మీ పాస్‌వర్డ్‌లను సేవ్ చేయండి, మేనేజ్ చేయండి & సురక్షితంగా ఉంచుకోండి

మీ అన్ని ఆన్‌లైన్ ఖాతాల కోసం శక్తివంతమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ని ఉపయోగించడం Google Password Manager సులభం చేస్తుంది. మీరు Google Password Managerను ఉపయోగించినప్పుడు, మీరు మీ Google ఖాతాలో లేదా మీ పరికరంలో పాస్‌వర్డ్‌లను సేవ్ చేయవచ్చు.

ముఖ్య గమనిక: మీ Google ఖాతాకు పాస్‌వర్డ్‌లను సేవ్ చేసేటప్పుడు Google Password Manager శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను మాత్రమే సూచిస్తుంది.

మీరు Google Password Managerను ఈ కింది వాటి కోసం ఉపయోగించవచ్చు:

  • మీ Google ఖాతాకు శక్తివంతమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసి సేవ్ చేయడానికి, తద్వారా మీరు వాటిని గుర్తుంచుకోవలసిన అవసరం లేదు.
  • బిల్ట్-ఇన్ సెక్యూరిటీతో మీ 'సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లు' అన్నింటినీ సురక్షితం చేసుకోవడానికి.
  • సైట్‌లు, యాప్‌లలో పాస్‌వర్డ్‌లను ఆటోమేటిక్‌గా పూరించడానికి.

Google Password Manager మీ ఆన్‌లైన్ సెక్యూరిటీని ఎలా మెరుగుపరచగలదు

మీ పాస్‌వర్డ్‌లను మేనేజ్ చేయడం కోసం భద్రత ఉన్న విధానం

ఖాతాలు హ్యాక్ అవ్వడానికి కారణమయ్యే అత్యంత సాధారణ మార్గాలలో పాస్‌వర్డ్‌లు దొంగిలించబడటం అనేది ఒకటి.

మీ ఖాతాలను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి, మీరు Google Password Managerను ఈ కింద ఉన్న వాటి కోసం ఉపయోగించవచ్చు:

  • శక్తివంతమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను సూచించడానికి, అలాగే వాటిని మీ Google ఖాతాలో సేవ్ చేయడానికి, ఇది ఒకే దొంగిలించబడిన పాస్‌వర్డ్ నుండి పలు ఖాతాల చోరీలను నివారించడానికి ఉపయోగపడుతుంది.
  • చోరీకి గురైన పాస్‌వర్డ్‌ల గురించి మీకు తెలియజేయడానికి. ఎవరైనా మీ సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను ఇంటర్నెట్‌లో పబ్లిష్ చేస్తే, Google Password Manager ఏవైనా చోరీకి గురైన పాస్‌వర్డ్‌లను మార్చడంలో మీకు సహాయం చేస్తుంది.
  • అనధికార యాక్సెస్‌ను బ్లాక్ చేయడంలో సహాయపడండి. మీ పాస్‌వర్డ్‌లు ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగించి Google బిల్ట్-ఇన్ సెక్యూరిటీ వెనుక స్టోర్ చేయబడతాయి.

చిట్కా: సేవ్ చేసిన మీ పాస్‌వర్డ్‌లకు మరింత సెక్యూరిటీని జోడించడానికి, మీరు రికవరీ సమాచారాన్ని జోడించి, 2-దశల వెరిఫికేషన్‌ను ఆన్ చేయవచ్చు.

Google Password Managerను ఉపయోగించండి

Android యాప్‌ల కోసం

ప్రారంభించండి

ముఖ్య గమనిక: మీ పరికరంలో ఈ దశలు మారవచ్చు. ఈ సెట్టింగ్‌కు నేరుగా వెళ్లడానికి మీరు “ఆటోఫిల్ సర్వీస్” కోసం మీ సెట్టింగ్‌ల యాప్‌ను కూడా సెర్చ్ చేయవచ్చు.

