుకోవచ్చు.

ముఖ్య గమనిక: మీ వర్క్ ప్రొఫైల్ డిజేబుల్ చేయబడితే, మీరు దానిని ఎంచుకోలేరు. 

వ్యక్తిగత మోడ్ నుండి వర్క్ మోడ్‌కు మార్చండి

  1. ఫోటో సెలెక్టర్ ఆప్షన్‌ను తెరవండి.
  2. వర్క్ మోడ్‌కు మార్చండి వర్క్ ప్రొఫైల్‌కు మార్చండిని ట్యాప్ చేయండి.

ముఖ్య గమనిక: వర్క్ ప్రొఫైల్ ఎనేబుల్ కాకుంటే:

  1. హోమ్ మెనూ నుండి పికర్‌ను తీసివేయండి.
  2. వర్క్ యాప్‌లను ఆన్ చేయండి ఆ తర్వాత వర్క్ మోడ్‌కు మార్చండి వర్క్ ప్రొఫైల్‌కు మార్చండిని ట్యాప్ చేయండి.

వర్క్ మోడ్ నుండి వ్యక్తిగత మోడ్‌కు మార్చండి

  1. ఫోటో సెలెక్టర్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  2. వ్యక్తిగత మోడ్‌కు మార్చండి వ్యక్తిగత ప్రొఫైల్‌కు మార్చండిని ట్యాప్ చేయండి.

బ్రౌజ్ చేయడం

మీరు బ్రౌజ్ చేయండి ఆప్షన్ ద్వారా ఇతర ప్రొవైడర్‌ల నుండి కంటెంట్‌ను యాక్సెస్ చేయవచ్చు.

ముఖ్య గమనిక: ఆ యాప్ మీరు ఎంచుకున్న మీడియాను మాత్రమే యాక్సెస్ చేయగలదు.

  1. ఫోటో సెలెక్టర్‌ను తెరవండి.
  2. బ్రౌజ్ చేయండి ఆ తర్వాత మీకు కావాల్సిన మీడియా ఫైల్స్‌ను ఎంచుకోండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

చిట్కా: కొన్ని యాప్‌లు మిమ్మల్ని బ్రౌజ్ చేయడానికి అనుమతించవు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7817060362314219402
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
false
false