నోటిఫికేషన్

దయచేసి మీరు మీ AdSense పేజీకి వెళ్లాలని నిర్ధారించుకోండి, ఇందులో మీరు AdSenseతో విజయం సాధించడం కోసం మీ ఖాతా గురించి వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని కనుగొనవచ్చు.

పాలసీలు

Google పబ్లిషర్ పాలసీలు, Google పబ్లిషర్ పరిమితులు గురించి అర్థం చేసుకోండి

పబ్లిషర్‌లు తమ కంటెంట్‌ను మానిటైజ్ చేయడానికి, అలాగే కస్టమర్‌లు కాదగిన వారికి ఉపయోగకరమైన, సందర్భోచితమైన ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లతో అడ్వర్టయిజర్‌లు చేరువ కావడానికి, ఉచితమైన ఇంటర్నెట్‌ను ఎనేబుల్ చేయడంలో Google సహాయపడుతుంది. యాడ్స్ ఎకో సిస్టమ్ పట్ల నమ్మకం కొనసాగించడానికి, మేము వేటిని మానిటైజ్ చేయాలనే దానిపై పరిమితులను విధించాల్సిన అవసరం ఉంటుంది.

పబ్లిషర్‌లందరు మా పాలసీలను అవలంబించాల్సిన అవసరం ఉంది, కనుక దయచేసి వాటిని తప్పక చదవండి. ఈ విధానాలను పాటించడంలో మీరు విఫలమైతే, ఏ సమయంలో అయినా మీ సైట్‌లో యాడ్‌లను చూపడాన్ని డిజేబుల్ చేయగల లేదా మీ ఖాతాను నిలిపివేయగల హక్కు మాకు ఉంది. మీ ఖాతా డిజేబుల్ చేయబడినట్లయితే, ఆ తర్వాత మీరు AdSense ప్రోగ్రామ్‌లో పాల్గొనలేరు.

మా ఆన్‌లైన్ నియమాలు, షరతుల ప్రకారం, ఇక్కడ పోస్ట్ చేసిన తాజా విషయాలను తెలుసుకోవడం మరియు పాలసీలను అవలంబించడం మీ బాధ్యత.

Google Publisher Policies and Restrictions Explained

ఈ ఆర్టికల్‌లో:

Google పబ్లిషర్ పాలసీలు అంటే ఏమిటి?

మీరు మీ కంటెంట్‌ను Google యాడ్ కోడ్‌తో మానిటైజ్ చేస్తుంటే, మీరు Google పబ్లిషర్ పాలసీలును అవలంబించవలసిన అవసరం ఉంది. కామెంట్ విభాగం లాంటి యూజర్ రూపొందించిన కంటెంట్, ఇతర అడ్వర్టయిజ్‌మెంట్‌లు, అలాగే ఇతర సైట్‌లకు లేదా యాప్‌లకు లింక్‌లతో సహా మీ పేజీలో లేదా యాప్‌లో ఉండేది ఏదయినా సరే మా ఉద్దేశ్యం ప్రకారం కంటెంట్‌గా పరిగిణించబడుతుంది. పాలసీని ఉల్లంఘించే కంటెంట్‌ను మానిటైజ్ చేయడానికి ప్రయత్నించడం, అలాగే ఈ పాలసీలను అవలంబించడంలో విఫలమతే, మీ కంటెంట్‌లో యాడ్స్ కనిపించకుండా Google బ్లాక్ చేయవచ్చు లేదా మీ ఖాతా సస్పెండ్ కావచ్చు లేదా శాశ్వతంగా మూసివేతకు గురి కావచ్చు.

ఏవైనా ఇతర పాలసీలు మీ Google పబ్లిషర్ ప్రోడక్టుల వినియోగాన్ని పర్యవేక్షిస్తుంటే వాటితో పాటుగా ఈ పరిమితులు కూడా వర్తిస్తాయి.

Google పబ్లిషర్ పరిమితులు అంటే ఏమిటి?