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, సెట్టింగ్‌లు యాప్‌ను తెరవండి.
  2. కిందికి స్క్రోల్ చేసి, సిస్టమ్ ఆ తర్వాత భాషలు & ఇన్‌పుట్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. అధునాతనం ఆ తర్వాత ఆటోఫిల్ సర్వీస్ ఆ తర్వాత ఆటోఫిల్ సర్వీస్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. Googleఆ తర్వాత సరే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. వెనుకకు వెళ్లండి Back ఆ తర్వాతసెట్టింగ్‌లు Settings ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  6. Googleతో ఆటోఫిల్‌ను ఉపయోగించండి ఆప్షన్ ఆన్ చేయబడిందని నిర్ధారించుకోండి.
  7. మీరు ఉపయోగించాలనుకుంటున్న ఖాతా, "ఖాతా" కింద లిస్ట్ చేయబడి ఉన్నదేనని నిర్ధారించుకోండి.

చిట్కా: ఒకే Google ఖాతాతో Chrome, Androidకు సైన్ ఇన్ చేయడం వలన మీరు సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లకు ఎల్లప్పుడూ యాక్సెస్ ఉండేలా చేస్తుంది.

శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసి, సేవ్ చేయండి

మీరు ఒక యాప్‌లో కొత్త ఖాతాను క్రియేట్ చేసినప్పుడు, Android శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను సూచించి, సేవ్ చేయగలదు.

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, పాస్‌వర్డ్ క్రియేషన్ ఫీల్డ్‌ను ట్యాప్ చేయండి.
  2. కీబోర్డ్‌కు పైన, పాస్‌వర్డ్‌లు Passwords ఆ తర్వాత పాస్‌వర్డ్‌ను జెనరేట్ చేసి, మీ Google ఖాతాకు సేవ్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీ యూజర్‌నేమ్‌ను పూర్తి చేసి, పాస్‌వర్డ్‌ను సేవ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

సేవ్ చేసిన పాస్‌వర్డ్‌తో సైన్ ఇన్ చేయండి

గతంలో ఒకవేళ మీరు మీ పాస్‌వర్డ్‌ను యాప్‌నకు సేవ్ చేసి ఉంటే, సైన్ ఇన్ చేయడంలో Android మీకు సహాయపడగలదు.

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, మీరు దేనిలోకి సైన్ ఇన్ చేయాలనుకుంటున్నారో ఆ యాప్‌ను తెరవండి. మీరు యాప్ యొక్క సైన్-ఇన్ పేజీకి వెళ్లాల్సి రావచ్చు.
  2. యూజర్‌నేమ్ ఫీల్డ్‌ను ట్యాప్ చేసి, మీ యూజర్‌నేమ్‌ను ఎంచుకోండి లేదా టైప్ చేయండి.
  3. పాస్‌వర్డ్ ఫీల్డ్‌ను ట్యాప్ చేయండి.
  4. కీబోర్డ్‌కు పైన, కుడి వైపున, పాస్‌వర్డ్‌లు Passwords ఆ తర్వాత సేవ్ చేసిన పాస్‌వర్డ్‌ను ఎంచుకోండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • పాస్‌వర్డ్‌లు Passwords కనిపించకపోతే, పాస్‌వర్డ్ ఫీల్డ్‌ను నొక్కి, పట్టుకోండి. ఆపై, ఆటోఫిల్ ఆ తర్వాత సేవ్ చేసిన పాస్‌వర్డ్‌ను ఎంచుకోండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. మీరు దేనిలోకి సైన్ ఇన్ చేయాలనుకుంటున్నారో ఆ యాప్ పేరు మీద ట్యాప్ చేయండి.

