Androidలో మీ పరికర లాగ్‌లను మేనేజ్ చేయండి

పరికర లాగ్‌లు మీ పరికరంలోని సిస్టమ్, యాప్‌ల ద్వారా రికార్డ్ చేయబడిన సమాచారాన్ని కలిగి ఉంటాయి. ఈ లాగ్‌లు తాత్కాలికంగా స్టోర్ చేయబడతాయి, రోలింగ్ ప్రాతిపదికన తొలగించబడతాయి.

ఆటోమేటిక్‌గా, అన్ని యాప్‌లు అవి క్రియేట్ చేసే యాప్ లాగ్‌లకు యాక్సెస్‌ను కలిగి ఉంటాయి, Google ఇంకా మీ పరికర తయారీదారులు సిస్టమ్ పనితీరు, అప్‌డేట్‌లు, మెయింటెనెన్స్, అలాగే సెక్యూరిటీ వంటి ప్రయోజనాల కోసం అవసరమైన సమాచారాన్ని కూడా యాక్సెస్ చేయవచ్చు.

కొన్ని యాప్‌లు, సర్వీస్‌లు అన్ని పరికర లాగ్‌లను కూడా యాక్సెస్ చేయగలవు - పరికర తయారీదారులు, యాప్ డెవలపర్‌లు తమ పరికరాలు అలాగే యాప్‌ల క్వాలిటీ, విశ్వసనీయతను మెరుగుపరచడంలో సహాయపడే మరింత విస్తృతమైన లాగ్‌ల సెట్. ఉదాహరణకు, మీ పరికర తయారీదారు అన్ని పరికర లాగ్‌లకు కొనసాగుతున్న యాక్సెస్ కోసం అడగవచ్చు, తద్వారా వారు పరికర క్వాలిటీ, విశ్వసనీయత మెరుగుదలలను అందించగలరు.

ఏటువంటి పరికర లాగ్‌లు ఉండవచ్చు

ముఖ్యమైనది: మీరు అన్ని పరికర లాగ్‌లను యాక్సెస్ చేయడానికి విశ్వసించే యాప్‌లను మాత్రమే అనుమతించాలి.

పరికర లాగ్‌లు సాధారణంగా పరిమిత టెక్నికల్ సమాచారాన్ని కలిగి ఉంటాయి, కానీ మీరు మీ పరికరంలో ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు, మీరు ఆ యాప్‌లు, యూజర్ లేదా పరికరం ఐడెంటిఫైయర్‌లు లేదా ఇతర యాప్ యాక్టివిటీ సమాచారం ఉపయోగించినప్పుడు ఈ లాగ్‌లు ఇటువంటి సమాచారాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది.

Android 13లో, యాప్ ఫీడ్‌బ్యాక్ లేదా బగ్ రిపోర్టింగ్ వంటి ఆమోదించబడిన వినియోగ సందర్భాల కోసం అన్ని పరికర లాగ్‌లను యాక్సెస్ చేయడానికి యాప్ ట్రై చేస్తే, మీరు ఈ మరింత విస్తృతమైన లాగ్‌ల సెట్‌కు యాప్‌నకు ఒక్కసారి యాక్సెస్‌ను అందించాలనుకుంటున్నారా అని సిస్టమ్ మిమ్మల్ని అడుగుతుంది.

సిస్టమ్ మిమ్మల్ని ప్రాంప్ట్ చేసినప్పుడు మీరు అన్ని పరికర లాగ్‌లకు యాక్సెస్‌ను అందించనప్పటికీ, Google, మీ పరికర తయారీదారులు లేదా యాప్ డెవలపర్‌లు ఇప్పటికీ కొన్ని లాగ్‌లు లేదా ఇలాంటి సమాచారాన్ని యాక్సెస్ చేయగలరు. ఉదాహరణకు, మీ పరికరం వినియోగం & విశ్లేషణలు సెట్టింగ్ ఎనేబుల్ చేయబడితే, మీరు మీ పరికరాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు, అది ఎలా పని చేస్తోంది అనే దాని గురించి మీ పరికరం Googleకు సమాచారాన్ని పంపుతుంది.

టెక్నికల్ వివరాలు
"అన్ని పరికర లాగ్‌లు" అనే పదబంధం లాగ్ చేయబడిన సిస్టమ్ ప్రాసెస్ ద్వారా మేనేజ్ చేయబడే లాగ్ బఫర్‌ల మొత్తం కంటెంట్‌లను సూచిస్తుంది. మీరు అన్ని పరికర లాగ్‌లకు యాక్సెస్‌ను అందించనప్పటికీ, యాప్‌లు ఇప్పటికీ ఈవెంట్ లాగ్ వంటి కొన్ని లాగ్‌లను యాక్సెస్ చేయగలవు.

మీ Android పరికరంలో పరికర లాగ్‌లను మేనేజ్ చేయండి

మీరు అన్ని పరికర లాగ్‌లను యాక్సెస్ చేయడానికి యాప్ తాలూకు రిక్వెస్ట్‌ను అనుమతించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.

Android 12 & అంతకన్నా కొత్త వెర్షన్

ఒక యాప్ అన్ని పరికర లాగ్‌లకు యాక్సెస్‌ను రిక్వెస్ట్ చేస్తే యాక్సెస్ రిక్వెస్ట్‌ను ఆమోదించమని లేదా తిరస్కరించమని మీరు ప్రాంప్ట్ చేయబడతారు.

  • అన్ని పరికర లాగ్‌లకు యాక్సెస్‌ను అందించడానికి ఒక్కసారి యాక్సెస్‌ను అనుమతించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  • అన్ని పరికర లాగ్‌లకు యాక్సెస్‌ను తిరస్కరించడానికి అనుమతించవద్దు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1366948193224238597
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
false
false