నోటిఫికేషన్

దయచేసి మీరు మీ AdSense పేజీకి వెళ్లాలని నిర్ధారించుకోండి, ఇందులో మీరు AdSenseతో విజయం సాధించడం కోసం మీ ఖాతా గురించి వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని కనుగొనవచ్చు.

గోప్యత, భద్రత

యూజర్ రూపొందించిన కంటెంట్‌కు సంబంధించిన సాధారణ సవాళ్లు, వాటిని ఎదుర్కోవడం ఎలా

యూజర్ రూపొందించిన కంటెంట్‌తో పబ్లిషర్‌లు ఎదుర్కొనే కొన్ని సాధారణ సవాళ్లతో పాటు, ప్రతి సందర్భంలోనూ యూజర్ రూపొందించిన కంటెంట్‌ను మేనేజ్ చేయడంలో ఉత్తమ వ్యూహాలకు సంబంధించి కొన్ని సిఫార్సులను కూడా ఇక్కడ హైలైట్ చేస్తాము.

మీ సైట్ లేదా యాప్ కోసం ఉత్తమంగా పనిచేసే పరిష్కారాలను మీరే ఎంచుకోవచ్చు.

కామెంట్‌లు

కామెంట్‌లు, ముఖ్యంగా అజ్ఞాత కామెంట్‌లు, తరచుగా ఆటోమేటిక్ స్పామ్‌కు కారణమవుతాయి. ఈ స్పామ్, బహుశా అభ్యంతరకరంగా టెక్స్ట్‌ను, అనుమానాస్పదమైన సైట్‌లకు లింక్‌లను కలిగి ఉండవచ్చు. దాన్ని మీ సైట్ లేదా యాప్‌లో కనిపించడానికి అనుమతించినట్లయితే, వర్తించే ప్రోగ్రామ్ పాలసీలను అది తరచుగా ఉల్లంఘిస్తుంది.

అలాగే, స్పామ్‌ను చూసే ప్రామాణిక యూజర్‌లు, సైట్ లేదా యాప్ విస్మరించబడిందని లేదా దాని నిర్వహణ సరిగ్గా లేదని భావించి, దానిని ఉపయోగించడం మానేస్తారు.

చివరగా, కొన్నిసార్లు యూజర్‌లు వ్యక్తిగతంగా చెప్పని విషయాలను రాతపూర్వకంగా తెలియజేసేందుకు కామెంట్‌లు అనేవి సహాయపడతాయి. కంటెంట్ పాలసీ ద్వారా స్టాండర్డ్‌ను సెట్ చేయడం, అలాగే సాదారణంగా ఉపయోగించే అభ్యంతరకరమైన పదాలను ఫిల్టర్ చేయడం వంటి చర్యలు సహాయపడతాయి.

సిఫార్సు చేస్తున్న పరిష్కారాలు: కంటెంట్ పాలసీని పబ్లిష్ చేయండి, క్యాప్చా, ఉల్లంఘనను రిపోర్ట్ చేయండి, విశ్వసనీయ యూజర్‌లు, యూజర్-మోడరేటర్‌లు, రివ్యూ పూర్తయ్యే వరకు యాడ్‌లను అందించడాన్ని డిజేబుల్ చేయండి, కంటెంట్ ఫిల్టరింగ్, కంటెంట్ రివ్యూవర్‌లు.

ఫోరమ్‌లు

తరచుగా ఫోరమ్‌లు అనేవి కమ్యూనిటీని పెంపొందించడానికి ఒక అద్భుతమైన మార్గం. యూజర్‌లు టెక్స్ట్, ఇమేజ్‌లు, వీడియోలను ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటారు, అలాగే ఒకరి గురించి ఒకరు తెలుసుకుని స్నేహం పెంచుకుంటారు. దురదృష్టవశాత్తూ, కొన్నిసార్లు ఆటోమేటిక్ బాట్‌లు ఫోరమ్‌లలో చొరబడి, యూజర్‌లకు స్పామ్‌ను పంపుతాయి, లేదా యూజర్‌లు అభ్యంతరకరంగా ప్రవర్తించేందుకు సహాయపడతాయి.

సిఫార్సు చేస్తున్న పరిష్కారాలు: కంటెంట్ పాలసీని పబ్లిష్ చేయండి, క్యాప్చా, ఉల్లంఘనను రిపోర్ట్ చేయండి, విశ్వసనీయ యూజర్‌లు, యూజర్-మోడరేటర్‌లు, రివ్యూ పూర్తయ్యే వరకు యాడ్‌లను అందించడాన్ని డిజేబుల్ చేయండి, కంటెంట్ ఫిల్టరింగ్, కంటెంట్ రివ్యూవర్‌లు.

