Google సర్వీస్‌ల అంతటా ఇతరులు మీ గురించి ఏ సమాచారాన్ని చూడాలో కంట్రోల్ చేయండి

మీరు మీ Google ఖాతాలో కొంత సమాచారాన్ని ప్రైవేట్‌గా లేదా ఎవరికైనా కనిపించేలా చేయవచ్చు. ఆ విధంగా, మీ పుట్టిన తేదీ, ఫోన్ నంబర్ వంటి సమాచారాన్ని Google సర్వీస్‌ల అంతటా ఎవరు చూడవచ్చు అనే దానిపై మీకు కంట్రోల్ ఉంటుంది.

ఏ సమాచారాన్ని చూపించాలో ఎంచుకోండి

మీ Google ఖాతా ప్రొఫైల్‌ను చూపే Google సర్వీస్‌లను లేదా పరికరాలను ఉపయోగించే ఇతర వ్యక్తులు మీ పేరును, ప్రొఫైల్ ఫోటోను చెక్ చేయవచ్చు.
  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎడమ వైపున ఉన్న, వ్యక్తిగత సమాచారం ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. "ఇతరులు ఏమి చూడాలో ఎంచుకోండి" కింద, నా పరిచయానికి వెళ్లండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. సమాచార రకం కింద, మీ సమాచారాన్ని ప్రస్తుతానికి ఎవరెవరు చూడవచ్చనేది మీరు ఎంచుకోవచ్చు.
  5. కింది వాటిలో ఒక దాన్ని ఎంచుకోండి:
    • సమాచారాన్ని ప్రైవేట్‌గా ఉంచడానికి, మీకు మాత్రమే Private, tap to edit who can see this info ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • సమాచారాన్ని ఎవరికైనా కనిపించేలా చేయడానికి, ఎవరికైనా People ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

వ్యక్తిగత సమాచారాన్ని ఎడిట్ చేయండి

వ్యక్తిగత సమాచారాన్ని జోడించండి, ఎడిట్ చేయండి లేదా తీసివేయండి

ముఖ్య గమనిక: మీ Google ఖాతా నుండి కొంత సమాచారం తీసివేయబడదు. ఉదాహరణకు, మీరు మీ పేరు, ఇంకా పుట్టిన రోజునుఎడిట్ చేయవచ్చు, కానీ తీసివేయలేరు.

  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎడమ వైపున ఉన్న, వ్యక్తిగత సమాచారం ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. "ఇతరులు ఏమి చూడాలో ఎంచుకోండి" కింద, నా పరిచయానికి వెళ్లండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీ సమాచారాన్ని మార్చండి:
    • జోడించండి: మీరు సమాచారాన్ని జోడించాలనుకునే ప్రతి కేటగిరీ కోసం, Add user జోడించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • ఎడిట్ చేయండి: మీరు మార్చాలనుకుంటున్న సమాచారాన్ని క్లిక్ చేసి, ఎడిట్ చేయండి ఎడిట్ చేయండిఆప్షన్‌ను క్లిక్ చేయండి.
      • చిట్కా: ఒకవేళ మీ పేరును మీరు ఇటీవల మార్చినట్లయితే, మీరు దాన్ని మళ్లీ మార్చడానికి వేచి ఉండాల్సి ఉంటుంది.
    • తీసివేయండి: మీరు తీసివేయాలనుకుంటున్న సమాచారాన్ని క్లిక్ చేసి, ఆపై, తీసివేయండి Delete ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. స్క్రీన్‌పై కనిపించే దశలను ఫాలో అవ్వండి.

వ్యక్తిగత సమాచారాన్ని ఎడిట్ చేయండి

చిట్కా: మీ పాస్‌వర్డ్ వంటి ఖాతాకు సంబంధించిన ఇతర సమాచారాన్ని మార్చడానికి, మీ Google ఖాతాకు వెళ్లండి.

Google సర్వీస్‌లలో మీ ప్రొఫైల్స్‌ను చూడండి, మేనేజ్ చేయండి

కొన్ని Google సర్వీస్‌లలో, మీకు ఒక ప్రొఫైల్ ఉంటుంది, అది ఆ సర్వీస్‌ను ఉపయోగించే ఇతర వ్యక్తులకు కనిపిస్తుంది. కొన్ని సర్వీస్‌లకు సంబంధించిన మీ ప్రొఫైల్స్‌ను మీ Google ఖాతాలో మీరు కనుగొనవచ్చు. 

  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎడమ వైపున ఉన్న, వ్యక్తిగత సమాచారం ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. "మీ ప్రొఫైల్స్"కు స్క్రోల్ చేయండి. ఆపై, ప్రొఫైల్స్‌ను చూడండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. మీ ప్రొఫైల్ సమాచారాన్ని చూడటానికి, ఒక సర్వీస్‌ను ఎంచుకోండి.
  5. మీ ప్రొఫైల్ సమాచారాన్ని మేనేజ్ చేయడానికి, ఆ సర్వీస్‌కు వెళ్లండి.