Chrome కోసం

శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసి, సేవ్ చేయండి

మీరు ఒక సైట్‌లో కొత్త ఖాతాను క్రియేట్ చేసినప్పుడు, Chrome శక్తివంతమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ను సూచించగలదు. 'సూచించిన పాస్‌వర్డ్'‌ను మీరు ఉపయోగిస్తే, అది ఆటోమేటిక్‌గా సేవ్ చేయబడుతుంది.

మీరు ఒక సైట్‌లో కొత్త పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేస్తే, దాన్ని సేవ్ చేయమని Chrome అడగవచ్చు. అంగీకరించడానికి, సేవ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

  • ఎంటర్ చేసిన పాస్‌వర్డ్‌ను చూడటానికి: ప్రివ్యూ Previewను ఎంచుకోండి.
  • పేజీలో పలు పాస్‌వర్డ్‌లు ఉంటే: కింది వైపు బాణాన్ని ఎంచుకోండి. మీరు సేవ్ చేయాలనుకుంటున్న పాస్‌వర్డ్‌ను ఎంచుకోండి.
  • మీ యూజర్‌నేమ్ ఖాళీగా లేదా తప్పుగా ఉంటే: "యూజర్‌నేమ్" పక్కన ఉన్న టెక్స్ట్ బాక్స్‌ను ఎంచుకోండి. మీరు సేవ్ చేయాలనుకుంటున్న యూజర్‌నేమ్‌ను ఎంటర్ చేయండి.
  • మీరు వేరొక పాస్‌వర్డ్‌ను సేవ్ చేయాలనుకుంటే: "పాస్‌వర్డ్" పక్కన ఉన్న టెక్స్ట్ బాక్స్‌ను ఎంచుకోండి. మీరు సేవ్ చేయాలనుకుంటున్న పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి.

మీ పాస్‌వర్డ్‌లను సేవ్ చేయడానికి Chrome ఆఫర్ చేయకపోతే

ఆటోమేటిక్‌గా మిమ్మల్ని అడగకపోతే, మీ పాస్‌వర్డ్‌ను సేవ్ చేయండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Chrome యాప్ Chrome‌ను తెరవండి .
  2. మీరు ఏ వెబ్‌సైట్ కోసం అయితే పాస్‌వర్డ్‌ను సేవ్ చేయాలనుకుంటున్నారో దానిలో మీ సమాచారాన్ని ఎంటర్ చేయండి.
  3. అడ్రస్ బార్‌కు కుడి వైపున, పాస్‌వర్డ్‌లు Passwords ఆ తర్వాత సేవ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీకు పాస్‌వర్డ్‌లు Passwords కనిపించకపోతే, మీ పాస్‌వర్డ్‌ను తొలగించి, మళ్లీ సైన్ ఇన్ చేయడానికి ట్రై చేయండి.

పాస్‌వర్డ్‌లను సేవ్ చేయడాన్ని ప్రారంభించండి లేదా ఆపివేయండి

ఆటోమేటిక్‌గా, మీ పాస్‌వర్డ్‌ను సేవ్ చేసే ఆప్షన్‌ను Chrome అందిస్తోంది. మీ Google ఖాతాలో పాస్‌వర్డ్‌లను సేవ్ చేయడాన్ని మీరు ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు లేదా Chromeలో చేయవచ్చు:

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Chrome యాప్ Chromeను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మరిన్ని ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. సెట్టింగ్‌లు Settings ఆ తర్వాత పాస్‌వర్డ్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. పాస్‌వర్డ్‌లను సేవ్ చేయండి ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

సేవ్ చేసిన పాస్‌వర్డ్‌తో సైన్ ఇన్ చేయండి

మీరు గతంలో ఒక వెబ్‌సైట్‌ను సందర్శించినప్పుడు మీ పాస్‌వర్డ్‌ను సేవ్ చేసి ఉంటే, సైన్ ఇన్ చేయడంలో Chrome మీకు సహాయపడగలదు.

