మీరు మీ Google ఖాతాలో కొంత సమాచారాన్ని ప్రైవేట్‌గా లేదా ఎవరికైనా కనిపించేలా చేయవచ్చు. ఆ విధంగా, మీ పుట్టిన తేదీ, ఫోన్ నంబర్ వంటి సమాచారాన్ని Google సర్వీస్‌ల అంతటా ఎవరు చూడవచ్చు అనే దానిపై మీకు కంట్రోల్ ఉంటుంది.
ఏ సమాచారాన్ని చూపించాలో ఎంచుకోండి
- మీ iPhone లేదా iPadలో, Gmail యాప్ ను తెరవండి.
- మెనూ సెట్టింగ్‌లు మీ ఖాతా మీ 'Google ఖాతాను మేనేజ్ చేయండి'ని ట్యాప్ చేయండి.
- చిట్కా: మీరు Gmailను ఉపయోగించకుంటే, myaccount.google.comకు వెళ్లండి.
- ఎగువున ఉన్న, వ్యక్తిగత సమాచారం నా పరిచయానికి వెళ్లండిని ట్యాప్ చేయండి.
- 'సమాచార రకం' దిగువున, ఈ సమాచారాన్ని ప్రస్తుతానికి ఎవరెవరు చూడవచ్చనేది మీరు ఎంచుకోవచ్చు.
- కింది వాటిలో ఒక దాన్ని ఎంచుకోండి:
- సమాచారాన్ని ప్రైవేట్‌గా ఉంచడానికి, మీకు మాత్రమే ను ట్యాప్ చేయండి.
- సమాచారాన్ని ఎవరికైనా కనిపించేలా చేయడానికి, ఎవరికైనా ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
వ్యక్తిగత సమాచారాన్ని జోడించండి, ఎడిట్ చేయండి లేదా తీసివేయండి
- మీ iPhone లేదా iPadలో, Gmail యాప్ ను తెరవండి.
- మెనూ సెట్టింగ్‌లు మీ ఖాతా మీ 'Google ఖాతాను మేనేజ్ చేయండి'ని ట్యాప్ చేయండి.
- చిట్కా: మీరు Gmailను ఉపయోగించకుంటే, myaccount.google.comకు వెళ్లండి.
- ఎగువున ఉన్న, వ్యక్తిగత సమాచారం నా పరిచయానికి వెళ్లండిని ట్యాప్ చేయండి.
- మీ సమాచారాన్ని మార్చండి:
- జోడించండి: మీరు సమాచారాన్ని జోడించాలనుకునే ప్రతి కేటగిరీ కోసం, జోడించండిని ట్యాప్ చేయండి.
- ఎడిట్ చేయండి: మీరు మార్చాలనుకుంటున్న సమాచారాన్ని ట్యాప్ చేసి, ఆపై, ఎడిట్ చేయండి ను ట్యాప్ చేయండి.
- చిట్కా: ఒకవేళ మీ పేరును మీరు ఇటీవల మార్చినట్లయితే, మీరు దాన్ని మళ్లీ మార్చడానికి వేచి ఉండాల్సి ఉంటుంది.
- తీసివేయండి: మీరు తీసివేయాలనుకుంటున్న సమాచారాన్ని ట్యాప్ చేసి, ఆపై, తీసివేయండిని ట్యాప్ చేయండి.
- స్క్రీన్‌పై కనిపించే దశలను ఫాలో అవ్వండి.
Google సర్వీస్‌లలో మీ ప్రొఫైల్స్‌ను చూడండి, మేనేజ్ చేయండి
కొన్ని Google సర్వీస్‌లలో, మీకు ఒక ప్రొఫైల్ ఉంటుంది, అది ఆ సర్వీస్‌ను ఉపయోగించే ఇతర వ్యక్తులకు కనిపిస్తుంది. కొన్ని సర్వీస్‌లకు సంబంధించిన మీ ప్రొఫైల్‌లను మీ Google ఖాతాలో మీరు కనుగొనవచ్చు.
- మీ iPhone లేదా iPadలో, మీ Google ఖాతాకు వెళ్లండి.
- ఎగువన ఉన్న, వ్యక్తిగత సమాచారాన్ని ట్యాప్ చేయండి.
- “మీ ప్రొఫైల్స్"కు స్క్రోల్ చేయండి. ఆపై, ప్రొఫైల్స్‌ను చూడండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- మీ ప్రొఫైల్ సమాచారాన్ని చూడటానికి, ఒక సర్వీస్‌ను ఎంచుకోండి.
- మీ ప్రొఫైల్ సమాచారాన్ని మేనేజ్ చేయడానికి, ఆ సర్వీస్‌కు వెళ్లండి.