నిర్దిష్ట అడ్వర్టయిజ్‌మెంట్ సోర్స్‌ల నుండి పరిమితం చేయబడిన కంటెంట్‌ను స్వీకరించడాన్ని Google పబ్లిషర్ పరిమితులు గుర్తిస్తాయి. మీ పేజీ లేదా యాప్‌లో ఉండే విషయాలు, దానితో పాటుగా ఇతర అడ్వర్టయిజ్‌మెంట్‌లు, ఇతర సైట్‌లు లేదా యాప్‌ల లింక్‌లు ఏవైనా కూడా మా ఉద్దేశ్యం ప్రకారం కంటెంట్‌గానే పరిగణించబడతాయి.

Google ప్రచురణకర్త పరిమితుల కిందకు వచ్చే కంటెంట్‌ను మానిటైజ్ చేయడం అనేది పాలసీ ఉల్లంఘన కాదు, అందుకు బదులుగా, మేము ప్రతి అడ్వర్టయిజింగ్ ప్రోడక్ట్ లేదా అడ్వర్టయిజర్ల వ్యక్తిగత ప్రాధాన్యతల ప్రకారం, సముచితమైన రీతిలో ఆ కంటెంట్‌కు అడ్వర్టయింజింగ్‌ను పరిమితం చేస్తాము. అంటే, కొన్ని సార్లు మీ ఇన్వెంటరీపై ఏ అడ్వర్టయిజింగ్ సోర్స్‌లు బిడ్డింగ్ చేయవు మరియు ఈ పరిమితం చేయబడిన కంటెంట్‌పై యాడ్‌లు కనిపించవు.

Google Ads, ప్రామాణిక కొనుగోలుదారులు, DV360, రిజర్వేషన్స్, మరియు ఇతరులతో కలిపి పలు సోర్స్‌ల నుండి మాకు కొనుగోలుదారులు ఉన్నారు. కాబట్టి, ఈ ఇతర కొన్ని సోర్స్‌ల నుండి మీరు పరిమిత సంఖ్యలో యాడ్స్ స్వీకరించవచ్చు, కానీ గమనించండి, పరిమితులతో లేబుల్ చేయబడిన కంటెంట్‌లో Google Ads (గతంలో AdWords) అందించబడవు.

కాబట్టి మీరు Google ప్రచురణకర్త పరిమితులు వర్తించే కంటెంట్‌ను మానిటైజ్ చేయడాన్ని ఎంచుకోగలిగినప్పటికీ, అలా చేయడం వల్ల, ఇతర, పరిమితం చేయని కంటెంట్ కంటే, ఈ పరిమితం చేయబడిన కంటెంట్‌కు తక్కువ వ్యాపార ప్రకటనలను అందుకునే అవకాశం ఉంది అని దాని అర్థం.

మీ Google ప్రచురణకర్త ప్రోడక్ట్‌ల వినియోగాన్ని పర్యవేక్షించే ఏవైనా ఇతర విధానాలతో పాటుగా ఈ పరిమితులు వర్తిస్తాయి.

Google ప్రచురణకర్త పాలసీలు, Google ప్రచురణకర్త పరిమితుల మధ్య తేడా ఏమిటి?

ఏవిధమైన మా పబ్లిషర్ ప్రోడక్ట్‌ల ద్వారా అయినా మేము మానిటైజ్ చేయని కంటెంట్ రకాల గురించి Google ప్రచురణకర్త పాలసీలు వివరిస్తాయి. ఇతరమైన వాటిలో, చట్ట వ్యతిరేక కంటెంట్, హానికరమైన లేదా గౌరవానికి భంగం కలిగించే కంటెంట్ మరియు లైంగికంగా అందరికీ తగని కంటెంట్ చేర్చబడ్డాయి. యాడ్‌లను చూపడానికి ఈ కంటెంట్ ఎప్పటికీ అనుమతించబడదు.

