నోటిఫికేషన్

దయచేసి మీరు మీ AdSense పేజీకి వెళ్లాలని నిర్ధారించుకోండి, ఇందులో మీరు AdSenseతో విజయం సాధించడం కోసం మీ ఖాతా గురించి వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని కనుగొనవచ్చు.

పేమెంట్‌లు

పేమెంట్ పొందడానికి సంబంధించిన దశలు

మేము YouTube Studio మొబైల్ యాప్‌లోని 'సంపాదించండి' ట్యాబ్‌లో పేమెంట్ వివరాలను అందించే కొత్త బీటా వెర్షన్‌ను పరిచయం చేస్తున్నాము. ఈ బీటా వెర్షన్ అర్హత గల క్రియేటర్‌లకు వారి ఆదాయాలు పేమెంట్‌లుగా ఎలా మారుతాయో అర్థం చేసుకోవడానికి సహాయపడే సులభమైన మార్గాన్ని అందిస్తుంది. ఈ బీటా వెర్షన్‌తో, మీరు కింద పేర్కొన్న వాటిని చూడవచ్చు:
  • మీ తర్వాతి పేమెంట్‌కు సంబంధించిన ప్రోగ్రెస్
  • తేదీ, పే చేసిన మొత్తం, పేమెంట్ బ్రేక్‌డౌన్‌తో సహా మీకు సంబంధించిన గత 12 నెలల పేమెంట్ హిస్టరీ
మా ఫోరమ్ పోస్ట్ లింక్‌లో మరింత తెలుసుకోండి.

మీ AdSense పేమెంట్ ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? మీకు పేమెంట్ ఈ నెల వస్తుందా లేక వచ్చే నెల వస్తుందా అని తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారా? ఈ గైడ్ మా పేమెంట్ ప్రాసెస్‌ను వివరిస్తుంది.

AdSense ద్వారా నేను ఎప్పుడు చెల్లింపును పొందుతాను?

మీ మొదటి పేమెంట్ ఎప్పుడు పొందుతారు

మీ మొదటి AdSense పేమెంట్ కోసం మీ ఖాతాను సెట్ చేయడానికి కింది దశలను పూర్తి చేయండి.

పేమెంట్ పొందడానికి చెందిన దశల డయాగ్రామ్.

1. మీ పన్ను సమాచారాన్ని అందించండి

మీ లొకేషన్‌ను బట్టి, మేము పన్ను ఆధారిత సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం, Googleకు మీ పన్ను సమాచారాన్ని ఎలా సమర్పించాలి లింక్‌లో చూడండి.

గమనిక: YouTubeలో మానిటైజింగ్ చేస్తున్న క్రియేటర్‌లు అందరూ, ప్రపంచంలో వారు నివసిస్తున్న లొకేషన్‌తో సంబంధం లేకుండా పన్ను సమాచారాన్ని అందించాలి.

2. మీ వ్యక్తిగత సమాచారాన్ని నిర్ధారించండి

మీ పేమెంట్ పేరు, అడ్రస్ ఖచ్చితత్వాన్ని నిర్ధారించడం చాలా ముఖ్యం, ఎందుకంటే మేము మీ గుర్తింపును వెరిఫై చేయడానికి, మీకు వ్యక్తిగత గుర్తింపు నంబర్ (PIN) పంపడానికి ఈ సమాచారాన్ని ఉపయోగిస్తాము. మీరు ఏదైనా సమాచారాన్ని సరి చేయాలంటే, మీ పేమెంట్ పేరు లేదా అడ్రస్‌ను మార్చడానికి ఈ సూచనలను ఫాలో అవ్వండి.

మీ గుర్తింపును వెరిఫై చేయడం

యాడ్‌లను చూపడం, AdSense నుండి పేమెంట్స్‌ను అందుకోవడం కొనసాగించడానికి, మీరు మీ గుర్తింపును వెరిఫై చేయాలి. మీ ఖాతా సమాచారం ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి, మోసం నుండి మిమ్మల్ని రక్షించడానికి ఇది అవసరం.

