SD కార్డ్‌తో ప్రారంభించండి

మీరు మీ Android పరికరంలో SD కార్డ్‌ను సెటప్ చేసినప్పుడు, మీరు పోర్టబుల్ స్టోరేజ్ లేదా అంతర్గత స్టోరేజ్‌లో ఒక దానిని ఎంచుకోవచ్చు.

మీరు పోర్టబుల్ స్టోరేజ్ కోసం SD కార్డ్‌ను ఫార్మాట్ చేసినప్పుడు:

  • మీరు SD కార్డ్‌లో ఫోటోలు, వీడియోల వంటి ఫైల్స్‌ను సేవ్ చేయవచ్చు.
  • మీరు SD కార్డ్‌లో యాప్‌లను ఇన్‌స్టాల్ చేయలేరు.
  • మీరు పరికరాల మధ్య SD కార్డ్‌ను బదిలీ చేయవచ్చు.

మీరు అంతర్గత స్టోరేజ్ కోసం SD కార్డ్‌ను ఫార్మాట్ చేసినప్పుడు:

  • మీరు SD కార్డ్‌లో ఫోటోలు, వీడియోల వంటి ఫైల్స్‌ను లోడ్ చేయవచ్చు.
  • మీరు SD కార్డ్‌లో యాప్‌లను ఇన్‌స్టాల్ చేయవచ్చు.
  • మీరు పరికరాల మధ్య SD కార్డ్‌ను బదిలీ చేయడం సాధ్యం కాదు.
  • SD కార్డ్‌ను మీ పరికరానికి అదనపు స్టోరేజ్‌గా ఉపయోగించవచ్చు.

కొత్త SD కార్డ్‌ను సెటప్ చేయండి

ముఖ్యమైనది: మీరు మీ SD కార్డ్‌ను ఫార్మాట్ చేస్తే, డేటా శాశ్వతంగా తొలగించబడుతుంది. మీరు SD కార్డ్‌ను ఫార్మాట్ చేయడానికి ముందు, మీ ఫైల్‌లను బ్యాకప్ చేసుకోండి.

  1. మీ పరికరంలో, స్క్రీన్ పైభాగం నుండి కిందకి స్వైప్ చేయండి.
  2. SD కార్డ్ గుర్తించబడింది అనే ఆప్షన్ నోటిఫికేషన్‌ను ట్యాప్ చేయండి.
  3. ఈ కింది వాటి కోసం మీ SD కార్డ్‌ను సెటప్ చేయడానికి:
    • పోర్టబుల్ స్టోరేజ్ కోసం, ఫార్మాట్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • అడాప్టబుల్ స్టోరేజ్ కోసం మరొక విధంగా ఫార్మాట్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. మీ SD కార్డ్ ఫార్మాట్ చేయబడిన తర్వాత, మీరు కంటెంట్‌ను తరలించండి లేదా కంటెంట్‌ను తర్వాత తరలించండి ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

మీ SD కార్డ్‌ను పోర్టబుల్ నుండి అడాప్టబుల్‌కు రీఫార్మాట్ చేయండి

ముఖ్యమైనది: మీరు మీ SD కార్డ్‌ను ఫార్మాట్ చేస్తే, డేటా శాశ్వతంగా తొలగించబడుతుంది. మీరు SD కార్డ్‌ను ఫార్మాట్ చేయడానికి ముందు, మీ ఫైల్‌లను బ్యాకప్ చేసుకోండి.

  1. మీ ఫోన్‌లో ఉన్న సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. స్టోరేజ్ ఆ తర్వాత SD కార్డ్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. ఎగువున కుడి వైపున ఉన్న, మెనూ ఆ తర్వాత స్టోరేజ్ సెట్టింగ్‌లు ఆ తర్వాత ఫార్మాట్ ఆ తర్వాత మరొక విధంగా ఫార్మాట్ చేయండి ఆ తర్వాత ఫార్మాట్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

మీ SD కార్డ్‌ను అడాప్టబుల్ నుండి పోర్టబుల్‌కు రీఫార్మాట్ చేయండి

ముఖ్యమైనది: మీరు మీ SD కార్డ్‌ను ఫార్మాట్ చేస్తే, డేటా శాశ్వతంగా తొలగించబడుతుంది. మీరు SD కార్డ్‌ను ఫార్మాట్ చేయడానికి ముందు, మీ ఫైల్‌లను బ్యాకప్ చేసుకోండి.

  1. మీ ఫోన్‌లో ఉన్న సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. స్టోరేజ్ ఆ తర్వాత SD కార్డ్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. ఎగువున కుడి వైపున ఉన్న, మెనూ ఆ తర్వాత ఫార్మాట్ ఆ తర్వాత ఫార్మాట్ కార్డ్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5192522401008759710
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
false
false