మీ Google ఖాతాను యాక్సెస్ చేయడానికి Gmailను ఉపయోగించండి

మీరు Gmailను ఉపయోగిస్తే, మీకు ఇప్పటికే Google ఖాతా ఉన్నట్లు అర్థం. Google ఖాతాతో, మీరు ఏ విధమైన ఛార్జీ విధించబడకుండా Drive, Docs, Calendar వంటి Google ప్రోడక్ట్‌లకు ఇంకా మరిన్నింటికి యాక్సెస్‌ను కలిగి ఉంటారు.

మీ Google ఖాతాకు (లేదా మరేదైనా Google ప్రోడక్ట్‌కు) సైన్ ఇన్ చేయడానికి:

  1. ప్రోడక్ట్‌కు సంబంధించిన సైన్ ఇన్ పేజీకి వెళ్ళండి (Google ఖాతాల కోసం myaccount.google.com లింక్‌కు వెళ్లాలి).
  2. మీ Gmail యూజర్‌నేమ్‌ను ఎంటర్ చేయండి ('@gmail.com'కు ముందు ఉన్న దాన్ని ఎంటర్ చేయాలి).
  3. మీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి.

సాధారణ సమస్యలు

నాకు Gmail ఖాతా లేదనుకుంటాను

కొత్త Google ఖాతాలు Gmailతో వస్తాయి, కాబట్టి మీరు ఇటీవల మీ ఖాతాను క్రియేట్ చేసినట్లయితే, మీకు ఇప్పటికే Gmail అడ్రస్‌ను కలిగి ఉండాలి.

మీరు ఇప్పటివరకూ Gmail ఖాతాను క్రియేట్ చేయకపోతే, ఎటువంటి ఛార్జీ లేకుండా సైన్ అప్ చేయవచ్చు. Gmail ఖాతాను క్రియేట్ చేయడానికి:

  1. Gmail.comకు వెళ్ళండి.
  2. మరిన్ని ఆప్షన్‌లు ఆ తర్వాత ఖాతాను క్రియేట్ చేయండి అనే ఆప్షన్ ఎంచుకోండి.
  3. స్క్రీన్ మీద కనిపించే సూచనలను ఫాలో చేయండి.
నేను నా Gmail ఖాతాను తొలగించాను అని అనుకుంటున్నాను

మీరు ఇప్పటికే Google ఖాతాను కలిగి ఉండి, మీ Gmail ఖాతాను తొలగించి ఉంటే, మీరు మీ ప్రస్తుత Google ఖాతాకు Gmailను జోడించవచ్చు.

Gmailను జోడించడానికి:

  1. mail.google.comకు వెళ్లండి.
  2. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  3. మీ ఖాతాకు Gmailను జోడించడానికి స్క్రీన్ మీద కనిపించే సమాచారాన్ని ఫాలో చేయండి.

మీరు Gmailను జోడించినప్పుడు, మీ Gmail అడ్రస్ మీ ఖాతాకు ప్రధాన యూజర్‌నేమ్ అవుతుంది. మీ Google ఖాతా నుండి డాక్యుమెంట్‌లు లేదా ఫోటోల వంటి సమాచారాన్ని మీరు షేర్ చేసినప్పుడు ఇతరులు ఈ ప్రధాన యూజర్‌నేమ్‌ను చూస్తారు. మీ ఒరిజినల్ ఇమెయిల్ అడ్రస్, మీ ఖాతాలో రికవరీ అడ్రస్ అవుతుంది.

మీకు మరిన్ని సందేహాలు ఉంటే, Gmail సహాయ కేంద్రాన్ని సందర్శించండి.

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13741516923676347237
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false