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Chrome Chrome‌ను తెరవండి.
  2. మీరు ఇంతకు ముందు సందర్శించిన సైట్‌కు వెళ్లండి.
  3. సైట్‌కు చెందిన సైన్ ఇన్ ఫారమ్‌కు వెళ్లండి.
  • మీరు సైట్ కోసం ఒకే యూజర్‌నేమ్‌ను, పాస్‌వర్డ్‌ను సేవ్ చేసినట్లయితే: Chrome ఆటోమేటిక్‌గా సైన్ ఇన్ ఫారమ్‌ను పూరించవచ్చు.
  • మీరు ఒకటి కంటే ఎక్కువ యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌లను సేవ్ చేసినట్లయితే: యూజర్‌నేమ్ ఫీల్డ్‌ను ఎంచుకుని, మీరు ఉపయోగించాలనుకుంటున్న సైన్ ఇన్ సమాచారాన్ని ఎంచుకోండి.
  • మీ సేవ్ చేసిన పాస్‌వర్డ్‌ను Chrome అందించకపోతే: సాధ్యమైన పాస్‌వర్డ్‌లను చూడటానికి, పాస్‌వర్డ్‌లు Passwords ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

చిట్కా: Google Password Managerను మరింత వేగంగా పొందడానికి, మీ Password Manager సెట్టింగ్‌కు వెళ్లి, మీ మొదటి స్క్రీన్‌కు షార్ట్‌కట్‌ను జోడించండి.

మీ పాస్‌వర్డ్‌లను మేనేజ్ చేసుకోండి, సురక్షితం చేసుకోండి

సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను కనుగొనండి, తొలగించండి లేదా ఎగుమతి చేయండి

సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లతో ఖాతాల లిస్ట్‌ను కనుగొనడానికి, మీరు passwords.google.com లింక్‌కు వెళ్లవచ్చు లేదా మీ పరికరంలోని Google Password Managerలో మీ పాస్‌వర్డ్‌లను చూడవచ్చు.

  • పాస్‌వర్డ్‌ను కనుగొనడానికి: ఖాతాను కనుగొని, ఆపై ప్రివ్యూ చేయండి Previewని ట్యాప్ చేయండి.
  • పాస్‌వర్డ్‌ను తొలగించడానికి: ఖాతాను కనుగొని, ఆపై తొలగించండిని ట్యాప్ చేయండి.
  • మీ పాస్‌వర్డ్‌లను ఎగుమతి చేయడానికి: సెట్టింగ్‌లు Settings ఆ తర్వాత పాస్‌వర్డ్‌లను ఎగుమతి చేయండి ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
సురక్షితం కాని పాస్‌వర్డ్‌ల కోసం చెక్ చేయండి

వీటి కోసం మీ 'సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లు' అన్నింటినీ మీరు ఒకేసారి చెక్ చేసుకోవచ్చు:

  • ఇంటర్నెట్‌లో పబ్లిష్ చేయబడిందేమో తెలుసుకోవడానికి
  • డేటా ఉల్లంఘనలో బహిర్గతమయ్యాయా లేదా అని తెలుసుకోవడానికి
  • బలహీనంగా ఉన్నాయా, ఊహించడానికి సులభంగా ఉన్నాయా అని తెలుసుకోవడానికి
  • బహుళ ఖాతాలలో ఉపయోగించబడిందా అని తెలుసుకోవడానికి

సేవ్ చేసిన మీ పాస్‌వర్డ్‌లను చెక్ చేయడానికి, పాస్‌వర్డ్ చెకప్ విభాగానికి వెళ్లండి.

పాస్‌వర్డ్ చెకప్ గురించి మరింత తెలుసుకోండి.

