నోటిఫికేషన్

దయచేసి మీరు మీ AdSense పేజీకి వెళ్లాలని నిర్ధారించుకోండి, ఇందులో మీరు AdSenseతో విజయం సాధించడం కోసం మీ ఖాతా గురించి వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని కనుగొనవచ్చు.

పాలసీలు

AdSense ప్రోగ్రామ్ పాలసీలు

పబ్లిషర్‌లు అందరూ Google పబ్లిషర్ పాలసీలను, కింది పాలసీలను తప్పకుండా అనుసరించాలి. కాబట్టి వాటిని దయచేసి జాగ్రత్తగా చదవండి. Google నుండి అనుమతి లేకుండా ఈ పాలసీలను పాటించడంలో మీరు విఫలమైతే, ఏ సమయంలో అయినా మీ సైట్‌లో యాడ్ సర్వింగ్‌ను డిజేబుల్ చేయగల మరియు/లేదా ఎప్పుడైనా మీ AdSense ఖాతాను డిజేబుల్ చేయగల హక్కు మాకు ఉంది. మీ ఖాతా డిజేబుల్ అయితే, ఆ తర్వాత AdSense ప్రోగ్రామ్‌లో పాల్గొనడానికి మీకు అర్హత ఉండదు.

మేము ఏ సమయంలో అయినా మా పాలసీలను మార్చవచ్చు, కనుక దయచేసి అప్‌డేట్‌ల కోసం ఇక్కడ తరచుగా చెక్ చేస్తూ ఉండండి. మా ఆన్‌లైన్ నియమాలు, షరతుల ప్రకారం, ఇక్కడ పోస్ట్ చేసిన కొత్త విషయాలను తెలుసుకోవడం, పాలసీలను పాటించడం మీ బాధ్యత. Google అనుమతించినప్పుడు మాత్రమే ఈ పాలసీలలో మినహాయింపులు ఉంటాయి.

Google పబ్లిషర్‌ పరిమితులు పరిధిలోని కంటెంట్ కలిగిన పేజీలలో AdSense కోడ్‌ను పబ్లిషర్‌లు ఉంచవచ్చు, అయితే పరిమితులు లేని ఇతర కంటెంట్‌తో పోలిస్తే ఈ కంటెంట్‌లో తక్కువ యాడ్‌లు వచ్చే అవకాశం ఉంది.

అన్నింటినీ విస్తరించండి అన్నింటినీ కుదించండి

చెల్లని క్లిక్‌లు, ఇంప్రెషన్‌లు

పబ్లిషర్‌లు తమ స్వంత యాడ్‌లను క్లిక్ చేయకూడదు లేదా ఇంప్రెషన్‌లు మరియు/లేదా క్లిక్‌లను కృత్రిమంగా పెంచడం కోసం మాన్యువల్ పద్ధతులతో సహా ఏ ఇతర పద్ధతులనూ ఉపయోగించకూడదు.

మరింత తెలుసుకోండి

యూజర్‌కు నిజంగా వేటిపై ఆసక్తి ఉందో వాటికే Google యాడ్‌ల క్లిక్‌లు రావాలి. మీ Google యాడ్స్‌లో క్లిక్‌లు లేదా ఇంప్రెషన్‌లను పెంచగల అన్ని కృత్రిమ పద్ధతులను పూర్తిగా నిషేధించడమైనది. రిపీట్ అయ్యే మాన్యువల్ క్లిక్‌లు లేదా ఇంప్రెషన్‌లు, క్లిక్‌ను, ఇంప్రెషన్‌ను ఆటోమేటిక్‌గా జెనరేట్‌ చేయగల టూల్స్, రోబోట్స్ లేదా మోసపూరిత సాఫ్ట్‌వేర్ వినియోగం వంటి వాటితో సహా ఇతర పద్ధతులు కూడా నిషేధించబడ్డాయి. దయచేసి గమనించండి, ఏ కారణం వల్లనైనా సరే మీరు మీ స్వంత యాడ్‌లను క్లిక్ చేయడం నిషేధించడమైనది.