Google ప్రచురణకర్త పరిమితులు, అందుకు విరుద్ధంగా, పొగాకు లేదా మత్తు పదార్థాల్లాంటి కంటెంట్ రకాలు పాలసీని ఖచ్చితంగా ఉల్లంఘించక పోవచ్చు, కానీ అవి అందరు అడ్వర్టయిజర్‌లకు ఆకర్షణీయం కావని వివరిస్తున్నాయి. పబ్లిషర్‌లు పాలసీ ఉల్లంఘనలను స్వీకరించరు కానీ దానికి బదులుగా ఆ కంటెంట్ ఒక ఇన్వెంటరీ పరిమితితో లేబుల్ చేయబడుతుంది, ఆపై దానికి పబ్లిషర్‌ల డిమాండ్ నిర్ణయానుసారం తక్కువ వ్యాపార ప్రకటనలు రావచ్చు లేదా అసలు రాకపోవచ్చు అని దీని అర్థం.

యాడ్‌ప్రదర్శనను ప్రభావితం చేయగల సమస్యలను నేను ఎక్కడ చూడవచ్చు?

మీ సైట్‌లలో ప్రస్తుతం విధించబడిన ఆంక్షలన్నీ పాలసీ కేంద్రంలో ప్రదర్శించబడతాయి. ఆంక్షల వల్ల అన్ని యాడ్‌లు బ్లాక్ చేయబడతాయి (ఉదాహరణకు, "యాడ్‌ల ప్రదర్శన డిజేబుల్ చేయడం") లేదా మీ ఇన్వెంటరీపై బిడ్ వేయగల అడ్వర్టైజర్‌లు పరిమితం చేయబడతారు (ఉదాహరణకు, "పరిమితం చేయబడిన డిమాండ్").

మీ కంటెంట్‌కు సంబంధించిన వివిధ సమస్యల కారణంగా మీరు ఆంక్షలను ఎదుర్కోవాల్సి రావచ్చు:

 • Google ప్రచురణకర్త పాలసీ తప్పక పరిష్కరించబడాలి. పాలసీ ఉల్లంఘనలు అనేవి, యాడ్ ప్రదర్శనను డిజేబుల్ చేయడం" లేదా "పరిమితం చేయబడిన డిమాండ్"తో అమలు చేయబడతాయి.
 • Google ప్రచురణకర్త పరిమితులు అనేవి పాలసీ ఉల్లంఘనలు కావు కాబట్టి మీరు మీ కంటెంట్‌ను గానీ, యాడ్‌ల అభ్యర్థనలను గానీ మార్చాల్సిన అవసరం లేదు. అయితే, ప్రచురణకర్త పరిమితులు ఉన్న కంటెంట్ "పరిమితం చేయబడిన డిమాండ్" కిందకు వస్తుంది.
చిట్కా: అమల్లో ఉన్న ఆంక్షకు ఎలా స్పందించాలి అన్నది తెలుసుకోవడానికి, మీ పాలసీ కేంద్రంలో ఉన్న "తప్పనిసరిగా పరిష్కరించాల్సినవి" అనే విభాగాన్ని రివ్యూ చేయండి. ఒకవేళ పాలసీ ఉల్లంఘన కారణంగా ఆంక్ష విధించబడినట్లయితే, ఆ విభాగంలో "అవును" అని ఉంటుంది. ప్రచురణకర్త పరిమితుల వల్ల అయితే, "కాదు" అని ఉంటుంది.

Google ప్రచురణకర్త పాలసీ ఉల్లంఘనను పరిష్కరించడం ఎలా?

