మీ iPhone లేదా iPadలో మీ Google ఖాతాను ఉపయోగించండి

మీరు మీ మొబైల్ పరికరంలో మీ Google ఖాతాను పలు రకాలుగా ఉపయోగించవచ్చు.

Safariకి సైన్ ఇన్ చేయడం

మీ పరికరంతో పాటుగా వచ్చే Safari బ్రౌజర్‌లో మీరు మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయవచ్చు. Safariకి సైన్ ఇన్ చేయడం ద్వారా వీటిని పొందుతారు:

  • వెబ్‌లో Google ప్రోడక్ట్‌లను ఉపయోగించేటప్పుడు మరింత వ్యక్తిగతీకరించిన అనుభవం
  • వెబ్‌సైట్‌లు, యాప్‌లకు ఒక్క-టచ్‌తో సైన్-ఇన్
  • మీ గోప్యత సెట్టింగ్‌ల మీద మరింత కంట్రోల్

మీరు సైన్ ఇన్ చేసినప్పుడు, మీ Google ఖాతా యాక్టివిటీ కంట్రోల్స్, యాడ్ ప్రాధాన్యతలు ఆటోమేటిక్‌గా Safariకి వర్తిస్తాయి.

ఆటోమేటిక్‌గా సైన్ ఇన్ చేయడం

మీరు Google యాప్ లేదా థర్డ్-పార్టీ ప్రోడక్ట్‌కు మీ Google ఖాతాతో సైన్ ఇన్ చేసినప్పుడు, Safariలోని మీ Google ఖాతాకు మీరు ఆటోమేటిక్‌గా సైన్ ఇన్ చేయబడతారు. అప్పుడు, మీ పరికరంలో మీ ఖాతాకు మళ్లీ మీరు సైన్ ఇన్ చేయాల్సిన అవసరం ఉండదు.

ఒకవేళ మీ Google ఖాతాతో మీరు Safariకి సైన్ ఇన్ చేయకూడదని అనుకుంటే, మీరు ఎప్పుడైనా సైన్ అవుట్ చేయవచ్చు.

మీరు సైన్ ఇన్ చేసి ఉన్నారో లేదో చెక్ చేయడం

మీ Google ఖాతాతో Safariకి సైన్ ఇన్ చేసి ఉన్నారో లేదో తెలుసుకోవడానికి:

  1. మీ iPhone లేదా iPadలో, Safari యాప్‌ను తెరవండి.
  2. www.google.comకు వెళ్లండి.
  3. ఎగువున కుడివైపున, మీ ప్రొఫైల్ ఇమేజ్ కోసం చూడండి. అది మీకు కనిపిస్తే, మీరు ఇప్పటికే సైన్ ఇన్ చేసి ఉన్నారని అర్థం. కనిపించకపోతే, సైన్ ఇన్ చేయలేదని అర్థం.
ఖాతాలకు సైన్-ఇన్ చేయడం లేదా స్విచ్ చేయడం

మీ Google ఖాతాతో Safariకి సైన్ ఇన్ చేయడానికి:

  1. మీ iPhone లేదా iPadలో, Safari యాప్‌ను తెరవండి.
  2. www.google.comకు వెళ్లండి.
  3. మీ ప్రొఫైల్ ఇమేజ్‌ను గానీ లేదా సైన్ ఇన్ ఆప్షన్‌ను గానీ ట్యాప్ చేయండి.
  4. సైన్-ఇన్ చేసే దశలను ఫాలో చేయండి.

గమనిక: మీరు ఇతర 'Google ప్రోడక్ట్' సైట్‌లకు కూడా సైన్ ఇన్ చేయవచ్చు, అయితే సైన్-ఇన్ చేసే దశలు భిన్నంగా ఉండవచ్చు.

ఖాతాల నుండి సైన్ అవుట్ చేసి, వాటిని తీసివేయడం

Safari నుండి మీ Google ఖాతాను సైన్ అవుట్ చేయడానికి, తీసివేయడానికి:

  1. మీ iPhone లేదా iPadలో, Safari యాప్‌ను తెరవండి.
  2. www.google.comకు వెళ్లండి.
  3. సైన్ అవుట్ చేయడానికి, ఎగువున కుడివైపున ఉన్న మీ ప్రొఫైల్ ఇమేజ్ ఆ తర్వాత సైన్ అవుట్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. (మీ ప్రొఫైల్ ఇమేజ్‌కు బదులుగా మీకు ఒకవేళ "సైన్ ఇన్" ఆప్షన్ కనిపిస్తే, మీరు ఇప్పటికే సైన్ అవుట్ చేశారని అర్థం.)
  4. ఖాతాను తీసివేయడం కోసం, మీరు సైన్ అవుట్ చేసి ఉన్నారని నిర్ధారించుకోండి. సైన్ ఇన్ చేయండి ఆ తర్వాత వేరొక ఖాతాతో సైన్ ఇన్ చేయండి ఆ తర్వాత తీసివేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. మీరు తీసివేయాలనుకుంటున్న ఖాతాను ఎంచుకొని, ఆపై పూర్తయింది ఆప్షన్‌ను ఎంచుకోండి.

