మీ పాస్‌వర్డ్‌లను సేవ్ చేయండి, మేనేజ్ చేయండి & సురక్షితంగా ఉంచుకోండి

మీ అన్ని ఆన్‌లైన్ ఖాతాల కోసం శక్తివంతమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ని ఉపయోగించడం Google Password Manager సులభం చేస్తుంది. మీరు Google Password Managerను ఉపయోగించినప్పుడు, మీరు మీ Google ఖాతాలో లేదా మీ పరికరంలో పాస్‌వర్డ్‌లను సేవ్ చేయవచ్చు.

ముఖ్య గమనిక: మీ Google ఖాతాకు పాస్‌వర్డ్‌లను సేవ్ చేసేటప్పుడు Google Password Manager శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను మాత్రమే సూచిస్తుంది.

మీరు Google Password Managerను ఈ కింది వాటి కోసం ఉపయోగించవచ్చు:

  • మీ Google ఖాతాకు శక్తివంతమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసి సేవ్ చేయడానికి, తద్వారా మీరు వాటిని గుర్తుంచుకోవలసిన అవసరం లేదు.
  • బిల్ట్-ఇన్ సెక్యూరిటీతో మీ 'సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లు' అన్నింటినీ సురక్షితం చేసుకోవడానికి.
  • సైట్‌లు, యాప్‌లలో పాస్‌వర్డ్‌లను ఆటోమేటిక్‌గా పూరించడానికి.

Google Password Manager మీ ఆన్‌లైన్ సెక్యూరిటీని ఎలా మెరుగుపరచగలదు

మీ పాస్‌వర్డ్‌లను మేనేజ్ చేయడం కోసం భద్రత ఉన్న విధానం

ఖాతాలు హ్యాక్ అవ్వడానికి కారణమయ్యే అత్యంత సాధారణ మార్గాలలో పాస్‌వర్డ్‌లు దొంగిలించబడటం అనేది ఒకటి.

మీ ఖాతాలను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి, మీరు Google Password Managerను ఈ కింద ఉన్న వాటి కోసం ఉపయోగించవచ్చు:

  • శక్తివంతమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను సూచించడానికి, అలాగే వాటిని మీ Google ఖాతాలో సేవ్ చేయడానికి, ఇది ఒకే దొంగిలించబడిన పాస్‌వర్డ్ నుండి పలు ఖాతాల చోరీలను నివారించడానికి ఉపయోగపడుతుంది.
  • చోరీకి గురైన పాస్‌వర్డ్‌ల గురించి మీకు తెలియజేయడానికి. ఎవరైనా మీ సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను ఇంటర్నెట్‌లో పబ్లిష్ చేస్తే, Google Password Manager ఏవైనా చోరీకి గురైన పాస్‌వర్డ్‌లను మార్చడంలో మీకు సహాయం చేస్తుంది.
  • అనధికార యాక్సెస్‌ను బ్లాక్ చేయడంలో సహాయపడండి. మీ పాస్‌వర్డ్‌లు ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగించి Google బిల్ట్-ఇన్ సెక్యూరిటీ వెనుక స్టోర్ చేయబడతాయి.

చిట్కా: సేవ్ చేసిన మీ పాస్‌వర్డ్‌లకు మరింత సెక్యూరిటీని జోడించడానికి, మీరు రికవరీ సమాచారాన్ని జోడించి, 2-దశల వెరిఫికేషన్‌ను ఆన్ చేయవచ్చు.

Google Password Managerను ఉపయోగించండి

ప్రారంభించండి

మీ అన్ని పరికరాలలో మీ పాస్‌వర్డ్‌లను ఉపయోగించడానికి, మీరు వీటిని చేయవచ్చు:

పాస్‌వర్డ్‌లను సేవ్ చేసి, ఉపయోగించండి

Chromeతో పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేయండి, సేవ్ చేయండి, ఇంకా పూరించండి

మీరు ఒక సైట్‌లో కొత్త ఖాతాను క్రియేట్ చేసినప్పుడు, Chrome శక్తివంతమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ను సూచించగలదు. 'సూచించిన పాస్‌వర్డ్'‌ను మీరు ఉపయోగిస్తే, అది ఆటోమేటిక్‌గా సేవ్ చేయబడుతుంది.

మీరు ఒక సైట్‌లో కొత్త పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేస్తే, దాన్ని సేవ్ చేయమని Chrome అడగవచ్చు. అంగీకరించడానికి, సేవ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

  • ఎంటర్ చేసిన పాస్‌వర్డ్‌ను చూడటానికి, ప్రివ్యూ Previewను క్లిక్ చేయండి.
  • పేజీలో పలు పాస్‌వర్డ్‌లు ఉంటే, కింది వైపు బాణాన్ని క్లిక్ చేయండి. మీరు సేవ్ చేయాలనుకుంటున్న పాస్‌వర్డ్‌ను ఎంచుకోండి.
  • ఒకవేళ మీ యూజర్‌నేమ్ ఖాళీగా లేదా తప్పుగా ఉంటే, "యూజర్‌నేమ్" పక్కన ఉన్న టెక్స్ట్ బాక్స్‌ను ట్యాప్ చేయండి. మీరు సేవ్ చేయాలనుకుంటున్న యూజర్‌నేమ్‌ను ఎంటర్ చేయండి.
  • ఒకవేళ మీరు వేరొక పాస్‌వర్డ్‌ను సేవ్ చేయాలనుకుంటే, "పాస్‌వర్డ్" పక్కన ఉన్న టెక్స్ట్ బాక్స్‌ను క్లిక్ చేయండి. మీరు సేవ్ చేయాలనుకుంటున్న పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి. ఆపై, సేవ్ చేయి ఆప్షన్‌ను ఎంచుకోండి.

