మీ Google ఖాతాలో సేవ్ చేయబడిన ఫోటోలు, వీడియోలు, ఆల్బమ్లు, ఇంకా వివరణల కాపీని మీరు వేరే సర్వీస్కు బదిలీ చేయవచ్చు.
ముఖ్య గమనిక: మీరు ఫోటోలు, వీడియోలను బదిలీ చేసిన తర్వాత మీ Google ఖాతా నుండి అవి తొలగించబడవు. మీ ఫోటోలు, వీడియోలను తొలగించడం, స్టోరేజ్ను క్లీనప్ చేయడం, మీ ఖాతా నుండి Google సర్వీస్ను తొలగించడం, లేదా మీ Google ఖాతాను తొలగించడం ఎలాగో తెలుసుకోండి.
సపోర్ట్ ఉన్న ఫోటో, వీడియో ఫైల్ రకాలు
మీరు బదిలీ చేయగల ఫైల్ రకాలలో ఇవి ఉంటాయి:
- ఫోటోలు: .jpg, .png, .gif, .webp, .avif, ఇంకా పలు ప్రాసెస్ చేయని ఫైల్స్.
- వీడియోలు: .mp4, .mov, .m4v, .mpg, mkv, .mod, .mmv, avi, .divx, .tod, .wmv, .asf, .3gp, .3g2, .m2t, .m2ts, ఇంకా .mts ఫైల్స్.
సపోర్ట్ లేని ఫోటోలు, వీడియోలను మీరు బదిలీ చేయలేరు.
దశ 1: Google Photosను ఎంచుకోండి
Google టేక్అవుట్ Photos వీక్షణను బదిలీ చేయండికి వెళ్ళండి లేదా కింద పేర్కొన్న దశలను ఫాలో అవ్వండి.
- మీ Google ఖాతా డ్యాష్బోర్డ్కు వెళ్ళండి.
- “ఇటీవల ఉపయోగించిన Google సర్వీస్లు”, లేదా “ఇతర Google సర్వీస్లు” కింద, Photosకు స్క్రోల్ చేయండి
డేటాను బదిలీ చేయండి ఆప్షన్ను ట్యాప్ చేయండి.
- మీరు కాపీ చేయాలనుకుంటున్న డేటాను ఎంచుకోండి.
- మీరు అన్ని ఫోటో ఆల్బమ్లను బదిలీ చేయకూడదనుకుంటే, అన్ని ఫోటో ఆల్బమ్లు చేర్చబడ్డాయి ఆప్షన్ను ట్యాప్ చేయండి
మీరు బదిలీ చేయకూడదనుకునే ఆల్బమ్ల ఎంపికను తొలగించండి
సరే ఆప్షన్ను ట్యాప్ చేయండి.
- మీరు అన్ని ఫోటో ఆల్బమ్లను బదిలీ చేయకూడదనుకుంటే, అన్ని ఫోటో ఆల్బమ్లు చేర్చబడ్డాయి ఆప్షన్ను ట్యాప్ చేయండి
- కొనసాగించండి ఆప్షన్ను ట్యాప్ చేయండి.
- మీ Google ఖాతాకు మీరు సైన్ ఇన్ చేసి, Takeoutను ప్రామాణీకరించాలి.
2వ దశ: మీ ఫోటోలు, వీడియోల కాపీని ఎక్కడికి బదిలీ చేయాలో ఎంచుకోండి
- "దీనికి తరలించండి" కింద, కింది వైపు బాణం గుర్తు
ను ఎంచుకోండి.
- మీ ఫోటోలు, వీడియోల కాపీని మీరు ఎక్కడికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ గమ్యస్థానాన్ని ఎంచుకోండి
కొనసాగించండి ఆప్షన్ను ఎంచుకోండి. మీ ఖాతాను లింక్ చేయడానికి, అలాగే మీ ఫోటోలు ఇంకా వీడియోలను బదిలీ చేయడానికి సంబంధించిన దశలను ఫాలో అవ్వండి. మీరు గమ్యస్థాన సర్వీస్తో కూడిన మీ ఖాతాకు సైన్ ఇన్ చేసి, Google Takeoutను ప్రామాణీకరించాలి.
- మీ ఫోటోలు, వీడియోల కాపీని మీరు ఎక్కడికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ గమ్యస్థానాన్ని ఎంచుకోండి
-
బదిలీని ప్రారంభించడానికి, అంగీకరించి, కొనసాగించండి ఆప్షన్ను ట్యాప్ చేయండి.
మీ ఫోటోలు, వీడియోలు కాపీ చేయబడిన తర్వాత:
- కొత్త సర్వీస్లో ఫోటోలు, వీడియోలను లొకేట్ చేయడానికి మీకు లింక్తో కూడిన ఈమెయిల్ వస్తుంది. కొన్ని సర్వీస్లు విభిన్న లొకేషన్లలో ఫోటోలు, వీడియోలను స్టోర్ చేయవచ్చు.
- మీ ఫోటోలు, వీడియోలను మీరు బదిలీ చేసిన సర్వీస్కు ఇకపై మీ Google ఖాతా యాక్సెస్ను కలిగి ఉండదు, కానీ అది ఇప్పటికీ సర్వీస్కు చెందిన సెట్టింగ్లలో కనిపించవచ్చు.