 1. మీ సైట్‌లు, సైట్ విభాగాలు, పేజీలు లేదా యప్‌లలో యాడ్‌లు కనిపించకుండా పరిమితం చేస్తున్న అంశాల గురించి వివరణాత్మక సమాచారాన్ని ఇచ్చే పాలసీ కేంద్రాన్ని చూడండి. ఇది యాడ్‌లు కనిపించడానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలను అందిస్తుంది, మీరు మార్పులు చేసిన తర్వాత ఆ మార్పును రివ్యూ చేయమని అభ్యర్థిస్తుంది. పాలసీ కేంద్రంలోని ప్రధాన పేజీ మీ ప్రభావిత సైట్‌ల గురించి ఓవర్‌వ్యూ అందిస్తుంది.
 2. "తప్పక పరిష్కరించాల్సినవి" విభాగం "అవును" అని చెప్తే, మీ సైట్‌లు, సైట్ విభాగాలు లేదా పేజీలు ప్రస్తుతం ప్రోగ్రామ్ పాలసీలను పాటించడం లేదు. ఈ సందర్భంలో Google ప్రచురణకర్త పాలసీలు, దీని ఫలితంగా, ఒక ఆంక్షను విధించడం జరిగింది. ఒక పేజీపై చర్య తీసుకున్నారంటే ఆ పేజీ పాలసీని ఉల్లంఘిస్తోందని అర్థం. సైట్ లేదా సైట్ విభాగంపై చర్య తీసుకున్నారంటే, సైట్ లేదా సైట్ విభాగంలోని అనేక పేజీలు పాలసీని ఉల్లంఘిస్తున్నాయని అర్థం. ఇలా జరిగినప్పుడు మీ సైట్ లేదా సైట్ విభాగాన్ని పూర్తిగా తనిఖీ చేసి, మా పాలసీలను పాటించేలా వాటికి మార్పులు చేయాలి.
 3. మీ సైట్, సైట్ విభాగం లేదా పేజీలలో పాలసీ ఉల్లంఘనలను పరిష్కరించిన తర్వాత, మీరు రివ్యూ కోసం అభ్యర్థనను పంపవచ్చు.

  ప్రత్యామ్నాయంగా, పాలసీని ఉల్లంఘిస్తున్న సైట్‌లు, సైట్ విభాగాలు లేదా పేజీలలో యాడ్‌లను అందించడం ఆపివేయాలనుకుంటే, మీరు ఆ సైట్‌లు, సైట్ విభాగాలు లేదా పేజీల నుండి AdSense యాడ్ కోడ్‌ను తీసివేయవచ్చు. ఆపై పాలసీ ఉల్లంఘనలు 7-10 రోజులలో పాలసీ కేంద్రం నుండి ఆటోమేటిక్‌గా తీసివేయబడతాయి.

Google ప్రచురణకర్త పరిమితులను పరిష్కరించడమెలా?

 1. మీ సైట్‌లు, సైట్ విభాగాలు లేదా పేజీలలో యాడ్‌లు కనిపించకుండా నియంత్రిస్తోన్న అంశాల గురించి వివరణాత్మక సమాచారం కోసం, అలాగే యాడ్‌లను కనిపించేలా చేయడానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సూచనలు పొందడం కోసం, మీరు మార్పులు చేసిన తర్వాత రివ్యూల కోసం అభ్యర్థించడానికి పాలసీ కేంద్రాన్ని చూడండి.
 2. ఒకవేళ "తప్పనిసరిగా పరిష్కరించాల్సినవి" అనే విభాగంలో "కాదు" అని ఉంటే, మీ సైట్‌లో Google ప్రచురణకర్త పరిమితుల కిందకు వచ్చే కంటెంట్ ఉందని అర్థం. మీరు ఈ విధమైన కంటెంట్‌ను మానిటైజ్ చేయగలిగినప్పటికీ, అన్ని యాడ్ సోర్స్‌లు దీనిపై బిడ్ వేయలేవు. ఫలితంగా మీరు తక్కువ సంఖ్యలో యాడ్‌లను అందుకునే అవకాశం ఉంటుంది.
 3. మీ సైట్, సైట్ విభాగం లేదా పేజీలలోని ప్రచురణకర్త పరిమితులలో దేనినైనా మీరు పరిష్కరిస్తే, రివ్యూ కోసం అభ్యర్థించవచ్చు. ప్రత్యామ్నాయంగా మీరు ఆ పేజీలలో యాడ్‌ల ప్రదర్శనను ఆపివేయాలనుకుంటే, మీ పేజీల నుండి AdSense యాడ్ కోడ్‌ను తీసివేయవచ్చు. ఆపై 7-10 రోజులలో పాలసీ కేంద్రం నుండి అవి ఆటోమేటిక్‌గా తీసివేయబడతాయి.