మీ పాస్‌వర్డ్‌లను సేవ్ చేయడానికి Chrome ఆఫర్ చేయకపోతే

ఆటోమేటిక్‌గా మిమ్మల్ని అడగకపోతే, మీ పాస్‌వర్డ్‌ను సేవ్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Chrome Chrome‌ను తెరవండి.
  2. మీరు ఏ వెబ్‌సైట్ కోసం అయితే పాస్‌వర్డ్‌ను సేవ్ చేయాలనుకుంటున్నారో దానిలో మీ సమాచారాన్ని ఎంటర్ చేయండి.
  3. అడ్రస్ బార్‌కు కుడి వైపున, పాస్‌వర్డ్‌లు Passwords ఆ తర్వాతసేవ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీకు పాస్‌వర్డ్‌లు Passwords కనిపించకపోతే, మీ పాస్‌వర్డ్‌ను తొలగించి, మళ్లీ సైన్ ఇన్ చేయడానికి ట్రై చేయండి.

పాస్‌వర్డ్‌లను సేవ్ చేయడానికి ఆఫర్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయండి

ఆటోమేటిక్‌గా, మీ పాస్‌వర్డ్‌ను సేవ్ చేసే ఆప్షన్‌ను Chrome అందిస్తోంది. మీ Google ఖాతాలో పాస్‌వర్డ్‌లను సేవ్ చేయడాన్ని మీరు ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు లేదా Chromeలో చేయవచ్చు:

  1. మీ కంప్యూటర్‌లో, Chrome Chrome‌ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ ఆ తర్వాత పాస్‌వర్డ్‌లు Passwords ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. పాస్‌వర్డ్‌లను సేవ్ చేయడానికి ఆఫర్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

Chromeలో సేవ్ చేసిన పాస్‌వర్డ్‌తో సైన్ ఇన్ చేయండి

మీరు గతంలో ఒక వెబ్‌సైట్‌ను సందర్శించినపుడు మీ పాస్‌వర్డ్‌ను Chromeకు సేవ్ చేసి ఉంటే, సైన్ ఇన్ చేయడంలో Chrome మీకు సహాయపడగలదు.

  1. మీ కంప్యూటర్‌లో, మీరు ముందే సందర్శించిన సైట్‌కు వెళ్లండి.
  2. సైట్‌కు చెందిన సైన్ ఇన్ ఫారమ్‌కు వెళ్లండి.
    • మీరు సైట్ కోసం ఒకే యూజర్‌నేమ్‌ను, పాస్‌వర్డ్‌ను సేవ్ చేసినట్లయితే: Chrome ఆటోమేటిక్‌గా సైన్ ఇన్ ఫారమ్‌ను పూరించవచ్చు.
    • మీరు ఒకటి కంటే ఎక్కువ యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌లను సేవ్ చేసినట్లయితే: యూజర్‌నేమ్ ఫీల్డ్‌ను ఎంచుకుని, మీరు ఉపయోగించాలనుకుంటున్న సైన్ ఇన్ సమాచారాన్ని ఎంచుకోండి.

Google Password Managerకు మారండి

వేరొక సర్వీస్ నుండి, మీరు మీ Google ఖాతాకు పాస్‌వర్డ్‌లను దిగుమతి చేయవచ్చు.

మీ పాస్‌వర్డ్‌లను మేనేజ్ చేసుకోండి, సురక్షితం చేసుకోండి

సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను కనుగొనండి, తొలగించండి లేదా ఎగుమతి చేయండి

సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లతో ఖాతాల లిస్ట్‌ను కనుగొనడానికి, మీరు passwords.google.com లింక్‌కు వెళ్లవచ్చు లేదా మీ పరికరంలోని Google Password Managerలో మీ పాస్‌వర్డ్‌లను చూడవచ్చు.

