మీ Google ఖాతాకు యాక్సెస్‌ను కోల్పోకుండా చూసుకోండి

మీ Google ఖాతాలో ఈమెయిల్స్, డాక్యుమెంట్‌లు, ఫోటోలు, అలాగే Playలో మీరు చేసిన కొనుగోళ్ళు వంటి మీకు ముఖ్యమైన కంటెంట్ ఉంటుంది. కింద పేర్కొనబడినవి ఎప్పుడైనా జరిగినప్పుడు, సైన్ ఇన్ చేయడంలో మీకు సహాయపడటానికి రికవరీ సమాచారం, అలాగే బ్యాకప్‌లతో మీ ఖాతాను సంరక్షించుకోండి:

  • మీరు మీ పాస్‌వర్డ్‌ను మర్చిపోయినప్పుడు
  • మీ ఫోన్ పోయినప్పుడు
  • మీ ఖాతా హ్యాక్ అయినప్పుడు

1వ దశ: మీ ఖాతాను రికవరీ సమాచారంతో సంరక్షించుకోండి

మీరు మీ ఖాతాకు యాక్సెస్‌ను కోల్పోయినట్లయితే, తిరిగి మీ ఖాతాలోకి ప్రవేశించడంలో మీకు రికవరీ సమాచారం సహాయపడుతుంది.

మీ రికవరీ ఫోన్ నంబర్‌ను జోడించండి లేదా అప్‌డేట్ చేయండి

  1. మీ Google ఖాతాలోని రికవరీ ఫోన్ నంబర్ విభాగంలోకి సైన్ ఇన్ చేయండి.
  2. ఇక్కడి నుండి, మీరు ఇవి చేయవచ్చు:
    • రికవరీ ఫోన్ నంబర్‌ను జోడించండిని ఎంచుకోండి.
    • మీ రికవరీ ఫోన్ నంబర్‌ను మార్చండి: మీ నంబర్ పక్కనున్న, 'ఎడిట్ చేయి' ఎడిట్ని ఎంచుకోండి.
    • మీ రికవరీ ఫోన్ నంబర్‌ను తొలగించండి: మీ నంబర్ పక్కనున్న, 'తొలగించు' Deleteను ఎంచుకోండి.
  3. స్క్రీన్‌పై కనిపించే దశలను ఫాలో అవ్వండి.

చిట్కా: మీ రికవరీ ఫోన్ నంబర్‌ను తొలగించినా కూడా, ఇతర Google సర్వీస్‌ల కోసం దానిని ఉపయోగించడం కొనసాగవచ్చు. మీ ఫోన్ నంబర్‌లను మేనేజ్ చేయడం కోసం మీ ఖాతాకు వెళ్లండి.

ఏ నంబర్‌ను ఉపయోగించాలి

ఈ కింది వాటికి అనుగుణంగా ఉండే మొబైల్ ఫోన్‌ను ఉపయోగించండి:

  • టెక్స్ట్ మెసేజ్‌లను అందుకోగలిగేది
  • మీకు మాత్రమే చెందినది
  • మీరు క్రమం తప్పకుండా ఉపయోగించేది, మీ చెంతనే ఉండేది

మీ రికవరీ ఇమెయిల్ అడ్రస్‌ను జోడించండి లేదా అప్‌డేట్ చేయండి

  1. మీ Google ఖాతాలోని రికవరీ ఇమెయిల్ విభాగానికి వెళ్లండి. మీరు సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు.
  2. ఇక్కడి నుండి, మీరు ఇవి చేయవచ్చు:
    • రికవరీ ఇమెయిల్‌ను జోడించండిని ఎంచుకోండి.
    • మీ రికవరీ ఇమెయిల్‌ను మార్చండి లేదా తొలగించండి: మీ ఇమెయిల్ పక్కనున్న 'ఎడిట్ చేయండి' ఎడిట్ చేయండిని ఎంచుకోండి.
  3. స్క్రీన్‌పై కనిపించే దశలను ఫాలో అవ్వండి.

ఏ ఈమెయిల్‌ను ఉపయోగించాలి

ఈ కింది వాటికి అనుగుణంగా ఉండే ఇమెయిల్ అడ్రస్‌ను ఉపయోగించండి:

  • మీరు క్రమం తప్పకుండా ఉపయోగించేది
  • మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయడం కోసం మీరు ఉపయోగించేది కాకుండా వేరేది

రికవరీ సమాచారం ఎలా ఉపయోగించబడుతుంది

రికవరీ ఫోన్ నంబర్

మీ రికవరీ ఫోన్ నంబర్ ఏయే చర్యల కోసం ఉపయోగించబడుతుంది అనే దానికి సంబంధించి ఇక్కడ కొన్ని పేర్కొనబడ్డాయి:

  • మీరు మీ పాస్‌వర్డ్‌ను మర్చిపోయినా లేదా ఏ కారణం చేతనైనా మీరు సైన్ ఇన్ చేయలేకపోయినా, మీ ఖాతాలోకి ప్రవేశించడంలో మీకు సహాయపడటానికి
  • మీ అనుమతి లేకుండా మీ ఖాతాను ఉపయోగించకుండా ఎవరినైనా బ్లాక్ చేయడానికి
  • మీ ఖాతాలో ఏదైనా అనుమానాస్పద యాక్టివిటీ జరిగినప్పుడు మీకు తెలియజేయడానికి