క్లిక్‌లు లేదా వీక్షణలను ప్రోత్సహించడం (రివార్డ్‌లు లేని ఇన్వెంటరీ)

రివార్డ్‌లు కలిగిన ఇన్వెంటరీ కోసం తప్ప, పబ్లిషర్‌లు తమ యాడ్‌లను క్లిక్ చేయాల్సిందిగా లేదా చూడాల్సిందిగా ఇతరులను అడగకూడదు లేదా క్లిక్‌లు లేదా వీక్షణల కోసం మోసపూరితంగా అమలు చేయగల పద్ధతులను ఉపయోగించకూడదు. యాడ్‌లను చూడటం లేదా సెర్చ్‌లు చేయడం కోసం యూజర్‌లకు పారితోషికం ఆఫర్ చేయడం, అటువంటి పనులు చేసి నిధుల సేకరణ చేస్తామని థర్డ్-పార్టీలకు వాగ్దానం చేయడం లేదా ఏవైనా యాడ్‌ల పక్కన ఇమేజ్‌లను ఉంచడం వంటివి దీని కిందికి వస్తాయి.

మరింత తెలుసుకోండి

యూజర్‌లకు, అడ్వర్టయిజర్‌లకు చక్కటి అనుభవాన్ని అందించడం కోసం, AdSense ప్రోగ్రామ్‌లో పాల్గొనే పబ్లిషర్‌లు ఇవి చేయకూడదు:

  • యాడ్‌లను చూడటం లేదా సెర్చ్‌లు చేయడం కోసం యూజర్‌లకు ఆర్థిక ప్రయోజనం అందించడంతో సహా ఏదైనా లాభం చేకూరుస్తామని, లేదా అటువంటి పనులు చేసినందుకు పరిహారం ఇస్తామని థర్డ్-పార్టీలకు వాగ్దానం చేయడం.
  • "యాడ్‌లను క్లిక్ చేయండి", "మాకు సపోర్ట్ చేయండి", "ఈ లింక్‌లను సందర్శించండి" వంటి పదబంధాలను లేదా ఈ తరహా భాషను ఉపయోగించి Google యాడ్‌లను క్లిక్ చేసేలా యూజర్‌లను ప్రోత్సహించడం.
  • బాణాలు లేదా ఇతర గ్రాఫికల్ జిమ్మిక్కులను ఉపయోగించి యూజర్ దృష్టిని యాడ్‌ల వైపు మళ్లించడం.
  • నిర్దిష్ట యాడ్‌ల పక్కన తప్పుదారి పట్టించే ఇమేజ్‌లను ఉంచడం.
  • ఫ్లోటింగ్ బాక్స్ స్క్రిప్ట్‌లో యాడ్‌లను ఉంచడం.
  • యాడ్‌లకు, ఆ పేజీలోని ఇతర కంటెంట్‌కు మధ్య తేడా తెలుసుకోలేని విధంగా యాడ్‌లను ఫార్మాట్ చేయడం.
  • సైట్ కంటెంట్‌కు, యాడ్‌లకు మధ్య తేడా తెలుసుకోలేని విధంగా సైట్ కంటెంట్‌ను ఫార్మాట్ చేయడం.
  • Google యాడ్ యూనిట్‌ల ఎగువున తప్పుదారి పట్టించే లేబుళ్లను ఉంచడం. ఉదాహరణకు, యాడ్‌లకు "స్పాన్సర్ చేసిన లింక్‌లు" లేదా "అడ్వర్టయిజ్‌మెంట్‌లు" అనే లేబుల్ ఉంచవచ్చు, కానీ "ఇష్టమైన సైట్‌లు" లేదా "నేటి టాప్ ఆఫర్‌లు" వంటివి ఉపయోగించకూడదు.

ట్రాఫిక్ సోర్స్‌లు

ఏదైనా సోర్స్‌ల నుండి ట్రాఫిక్‌ను పొందే పేజీలలో Google యాడ్‌లను ఉంచకూడదు. ఉదాహరణకు, పబ్లిషర్‌లు 'క్లిక్ చేస్తే పేమెంట్' ప్రోగ్రామ్‌లలో పాల్గొనకూడదు, అవాంఛిత ఈమెయిళ్లను పంపకూడదు లేదా ఏదైనా సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లోని చర్య ఫలితంగా యాడ్‌లను ప్రదర్శించకూడదు. అలాగే, ఆన్‌లైన్ అడ్వర్టయిజింగ్‌ను ఉపయోగించే పబ్లిషర్‌లు తమ పేజీలు Google ల్యాండింగ్ పేజీ క్వాలిటీ గైడ్‌లైన్స్‌కు తప్పక కట్టుబడి ఉండేలా చూసుకోవాలి.