  • పాస్‌వర్డ్‌ను కనుగొనడానికి: ఖాతాను ఎంచుకొని, ఆపై ప్రివ్యూ చేయండి Previewని క్లిక్ చేయండి.
  • పాస్‌వర్డ్‌ను తొలగించడానికి: ఖాతాను కనుగొని, ఆపై తొలగించండిని క్లిక్ చేయండి.
  • మీ పాస్‌వర్డ్‌లను ఎగుమతి చేయడానికి: సెట్టింగ్‌లు Settings ఆ తర్వాతపాస్‌వర్డ్‌లను ఎగుమతి చేయండిని క్లిక్ చేయండి.
సురక్షితం కాని పాస్‌వర్డ్‌ల కోసం చెక్ చేయండి

వీటి కోసం మీ 'సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లు' అన్నింటినీ మీరు ఒకేసారి చెక్ చేసుకోవచ్చు:

  • ఇంటర్నెట్‌లో పబ్లిష్ చేయబడిందేమో తెలుసుకోవడానికి
  • డేటా ఉల్లంఘనలో బహిర్గతమయ్యాయా లేదా అని తెలుసుకోవడానికి
  • బలహీనంగా ఉన్నాయా, ఊహించడానికి సులభంగా ఉన్నాయా అని తెలుసుకోవడానికి
  • బహుళ ఖాతాలలో ఉపయోగించబడిందా అని తెలుసుకోవడానికి

సేవ్ చేసిన మీ పాస్‌వర్డ్‌లను చెక్ చేయడానికి, పాస్‌వర్డ్ చెకప్ విభాగానికి వెళ్లండి.

పాస్‌వర్డ్ చెకప్ గురించి మరింత తెలుసుకోండి.

Password Manager సెట్టింగ్‌లను మార్చండి
  1. passwords.google.com లింక్‌కు వెళ్లండి.
  2. ఎగువ కుడి వైపున, సెట్టింగ్‌లు Settings అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. ఇక్కడ నుండి మీరు మీ సెట్టింగ్‌లను మేనేజ్ చేయవచ్చు.
    • పాస్‌వర్డ్‌లను సేవ్ చేయడానికి వచ్చే ఆఫర్‌లు: Androidలో, Chromeలో పాస్‌వర్డ్‌లను సేవ్ చేయడానికి వచ్చే ఆఫర్‌లను మేనేజ్ చేయండి.
    • నిర్దిష్ట సైట్‌లు లేదా యాప్‌ల కోసం పాస్‌వర్డ్‌లకు సంబంధించిన ఆఫర్‌లను మేనేజ్ చేయండి: నిర్దిష్ట సైట్‌ల విషయంలో, పాస్‌వర్డ్‌లు ఎప్పటికీ సేవ్ అవ్వకుండా ఉండేలా మీరు సెట్ చేయవచ్చు. పాస్‌వర్డ్‌ను సేవ్ చేయమని మీకు ప్రాంప్ట్ వచ్చినప్పుడు, 'ఎప్పటికీ వద్దు'ను ఎంచుకోండి. మీరు ఈ పాస్‌వర్డ్‌ను సేవ్ చేయాలని తర్వాత నిర్ణయించుకుంటే, సైట్ లేదా యాప్ పేరు పక్కన ఉండే తీసివేయండి Removeని ఎంచుకోండి.
    • ఆటో సైన్ ఇన్ చేయండి: మీరు సేవ్ చేసిన సమాచారాన్ని ఉపయోగించి సైట్‌లకు, యాప్‌లకు మీరు ఆటోమేటిక్‌గా సైన్ ఇన్ చేయవచ్చు. సైన్ ఇన్ చేసే ముందు మీరు నిర్ధారించాలని అనుకున్నట్లయితే, మీరు ఆటో సైన్ ఇన్‌ను ఆఫ్ చేసుకోవచ్చు.
    • పాస్‌వర్డ్ హెచ్చరికలు: సేవ్ చేసిన మీ పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో కనుగొనబడినప్పుడు మీరు నోటిఫికేషన్‌లను పొందవచ్చు.
    • పరికరంలో ఎన్‌క్రిప్షన్: పాస్‌వర్డ్‌లు Google Password Managerలో సేవ్ కావడానికి ముందు, వాటిని మీ పరికరంలో ఎన్‌క్రిప్ట్ చేయండి. మీ పరికరంలో పాస్‌వర్డ్‌లను ఎలా ఎన్‌క్రిప్ట్ చేయాలో తెలుసుకోండి. ఈ ఫీచర్ Workspace యూజర్‌లకు అందుబాటులో లేదు.

Google Password Manager మీ డేటాను ఎలా హ్యాండిల్ చేస్తుంది

మీ పరికరంలో సర్వీసు‌లను అమలు చేయడానికి Google Password Manager నిర్దిష్ట సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ ఫంక్షనాలిటీలో కొంత, Google Play సర్వీసులను ఉపయోగిస్తుంది. ఉదాహరణకు, Google Password Manager ఈ సమాచారాన్ని ఎనలిటిక్స్, అలాగే పరిష్కార ప్రక్రియ ప్రయోజనాల కోసం సేకరిస్తుంది:

  • పేజీ వీక్షణలు, యాప్‌లోని ట్యాప్‌లు
  • క్రాష్ లాగ్‌లు
  • సమస్య విశ్లేషణలు

డేటా ఉల్లంఘన ప్రమాదాన్ని తగ్గించడానికి మీ సింక్ చేసిన డేటా ఎల్లప్పుడూ పారిశ్రామిక రంగంలోని అత్యధునాతన ఎన్‌క్రిప్షన్ ద్వారా రక్షించబడుతుంది. పారిశ్రామిక రంగంలోని అత్యధునాతన ఎన్‌క్రిప్షన్ గురించి మరింత తెలుసుకోండి.

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6044049857845969383
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false