మీ Google ఖాతాను ఏ సమయంలోనైనా మళ్లీ Safariకి మీరు జోడించవచ్చు.

గమనిక: మీ Google యాప్‌లలో దేనిలోనైనా Google ఖాతా లేనట్లయితే, మీ పరికరం సైన్ అవుట్ అవుతుంది.

Google యాప్‌లకు సైన్ ఇన్ చేయడం

మీ iPhone లేదా iPadలో ఉపయోగించడానికి Gmail లేదా YouTube లాంటి మీకు ఇష్టమైన Google ప్రోడక్ట్‌ల యాప్‌లను డౌన్‌లోడ్ చేయండి.

మొదటగా, మీరు కావాలనుకుంటున్న యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం

  1. మీ iPhone లేదా iPadలో, యాప్ స్టోర్‌ను తెరవండి.
  2. మీరు కావాలనుకుంటున్న యాప్‌ను కనుగొని, డౌన్‌లోడ్ చేయండి. అది Google Inc అందిస్తున్నదేనని నిర్ధారించుకోండి.

తర్వాత, మీ Google ఖాతాతో సైన్ ఇన్ చేయడం

సైన్-ఇన్ విధానం అనేది ప్రోడక్ట్‌ను బట్టి మారుతుంది. పాపులర్ Google యాప్‌లలో ఖాతాలను జోడించడం, స్విచ్ చేయడం లేదా తీసివేయడం గురించి సూచనలు ఇవిగోండి.

Google search యాప్

ఖాతాలను జోడించడం లేదా స్విచ్ చేయడం

మీ Google ఖాతాతో Google యాప్‌నకు సైన్ ఇన్ చేయడం:

  1. మీ iPhone లేదా iPadలో, Google యాప్ ని తెరవండి.
  2. మీ Google ఖాతాను జోడించండి.
    • మొదటిసారి ఖాతాను జోడించడానికి: సైన్ ఇన్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • మరొక ఖాతాను జోడించడానికి: ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ ఇమేజ్‌ను ట్యాప్ చేయండి. ఇప్పటికే సైన్ ఇన్ చేసి ఉన్న ఖాతాను ట్యాప్ చేయండి.
  3. మీరు ఉపయోగించాలనుకుంటున్న ఖాతాను ఎంచుకోండి. (లిస్ట్‌లో అది లేకపోతే, ఖాతాను జోడించండి ఆప్షన్‌ను ఎంచుకొని, సైన్-ఇన్ దశలను ఫాలో చేయండి.)

మీ ఖాతా నుండి సైన్ అవుట్ చేసి, దానిని తీసివేయడం

Google యాప్ నుండి మీ Google ఖాతాను సైన్ అవుట్ చేసి, తీసివేయడానికి:

  1. మీ iPhone లేదా iPadలో, Google యాప్ ని తెరవండి.
  2. ఎగువున ఎడమ వైపున ఉన్న, మీ ప్రొఫైల్ ఇమేజ్‌ను ట్యాప్ చేయండి. సైన్ ఇన్ చేసి ఉన్న ఖాతాను ట్యాప్ చేయండి.
  3. ఇక్కడ నుండి మీరు వీటిని చేయవచ్చు:
    • మీ ఖాతాను తీసివేయడం: మేనేజ్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి. తీసివేయాలనుకుంటున్న మీ ఖాతాకు పక్కన ఉన్న, తీసివేయండి ఆ తర్వాత తీసివేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. వెనుకకు వెళ్లండి వెనుకకు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. ఎగువున కుడివైపున ఉన్న, పూర్తయింది ఆప్షన్‌ను ఎంచుకోండి.

గమనిక: మీ Google యాప్‌లలో దేనిలోనైనా Google ఖాతా లేనట్లయితే, మీ పరికరం సైన్ అవుట్ అవుతుంది.