మరింత తెలుసుకోండి

ఇంటర్నెట్ యూజర్‌లు, Google అడ్వర్టయిజర్‌లకు సానుకూల అనుభవాన్ని అందించేలా చూడటానికి, Google యాడ్‌లను ప్రదర్శించే సైట్‌లు వీటిని చేయకూడదు:

  • క్లిక్ చేస్తే పేమెంట్, బ్రౌజింగ్ చేస్తే పేమెంట్, ఆటోసర్ఫ్, క్లిక్-ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రామ్‌ల వంటి క్లిక్‌లు లేదా ఇంప్రెషన్‌లను జెనరేట్ చేసే థర్డ్-పార్టీ సర్వీసులను ఉపయోగించడం.
  • భారీ సంఖ్యలో అవాంఛిత ఈమెయిళ్లను పంపడం ద్వారా లేదా థర్డ్-పార్టీ వెబ్‌సైట్‌లలో అవాంఛిత యాడ్‌ల ద్వారా ప్రచారం చేయించుకోవడం.
  • టూల్‌బార్‌ల లాంటి సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ల చర్యల ఫలితంగా Google యాడ్‌లు, సెర్చ్ బాక్స్‌లు లేదా సెర్చ్ ఫలితాలను డిస్‌ప్లే చేయడం.
  • పాప్-అప్‌లను యాక్టివేట్ చేసే, యూజర్‌లను అవాంఛిత వెబ్‌సైట్‌లకు మళ్లించే, బ్రౌజర్ సెట్టింగ్‌లను మార్చే లేదా సైట్ నావిగేషన్‌లో జోక్యం చేసుకునే ఏదైనా సాఫ్ట్‌వేర్ ద్వారా లోడ్ చేయడం. మీ AdSense కోడ్‌ను కలిగి ఉండే పేజీలకు ట్రాఫిక్‌ను మళ్లించడానికి ఏ యాడ్ నెట్‌వర్క్ అయినా లేదా ఏ అనుబంధిత పక్షమైనా అలాంటి పద్ధతులను అనుసరించకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది.
  • Googleకు చెందిన ల్యాండింగ్ పేజీ క్వాలిటీ గైడ్‌లైన్స్ స్ఫూర్తిని పాటించకుండా ఆన్‌లైన్ అడ్వర్టయిజింగ్ నుండి ట్రాఫిక్‌ను పొందటం. ఉదాహరణకు, మీ యాడ్ ఏమి చెబుతోంది అన్నది యూజర్‌లకు సులభంగా అర్థం కావాలి.

యాడ్ ప్రవర్తన

AdSense యాడ్‌ కోడ్‌కు మార్పులు చేయడానికి పబ్లిషర్లకు అనుమతి ఉంటుంది, కానీ ఆ మార్పులనేవి, యాడ్ పనితీరును కృత్రిమంగా పెంచేలా లేదా అడ్వర్టయిజర్లకు హాని కలగజేసేలా ఉండనంత వరకు మాత్రమే అలా చేయడానికి అనుమతి ఉంటుంది. మరింత సమాచారం కోసం దయచేసి AdSense యాడ్ కోడ్‌కు చేసిన మార్పులను చూడండి.

యాడ్ ప్లేస్‌మెంట్

పబ్లిషర్‌లు విభిన్న రకాల ప్లేస్‌మెంట్‌లు, యాడ్‌ ఫార్మాట్‌లతో ప్రయోగం చేయడాన్ని మేము ప్రోత్సహిస్తాము. అయితే, AdSense కోడ్‌ను పాప్-అప్‌లు, ఈమెయిళ్లు లేదా సాఫ్ట్‌వేర్ వంటి అనుచితమైన స్థానాల్లో ఉంచకూడదు. పబ్లిషర్‌లు, తాము వినియోగించే ప్రతి ఒక్క ప్రోడక్ట్‌కు చెందిన పాలసీని కూడా తప్పకుండా పాటించాలి. మరింత సమాచారం కోసం దయచేసి మా యాడ్ ప్లేస్‌మెంట్ పాలసీలు అనే ఆర్టికల్‌ను చూడండి.

పూర్తి యాడ్ ప్లేస్‌మెంట్ పాలసీలను చూడండి.