మీ అడ్రస్‌ను నిర్ధారించండి

మీ ఆదాయం కనిష్ఠ వెరిఫికేషన్ పరిమితిని చేరుకున్నప్పుడు, మీ AdSense ఖాతాలోని పేమెంట్ అడ్రస్‌కు మేము PINను మెయిల్ చేస్తాము. మేము ఏవైనా పేమెంట్‌లను జారీ చేసే ముందు, మీరు ఈ PINను మీ AdSense ఖాతాలో తప్పకుండా ఎంటర్ చేయాలి. మీ PIN స్టాండర్డ్ పోస్ట్ ద్వారా పంపించబడుతుంది, అది చేరడానికి 2-3 వారాల సమయం వరకు పట్టవచ్చు. PINల గురించి మరింత సమాచారం కోసం, అడ్రస్ (PIN) వెరిఫికేషన్ ఓవర్‌వ్యూ లింక్‌లో చూడండి.

గమనిక: AdSense, YouTube కోసం మీకు ప్రత్యేక పేమెంట్స్ ఖాతాలు ఉంటే, మీ పేమెంట్స్ ఖాతాలలో ఏదైనా కనిష్ఠ వెరిఫికేషన్ పరిమితిని చేరుకున్నప్పుడు మీరు మీ అడ్రస్‌ను వెరిఫై చేస్తారు. మీరు మీ సమాచారాన్ని ఒకసారి మాత్రమే వెరిఫై చేయాల్సి ఉంటుంది.

3. మీ పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి

మీ నికర ఆదాయం పేమెంట్ ఆప్షన్ ఎంపిక కనిష్ఠ పరిమితిని చేరుకుంటే, మీరు మీ పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. మీ పేమెంట్ అడ్రస్ ఆధారంగా, ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (EFT), బ్యాంక్ ట్రాన్స్‌ఫ‌ర్, మొదలైన వాటితో సహా చాలా రకాల పేమెంట్ ఆప్షన్‌లు మీకు అందుబాటులో ఉండవచ్చు. మీ పేమెంట్ ఆప్షన్‌ను సెటప్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

గమనిక: AdSense, YouTube కోసం మీకు ప్రత్యేక పేమెంట్స్ ఖాతాలు ఉంటే, ప్రతి పేమెంట్స్ ఖాతా పరిమితికి చేరుకున్నప్పుడు మీరు పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకుంటారు.

4. కనిష్ఠ పేమెంట్ పరిమితిని చేరుకోండి

నెలాఖరులోగా మీ ప్రస్తుత బ్యాలెన్స్ కనిష్ఠ పేమెంట్ పరిమితిని చేరుకుంటే, 21 రోజుల పేమెంట్ ప్రాసెసింగ్ వ్యవధి మొదలవుతుంది. ప్రాసెస్ వ్యవధి ముగిసిన తర్వాత, మేము మీకు పేమెంట్ చేస్తాము. పేమెంట్ టైమ్‌లైన్స్ గురించి మరింత తెలుసుకోండి.

గమనిక: AdSense, YouTube కోసం మీకు ప్రత్యేక పేమెంట్‌ల ఖాతాలు ఉంటే, పేమెంట్‌ను అందుకోవడానికి ప్రతి పేమెంట్‌ల ఖాతా కనిష్ఠ పేమెంట్ పరిమితిని చేరుకోవాల్సి ఉంటుంది.
ఉదాహరణ

ఉదాహరణకు, మీ ఖాతాకు కనిష్ఠ పేమెంట్ పరిమితి $100 అనుకోండి. జనవరిలో మీ ప్రస్తుత బ్యాలెన్స్ $100కు చేరుకుని, మీరు పైన పేర్కొన్న అన్ని దశలను పూర్తి చేస్తే, అప్పుడు మేము ఫిబ్రవరి చివర్లో పేమెంట్ చేస్తాము.

మీ ప్రస్తుత బ్యాలెన్స్ కనిష్ఠ పేమెంట్ పరిమితిని చేరకపోతే, మీ తుది నికర ఆదాయం వచ్చే నెలకు బదిలీ అవుతుంది, అలాగే మీ బ్యాలెన్స్, పరిమితిని చేరే వరకూ జమ అవుతూ ఉంటుంది.

చిట్కా: AdSense పేమెంట్‌ల గురించి మీకు మరిన్ని సందేహాలు ఉంటే, పేమెంట్‌లకు సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలు లింక్‌లో చూడండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
మీ AdSense పేజీ

AdSense పేజీ పరిచయం: ఇది ఒక కొత్త రిసోర్స్, ఇక్కడ మీరు AdSenseతో విజయం సాధించడానికి సహాయపడే, మీ ఖాతాకు సంబంధించిన వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని, కొత్త అవకాశాలను కనుగొనవచ్చు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
Google యాప్‌లు
ప్రధాన మెనూ