నోటిఫికేషన్

దయచేసి మీరు మీ AdSense పేజీకి వెళ్లాలని నిర్ధారించుకోండి, ఇందులో మీరు AdSenseతో విజయం సాధించడం కోసం మీ ఖాతా గురించి వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని కనుగొనవచ్చు.

AdSenseతో Google Analyticsను ఉపయోగించండి

AdSenseను, Analyticsను లింక్ చేయడం గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

AdSense, Analytics ఖాతాలను లింక్ చేయడం గురించి తరచుగా అడిగే కొన్ని ప్రశ్నలకు దిగువున సమాధానాలు ఇవ్వబడ్డాయి.

అన్నింటినీ విస్తరించండి  అన్నింటినీ కుదించండి నేను పలు AdSense ప్రాపర్టీలను ఒక Analytics వెబ్ ప్రాపర్టీతో ఏకీకృతం చేయవచ్చా?

అవును, మీరు బహుళ AdSense ప్రాపర్టీలను ఒక Analytics వెబ్ ప్రాపర్టీతో ఏకీకృతం చేయవచ్చు.

నేను ఒక AdSense ప్రాపర్టీని పలు Analytics వెబ్ ప్రాపర్టీలతో ఇంటిగ్రేట్ చేయవచ్చా?

అవును, మీరు ఒక AdSense ప్రాపర్టీని పలు Analytics వెబ్ ప్రాపర్టీలతో ఇంటిగ్రేట్ చేయవచ్చు.

నేను తప్పు Analytics ప్రాపర్టీని లింక్ చేశాను - నేను ఏమి చేయాలి?

మీరు తప్పు Analytics ప్రాపర్టీని లింక్ చేస్తే, మొదట AdSense నుండి మీ Analytics ప్రాపర్టీని అన్‌లింక్ చేయండి, సరైన Analytics ప్రాపర్టీని మళ్లీ లింక్ చేయడానికి లింకింగ్ ప్రాసెస్ లింక్‌ను ఫాలో అవ్వండి.

నేను కొత్త లింక్‌ను క్రియేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు నా AdSense ప్రాపర్టీ Analyticsలో కనిపించదు. నేను ఏమి చేయాలి?

మీరు కంటెంట్ కోసం AdSense ప్రాపర్టీలను Google Analytics ప్రాపర్టీలతో మాత్రమే లింక్ చేయవచ్చు. ఇతర ప్రాపర్టీ రకాలైన సెర్చ్ కోసం AdSense, వీడియో కోసం AdSense మొదలైనవి లింక్ చేయబడవు. Google Analyticsతో లింక్‌ను ఏర్పాటు చేయడానికి మీరు యాక్టివ్ కంటెంట్ కోసం AdSense ప్రాపర్టీని కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి.

నా Analytics ఖాతాకు యాక్సెస్ ఉన్న యూజర్‌లకు నా AdSense ఖాతాకు కూడా యాక్సెస్ ఉంటుందా?

లేదు, వారికి యాక్సెస్ ఉండదు. మీరు ఎవరికైనా మీ Analytics ఖాతాకు యాక్సెస్ ఇచ్చి ఉన్నా, దానికి లింక్ చేసి ఉన్న మీ AdSense ఖాతాలోకి సైన్ ఇన్ చేయడానికి వారికి అనుమతి ఉండదు.

అయితే, మీ Analytics ప్రొఫైళ్లకు లింక్ చేసిన AdSense డేటాను చూడగలిగే అవకాశం, మీ Analytics ఖాతాలోని ప్రొఫైళ్లకు యాక్సెస్ ఉన్న వారు ఎవరికైనా ఉంటుందని గుర్తుంచుకోండి. మీరు Analytics అడ్మినిస్ట్రేటర్ అయితే, Analyticsలో డేటాకు మీరు యూజర్‌ల యాక్సెస్‌ను పరిమితం చేయవచ్చు. యాక్సెస్, డేటాను పరిమితం చేసే మేనేజ్‌మెంట్ గురించి మరింత తెలుసుకోండి.

నా AdSense ఖాతాకు యాక్సెస్ ఉన్న యూజర్లు, దానికి లింక్ చేసి ఉన్న నా Analytics ఖాతా IDని చూడగలుగుతారా?

అవును. మీ AdSense ఖాతాకు యాక్సెస్ ఉన్న యూజర్లు అందరూ, దానికి లింక్ చేసి ఉన్న మీ Analytics ఖాతా IDని చూడగలుగుతారు. అయితే, Google Analytics ప్రాపర్టీలో ఆ లింక్‌ను ఏర్పాటు చేయాలంటే, యూజర్, మీ AdSense ఖాతాకు అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్‌ను, అలాగే ఎడిట్ అనుమతిని కలిగి ఉండాలి. ఒక లింక్‌ను తొలగించాలంటే, యూజర్ తప్పనిసరిగా AdSense అడ్మినిస్ట్రేటర్ అయి ఉండాలి.

నాకు ఇప్పటికే Analytics ఖాతా ఉండాలా?

అవును. Analyticsలో వివరణాత్మకంగా AdSense పనితీరు డేటాను ప్రదర్శించాలంటే మీకు Analytics ఖాతా ఉండడం అవసరం.

మీకు ఇప్పటికే ఖాతా ఉంటే, సులభంగా మీ AdSense ఖాతాకు దానిని లింక్ చేయవచ్చు. మీకు Analytics ఖాతా లేకపోతే, కొత్త ఖాతా కోసం సైన్ అప్ చేయడానికి Google Analytics సైట్‌ను సందర్శించండి.

ఇంటిగ్రేట్ చేసిన తర్వాత నా Analytics ఖాతాను AdSenseతో సంబంధం లేకుండా నేను స్వతంత్రంగా ఉపయోగించవచ్చా?

అవును, ఒకసారి మీ AdSense; Analytics ప్రాపర్టీలను లింక్ చేసిన తర్వాత, గతంలో చేసినట్లే మీ Analytics ప్రాపర్టీలను ట్రాకింగ్ చేయడానికి, ట్రాఫిక్ విశ్లేషణ కోసం ఉపయోగించడాన్ని కొనసాగించవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
ఎదగగల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయండి

విలువైన AdSense గణాంకాలను మిస్ చేసుకోకండి. మీ నికర ఆదాయాన్ని పెంచడంలో సహాయపడగల పనితీరు రిపోర్ట్‌లను, వ్యక్తిగతీకరించిన చిట్కాలను, వెబినార్ ఆహ్వానాలను అందుకోవడానికి సమ్మతించండి

సమ్మతించండి

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
Google యాప్‌లు
ప్రధాన మెనూ