Google ప్రచురణకర్త పాలసీలు, Google ప్రచురణకర్త పరిమితుల FAQలు

Google ప్రచురణకర్త పాలసీలు మరియు Google ప్రచురణకర్త పరిమితులు గురించి తరచుగా అడిగే కొన్ని ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలున్నాయి:

నేను పాలసీ పరిమితులను అందుకున్నాను, అది "తప్పనిసరిగా పరిష్కరించాల్సిన" సమస్య కాదని పాలసీ కేంద్రం చెబుతోంది, దాని అర్థం ఏమిటి?

ఒకవేళ "తప్పనిసరిగా పరిష్కరించాల్సినవి" అనే విభాగంలో "కాదు" అని ఉంటే, మీ సైట్‌లో Google పబ్లిషర్ పరిమితుల కిందకు వచ్చే కంటెంట్ ఉందని అర్థం. Google Ads, ప్రామాణిక కొనుగోలుదారులు, DV360, రిజర్వేషన్స్, మరియు ఇతరులతో కలిపి పలు సోర్స్‌ల నుండి మాకు కొనుగోలుదారులు ఉన్నారు. కాబట్టి, ఈ రకమైన కంటెంట్‌ను మానిటైజ్ చేసేందుకు ఎంపిక చేసుకోగలిగినా, ఈ ఇతర సోర్స్‌ల నుండి మీకు పరిమిత సంఖ్యలో యాడ్‌లు రావచ్చు, కానీ Google Ads (గతంలో AdWords) యొక్క యాడ్‌లు మాత్రం ఈ పరిమితులతో లేబుల్ చేయబడిన కంటెంట్‌లో చూపబడవు అని గమనించండి.

పరిమితం చేయబడిన పేజీలో (అంటే, Google పబ్లిషర్ పరిమితుల కిందకు వచ్చేవి) నేను యాడ్‌లను అందించడం కొనసాగించాలనుకుంటే, నా ఖాతా సస్పెండ్ కాగల లేదా శాశ్వతంగా తీసివేతకు గురికాగల ప్రమాదంలో పడుతుందా?

Google పబ్లిషర్ పరిమితుల కిందకు వచ్చే కంటెంట్‌ను మానిటైజ్ చేయడం అనేది పాలసీ ఉల్లంఘన కాదు, దానికి బదులుగా మేము పైన వివరించినట్లుగా యాడ్‌లను చూపడాన్ని పరిమితం చేస్తాము. Google ప్రచురణకర్త పరిమితులు కవర్ చేసే కంటెంట్‌ను మీరు మానిటైజ్ చేయాలని ఎంచుకోవచ్చు, అయితే, అలా చేయడం వల్ల పూర్తిగా నిబంధనలను పాటించే ఇతర కంటెంట్ కంటే, పరిమితం చేయబడిన కంటెంట్‌పై, తక్కువ యాడ్‌ల ఆదాయాన్ని మీరు అందుకుంటారని గమనించండి.

Google ప్రచురణకర్త పరిమితులను ఉల్లంఘించే కంటెంట్ గల నా పేజీలో అడ్వర్టయిజర్‌లు ఎందుకు యాడ్‌లను అందించరు?

Google ప్రచురణకర్త పరిమితుల కిందకు వచ్చే లిస్ట్‌లో చేర్చిన కంటెంట్ రకాలు అడ్వర్టయిజర్‌లకు ఆకర్షణీయం కాకపోవచ్చని లేదా వారి బ్రాండ్‌కు సరిపోయే అనుబంధాన్ని కలిగి ఉండకపోవచ్చని మేము అర్థం చేసుకున్నాము, అందుకనే నిర్ణయాన్ని వారికే వదిలేశాము. ఎంపిక చేసుకునేందుకు మా అడ్వర్టయిజర్‌లకు పలు రకాల కేటగిరీలున్నాయి, వారిలో అందరూ సున్నితమైన కేటగిరీలను ఎంచుకోరు. కాబట్టి, అంతిమంగా మీ ఆదాయం ఈ విధంగా ప్రభావితమవుతుంది - ఏదైనా కంటెంట్‌కు 'పరిమితం చేయబడినది' అని లేబుల్ పడితే, దానికి మానిటైజేషన్ పరిమితంగా ఉండవచ్చు, లేదా అసలు ఉండకపోవచ్చు. ఏదేమైనా ఇది పాలసీ ఉల్లంఘనగా పరిగణించబడదు.