Gmail యాప్

ఖాతాలను జోడించడం

మీ Google ఖాతాతో Gmail యాప్‌నకు సైన్ ఇన్ చేయడం:

  1. మీ iPhone లేదా iPadలో, Gmail యాప్‌ను తెరవండి.
  2. మొదటిసారి మీ ఖాతాను జోడించడానికి, అడిగినప్పుడు సైన్ ఇన్ చేయండి. మరొక ఖాతాను జోడించడానికి, కింది దశలను ఫాలో చేయండి.
  3. మెనూ మెనూ ఆప్షన్‌ను ఎంచుకోండి. సైన్ ఇన్ చేసి ఉన్న ఖాతాను ట్యాప్ చేసి ఆ తర్వాత ఖాతాలను మేనేజ్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. ఏయే ఖాతాను జోడించాలో ఎంచుకోండి. (ఒకవేళ లిస్ట్‌లో ఖాతా లేకపోతే, ఖాతాను జోడించండి ఆప్షన్‌ను ఎంచుకొని, సైన్-ఇన్ దశలను ఫాలో చేయండి.)
    • మీరు జోడించాలనుకుంటున్న ఖాతాల పక్కన ఉన్న, స్విచ్‌ను ఆన్ చేయండి.
    • మీరు జోడించకూడదని అనుకుంటున్న ఖాతాల పక్కన ఉన్న, స్విచ్‌ను ఆఫ్ చేయండి.
  5. ఎగువున ఎడమ వైపున ఉన్న, పూర్తయింది ఆప్షన్‌ను ఎంచుకోండి.

మీరు ఒక్కసారి ఒక్క ఖాతాకు సంబంధించిన మెయిల్‌ను మాత్రమే చూడగలుగుతారు.

ఖాతాలను స్విచ్ చేయడం

వేరొక Google ఖాతాతో Gmail యాప్‌ను ఉపయోగించడానికి:

  1. మీ iPhone లేదా iPadలో, Gmail యాప్‌ను తెరవండి.
  2. మెనూ మెనూ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. సైన్ ఇన్ చేసి ఉన్న ఖాతాను ట్యాప్ చేసి, ఆపై మీరు స్విచ్ అవ్వాలనుకుంటున్న ఖాతాను ట్యాప్ చేయండి.

మీ ఖాతాను తొలగించడం

Gmail యాప్ నుండి మీ Google ఖాతాను తొలగించడానికి:

  1. మీ iPhone లేదా iPadలో, Gmail యాప్‌ను తెరవండి.
  2. మెనూ మెనూ ఆప్షన్‌ను ఎంచుకోండి. సైన్ ఇన్ చేసి ఉన్న ఖాతాను ట్యాప్ చేసి ఆ తర్వాత ఖాతాలను మేనేజ్ చేయండి ఆ తర్వాత ఎడిట్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు తీసివేయాలనుకుంటున్న ఖాతాకు పక్కన ఉన్న, తీసివేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. ఒకవేళ అడిగితే మీ ఎంపికను నిర్ధారించండి.
  4. ఎగువున ఎడమ వైపున ఉన్న, పూర్తయింది ఆప్షన్‌ను ఎంచుకోండి.
YouTube యాప్

ఖాతాలను జోడించడం లేదా స్విచ్ చేయడం

మీ Google ఖాతాతో YouTube యాప్‌నకు సైన్ ఇన్ చేయడానికి:

  1. మీ iPhone లేదా iPadలో, YouTube యాప్ YouTube appను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ ఇమేజ్‌ను ట్యాప్ చేయండి.
    • మొదటిసారి ఖాతాను జోడించడానికి: సైన్ ఇన్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • మరొక ఖాతాను జోడించడానికి: మీరు ఖాతాలను స్విచ్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు ఉపయోగించాలనుకుంటున్న ఖాతాను ఎంచుకోండి. (లిస్ట్‌లో అది లేకపోతే, ఖాతాను జోడించండి ఆప్షన్‌ను ఎంచుకొని, సైన్-ఇన్ దశలను ఫాలో చేయండి.)

మీ ఖాతా నుండి సైన్ అవుట్ చేయడం

YouTube యాప్ నుండి మీ Google ఖాతాను సైన్ అవుట్ చేసి, తీసివేయడానికి:

  1. మీ iPhone లేదా iPadలో, YouTube యాప్ YouTube appను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ ఇమేజ్‌ను ట్యాప్ చేయండి.​
  3. ఖాతాలను స్విచ్ చేయండి ఆ తర్వాత సైన్ అవుట్ చేసిన YouTubeను ఉపయోగించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

గమనిక: మీ Google యాప్‌లలో దేనిలోనైనా Google ఖాతా లేనట్లయితే, మీ పరికరం సైన్ అవుట్ అవుతుంది.

మీ యాప్‌లను అప్‌డేట్ చేసి ఉంచండి

ముఖ్య గమనిక: యూజర్ రక్షణను మెరుగుపరచడానికి, 2020కి ముందు విడుదల చేసిన Google iOS యాప్‌ల నిర్దిష్ట వెర్షన్‌లకు సైన్ ఇన్ చేయడానికి Google ఇకపై యూజర్‌లను అనుమతించదు. ఈ యాప్‌లకు చెందిన అప్‌డేట్ అయ్యి ఉన్న వెర్షన్‌లు మరింత సురక్షితమైనవి. 

iOSలో మీ Google యాప్‌లను అప్‌డేట్ చేయడానికి, ముందుగా మీ పరికరంలో iOSకు సంబంధించిన అప్‌డేట్ అయిన వెర్షన్ ఉందని నిర్ధారించుకోండి. ఆపై, App Storeలో మీ యాప్‌లను అప్‌డేట్ చేయండి.

