నోటిఫికేషన్

దయచేసి మీరు మీ AdSense పేజీకి వెళ్లాలని నిర్ధారించుకోండి, ఇందులో మీరు AdSenseతో విజయం సాధించడం కోసం మీ ఖాతా గురించి వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని కనుగొనవచ్చు.

పేమెంట్‌లు

చెల్లింపుల FAQలు

AdSense పేమెంట్స్ గురించి అత్యంత తరచుగా అడిగే కొన్ని ప్రశ్నలకు దిగువున సమాధానాలు ఇవ్వబడ్డాయి.

పేమెంట్స్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

అన్నింటినీ విస్తరించండి  అన్నింటినీ కుదించండి నాకు పేమెంట్ ఎప్పుడు జరుగుతుంది?

AdSense పేమెంట్ కాల వ్యవధి, నెలవారీగా ఉంటుంది. పేమెంట్ పొందడానికి పాటించాల్సిన దశలను పూర్తి చేసిన తర్వాత, మేము నెలలోని 21 నుండి 26 తేదీల మధ్య పేమెంట్‌లు జారీ చేస్తాము. ఈ సమయంలో, మీకు "లావాదేవీలు" పేజీలో లైన్ ఐటెమ్ కనిపిస్తుంది, అది మీ పేమెంట్ ప్రోగ్రెస్‌లో ఉందని సూచిస్తుంది. పేమెంట్ టైమ్‌లైన్స్ గురించి మరింత తెలుసుకోండి.

పేమెంట్ ప్రాసెసింగ్ ప్రారంభం అవగానే మీ బ్యాంక్ ఖాతాలో నిధులను అందుకోవడానికి EFT కోసం దయచేసి 4-10 రోజుల వరకు వేచి చూడండి. బ్యాంక్ ట్రాన్స్‌ఫ‌ర్‌‌ల ద్వారా మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవడానికి 15 పని దినాల వరకు సమయం తీసుకుంటుంది. మరింత గైడెన్స్ కోసం, మా EFT పరిష్కార సాధనం, బ్యాంక్ ట్రాన్స్‌ఫ‌ర్‌ పరిష్కార సాధనం లింక్‌ను కూడా మీరు సందర్శించవచ్చు.

నాకు త్వరగా చెల్లించబడుతుందా?

లేదు, కారణం ఏదైనా మేము మా సాధారణ చెల్లింపు షెడ్యూల్ వెలుపల చెల్లింపులను చేయలేము.

ప్రత్యామ్నాయ పేమెంట్ ఆప్షన్ ఏదైనా అందుబాటులో ఉందా?

మీ "పేమెంట్ ఆప్షన్‌ను జోడించండి" పేజీలో పేమెంట్ ఆప్షన్ కనిపించకపోతే, అది మీ దేశంలో అందుబాటులో లేదని అర్థం. మీ దేశంలో కొత్త చెల్లింపు పద్ధతి అందుబాటులోకి వస్తే మేము మీకు తెలియజేస్తాము.

నా "లావాదేవీలు" పేజీలో అనేక చెల్లింపులు కనిపించడం లేదు. నా పూర్తి లావాదేవీ చరిత్రను నేను ఎలా చూడగలను?

మీ "లావాదేవీలు" పేజీ డిఫాల్ట్ వీక్షణ మీ ఖాతాలోని గత మూడు నెలల లావాదేవీలను చూపుతుంది. మీ పూర్తి లావాదేవీ హిస్టరీని చూడటానికి, తేదీల పరిధి ఎంపిక సాధనంలో మొత్తం సమయం ఎంచుకోండి.

నా EFT పేమెంట్ మూసివేసిన బ్యాంక్ ఖాతాకు పంపించబడింది, నేను ఏం చేయాలి?