పేజీ స్థాయి ఆంక్షను అందుకున్న తర్వాత నేను నా కంటెంట్ తీసివేసి, రివ్యూను అభ్యర్థించాను. ఇప్పుడు నేను ఒక కొత్త "కంటెంట్ లేదు" పాలసీ ఉల్లంఘనను అందుకున్నాను. ఉల్లంఘనలను పరిష్కరించడానికి సిఫార్సు చేసిన చర్యలు ఏమిటి?

మేము ఏమి చేసినా అది మా పబ్లిషర్‌లు, మా యూజర్‌లు మా అడ్వర్టైజర్‌లను కాపాడేందుకు రూపొందించినదే. పేజీలలో పాలసీని పాటించని కంటెంట్‌ను తీసివేసేందుకు ఎంచుకునే ప్రాంతంలోనే, ఆ పేజీల నుండి సంబంధించిన ఏ విధమైన యాడ్ కోడ్‌నైనా కూడా తీసివేయాలి, తద్వారా ఖాళీ ప్రదేశం పక్కన యాడ్‌లు అందించబడవు.

మీ సైట్ పేజీలలో ఏమైనా పాలసీల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయనే దానిని నిర్ణయించడమనేది మీ వైపు జరిగే ప్రయత్నమే కావచ్చు అని మేము అర్థం చేసుకున్నాము, కానీ మా అడ్వర్టైజర్‌లు, యూజర్‌లకు కూడా మేము బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ ఎకోసిస్టమ్‌లో వారిలో నమ్మకాన్ని నిలిపి ఉంచాలంటే, మేము మా పాలసీలను తప్పక కొనసాగించాలి.

మరింత స్పష్టంగా చెప్పాలంటే, మేము వారి సైట్‌లలో ఏ కంటెంట్‌ను అయినా తీసివేత ద్వారా పబ్లిషర్‌ల కంటెంట్‌ను సెన్సార్ చేయడం లేదు పాలసీని పాటించని పేజీల నుండి మా యాడ్ ‌కోడ్‌ను తీసివేయాలని మేము కేవలం అభ్యర్థిస్తాం.

నాకు పరిష్కరించడం ఇష్టం లేని పరిమితులను దాచడం/తీసివేయడం చేయవచ్చా? నిర్దిష్ట పేజీలలో పాత పరిమితులు, లేదా కొత్త పరిమితులను నేను చూస్తూనే ఉండాలనుకోవడం లేదు.

పాలసీ ఉల్లంఘనలను, ప్రచురణకర్త పరిమితులను కనుగొని, నిర్వహించడంలో మీకు సహాయపడేందుకు పాలసీ కేంద్రంలోని ఫిల్టర్, డౌన్‌లోడ్ ఎంపికలను మీరు ఉపయోగించవచ్చు:

 • నిర్దిష్ట సైట్‌లు, సైట్ స్టేటస్ లేదా నిర్దిష్ట ఆంక్షల తేదీలను మాత్రమే చూడటం కోసం ఫిల్టర్ ను క్లిక్ చేయండి.
 • అన్ని సైట్‌లు లేదా వేర్వేరు సైట్‌లలో ఉల్లంఘనలను కలిగిన అన్ని పేజీలు లేదా విభాగాల CSV ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయడం కోసం Downloadను క్లిక్ చేయండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
మీ AdSense పేజీ

AdSense పేజీ పరిచయం: ఇది ఒక కొత్త రిసోర్స్, ఇక్కడ మీరు AdSenseతో విజయం సాధించడానికి సహాయపడే, మీ ఖాతాకు సంబంధించిన వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని, కొత్త అవకాశాలను కనుగొనవచ్చు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
Google యాప్‌లు
ప్రధాన మెనూ