కాంటాక్ట్‌లు అని ఎవరు సేవ్ చేయబడ్డారో & సూచించబడ్డారో, వారిని మార్చండి

మీరు Gmailలోని కొత్త ఈమెయిల్‌లో, ఎవరి పేరునైనా టైప్ చేయడం ప్రారంభించినప్పుడు, లేదా అలాంటివే చేసినప్పుడు, కొన్ని Google సర్వీస్‌లలో, కాంటాక్ట్‌లను సూచించడాన్ని మీరు చూస్తారు. వీటిలో ఎవరు సేవ్ చేయబడి కాంటాక్ట్‌గా సూచించబడాలో మీరు కంట్రోల్ చేయవచ్చు.

సూచనలుగా ఎవరు చూపించబడతారు

సూచనలు మీ కాంటాక్ట్‌లు, అలాగే ఇంటరాక్షన్‌లకు సంబంధించిన వివిధ రకాల సంకేతాలపై ఆధారపడి ఉంటాయి, అంటే కాంటాక్ట్‌కు స్టార్ గుర్తును ఉంచడం లేదా మీరు ఇటీవల కాంటాక్ట్‌కు ఈమెయిల్ పంపడం వంటివి. సూచించబడిన కాంటాక్ట్‌లలో మీరు మీ కాంటాక్ట్‌లకు జోడించిన వ్యక్తులు ఉంటారు. మీరు Google సర్వీస్‌లలో ఇంటరాక్ట్ అయిన వ్యక్తులను ఆటోమేటిక్‌గా "ఇతర కాంటాక్ట్‌ల"లో సేవ్ చేయడం జరుగుతుంది.

Gmail లేదా Photos వంటి కొన్ని యాప్‌లలో, మీరు ఏదైనా టైప్ లేదా సెర్చ్ చేయడానికి ముందే మీకు సూచించబడిన కాంటాక్ట్‌లు కనిపించవచ్చు.

చిట్కాలు:

కాంటాక్ట్‌లుగా ఎవరు సేవ్ చేయబడ్డారో వారిని నియంత్రించండి

మీరే కాంటాక్ట్‌లను జోడించండి
  1. Google కాంటాక్ట్‌లుకు సైన్ ఇన్ అవ్వండి. మీరు జోడించిన కాంటాక్ట్‌ల లిస్ట్‌ను మీరు చూస్తారు.
  2. ఎగువ ఎడమవైపున, జోడించు 'కాంటాక్ట్‌ను క్రియేట్ చేయండి' అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. వ్యక్తి కాంటాక్ట్ సమాచారాన్ని ఎంటర్ చేయండి.
  4. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
మీరు వ్యక్తులతో ఇంటరాక్ట్ అయినప్పుడు కాంటాక్ట్ సమాచారాన్ని సేవ్ చేయండి

మీరు Google ప్రోడక్ట్‌ల ద్వారా వ్యక్తులతో ఇంటరాక్ట్ అయినప్పుడు, ఈ కింద పేర్కొన్న అంశాలను కలిగి ఉన్న వారి కాంటాక్ట్ సమాచారాన్ని మీరు ఆటోమేటిక్‌గా సేవ్ చేయవచ్చు.

  • పేర్లు
  • ఈమెయిల్ అడ్రస్‌లు
  • ఫోన్ నంబర్‌లు

ఈ సెట్టింగ్ ఆన్ అయ్యి ఉన్నప్పుడు, ఈ కింద పేర్కొన్న వ్యక్తుల కాంటాక్ట్ సమాచారం సేవ్ అవుతుంది:

  • మీరు Gmailలో ఈమెయిల్ చేసిన వ్యక్తులు.
  • ఏ వ్యక్తులతో అయితే మీరు ఏదైనా (ఉదాహరణకు, Driveలోని ఒక డాక్యుమెంట్‌ను) షేర్ చేస్తారో, వారు.
  • Google Photosలో షేర్ చేసిన ఆల్బమ్‌ల లాంటి కంటెంట్‌ను మీతో షేర్ చేసే వ్యక్తులు.
  • మీరున్న గ్రూప్‌లలో, ఈవెంట్‌లలో చేర్చబడే వ్యక్తులు.
  • తెలిసి ఉన్న వారిగా మీరు గుర్తు పెట్టిన వ్యక్తులు.
  • ఏ వ్యక్తుల నుండి వచ్చిన క్యాలెండర్ ఆహ్వానాలను అయితే మీరు ఆమోదిస్తారో, వారు.

