మీ Android ఫోన్‌లో యాప్ భాషను మార్చండి

మీ పరికర సెట్టింగ్‌లలో మీరు ఒక్కో యాప్‌నకు భాషను మార్చవచ్చు.

ముఖ్య గమనిక: ఈ దశలలో కొన్ని, Android 14లో, అలాగే ఆ తర్వాత వచ్చిన వెర్షన్‌లలో మాత్రమే పని చేస్తాయి. మీ Android వెర్షన్‌ను ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

నిర్దిష్ట యాప్‌నకు సంబంధించిన భాషా సెట్టింగ్‌ను మార్చండి

ముఖ్య గమనిక: సిస్టమ్ ఆటోమేటిక్ సెట్టింగ్‌ను ఫాలో అవ్వాల్సిందిగా సెట్ చేసిన యాప్‌లు, లిస్ట్‌లో ఉన్న మొదట సపోర్ట్ చేసే భాషను ఉపయోగిస్తాయి.

  1. మీ పరికరంలో, మీ సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. సిస్టమ్ ఆ తర్వాత భాషలు ఆ తర్వాత యాప్ భాషలు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు మార్చాలనుకుంటున్న యాప్‌ను ఎంచుకోండి.
  4. ఒక భాషను ఎంచుకోండి.

చిట్కా: మీరు భాష ఎంపికకు సపోర్ట్ చేసే యాప్‌ల కోసం మాత్రమే భాషను మార్చగలరు.

యాప్ భాష ఫీచర్‌తో సమస్యలను పరిష్కరించండి

"అన్ని భాషలు" అనే ఆప్షన్ నిర్దిష్ట యాప్‌నకు సపోర్ట్ చేసే భాషలను లిస్ట్ చేస్తుంది. సపోర్ట్ చేసే భాషలకు సంబంధించిన అప్‌డేట్ అయ్యి ఉన్న లిస్ట్‌ను పొందడానికి, మీ యాప్‌ను అప్‌డేట్ చేయండి.

మీరు యాప్ సెట్టింగ్‌ను మార్చినా, యాప్ భాష మారదు

మీరు భాషను ఎంచుకుని, యాప్ భాష మారలేదని గమనించినట్లయితే, ఈ పరిష్కారాలను ట్రై చేయండి:

  • యాప్‌ను రీస్టార్ట్ చేయండి.
  • మీ పరికరానికి నెట్‌వర్క్ కనెక్షన్ ఉందని నిర్ధారించుకోండి. మీరు ఇంటర్నెట్‌కు కనెక్ట్ కానప్పుడు మీ యాప్ భాషను మార్చినట్లయితే, యాప్ భాష అప్‌డేట్ కాకపోవచ్చు.
  • భాషను ద్వితీయ భాషగా జోడించి, ఆపై యాప్ భాషను మార్చడానికి మళ్లీ ట్రై చేయండి:
    1. మీ Android పరికరంలో మీ సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
    2. సిస్టమ్ ఆ తర్వాత భాషలు & ఇన్‌పుట్ ఆ తర్వాత భాషలు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    3. భాషను ద్వితీయ భాషగా జోడించండి.
    4. కొన్ని నిమిషాల తర్వాత, మీ సెట్టింగ్‌ల యాప్‌ను మళ్లీ తెరవండి.
    5. సిస్టమ్ ఆ తర్వాత భాషలు & ఇన్‌పుట్ ఆ తర్వాత యాప్ భాషలు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    6. మీరు మార్చాలనుకుంటున్న యాప్‌ను ఎంచుకోండి.
    7. భాషను ఎంచుకోండి.

భాష ఫీచర్ ఇప్పటికీ పని చేయకపోతే, యాప్ అందించిన సపోర్ట్ ఉన్న భాషల లిస్ట్ ఖచ్చితమైనది కాకపోవచ్చు.

చిట్కా: మీ దగ్గర యాప్ తాజా వెర్షన్ ఉందని నిర్ధారించుకోండి.

మీరు యాప్ లిస్ట్‌లో మీ యాప్‌ను కనుగొనలేకపోతే

కొన్ని యాప్‌లు ఈ భాష ఫీచర్‌కు సపోర్ట్ చేయవు. డెవలపర్‌లు ఈ ఫీచర్‌కు సమ్మతి తెలియజేసిన యాప్‌లు మాత్రమే యాప్‌ల లిస్ట్‌లో ప్రదర్శించబడతాయి.

మీ సిస్టమ్ భాషలకు భిన్నమైన భాషలో యాప్ నిలిచిపోయినట్లు అనిపించినట్లయితే, మీరు  ద్వారా యాప్‌ను రీసెట్ చేయగలరు. కొన్ని యాప్‌లు యాప్‌లో లేదా అనుబంధిత యాప్-నిర్దిష్ట ఖాతా నుండి మాత్రమే భాషను మార్చడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి.

ప్రాంతీయ ప్రాధాన్యతలను సెట్ చేయండి

ముఖ్య గమనిక: ప్రాంతీయ ప్రాధాన్యతల సెట్టింగ్‌లు Android 14, ఆ తర్వాతి వెర్షన్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

  1. మీ పరికరంలో, సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. సిస్టమ్ ఆ తర్వాత భాషలు ఆ తర్వాత ప్రాంతీయ ప్రాధాన్యతలు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. కింది వాటి ఆధారంగా, మీ ప్రాంతీయ ప్రాధాన్యతలను ఎంచుకోండి:
    • ఉష్ణోగ్రత: మీ ప్రాధాన్య ఉష్ణోగ్రతను సెల్సియస్ లేదా ఫారెన్‌హీట్ వంటి యూనిట్‌కు సెట్ చేయండి.
    • వారంలో మొదటి రోజు: వారంలో మీ మొదటి రోజు ప్రాధాన్యతను ఆదివారం లేదా సోమవారం వంటి రోజుకు సెట్ చేయండి.
    • నంబర్ ప్రాధాన్యతలు: సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ నంబరింగ్ సిస్టమ్‌లను ఉపయోగించే అరబిక్ వంటి భాషలలో నంబరింగ్ సిస్టమ్‌ను మార్చండి. సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ నంబరింగ్ సిస్టమ్‌లను ఉపయోగించే భాషలలో మాత్రమే ఈ ఐటెమ్ కనిపిస్తుంది.

చిట్కాలు:

  • మీ ఆటోమేటిక్ ప్రాంతీయ ప్రాధాన్యతలు, మీ సిస్టమ్, యాప్ భాషా సెట్టింగ్‌లపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు, ఇంగ్లీష్ (యునైటెడ్ స్టేట్స్)లో సాధారణంగా ఉపయోగించే ఉష్ణోగ్రత యూనిట్ ఫారెన్‌హీట్, వారంలో మొదటి రోజు ఆదివారం. ఇంగ్లీష్ (యునైటెడ్ కింగ్‌డమ్)లో సాధారణంగా ఉపయోగించే ఉష్ణోగ్రత యూనిట్ సెల్సియస్, వారంలో మొదటి రోజు సోమవారం.
  • పలు Google సర్వీస్‌లలో కూడా మీ ప్రాధాన్య ఉష్ణోగ్రత యూనిట్‌ను సెట్ చేయవచ్చు.
    1. Google యాప్‌ను తెరవండి.
    2. వాతావరణ చిప్‌ను ట్యాప్ చేయండి.
    3. వాతావరణ కార్డ్‌లో, మెనూ ను ట్యాప్ చేయండి.
    4. మీ ప్రాధాన్య ఉష్ణోగ్రత యూనిట్‌ను ఎంచుకోండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17751090058804055916
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
false
false