యూజర్‌నేమ్‌కు బదులుగా మీ ఫోన్ నంబర్‌తో సైన్ ఇన్ చేయండి

"ఈమెయిల్ లేదా ఫోన్ నంబర్" ఫీల్డ్‌తో ఏదైనా సైన్ ఇన్ స్క్రీన్‌లో మీ ఫోన్ నంబర్‌తో మీ Google ఖాతాకు మీరు సైన్ ఇన్ చేయవచ్చు.

మీ యూజర్‌నేమ్ మీకు గుర్తులేకపోతే సైన్ ఇన్ చేయడానికి ఈ ఆప్షన్ మీకు మరో మార్గాన్ని సూచిస్తుంది.

సైన్ ఇన్ చేయడానికి మీ ఫోన్ నంబర్‌ను ఉపయోగించండి

మీ ఫోన్ నంబర్‌ను మీరు మీ Google ఖాతాకు జోడించి ఉన్నట్లయితే దానితో మీరు సైన్ ఇన్ చేయవచ్చు.

  1. "ఈమెయిల్ లేదా ఫోన్ నంబర్" ఫీల్డ్ ఉన్న ఏదైనా Google సైన్ ఇన్ స్క్రీన్‌లో, మీ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  2. తర్వాతను ఎంచుకోండి.
  3. మీరు ఎప్పటిలాగా సైన్ ఇన్ చేసి ముగించండి.

మీ ఖాతాలో ఫోన్ నంబర్‌ను జోడించండి లేదా మార్చండి

మీ Google ఖాతాను మీరు క్రియేట్ చేసినప్పుడు, మీ పరికరాన్ని సెటప్ చేసినప్పుడు, లేదా మీ సెట్టింగ్‌లను అప్‌డేట్ చేసినప్పుడు, మీరు ఫోన్ నంబర్‌ను జోడించి ఉంటారు.

మీ ప్రస్తుత నంబర్ మీ ఖాతాకు కనెక్ట్ అయిందని నిర్ధారించుకోవడానికి:

  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎడమ వైపున్న నావిగేషన్ ప్యానెల్‌లో, సెక్యూరిటీ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. మీరు Googleకు ఎలా సైన్ ఇన్ చేస్తారు ప్యానెల్‌లో, సైన్ ఇన్ చేయడానికి మీ ఫోన్‌ను ఉపయోగించండిని క్లిక్ చేయండి.
  4. దానిని సెటప్ చేయిని క్లిక్ చేయండి.
  5. ఇక్కడ నుండి, మీరు ఇవి చేయవచ్చు:
    • ఫోన్ నంబర్‌ను జోడించండి: "రికవరీ ఫోన్ నంబర్ " కింద, రికవరీ ఫోన్ నంబర్‌ను జోడించును ఎంచుకోండి. (మీకు ఇప్పటి వరకు రికవరీ ఫోన్ నంబర్ లేకపోతే, దాన్ని జోడించమని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము.)
    • మీ ఫోన్ నంబర్‌ను మార్చండి: మీ నంబర్ పక్కన, ఎడిట్ చేయి ఎడిట్ చేయండిని ఎంచుకోండి. నంబర్‌ను అప్‌డేట్ చేయిని ఎంచుకోండి.
  6. మీ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయండి. ఇటువంటి నంబర్‌ను ఉపయోగించండి:
    • మీకు మాత్రమే చెందినది
    • మీరు మరో Google ఖాతాకు సైన్ ఇన్ చేయడానికి ఉపయోగించనిది
    • Photos వంటి Google సర్వీస్‌లలో ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి మీరు ఉపయోగించనిది
  7. స్క్రీన్‌పై కనిపించే దశలను ఫాలో అవ్వండి.

ముఖ్యమైనది: మీ నంబర్ పక్కన "నంబర్ వెరిఫై చేయబడలేదు" అని మీరు చూస్తే, ఇప్పుడే వెరిఫై చేయిని ఎంచుకొని, స్క్రీన్‌పై ఉన్న దశలను ఫాలో అవ్వండి.

సమస్యలను పరిష్కరించండి

"మీ Google ఖాతాను కనుగొనలేకపోయాము" అని మీకు ఎర్రర్ మెసేజ్ వస్తే, మీ ఫోన్ నంబర్ మీ ఖాతాకు కనెక్ట్ అయి లేకపోవచ్చు.

మీ ఫోన్ నంబర్‌ను జోడించడానికి పై దశలను ఫాలో అవ్వండి.

మీ ఫోన్ నంబర్‌తో మీరు సైన్ ఇన్ చేయలేకపోతే, మీ యూజర్‌నేమ్ లేదా ఇమెయిల్ అడ్రస్‌తో సైన్ ఇన్ చేయండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1239238077959846186
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false