ప్రొఫైల్ విజిబిలిటీ

Google ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లలో వ్యక్తులు మీ ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ ఆధారంగా మీ కోసం సెర్చ్ చేసినప్పుడు, వారు ఏమి కనుగొంటారో నిర్ణయించడంలో ప్రొఫైల్ విజిబిలిటీ సహాయపడుతుంది. దాన్ని సెట్ చేసేటప్పుడు, Google సర్వీస్‌లలో మీరు ఇంటరాక్ట్ అవ్వకపోయినా, మీ కాంటాక్ట్ సమాచారం ఉన్న వ్యక్తులు, మీ ప్రొఫైల్ ఫోటోను, మీ పూర్తి లేదా సంక్షిప్త పేరును చూడవచ్చా లేదా అనేది మీరు నిర్ణయిస్తారు. మీరు ఎవరితో అయినా ఇంటరాక్ట్ అయ్యాక, ఉదాహరణకు Google Chatలో కమ్యూనికేషన్ జరిపేటప్పుడు కానీ, లేదా Google Photosలో ఏదైనా ఆల్బమ్‌ను షేర్ చేసేటప్పుడు కానీ, వారికి సాధారణంగా మీ Google ఖాతాలో ఉన్న మీ పూర్తి పేరు, ఇంకా ప్రొఫైల్ ఫోటో కనిపిస్తాయి.

ప్రొఫైల్ విజిబిలిటీతో, ఈ కింద పేర్కొన్న పనులు మీరు చేయవచ్చు:

  • మీ ప్రధాన ప్రొఫైల్‌లోని మీ పేరును గానీ, లేదా మీ పేరుకు షార్ట్ వెర్షన్‌ను గానీ ఉపయోగించవచ్చు.
  • మీ ప్రొఫైల్ ఫోటోను చూపవచ్చు లేదా దాచవచ్చు.

ప్రొఫైల్ విజిబిలిటీని మేనేజ్ చేయండి

ముఖ్య గమనిక: ఫోన్ నంబర్ ఆధారంగా మిమ్మల్ని కనుగొనే వీలు వ్యక్తులకు కల్పించడానికి, మీ ఫోన్ నంబర్ సెట్టింగ్‌లలో ఫోన్ నంబర్ ఆధారంగా మిమ్మల్ని కనుగొనే వీలు వ్యక్తులకు కల్పించండిని ఆన్ చేయండి.

  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎడమ వైపున ఉన్న, వ్యక్తిగత సమాచారాన్ని క్లిక్ చేయండి.
  3. "మీ ప్రొఫైల్స్" కింద, ప్రొఫైల్స్‌ను చూడండిని క్లిక్ చేయండి.
  4. మీ ఫోటో, అలాగే పేరు కింద, ప్రొఫైల్ విజిబిలిటీ సెట్టింగ్‌లను క్లిక్ చేయండి.
  5. ప్రొఫైల్ విజిబిలిటీని ఆన్ చేయండి.
  6. మీ ప్రొఫైల్‌లో మీ పేరు, ఫోటో ఎలా కనిపించాలి అనేది ఎడిట్ చేయడానికి, మార్చండిని క్లిక్ చేయండి.

మీ సమాచారం గురించి మరిన్ని వివరాలు

ఏ సమాచారాన్ని చూపించవచ్చు

Google సర్వీస్‌లను ఉపయోగించే ఇతర వ్యక్తులకు మీరు చూపించగల లేదా దాచగల కొంత సమాచారం ఇక్కడ ఉంది:

  • మీ పుట్టిన తేదీ
  • మీ లింగం
  • మీరు పని చేసే సంస్థ వంటి ఉపాధి సమాచారం
  • వ్యక్తిగత, పని చేసే సంస్థ కాంటాక్ట్ సమాచారం
  • మీరు నివసించిన ప్రదేశాలు
  • విద్యా సంబంధిత సమాచారం

కింది సమాచారం మీరు సంప్రదించే లేదా షేర్ చేసే వ్యక్తులకు చూపించే అవకాశం ఉంది:

  • మీ పేరు
  • మారుపేరు
  • ప్రొఫైల్ ఫోటో
  • కవర్ ఫోటో
  • మీ Google ఖాతా ఇమెయిల్

చిట్కా: మీ "నా పరిచయం" పేజీలోని పేరు, ప్రొఫైల్ ఫోటో చాలా Google సర్వీస్‌లలో చూపబడతాయి. ఒకవేళ మీరు కొన్ని Google సర్వీస్‌లలో వేరే పేరు, ప్రొఫైల్ ఫోటోను ఉపయోగిస్తే, మీకు ఇప్పటికీ అవి అక్కడ కనిపిస్తాయి.

ఈ సమాచారం ఎక్కడ చూపబడుతుంది

మీరు ఎవరికైనా కనిపించేలా సెట్ చేసిన మీ Google ఖాతాలోని సమాచారాన్ని కొన్ని స్థలాలలో చూడవచ్చు:
  • Google Chat, ఇంకా Gmail వంటి మీరు సంప్రదించగల Google సర్వీస్‌లలోను.
  • మీరు కంటెంట్‌ను క్రియేట్ చేసే Google సర్వీస్‌లలో (ఉదాహరణకు, Maps, Play, YouTube).

మీ సమాచారాన్ని ఎవరు చూడగలరు

  • ప్రైవేట్: మీకు మాత్రమే కనిపిస్తుంది.
  • ఎవరైనా: ఎవరికైనా కనిపిస్తుంది.
  • మీరు ఇంటరాక్ట్ అయ్యే వ్యక్తులకు: Google Photosలో షేర్ చేయబడిన చాట్, ఇంకా ఫోటో ఆల్బమ్‌ల వంటి వాటి ద్వారా మీరు ఇంటరాక్ట్ అయ్యే వ్యక్తులకు కనిపిస్తుంది.
  • మీ సంస్థ: మీ సంస్థలోని అందరికీ కనిపిస్తుంది, అంటే మీ ఆఫీస్ లేదా స్కూల్ వంటివి. 
  • ఫ్యామిలీ: మీ ఫ్యామిలీ గ్రూప్‌లోని ఎవరికైనా కనిపిస్తుంది.

సంబంధిత రిసోర్స్‌లు

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6707800801408519442
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false