ఆటోమేటిక్‌గా సేవ్ చేయడాన్ని ప్రారంభించండి లేదా ఆపివేయండి

  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎడమ వైపు ఉండే నావిగేషన్ ప్యానెల్‌లో, వ్యక్తులు, షేరింగ్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. "కాంటాక్ట్‌ల" ప్యానెల్‌లో, ఇంటరాక్షన్‌ల నుండి సేవ్ చేసిన కాంటాక్ట్ సమాచారం అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. మీరు వ్యక్తులతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కాంటాక్ట్ సమాచారాన్ని సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.
  5. మీరు ఒకవేళ Gmailను ఉపయోగిస్తుంటే, మీరు ఈమెయిల్ చేసిన వ్యక్తుల కాంటాక్ట్ సమాచారాన్ని, Gmail సేవ్ చేయాలా వద్దా అనే దాన్ని ఎంచుకోండి:
    1. కంప్యూటర్‌లో, మీ Gmail సెట్టింగ్‌లకు వెళ్ళండి.
    2. "ఆటోమేటిక్‌గా పూర్తిచేయడం కోసం, కాంటాక్ట్‌లను క్రియేట్ చేయండి," అనేదాని కింద ఉన్న ఆప్షన్‌ను ఎంచుకోండి.
    3. పేజీ దిగువున, మార్పులను సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

కాంటాక్ట్‌లను మార్చడం లేదా తీసివేయడం

సూచనలుగా వ్యక్తులు కనిపించడాన్ని ఆపివేయడం కోసం, వారిని తీసివేయడానికి కింద పేర్కొన్న దశలను ఫాలో అవ్వండి.

మీరు జోడించిన కాంటాక్ట్‌లు
  1. Google కాంటాక్ట్‌లుకు సైన్ ఇన్ అవ్వండి.
  2. కాంటాక్ట్‌ను క్లిక్ చేయండి లేదా ట్యాప్ చేయండి.
  3. ఇక్కడ నుండి, మీరు వీటిని చేయవచ్చు:
    • సమాచారాన్ని మార్చడం: ఎగువ కుడివైపున, ఎడిట్ చేయండి ఎడిట్ చేయండిని ఎంచుకోండి. మీరు చేయాలనుకుంటున్న మార్పులను చేయండి. దిగువున, సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • కాంటాక్ట్‌ను తీసివేయడం: ఎగువ కుడివైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత 'తొలగించు' అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
ఆటోమేటిక్‌గా సేవ్ చేయబడిన కాంటాక్ట్‌లు
  1. Google కాంటాక్ట్‌లుకు సైన్ ఇన్ అవ్వండి.
  2. ఎడమవైపు ఉన్న, ఇతర కాంటాక్ట్‌లు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. కాంటాక్ట్‌ను క్లిక్ చేయండి లేదా ట్యాప్ చేయండి.
  4. ఇక్కడ నుండి, మీరు వీటిని చేయవచ్చు:
    • సమాచారాన్ని మార్చడం: ఎగువ కుడివైపున, 'కాంటాక్ట్‌లకు జోడించండి' వ్యక్తులను జోడించుని ఎంచుకోండి. మీరు చేయాలనుకుంటున్న మార్పులను చేయండి. దిగువున, సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • కాంటాక్ట్‌ను తీసివేయడం: ఎగువ కుడివైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత 'తొలగించు' అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. వాటిని మళ్లీ జోడించబడకుండా ఆపడానికి, ఆటోమేటిక్‌గా సేవ్ అవ్వడం ఆపివేయడానికి దశలను ఫాలో అవ్వండి.
true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6099977802229227330
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false