ప్రొఫైల్ విజిబిలిటీ
Google ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లలో వ్యక్తులు మీ ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ ఆధారంగా మీ కోసం సెర్చ్ చేసినప్పుడు, వారు ఏమి కనుగొంటారో నిర్ణయించడంలో ప్రొఫైల్ విజిబిలిటీ సహాయపడుతుంది. దాన్ని సెట్ చేసేటప్పుడు, Google సర్వీస్‌లలో మీరు ఇంటరాక్ట్ అవ్వకపోయినా, మీ కాంటాక్ట్ సమాచారం ఉన్న వ్యక్తులు, మీ ప్రొఫైల్ ఫోటోను, మీ పూర్తి లేదా సంక్షిప్త పేరును చూడవచ్చా లేదా అనేది మీరు నిర్ణయిస్తారు. మీరు ఎవరితో అయినా ఇంటరాక్ట్ అయ్యాక, ఉదాహరణకు Google Chatలో కమ్యూనికేషన్ జరిపేటప్పుడు కానీ, లేదా Google Photosలో ఏదైనా ఆల్బమ్‌ను షేర్ చేసేటప్పుడు కానీ, వారికి సాధారణంగా మీ Google ఖాతాలో ఉన్న మీ పూర్తి పేరు, ఇంకా ప్రొఫైల్ ఫోటో కనిపిస్తాయి.
ప్రొఫైల్ విజిబిలిటీతో, ఈ కింద పేర్కొన్న పనులు మీరు చేయవచ్చు:
- మీ ప్రధాన ప్రొఫైల్‌లోని మీ పేరును గానీ, లేదా మీ పేరుకు షార్ట్ వెర్షన్‌ను గానీ ఉపయోగించవచ్చు.
- మీ ప్రొఫైల్ ఫోటోను చూపవచ్చు లేదా దాచవచ్చు.
ప్రొఫైల్ విజిబిలిటీని మేనేజ్ చేయండి
ముఖ్య గమనిక: ఫోన్ నంబర్ ఆధారంగా మిమ్మల్ని కనుగొనే వీలు వ్యక్తులకు కల్పించడానికి, మీ ఫోన్ నంబర్ సెట్టింగ్‌లలో ఫోన్ నంబర్ ఆధారంగా మిమ్మల్ని కనుగొనే వీలు వ్యక్తులకు కల్పించండిని ఆన్ చేయండి.
- మీ Google ఖాతాకు వెళ్లండి.
- పైన ఉన్న, వ్యక్తిగత సమాచారాన్ని ట్యాప్ చేయండి.
- "మీ ప్రొఫైల్స్" కింద, ప్రొఫైల్స్‌ను చూడండిని ట్యాప్ చేయండి.
- మీ ఫోటో, అలాగే పేరు కింద, ప్రొఫైల్ విజిబిలిటీ సెట్టింగ్‌లను ట్యాప్ చేయండి.
- ప్రొఫైల్ విజిబిలిటీని ఆన్ చేయండి.
- మీ ప్రొఫైల్‌లో మీ పేరు, ఫోటో ఎలా కనిపించాలి అనేది ఎడిట్ చేయడానికి, మార్చండిని ట్యాప్ చేయండి.
మీ సమాచారం గురించి మరిన్ని వివరాలు
ఏ సమాచారాన్ని చూపించవచ్చు
Google సర్వీస్‌లను ఉపయోగించే ఇతర వ్యక్తులకు మీరు చూపించగల లేదా దాచగల కొంత సమాచారం ఇక్కడ ఉంది:
- మీ పుట్టిన తేదీ
- మీ లింగం
- మీరు పని చేసే సంస్థ వంటి ఉపాధి సమాచారం
- వ్యక్తిగత, పని చేసే సంస్థ కాంటాక్ట్ సమాచారం
- మీరు నివసించిన ప్రదేశాలు
- విద్యా సంబంధిత సమాచారం
కింది సమాచారం మీరు సంప్రదించే లేదా షేర్ చేసే వ్యక్తులకు చూపించే అవకాశం ఉంది:
- మీ పేరు
- మారుపేరు
- ప్రొఫైల్ ఫోటో
- కవర్ ఫోటో
- మీ Google ఖాతా ఇమెయిల్
చిట్కా: మీ "నా పరిచయం" పేజీలోని పేరు, ప్రొఫైల్ ఫోటో చాలా Google సర్వీస్‌లలో చూపబడతాయి. ఒకవేళ మీరు కొన్ని Google సర్వీస్‌లలో వేరే పేరు, ప్రొఫైల్ ఫోటోను ఉపయోగిస్తే, మీకు ఇప్పటికీ అవి అక్కడ కనిపిస్తాయి.
ఈ సమాచారం ఎక్కడ చూపబడుతుంది
- Google Chat, ఇంకా Gmail వంటి మీరు సంప్రదించగల Google సర్వీస్లలోను.
- మీరు కంటెంట్‌ను క్రియేట్ చేసే Google సర్వీస్‌లలో (ఉదాహరణకు, Maps, Play, YouTube).
మీ సమాచారాన్ని ఎవరు చూడగలరు
- ప్రైవేట్: మీకు మాత్రమే కనిపిస్తుంది.
- ఎవరైనా: ఎవరికైనా కనిపిస్తుంది.
- మీరు ఇంటరాక్ట్ అయ్యే వ్యక్తులకు: Google Photosలో షేర్ చేయబడిన చాట్, ఇంకా ఫోటో ఆల్బమ్‌ల వంటి వాటి ద్వారా మీరు ఇంటరాక్ట్ అయ్యే వ్యక్తులకు కనిపిస్తుంది.
- మీ సంస్థ: మీ సంస్థలోని అందరికీ కనిపిస్తుంది, అంటే మీ ఆఫీస్ లేదా స్కూల్ వంటివి.
- ఫ్యామిలీ: మీ ఫ్యామిలీ గ్రూప్‌లోని ఎవరికైనా కనిపిస్తుంది.