కంటెంట్ ఫిల్టరింగ్ అనేది అధిక పరిమాణంలో ఉన్న డేటాను ప్రాసెస్ చేయడానికి, నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఏదైనా కంటెంట్పై చర్య తీసుకోవడానికి ఏర్పాటు చేయబడిన ఒక ఆటోమేటిక్ సిస్టమ్ను సూచిస్తుంది. ప్రచురణకర్తలు తమ సైట్లో వినియోగదారులు రూపొందించిన అధిక పరిమాణంలోని కంటెంట్ను హ్యాండిల్ చేయడానికి తరచూ వచనం, మీడియా ఫిల్టరింగ్ ఎంపికలను ఉపయోగిస్తారు. పెద్దలకు మాత్రమే తగిన విషయాలు, చట్టవిరుద్ధమైన ఫైల్ షేరింగ్, వాటితో పాటుగా మారణాయుధాలు, మాదకద్రవ్యాలు, మద్యం, పొగాకు అమ్మకాల గురించి ఉన్న కంటెంట్ను ఫిల్టర్ చేయడానికి ఈ సిస్టమ్లు తరచుగా ఉపయోగించబడతాయి.
అంతర్గత పరిష్కార విధానాన్ని అభివృద్ధి చేయడం
చాలా మంది ప్రచురణకర్తలు తమ స్వంత ఫిల్టరింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడం వైపు మొగ్గు చూపుతారు. ఈ నిర్ణయం వలన కింది ప్రయోజనాలు ఉంటాయి:
- ఇతర పద్ధతులతో పోలిస్తే వచన ఆధారిత ఫిల్టరింగ్ను కోడింగ్ చేయడం సులభంగా ఉంటుంది
- వాణిజ్యపరమైన పరిష్కారాల కంటే ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది
- పబ్లిషర్ వారి సైట్, యూజర్ల గురించి ఉత్తమ అవగాహనను పొందగలరు, తద్వారా పాలసీపరమైన సమస్యలను ఇతరుల కంటే కూడా మెరుగ్గా కనుగొనగలరు
కీవర్డ్ల జాబితాను రూపొందించడం
- మీరు ఫిల్టర్ చేయాలనుకుంటున్న మీ స్వంత పదాలు, పదబంధాల లిస్ట్ను సంకలనం చేయండి. మీరు మీ స్వంత తెలివిని ఉపయోగించవచ్చు లేదా ఇతరుల సహాయం తీసుకోవచ్చు:
- మీ ఉద్యోగులను సహకారం అందించాల్సిందిగా అడగండి
- సహాయం కోసం మీ వినియోగదారులను సంప్రదించండి
- Google Adsను ఉపయోగించండి: కీవర్డ్స్ టూల్
- మరింత స్ఫూర్తి కావాలంటే, అనుచితమైన కంటెంట్ను హోస్ట్ చేస్తోన్న వెబ్సైట్ల (ఉదాహరణకు, పెద్దలకు మాత్రమే తగిన మరియు/లేదా ఫైల్ షేరింగ్ సైట్ల)ను సందర్శించి, వాటిలో ఏయే కీవర్డ్లు అధికంగా చూపబడుతున్నాయో కనుగొనండి.
- మీ స్వంత ఆటోమేటిక్ కీవర్డ్ స్క్రాపింగ్ టూల్కు కోడ్ను రూపొందించండి:
- సైట్లోని అన్ని పేజీలను పరిశీలించడానికి సెర్చ్ ఇంజిన్ డేటాను ఉపయోగించండి
- అందులోని విశిష్ట పదాలు, పద కలయికల లిస్ట్ను పొందండి
- అత్యంత సాధారణంగా ఉపయోగించే కీవర్డ్స్ను మాత్రమే తీసుకుని, మిగతావి వదిలేయండి. అలాగే సాధారణ ఆర్టికల్స్ను, ‘a’, ‘and’ లేదా ‘the’ లాంటి పదాలను తీసివేయడం మర్చిపోకండి.
- టెక్స్ట్ ఫైల్ రూపంలో అవుట్పుట్ను ఎగుమతి చేయండి
- మీ లిస్ట్ మీకు సంతృపికరంగా తయారయ్యే వరకు ఎన్ని సైట్లలో అయినా ఈ ప్రక్రియను పునరావృతం చేయండి. దీంతో మీ లిస్ట్ సిద్ధమవుతుంది.
- ముఖ్య విషయం: ఇతర సైట్లను స్క్రాప్ చేయడం, వారి కంటెంట్ను మీ స్వంతం లాగా ఉపయోగించడం అనేది Google పబ్లిషర్ పాలసీలు, Google Web Search కోసం స్పామ్ పాలసీలకు విరుద్ధమైన పద్ధతి, అలాగే చట్టవిరుద్ధం మరియు/లేదా అనైతికంగా కూడా ఉండవచ్చు.
అన్ని పదాలు సమానంగా రూపొందించబడవు. వాటిలో కొన్ని కీవర్డ్లు మిగతా వాటితో పోల్చితే చాలా అధ్వాన్నంగా ఉంటాయి. కనుక, వివిధ రకాల పదాలను వివిధ ప్రాధాన్యతలతో సెట్ చేసే విధానాన్ని మీరు పరిగణనలోకి తీసుకోవాలి.