చిట్కా: మీరు ఇప్పటికీ iOSలో Google Appsకు సైన్ ఇన్ చేయలేకపోతే, మీ బ్రౌజర్ నుండి మీ Google ఖాతా లేదా Gmailకు సైన్ ఇన్ చేయడానికి ట్రై చేయండి. 

Apple యాప్‌లతో మీ ఖాతాను సింక్ చేయడం

మీ iPhone లేదా iPadలలో వచ్చిన నిర్దిష్ట Google ప్రోడక్ట్‌ల లాంటి యాప్‌లతో మీరు మీ కంటెంట్‌ను సింక్ చేయవచ్చు. ఉదాహరణకు, మీరు వీటిని చేయవచ్చు:

  • Mail యాప్‌లో Gmail నుండి మీ ఇమెయిల్‌లను పొందవచ్చు
  • Calendar యాప్‌లో మీ Google Calendar ఈవెంట్‌లను చూడవచ్చు
Apple యాప్‌లతో మీ Google ఖాతాను సింక్ చేయడం

మీ పరికరంలో Apple యాప్‌లతో మీ Google ఖాతా నుండి కంటెంట్‌ను సింక్ చేయడానికి:

  1. మీ iPhone లేదా iPadలో, సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. కాంటాక్ట్‌లను ట్యాప్ చేయండి. మీరు కిందికి స్క్రోల్ చేయాల్సి రావచ్చు.
  3. 'ఖాతాను జోడించు'ను ట్యాప్ చేయండి. మీరు Google ఖాతాను ఇప్పటికే మీ పరికరంతో సింక్ చేసినట్లయితే, ఖాతాలను ట్యాప్ చేయండి.
  4. ఖాతాను జోడించు and then Googleను ట్యాప్ చేయండి.
  5. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయడానికి సూచనలను ఫాలో అవ్వండి.
  6. మీ పరికరంతో ఏ Google యాప్‌లను సింక్ చేయాలో ఎంచుకోండి. ఈ సెట్టింగ్‌లను ఎప్పుడైనా అప్‌డేట్ చేయవచ్చు.
  7. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

మీరు ఎంచుకున్న Google ఖాతా డేటా, మీ iPhone లేదా iPadతో సింక్ అవుతుంది. మీ కంటెంట్‌ను చూడటానికి, సంబంధిత యాప్‌ను తెరవండి.

మీ ఖాతాకు సింక్ అయ్యే దానిని మార్చడం లేదా ఖాతాను తీసివేయడం

మీ పరికరంలోని Apple యాప్‌లకు, మీ Google నుండి ఎలాంటి కంటెంట్ సింక్ అవ్వాలనేది మీరు మార్చవచ్చు. మీ Apple యాప్‌ల నుండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ Google ఖాతాను తీసివేయవచ్చు, దీని వల్ల సింక్ చేయడం ఆగిపోతుంది.

మీ Google ఖాతాకు సింక్ అయ్యే దానిని మార్చడం లేదా ఖాతాను తీసివేయడం:

  1. మీ iPhone లేదా iPadలో, సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. మెయిల్, కాంటాక్ట్‌లు లేదా క్యాలెండర్‌లను ఎంచుకోండి.
  3. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న లేదా తీసివేయాలనుకుంటున్న ఖాతాను ఎంచుకోండి.
  4. మీరు కోరుకుంటున్న మార్పులు చేయండి.
    • సింక్ అయ్యే కంటెంట్‌ను మార్చడానికి: మీరు సింక్ చేయాలనుకుంటున్న కంటెంట్ పక్కన ఉన్న, స్విచ్‌ను ఆన్ చేయండి. మీరు చేయవద్దనుకుంటున్న కంటెంట్‌కు పక్కన ఉన్న స్విచ్‌ను ఆఫ్ చేయండి.
    • మీ ఖాతాను తీసివేయడానికి: ఖాతాను తొలగించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

ఇతర యాప్‌లలో సైన్ ఇన్ చేయడం

మీరు మీ Google ఖాతాతో కొన్ని Google-కాని యాప్‌లు, వెబ్‌సైట్‌లలో సైన్ ఇన్ చేయవచ్చు.

ముఖ్యమైనది: మీ Google ఖాతాతో థర్డ్-పార్టీ ప్రోడక్ట్‌కు మీరు సైన్ ఇన్ చేసినప్పుడు, మీరు ఆటోమేటిక్‌గా Safariకి కూడా సైన్ ఇన్ చేయబడతారు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11868245579083265499
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false