Password Manager సెట్టింగ్‌లను మార్చండి
  1. passwords.google.com లింక్‌కు వెళ్లండి.
  2. ఎగువ కుడి వైపున, సెట్టింగ్‌లు Settings అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. ఇక్కడ నుండి మీరు మీ సెట్టింగ్‌లను మేనేజ్ చేయవచ్చు.
    • పాస్‌వర్డ్‌లను సేవ్ చేయడానికి వచ్చే ఆఫర్‌లు: Androidలో, Chromeలో పాస్‌వర్డ్‌లను సేవ్ చేయడానికి వచ్చే ఆఫర్‌లను మేనేజ్ చేయండి.
    • నిర్దిష్ట సైట్‌లు లేదా యాప్‌ల కోసం పాస్‌వర్డ్‌లకు సంబంధించిన ఆఫర్‌లను మేనేజ్ చేయండి: నిర్దిష్ట సైట్‌ల విషయంలో, పాస్‌వర్డ్‌లు ఎప్పటికీ సేవ్ అవ్వకుండా ఉండేలా మీరు సెట్ చేయవచ్చు. పాస్‌వర్డ్‌ను సేవ్ చేయమని మీకు ప్రాంప్ట్ వచ్చినప్పుడు, 'ఎప్పటికీ వద్దు'ను ఎంచుకోండి. మీరు ఈ పాస్‌వర్డ్‌ను సేవ్ చేయాలని తర్వాత నిర్ణయించుకుంటే, సైట్ లేదా యాప్ పేరు పక్కన ఉండే తీసివేయండి Removeని ఎంచుకోండి.
    • ఆటో సైన్ ఇన్ చేయండి: మీరు సేవ్ చేసిన సమాచారాన్ని ఉపయోగించి సైట్‌లకు, యాప్‌లకు మీరు ఆటోమేటిక్‌గా సైన్ ఇన్ చేయవచ్చు. సైన్ ఇన్ చేసే ముందు మీరు నిర్ధారించాలని అనుకున్నట్లయితే, మీరు ఆటో సైన్ ఇన్‌ను ఆఫ్ చేసుకోవచ్చు.
    • పాస్‌వర్డ్ హెచ్చరికలు: సేవ్ చేసిన మీ పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో కనుగొనబడినప్పుడు మీరు నోటిఫికేషన్‌లను పొందవచ్చు.
    • పరికరంలో ఎన్‌క్రిప్షన్: పాస్‌వర్డ్‌లు Google Password Managerలో సేవ్ కావడానికి ముందు, వాటిని మీ పరికరంలో ఎన్‌క్రిప్ట్ చేయండి. మీ పరికరంలో పాస్‌వర్డ్‌లను ఎలా ఎన్‌క్రిప్ట్ చేయాలో తెలుసుకోండి. ఈ ఫీచర్ Workspace యూజర్‌లకు అందుబాటులో లేదు.

Google Password Manager మీ డేటాను ఎలా హ్యాండిల్ చేస్తుంది

మీ పరికరంలో సర్వీసు‌లను అమలు చేయడానికి Google Password Manager నిర్దిష్ట సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ ఫంక్షనాలిటీలో కొంత, Google Play సర్వీసులను ఉపయోగిస్తుంది. ఉదాహరణకు, Google Password Manager ఈ సమాచారాన్ని ఎనలిటిక్స్, అలాగే పరిష్కార ప్రక్రియ ప్రయోజనాల కోసం సేకరిస్తుంది:

  • పేజీ వీక్షణలు, యాప్‌లోని ట్యాప్‌లు
  • క్రాష్ లాగ్‌లు
  • సమస్య విశ్లేషణలు

డేటా ఉల్లంఘన ప్రమాదాన్ని తగ్గించడానికి మీ సింక్ చేసిన డేటా ఎల్లప్పుడూ పారిశ్రామిక రంగంలోని అత్యధునాతన ఎన్‌క్రిప్షన్ ద్వారా రక్షించబడుతుంది. పారిశ్రామిక రంగంలోని అత్యధునాతన ఎన్‌క్రిప్షన్ గురించి మరింత తెలుసుకోండి.

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7587909429800471631
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false