మీ రికవరీ ఫోన్ నంబర్, మరొక ఫోన్ నంబర్‌గా మీరు మీ ఖాతాకు జోడించిన నంబర్ ఒకటే అయితే, అది ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించబడవచ్చు. ఫోన్ నంబర్‌లు ఎలా ఉపయోగించబడతాయి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

రికవరీ ఈమెయిల్ అడ్రస్

మీ రికవరీ ఈమెయిల్ అడ్రస్ ఏయే చర్యల కోసం ఉపయోగించబడుతుంది అనే దానికి సంబంధించి ఇక్కడ కొన్ని పేర్కొనబడ్డాయి:

  • మీరు మీ పాస్‌వర్డ్‌ను మర్చిపోయినా లేదా ఏ కారణం చేతనైనా మీరు సైన్ ఇన్ చేయలేకపోయినా, మీ ఖాతాలోకి ప్రవేశించడంలో మీకు సహాయపడటానికి
  • మీ ఖాతాలో ఏదైనా అనుమానాస్పద యాక్టివిటీ జరిగినప్పుడు మీకు తెలియజేయడానికి
  • మీ స్టోరేజ్ స్పేస్ నిండిపోయే దశకు చేరుకున్నప్పుడు మీకు తెలియజేయడానికి

2వ దశ: సైన్ ఇన్ చేయడానికి మరిన్ని మార్గాలను సెటప్ చేయండి

సైన్ ఇన్ చేయడానికి మరిన్ని మార్గాలను జోడించి, ఆ ఖాతా మీదేనని మీరు నిరూపించవచ్చు.
మీరు కేవలం పాస్‌వర్డ్‌తో మాత్రమే సైన్ ఇన్ చేస్తుంటే
మీరు పాస్‌వర్డ్‌కు బదులుగా మీ ఫోన్ ద్వారా సైన్ ఇన్ చేయవచ్చు. మీరు మీ పాస్‌వర్డ్‌ను మర్చిపోతే, సైన్ ఇన్ చేయడానికి మరొక మార్గం ఉండటం అనేది ఉపయోగకరంగా ఉంటుంది.
మీరు 2-దశల వెరిఫికేషన్‌ను ఉపయోగిస్తుంటే

మీ గుర్తింపును నిర్ధారించడానికి మరిన్ని మార్గాలను జోడించండి

ఫోన్ ప్రాంప్ట్‌లను సెటప్ చేయండి

సైన్ ఇన్ చేయడానికి, Google మీ ఫోన్‌కు పంపే ప్రాంప్ట్‌ను మీరు ట్యాప్ చేయవచ్చు. ఫోన్ ప్రాంప్ట్‌లు మీ ఖాతా సెక్యూరిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి, కోడ్‌ను ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వడం కన్నా వేగంగా సైన్ ఇన్ అయ్యే మార్గాన్ని అందిస్తాయి.

బ్యాకప్ కోడ్‌లను స్టోర్ చేయండి

మీరు మీ ఫోన్‌ను ఉపయోగించలేకపోతే, మీ ఖాతాలోకి ప్రవేశించడానికి బ్యాకప్ కోడ్‌లు మీకు సహాయపడగలవు. మీరు బ్యాకప్ కోడ్‌లను ఒక పరికరంలోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా వాటిని ప్రింట్ చేసి ఒక సురక్షితమైన ప్రదేశంలో స్టోర్ చేసుకోవచ్చు.

యాప్ నుండి కోడ్‌లు పొందండి

మీకు టెక్స్ట్ మెసేజ్‌లు అందకపోయినప్పటికీ, మీరు మీ ఖాతాలోకి సైన్ ఇన్ చేయడానికి కోడ్‌లను పొందవచ్చు. మీ ఫోన్‌లో కోడ్‌లు పొందడానికి Google ప్రామాణీకరణదారు యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

సెక్యూరిటీ కీని సెటప్ చేయండి

మీరు మీ Google ఖాతాతో ఉపయోగించగల అత్యంత సురక్షితమైన రెండవ దశలలో సెక్యూరిటీ కీల ఆప్షన్ ఒకటి. సెక్యూరిటీ కీని ఉపయోగించడం ఎలాగో తెలుసుకోండి.

మీరు తరచుగా ప్రయాణం చేసే వారు అయితే

మీరు ఒక కొత్త ప్రదేశం నుండి సైన్ ఇన్ చేసినప్పుడు, మీ గుర్తింపును చెక్ చేయడానికి, Google మిమ్మల్ని ఒక అదనపు దశ పూర్తి చేయమని అడగవచ్చు. మీరు ప్రయాణం చేసేటప్పుడు, మరింత బాగా సిద్ధమవ్వడానికి ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.