చిట్కాలు:
- మీరు బదిలీ చేసిన ఫోటోలు, వీడియోల విజిబిలిటీ, గమ్యస్థాన సర్వీస్లో మీ షేరింగ్ అనుమతులపై ఆధారపడి ఉంటుంది.
- మీరు మళ్లీ మీ ఫోటోలు, వీడియోలను బదిలీ చేస్తే, కొత్త కాపీ క్రియేట్ చేయబడవచ్చు, ఇంకా అది మీ ఒరిజినల్ బదిలీ నుండి డూప్లికేట్లను కలిగి ఉండవచ్చు.
-
మీరు Google Takeout నుండి రిక్వెస్ట్ను రద్దు చేస్తే, కొత్త బదిలీ రిక్వెస్ట్ను ఉంచడంలో ఆలస్యం కావచ్చు.
కొన్ని ఫోటోలు, వీడియోలు ఎందుకు బదిలీ అవ్వడం లేదో తెలుసుకోండి
మీ ఫోటోలు, వీడియోలన్నీ బదిలీ అవ్వకపోతే, దానికి కారణం ఇది కావచ్చు:
- కొన్ని ఫోటోలు, వీడియోలలో సపోర్ట్ లేని ఫైల్ రకాలు ఉండటం.
- మీరు ఫోటోలు, వీడియోలను బదిలీ చేసిన ఖాతాలో స్పేస్ నిండిపోవడం.
- చిట్కా: బదిలీ చేయబడిన ఫోటోలు, వీడియోలకు Photosలో చూపబడిన దాని కంటే ఎక్కువ స్పేస్ అవసరం ఉండవచ్చు.
- బదిలీ పూర్తి కాకముందే దాన్ని రద్దు చేయబడటం.
మీ అన్ని ఫోటో ఐటెమ్లు, డేటా అంతా బదిలీ చేయబడవు, అందులో ఇవి ఉంటాయి:
- డిస్ప్లే చేయడానికి సాధ్యపడని విఫలమైన వీడియోలు, నాసిరకమైన ఫోటోలు
- మీ Android పరికరంలో మీ ఫోటోలు తప్పుగా కనిపిస్తే, మీరు నాసిరకమైన ఫోటోలను బదిలీ చేయడానికి ముందే వాటిని రికవర్ చేయడానికి ట్రై చేయండి. నాసిరకమైన ఫోటోల సమస్యను ఎలా పరిష్కరించాలో తెలుసుకోండి.
- లాక్ చేసిన ఫోల్డర్లో ఉన్న కంటెంట్
- మీరు లాక్ చేసిన ఫోల్డర్లో ఉన్న కంటెంట్ను బదిలీ చేయాలనుకుంటే, ఐటెమ్లను బదిలీ చేయడానికి ముందే వాటిని బయటకు తరలించండి. లాక్ చేసిన ఫోల్డర్ గురించి మరింత తెలుసుకోండి.
- సేవ్ చేయని జ్ఞాపకాలు, క్రియేషన్లు
- మీరు జ్ఞాపకాలను, క్రియేషన్లను బదిలీ చేయాలనుకుంటే, ముందుగా వాటిని సేవ్ చేయండి. క్రియేషన్లను ఎలా సేవ్ చేయాలో తెలుసుకోండి.
- మోషన్ ఫోటోలు, లైవ్ ఫోటోలకు సంబంధించిన వీడియో భాగం
- మీరు బదిలీలో వీడియో భాగాన్ని ఉంచాలనుకుంటే, మీ మోషన్ ఫోటోలను, లైవ్ ఫోటోలను వీడియోలుగా సేవ్ చేయవచ్చు. ఫోటో
మరిన్ని
వీడియోగా సేవ్ చేయండి ఆప్షన్ను ట్యాప్ చేయండి.
- మీరు బదిలీలో వీడియో భాగాన్ని ఉంచాలనుకుంటే, మీ మోషన్ ఫోటోలను, లైవ్ ఫోటోలను వీడియోలుగా సేవ్ చేయవచ్చు. ఫోటో
- మాన్యువల్గా ఎడిట్ చేసిన మెటాడేటా, ఉదాహరణకు ఫోటోకు జోడించిన కామెంట్ల వంటివి
- ట్రాష్లో ఉన్న కంటెంట్
- మీ ట్రాష్లో ఉన్న కంటెంట్ను మీరు బదిలీ చేయాలనుకుంటే, ఐటెమ్లను బదిలీ చేయడానికి ముందే వాటిని రీస్టోర్ చేయండి. ఇటీవల తొలగించిన ఫోటోలు, వీడియోలను ఎలా రీస్టోర్ చేయాలో తెలుసుకోండి.
ఫోటో, వీడియోల బదిలీలకు సపోర్ట్ చేయని ఖాతా రకాలు
ప్రస్తుతం, మీరు ఈ సర్వీస్ను కింద పేర్కొన్న వాటితో ఉపయోగించలేరు:
- వారి దేశంలో చట్టప్రకారం ఆమోదయోగ్యమైన వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఖాతాలు
- ఆఫీస్, పాఠశాల, లేదా ఇతర సంస్థల తరపున ఖాతాలు
- అధునాతన రక్షణ ఆన్ చేసి ఉన్న ఖాతాలు