ఉదాహరణకు, ఇంగ్లీషులోని అడల్ట్ ఫిల్టర్లు 'సెక్స్' కంటే 'పోర్నో' అనే పదాన్ని ఎక్కువగా ఉంచాలి. ‘పోర్నో’ అనేది దాదాపుగా కుటుంబ భద్రత లేని కంటెంట్కు సంబంధించినది అయితే, ‘సెక్స్’ అంటే ‘లింగం’ అని కూడా అర్ధం కావచ్చు - అది ఉపయోగించబడే సందర్భాన్ని బట్టి మారుతుంది.
అలాగే, ఒక పదం విడిగా చూస్తే సురక్షితంగా ఉంటూ, మరో పదం కలిపితే పూర్తిగా అర్థం మారిపోయే పదాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు ‘pictures’ పదం విడిగా సురక్షితంగానే కనిపిస్తుంది, కానీ ‘teen pictures’ అని కలిపి చూస్తే, అది పోర్నోగ్రఫీని సూచిస్తుంది.
పద్ధతి 1 - యూజర్ రూపొందించిన కంటెంట్ను పేజీలో ప్రదర్శించిన తర్వాత స్కాన్ చేయడం:
- కంటెంట్ను స్కాన్ చేయండి
- ఫిల్టరింగ్ ప్రమాణాలతో సరిపోలితే దానిని ఫ్లాగ్ చేయండి
- ఆ చెప్పబడిన కంటెంట్ను హోస్ట్ చేస్తోన్న పేజీలో యాడ్ ప్రదర్శనను నిలిపివేయండి
- కంటెంట్ను మాన్యువల్గా రివ్యూ చేయండి:
- ఒకవేళ సురక్షితమైతే, యాడ్ ప్రదర్శనను ప్రారంభించి, ఫిల్టర్లను సర్దుబాటు చేయండి
- ఒకవేళ సురక్షితమైనది కాకపోతే, యాడ్ కోడ్ను కలిగి ఉన్న పేజీలలో కంటెంట్ డిస్ప్లే అవ్వకుండా చూసుకోండి
పద్ధతి 2 - యూజర్ రూపొందించిన కంటెంట్ను యూజర్లకు చూపడానికి ముందే స్కాన్ చేయడం:
- కంటెంట్ను స్కాన్ చేయండి
- ఫిల్టరింగ్ ప్రమాణాలతో సరిపోలితే దానిని ఫ్లాగ్ చేయండి
- దానిని రివ్యూ కోసం క్యూకు జోడించండి లేదా ఈ దశలోనే పూర్తిగా తిరస్కరించండి
- కంటెంట్ను మాన్యువల్గా రివ్యూ చేయండి:
- ఒకవేళ సురక్షితమైతే, యాడ్లను అందించే పేజీలలో చూపబడేలా ఎంచుకుని, ఫిల్టర్లను సర్దుబాటు చేయండి
- అలా కాకపోతే, ప్రకటన ప్రదర్శనను నిలిపివేసి, దానిని చూపండి లేదా తిరస్కరించండి
వాణిజ్య పరిష్కారాల గురించి క్లుప్తంగా
కంటెంట్ ఫిల్టరింగ్ను అందించడానికి పలు రకాల సర్వీస్లు అందుబాటులో ఉన్నాయి, వాటిలో కొన్ని పెద్దలకు మాత్రమే తగిన లేదా కాపీరైట్ చేసిన కంటెంట్ను ఫిల్టర్ చేసే నిర్దిష్టమైన ప్రత్యేక ఫిల్టర్ రకాలు. ఇంటర్నెట్లో సులభంగా నిధులు సమీకరించాలని చూస్తోన్న వినియోగదారులకు, ప్రచురణకర్తలకు మధ్య ఒక వారధిని ఏర్పరచేలా క్రౌడ్సోర్సింగ్ ప్లాట్ఫామ్లు కూడా ఉన్నాయి. దీనిని సాధించడానికి ఉత్తమ మార్గం ఏంటంటే, ఎంచుకున్న అంశంపై కొంత 'మార్కెట్ పరిశోధన' నిర్వహించి, మీరు అందిస్తోన్న సేవకు సరైన పరిష్కారాన్ని నిర్ణయించుకోవడం. సాఫ్ట్వేర్ను సమీక్షిస్తోన్న సైట్ల కోసం వెతకడాన్ని ప్రయత్నించి, అవి వినియోగదారు రూపొందించిన ఏ రకమైన కంటెంట్ ఫిల్టరింగ్ సిస్టమ్లను సిఫార్సు చేస్తున్నాయో చూడండి. ఈ సమాచారం అంతా మీ చేతిలోకి వచ్చిన తర్వాత ప్రోడక్ట్ స్కోర్, దాని ప్రత్యేక ఫీచర్లు, ధర విధానం ఆధారంగా మీకు ఉత్తమ పరిష్కారం ఏదో నిర్ణయించుకోండి.