మీరు Google సర్వీస్‌ను (Google One వంటిది) కొనుగోలు చేసినప్పుడు లేదా Google ప్రోడక్ట్ (Google Play వంటిది) ద్వారా ఏదైనా కొనుగోలు చేసినప్పుడు, మీరు అందించే పేమెంట్ సమాచారం మీ Google ఖాతాలో సేవ్ అవుతుంది. మీరు Google Payలో ఈ సమాచారాన్ని చూడవచ్చు లేదా దానికి మార్పులు చేయవచ్చు.
సేవ్ చేసిన పేమెంట్ ఆప్షన్‌లను జోడించండి, ఎడిట్ చేయండి, లేదా తీసివేయండి
మీ Google ఖాతాలో ఇప్పటికే సేవ్ చేసి ఉన్న పేమెంట్ ఆప్షన్‌ను మీరు చూడవచ్చు, జోడించవచ్చు, లేదా దానికి మార్పులు చేయవచ్చు.
పేమెంట్ ఆప్షన్‌ను జోడించండి
- పేమెంట్ ఆప్షన్‌లకు సైన్ ఇన్ చేయండి.
- దిగువన, ' పేమెంట్ ఆప్షన్‌ను జోడించు'ను క్లిక్ చేయండి.
- మీరు జోడించాలనుకునే పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
- మీ పేమెంట్ ఆప్షన్‌ను జోడించడం పూర్తి చేయడానికి సూచనలను అనుసరించండి.
- మీ పేమెంట్ ఆప్షన్‌ను వెరిఫై చేయమని అడిగితే, లిస్ట్ నుండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
- వెరిఫికేషన్ కోడ్‌ను కనుగొని, ఎంటర్ చేయండి.
పేమెంట్ ఆప్షన్‌ను మార్చండి లేదా తీసివేయండి
- పేమెంట్ ఆప్షన్‌లకు సైన్ ఇన్ చేయండి.
- పేమెంట్ ఆప్షన్‌కు పక్కన, ఎడిట్ చేయండి లేదా తొలగించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
మీ పేమెంట్ ప్రొఫైల్‌లో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని మేనేజ్ చేయండి
మీరు మొదటిసారి Google ద్వారా కొనుగోలు చేసినప్పుడు, మీ పేమెంట్ సమాచారం పేమెంట్స్ ప్రొఫైల్‌లో సేవ్ చేయబడుతుంది. మీరు తర్వాతిసారి Google ద్వారా ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు, ప్రొఫైల్‌లోని సమాచారాన్ని తిరిగి వినియోగించవచ్చు.
మీరు క్రియేట్ చేసే పేమెంట్స్ ప్రొఫైల్ ఏదైనా మీ Google ఖాతాతో అనుబంధించబడుతుంది.
పేమెంట్ ప్రొఫైల్ అంటే ఏమిటి?
మీ వ్యక్తిగత Google పేమెంట్స్ ప్రొఫైల్ ఈ కింద పేర్కొన్నటువంటి సమాచారాన్ని స్టోర్ చేస్తుంది:
- చట్టపరంగా అవసరమైనప్పుడు ప్రొఫైల్‌కు బాధ్యుడైన వ్యక్తి పేరు, అడ్రస్, ట్యాక్స్ ID.
- మీరు గతంలో Google ద్వారా కొనుగోలు చేయడానికి ఉపయోగించిన క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు, బ్యాంక్ ఖాతాలు, ఇంకా ఇతర పేమెంట్ ఆప్షన్‌లు.
- మీరు Chrome, ఇంకా Google Payలో ఆటోఫిల్ వంటి Google సర్వీస్‌లలో జోడించిన ఇతర అడ్రస్‌లను ఉపయోగించవచ్చు.
- గత లావాదేవీలకు సంబంధించిన రసీదులు, ఇతర సమాచారం.
- సబ్‌స్క్రిప్షన్‌లు, అలాగే రిపీట్ అయ్యే పేమెంట్‌లు.
చిట్కా: మీరు బిజినెస్ లేదా సంస్థ కోసం Google పేమెంట్స్ ప్రొఫైల్‌ను మేనేజ్ చేస్తుంటే, బిజినెస్ ప్రొఫైల్స్ గురించి తెలుసుకోండి.
ఒకటి కంటే ఎక్కువ పేమెంట్స్ ప్రొఫైల్‌ను మేనేజ్ చేయండి
మీరు వ్యక్తిగత పేమెంట్‌ల కోసం మీ ప్రొఫైల్‌ను ఉపయోగిస్తే, మీరు నివసించే దేశం లేదా ప్రాంతం కోసం మీరు ఒక వ్యక్తిగత ప్రొఫైల్‌ను మాత్రమే క్రియేట్ చేయగలరు. ఈ విధంగా, మీ Google కొనుగోళ్లు అన్నింటినీ మీరు ఒకే చోటు నుండి మేనేజ్ చేయవచ్చు.
కింద పేర్కొన్న సందర్భాల్లో మీకు పలు పేమెంట్స్ ప్రొఫైల్స్ ఉండవచ్చు:
- మీరు నివసించే దేశం లేదా ప్రాంతం మారితే: మీరు వేరే దేశం లేదా ప్రాంతానికి మారినట్లయితే, ప్రయాణిస్తున్నట్లయితే లేదా తాత్కాలిక నివాసాన్ని కలిగి ఉంటే, మీరు తప్పనిసరిగా కొత్త పేమెంట్స్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేయాలి.
- బిజినెస్ పేమెంట్స్ ప్రొఫైల్‌ను కలిగి ఉంటే: మీరు మీ Google ఖాతాతో వ్యక్తిగత ప్రొఫైల్, అలాగే బిజినెస్ ప్రొఫైల్ రెండింటినీ అనుబంధించబడి ఉండవచ్చు.
మీ పేమెంట్ ప్రొఫైల్‌తో అనుబంధించిన సమాచారాన్ని కనుగొనడం లేదా మార్చడం గురించి కొన్ని కథనాలు ఇవిగోండి.
ఛార్జీలు, రసీదులు, అలాగే గతంలో చేయబడిన ఇతర పేమెంట్ సమాచారాన్ని చూడండి
- చాలా వరకు కొనుగోళ్ల కోసం, యాక్టివిటీకి వెళ్లండి.
- మీరు Google ప్రోడక్ట్‌ల ద్వారా చేసిన కొన్ని కొనుగోళ్ల కోసం, సబ్‌స్క్రిప్షన్‌లుకు వెళ్లండి.
- మీ కొనుగోలును Google Payలో మీరు కనుగొనలేకపోతే, ఏ Google ప్రోడక్ట్‌లో అయితే మీరు కొనుగోలు చేశారో దానికి సైన్ ఇన్ చేసి, అక్కడ దాన్ని కనుగొనండి.
Google Payకు సంబంధించిన సహాయాన్ని పొందండి
మీ Google పేమెంట్‌లను మేనేజ్ చేయడంలో మీకు మరింత సహాయం అవసరమైనట్లయితే, Google Pay సహాయ కేంద్రంను సందర్శించండి.