మీ చెల్లింపు పద్ధతి EFT అయి ఉండి, చెల్లింపు స్వీకరించాల్సిన బ్యాంక్ ఖాతా ఇటీవల మూసివేసినదైతే, చెల్లింపు ఆటోమేటిక్‌గా వాపసు చేయబడి, మీ ఆదాయాలు తిరిగి మీ ఖాతాలో జమ చేయబడతాయి.

మీ ఖాతాలోని ధృవీకరించిన బ్యాంక్ ఖాతా కొత్తదైతే, అప్పుడు తిరిగి పంపబడిన మీ చెల్లింపు కొన్ని రోజుల్లో మళ్లీ జారీ చేయబడుతుంది. ఈ మొత్తం ప్రాసెస్‌కు దాదాపుగా వారం సమయం పట్టవచ్చు.

లోకల్ కొరియర్ చెక్ డెలివరీ కోసం ట్రాకింగ్ నంబర్‌ను నేను ఎప్పుడు పొందుతాను?

చెక్‌ల డెలివరీలను తనిఖీ చేయడానికి మేము ట్రాకింగ్ నంబర్‌లను అందించము.

నా చెక్ పాత చిరునామాకు పంపబడింది. నేను కొత్త చెక్‌ను ఎలా పొందగలను? Western Union పేమెంట్‌ల కోసం సెండర్ అడ్రస్ ఏమిటి?

పంపిన వారి చిరునామాను మీ చెల్లింపు రసీదుపై చూడవచ్చు. Western Union ద్వారా చెల్లింపులను స్వీకరించడం గురించి మరింత తెలుసుకోండి.

బ్యాంక్ ట్రాన్స్‌ఫ‌ర్‌ ద్వారా పేమెంట్‌లను అందుకోవాలంటే పరీక్ష డిపాజిట్‌తో నేను నా బ్యాంక్ ఖాతాను వెరిఫై చేయాలా?

లేదు, బ్యాంక్ బదిలీల కోసం మీ ఖాతాను ధృవీకరించాల్సిన అవసరం లేదు. బ్యాంక్ ట్రాన్స్‌ఫ‌ర్‌ ద్వారా పేమెంట్‌లను అందుకోవడం గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

నా పేమెంట్‌ల సెట్టింగ్‌లలోని అడ్రస్‌లో కాకుండా వేరే దేశంలో నా బ్యాంక్ ఉన్నట్లయితే బ్యాంక్ బదిలీ ద్వారా నేను పేమెంట్‌లను అందుకోగలనా?

లేదు. మీ బ్యాంక్ (లేదా బ్రాంచ్) తప్పనిసరిగా మీ పేమెంట్ సెట్టింగ్‌లలోని అడ్రస్ ఉన్న అదే దేశంలో ఉండాలి. ఒకవేళ అదే దేశంలో లేకుంటే, మీ కొత్త పేమెంట్ ఆప్షన్ వివరాలను ఎంటర్ చేస్తున్నప్పుడు మీ SWIFT కోడ్ అంగీకరించబడదు.

EEAలో ఉన్న వ్యాపారులు: SEPA (యూరో పేమెంట్‌ల ఏకీకృత ప్రాంతం) పేమెంట్ ఆప్షన్ మీ దేశంలో అందుబాటులో ఉంటే మీరు దానికి సైన్ అప్ చేయవచ్చు. SEPA ద్వారా పేమెంట్స్ అందుకోవడం గురించి మరింత తెలుసుకోండి.

నేను నా పేమెంట్ కరెన్సీని మార్చుకోవచ్చా?

దురదృష్టవశాత్తూ, మీ చెల్లింపు కరెన్సీని మార్చడం సాధ్యం కాదు.

నేను స్వచ్ఛంద సంస్థకు నా AdSense ఆదాయాన్ని విరాళంగా ఇవ్వవచ్చా?

ప్రస్తుతం మీ AdSense ఆదాయాలను మీ ఖాతా నుండి నేరుగా స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇచ్చే ఎంపికను మేము అందివ్వడం లేదు. అయినప్పటికీ, మీరు మీ AdSense పేమెంట్‌లను స్వీకరించిన తర్వాత మీ ఆదాయాలను మీకు ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకోవచ్చు.