1. మీ రికవరీ సమాచారాన్ని అప్‌డేట్ చేయండి

మీరు మీ రికవరీ ఫోన్ నంబర్, ఇమెయిల్ అడ్రస్‌లను ఇప్పటికీ ఉపయోగించగలరని నిర్ధారించుకోండి. అలా చేయడం వలన, మీరు సైన్ ఇన్ చేయలేని పక్షంలో, మీ ఖాతాలోకి తిరిగి ప్రవేశం కల్పించడంలో మీకు మేము సహాయపడగలము.

2. Set up a way to prove it’s you

మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ ఖాతాను ఉపయోగించడంలో మీకు సహాయపడటానికి, బయలుదేరే ముందు మీ రికవరీ ఫోన్ నంబర్‌ను సెటప్ చేయండి. మీ ట్రిప్ సమయంలో, ఈ ఫోన్‌ను మీ చెంతనే ఉంచుకోండి.

టెక్స్ట్ మెసేజ్ వెరిఫికేషన్ కోడ్‌లను ఉపయోగించి, అది మీ ఖాతాయే అని నిరూపించండి

మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు, మీ రికవరీ ఫోన్ నంబర్ టెక్స్ట్ మెసేజ్‌లను అందుకోగలదు అని నిర్ధారించుకోండి.

ఫోన్ ప్రాంప్ట్‌లను ఉపయోగించి, అది మీ ఖాతాయే అని నిరూపించండి

ఫోన్ ప్రాంప్ట్‌లను ఉపయోగించాలంటే, మీ రికవరీ ఫోన్‌లో యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.

మీరు కేవలం పాస్‌వర్డ్‌తో మాత్రమే సైన్ ఇన్ చేస్తుంటే:

మీరు ప్రయాణం మొదలుపెట్టే ముందు, మీ రికవరీ ఫోన్‌కు మీ Google ఖాతాను జోడించడం మర్చిపోకండి.

మీరు 2-దశల వెరిఫికేషన్‌ను ఉపయోగిస్తుంటే:

  1. మీరు ప్రయాణం మొదలుపెట్టే ముందు, ఫోన్ ప్రాంప్ట్‌లను సెటప్ చేయడానికి దశలను ఫాలో అవ్వండి.
  2. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు, మీ రికవరీ ఫోన్‌కు గానీ లేదా Google యాప్‌లకు గానీ సైన్ ఇన్ అయ్యి ఉండండి.

3. మీ గుర్తింపును నిర్ధారించడానికి మరిన్ని మార్గాలను జోడించండి

2-దశల వెరిఫికేషన్‌ను ఆన్ చేసినట్లయితే, మీరు మీ గుర్తింపును నిర్ధారించడానికి మరిన్ని మార్గాలను జోడించవచ్చు.

3వ దశ: మీ ఖాతాను మరింత సురక్షితంగా చేసుకోండి

ఈ చిట్కాల సహాయంతో, మీ ఖాతాలోకి కేవలం మీరు మాత్రమే ప్రవేశించగలుగుతున్నారని నిర్ధారించుకోవడంలో సహాయపడండి.

సమస్యలను పరిష్కరించండి

సైన్ ఇన్ చేయడం సాధ్యపడటం లేదు

ఖాతా రికవరీ పేజీకి వెళ్లి, మీకు సాధ్యమైనంత వరకు ఉత్తమ సమాధానాలను ఇవ్వండి. ఈ చిట్కాలు సహాయపడగలవు.

ఈ కింద పేర్కొనబడిన పరిస్థితులు ఎదురైనప్పుడు ఖాతా రికవరీ పేజీని ఉపయోగించండి:

  • మీరు మీ పాస్‌వర్డ్‌ను మరచిపోయినప్పుడు.
  • మీ పాస్‌వర్డ్‌ను వేరెవరో మార్చినప్పుడు.
  • మీ ఖాతాను వేరెవరో తొలగించినప్పుడు.
  • మరొక కారణం చేత మీరు సైన్ ఇన్ చేయలేకపోయినప్పుడు.

చిట్కా: మీరు సరైన ఖాతాలోకి సైన్ ఇన్ చేయడానికి ట్రై చేస్తున్నారని నిర్ధారించుకోవడానికి, మీ యూజర్‌నేమ్‌ను రికవర్ చేయడానికి ట్రై చేయండి.

రికవరీ సమాచారాన్ని మార్చడం సాధ్యపడటం లేదు

మీరు సైన్ ఇన్ చేసే విధానంలో ఏదైనా తేడా ఉంటే, మీ రికవరీ సమాచారాన్ని మార్చే ఆప్షన్ మీకు ఉండకపోవచ్చు. మీరు ఈ కింద పేర్కొనబడిన విధంగా ట్రై చేయవచ్చు:

  • మీరు సాధారణంగా సైన్ ఇన్ చేయడానికి ఉపయోగించే పరికరం నుండి ట్రై చేయవచ్చు.
  • మీరు సాధారణంగా సైన్ ఇన్ చేసే లొకేషన్ నుండి ట్రై చేయవచ్చు.
  • మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న పరికరం నుండి తర్వాతి వారం ట్రై చేయవచ్చు.
Android iPhone & iPad
true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
516053701256888321
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false