ఫోటోలు, మ్యూజిక్, అలాగే ఫైల్స్ షేర్ చేయడం

ఒకే రకమైన ఆసక్తులు లేదా క్రియేటివిటీ చుట్టూ ఒక కమ్యూనిటీని రూపొందించడానికి ఫోటోలు, మ్యూజిక్ లేదా ఇతర ఫైల్స్‌ను షేర్ చేసుకోవడం అనేది ఒక గొప్ప మార్గం. అయితే, ఇవే సర్వీస్‌లను దుర్వినియోగం చేసి, కాపీరైట్‌ను ఉల్లంఘించడం, వైరస్‌తో నిండిన లేదా అవాంఛిత సాఫ్ట్‌వేర్‌లను పంపడం లేదా మరే విధంగానైనా మా ప్రోగ్రామ్ పాలసీలను ఉల్లంఘించడం వంటి చర్యలకు కూడా పాల్పడవచ్చు. సైట్ లేదా యాప్ ద్వారా షేర్ చేయబడిన ఏదైనా కంటెంట్‌తో పాటు, యాడ్‌లను కూడా అందిస్తే, ఆ కంటెంట్ మా ప్రోగ్రామ్ పాలసీలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోండి.

సిఫార్సు చేస్తున్న పరిష్కారాలు: కంటెంట్ పాలసీని పబ్లిష్ చేయండి, క్యాప్చా, ఉల్లంఘనను రిపోర్ట్ చేయండి, విశ్వసనీయ యూజర్‌లు, యూజర్-మోడరేటర్‌లు, రివ్యూ పూర్తయ్యే వరకు యాడ్‌లను అందించడాన్ని డిజేబుల్ చేయండి, కంటెంట్ ఫిల్టరింగ్, కంటెంట్ రివ్యూవర్‌లు.

డేటింగ్

ఆన్‌లైన్ డేటింగ్ సైట్‌లు, యాప్‌లు తరచుగా పెద్దలు మాత్రమే చూడదగిన ఇమేజ్‌లను కలిగి ఉంటాయి, అవి ఫ్యామిలీకి సముచితం కాదు. ఈ ఇమేజ్‌లను సైట్‌లో లేదా యాప్‌లో అనుమతించినప్పటికీ, మా ప్రోగ్రామ్ పాలసీల ప్రకారం ఫ్యామిలీకి సముచితం కాని ఇమేజ్‌లు నిషేధించబడతాయి. కాబట్టి, ఫ్యామిలీకి సముచితం కాని ఫోటోలు లేదా ఫ్యామిలీకి సముచితం కాని కంటెంట్‌ను కలిగి ఉన్న డేటింగ్ ప్రొఫైల్‌ల వంటి వాటిని మానిటైజ్ చేయవద్దు.

చివరగా, ఏదైనా సైట్ లేదా యాప్ ప్రధానంగా పెద్దల డేటింగ్‌కు సంబంధించినది అయితే, మరో విధంగా చెప్పాలంటే, అది "సెక్స్ డేటింగ్" అయితే, బహుశా అది AdSense లేదా AdMobకు సముచితమైనది కాదు.

సిఫార్సు చేస్తున్న పరిష్కారాలు: కంటెంట్ పాలసీని పబ్లిష్ చేయండి, ఉల్లంఘనను రిపోర్ట్ చేయండి, రిస్క్‌ను అంచనా వేయండి, రివ్యూ పూర్తయ్యే వరకు యాడ్‌లను అందించడాన్ని డిజేబుల్ చేయండి, కంటెంట్ ఫిల్టరింగ్, కంటెంట్ రివ్యూవర్‌లు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
వ్యక్తిగతీకరించిన చిట్కాలతో ఈరోజే మీ ఆదాయాన్ని పెంచుకోండి!

మీ ఆదాయాన్ని పెంచుకోవడంలో సహాయపడే వ్యక్తిగతీకరించిన సూచనలను చూడటానికి AdSense కోసం ఆప్టిమైజేషన్ చిట్కాల పేజీకి వెళ్లండి.

ఇప్పుడే అన్‌లాక్ చేయండి

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
Google యాప్‌లు
ప్రధాన మెనూ
9574662597589548266
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
false
true
true
true
true
true
157
false
false
false
false