Google యాడ్‌లు, సెర్చ్ బాక్స్‌లు లేదా సెర్చ్ ఫలితాల విషయంలో వీటిని చేయకూడదు:

  • టూల్‌బార్‌లతో సహా ఎటువంటి సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లోనైనా కలపడం (AdMobకు వర్తించదు).
  • Google యాడ్‌లు, సెర్చ్ బాక్స్‌లు లేదా సెర్చ్ ఫలితాలను కలిగి ఉండే పేజీ పాప్-అప్ లేదా పాప్-అండర్‌లో లోడ్ చేయబడటంతో సహా పాప్-అప్‌లు లేదా పాప్-అండర్‌లలో డిస్‌ప్లే చేయడం.
  • ఈమెయిల్స్ లోపల ఉంచడం లేదా ఈమెయిల్ మెసేజ్‌లపై ప్రాథమికంగా ఫోకస్ చేసే పేజీలలో ఉంచడం.
  • ప్రైవేట్ కమ్యూనికేషన్ పేజీకి సంబంధించిన ప్రధానంగా ఫోకస్ చేసే స్క్రీన్‌లపై వాటిని ఉంచడం.
  • ఏదైనా కంటెంట్‌తో సంబంధం లేని పేజీలో ఉంచడం. (సెర్చ్ కోసం AdSenseకు లేదా సెర్చ్ కోసం మొబైల్ AdSenseకు వర్తించదు.)
  • ప్రత్యేకించి యాడ్‌లు చూపే ఉద్దేశంతో పబ్లిష్ చేసిన పేజీలలో ఉంచడం.
  • లోగోలు, వ్యాపార చిహ్నాలు లేదా ఇతర బ్రాండ్ ఫీచర్‌ల దుర్వినియోగం కారణంగా Googleతో అనుబంధించబడిందనే భావన కలిగిస్తూ యూజర్‌లను గందరగోళపరిచే కంటెంట్ లేదా URL కలిగిన పేజీలలో ఉంచడం.
  • ప్రోడక్ట్ లేదా సర్వీస్ పాలసీలను ఉల్లంఘించే పద్ధతిలో ఇతర Google ప్రోడక్టులు లేదా సర్వీసుల్లో అందించడం, ఉంచడం లేదా వాటితో పాటు అందించడం.
  • కంటెంట్‌ను ఫ్రేమ్ చేసే పేజీలలో ఉంచబడింది. కంటెంట్‌ను ఫ్రేమ్ చేయడం అంటే ఒక సైట్ లేదా యాప్, సదరు కంటెంట్ ఓనర్‌ల అనుమతి లేకుండా ఫ్రేమ్ లేదా విండోలో వేరొకరి సైట్‌ను ప్రదర్శించడం. 

సైట్ ప్రవర్తన

Google యాడ్‌లను చూపే సైట్‌లు యూజర్‌లు నావిగేట్ చేసేందుకు సులభంగా ఉండాలి. సైట్‌లు యూజర్ ప్రాధాన్యతలను మార్చకూడదు, యూజర్‌లను అవాంఛిత వెబ్‌సైట్‌లకు మళ్లించకూడదు, డౌన్‌లోడ్‌లను ప్రారంభించకూడదు, మాల్వేర్‌ను చేర్చకూడదు లేదా సైట్ నావిగేషన్‌కు ఆటంకం కలిగించే పాప్-అప్‌లు లేదా పాప్-అండర్‌లు కలిగి ఉండకూడదు.

మోసపూరిత సైట్ నావిగేషన్

క్లిక్‌లు, వీక్షణలను పొందడానికి మెనూ, నావిగేషన్ లేదా డౌన్‌లోడ్ లింక్‌లను తప్పుగా భావించే విధంగా యాడ్‌లను ఉంచే మోసపూరిత అమలు పద్ధతులను పబ్లిషర్‌లు ఉపయోగించకూడదు. ప్రతి పబ్లిషర్‌కు, తమ యాడ్స్ అమలు అనేది యాడ్ ప్లేస్‌మెంట్ పాలసీలకు కట్టుబడి ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉందని గుర్తుంచుకోండి.

ఇందులో ఇవి ఉన్నాయి, కానీ వీటికే పరిమితం కాదు:

  • స్ట్రీమింగ్ కంటెంట్ లేదా డౌన్‌లోడ్‌లకు సంబంధించిన తప్పు క్లెయిమ్‌లు
  • లేని కంటెంట్‌కు లింక్ చేయడం
  • యూజర్‌లను అసంబద్ధమైన, లేదా తప్పుదారి పట్టించే వెబ్‌పేజీలకు మళ్లించడం
  • యూజర్‌లను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేలా రూపొందించిన ఇతర రకాల నావిగేషన్
  • నావిగేషన్ కోసం అకారణంగా ఉద్దేశించిన ప్లేస్‌మెంట్‌లలో యాడ్‌లు అమలు చేయబడిన పేజీలు.