ఒక స్నేహపూర్వక సూచనగా మీ తెలియజేస్తున్నాము, మీ ఆదాయాలను విరాళమివ్వాలని మీరు ఎంచుకుంటే మీ ఆదాయం మొత్తం లేదా అందులో కొంత భాగం స్వచ్ఛంద సంస్థకు వెళ్తుందనే విషయాన్ని మీ సైట్‌లో రాయవద్దని మా విజ్ఞప్తి. ఇటువంటి వాక్యాలను చేర్చడం వలన ప్రకటనల పట్ల అనవసరమైన ఆసక్తి ఏర్పడే అవకాశం ఉన్నందున, అలాగే ఆదాయాలు అంతిమంగా ఎలా ఉపయోగించబడతాయో మేము ధృవీకరించలేనందున, ఈ స్టేట్‌మెంట్‌లు AdSense ప్రోగ్రామ్ విధానాలు ద్వారా అనుమతించబడవు.

నేను నా ఇన్వాయిస్‌ను ఎక్కడికి పంపాలి?

మీరు ఐర్లాండ్‌లో VAT అవసరాల కోసం రిజిస్టర్ చేసుకున్న పబ్లిషర్ అయితే మాత్రమే, మాకు ఇన్‌వాయిస్ పంపించాల్సి ఉంటుంది. ఈ కేస్‌లో, మీరు మీ ఇన్‌వాయిస్‌ను ఈమెయిల్ ద్వారా AdSenseVAT@google.com పంపాలి. దయచేసి మాకు హార్డ్ కాపీ ఇన్‌వాయిస్ పంపవద్దు.

Google AdSense అధికారిక పేమెంట్ డాక్యుమెంట్‌లను అందిస్తుందా?

అవును, ప్రతి ఒక్క చెల్లింపునకు మేము చెల్లింపు రసీదును అందిస్తాము. AdSense నుండి పేమెంట్‌కు రుజువుగా పేమెంట్ రసీదులను మీ బ్యాంక్‌కు లేదా పన్ను అడ్మినిస్ట్రేషన్‌కు చూపించవచ్చు. పేమెంట్ రసీదును చూడటానికి, పేమెంట్‌లు, ఆపై పేమెంట్‌ల సమాచారం ఆప్షన్‌ను క్లిక్ చేయండి. మీ "లావాదేవీలు" విభాగంలో ఆటోమేటిక్ పేమెంట్ లింక్‌ను క్లిక్ చేయండి.

AdSenseతో మీ ఒప్పందాన్ని చూపించాల్సిన అవసరం ఉంటే, మీరు AdSense నిబంధనలు మరియు షరతుల ముద్రణ పత్రాలను తీసుకోవచ్చు. మీరు AdSense కోసం సైన్ అప్ చేసినప్పుడు, మీరు నియమాలు, షరతులను అంగీకరించారు, ఈ అంగీకారం మీకు (మీ బిజినెస్), AdSenseకు మధ్య ఉన్న ఇంటరాక్షన్‌లకు చట్టపరమైన ప్రాతిపదికగా ఉంటుంది.

గమనిక: మేము ముద్రించిన, సంతకం చేసిన లేదా స్టాంప్ వేసిన డాక్యుమెంట్‌లను అందించలేము.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
ఎదగగల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయండి

విలువైన AdSense గణాంకాలను మిస్ చేసుకోకండి. మీ నికర ఆదాయాన్ని పెంచడంలో సహాయపడగల పనితీరు రిపోర్ట్‌లను, వ్యక్తిగతీకరించిన చిట్కాలను, వెబినార్ ఆహ్వానాలను అందుకోవడానికి సమ్మతించండి

సమ్మతించండి

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
Google యాప్‌లు
ప్రధాన మెనూ
8909610790380872574
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
157
false
false
false
false