యాప్‌ల కోసం వెబ్ కంటెంట్‌ను చూపే ఫ్రేమ్‌లకు సంబంధించి టెక్నికల్ అవసరాలు

వెబ్ కంటెంట్ వీక్షణ ఫ్రేమ్ ద్వారా AdSense, Ad Manager డిస్‌ప్లే యాడ్‌‌లను పబ్లిష్ చేయడం ద్వారా మానిటైజ్ చేయాలనుకునే యాప్ డెవలపర్‌లు తప్పనిసరిగా కింది ఇంటిగ్రేషన్ ఎంపికలలో ఒక దాన్ని ఉపయోగించాలి:

  1. యాడ్‌ల కోసం వెబ్ వీక్షణ API
    Google మొబైల్ యాడ్స్ SDKతో వెబ్ వీక్షణ సందర్భాలను (Android: WebView, iOS: WKWebView) రిజిస్టర్ చేయడానికి, యాడ్‌ల కోసం వెబ్ వీక్షణ APIని ఇంటిగ్రేట్ చేయడానికి యాప్ డెవలపర్‌లను మేము ప్రోత్సహిస్తాము.

    developer documentationAndroidమరియు iOS‌కు సంబంధించిన డెవలపర్ డాక్యుమెంటేషన్‌లో మరింత తెలుసుకోండి.

    Google మొబైల్ యాడ్స్ SDK వినియోగంలో ఉన్నంత వరకు, పబ్లిషర్‌ ఇతర అన్ని సందర్భోచిత ప్రోగ్రామ్ పాలసీలు, గైడ్‌లైన్‌లకు పబ్లిషర్‌ కట్టుబడి ఉన్నంత వరకు, AdMob, Ad Manager యాప్ లోపలి యాడ్‌లు వెబ్ వీక్షణకు పక్కన ఉండే యాప్‌లో చూపబడవచ్చు.

    ఒక రిమైండర్‌గా, వెబ్ వీక్షణలోని కంటెంట్ అనేది బ్రౌజర్‌లో ఉన్నప్పుడు వర్తించే అదే కంటెంట్ పాలసీ అవసరానికి లోబడి ఉంటుంది.
  2. సపోర్ట్ చేయబడే ఇతర వీక్షణ ఫ్రేమ్‌లు:

సున్నితమైన సంఘటనలు

"సున్నితమైన సంఘటన" అనేది ఊహించలేని ఈవెంట్ లేదా డెవలప్‌మెంట్. ఇది అధిక క్వాలిటీని, సంబంధిత సమాచారం ఇంకా వాస్తవిక సత్యాన్ని అందించడంలో Google సామర్థ్యానికి గణనీయమైన ప్రమాదాన్ని కలగ జేస్తుంది, ప్రాముఖ్యత కలిగిన, మానిటైజ్ చేసిన ఫీచర్‌లలో సున్నితం కాని లేదా దాడిని జరిపే విధంగా ఉండే కంటెంట్‌ను తగ్గిస్తుంది. సున్నితమైన సంఘటన సమయంలో, ఈ ప్రమాదాలను పరిష్కరించడానికి మేము అనేక రకాల చర్యలు తీసుకోవచ్చు.

ప్రోడక్ట్ నిర్దిష్ట పాలసీలు

చివరిగా అప్‌డేట్ చేసినది: 16 ఆగస్ట్, 2024

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
వ్యక్తిగతీకరించిన చిట్కాలతో ఈరోజే మీ ఆదాయాన్ని పెంచుకోండి!

మీ ఆదాయాన్ని పెంచుకోవడంలో సహాయపడే వ్యక్తిగతీకరించిన సూచనలను చూడటానికి AdSense కోసం ఆప్టిమైజేషన్ చిట్కాల పేజీకి వెళ్లండి.

ఇప్పుడే అన్‌లాక్ చేయండి

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
Google యాప్‌లు
ప్రధాన మెనూ
13508952654061628000
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
false
true
true
true
true
true
157
false
false
false
false