పాస్‌వర్డ్ హెచ్చరికతో ఫిషింగ్‌ను నివారించండి

మీరు Gmail లేదా YouTubeలో స్టోర్ చేసిన సమాచారంతో సహా మీ Google ఖాతాను సురక్షితంగా ఉంచడంలో పాస్‌వర్డ్ హెచ్చరిక సహాయపడుతుంది.

మీరు మీ Chrome బ్రౌజర్‌కు పాస్‌వర్డ్ హెచ్చరికను జోడించినప్పుడు, Google యేతర సైట్‌లకు సైన్ ఇన్ చేయడానికి మీ Google పాస్‌వర్డ్‌ను ఉపయోగించినప్పుడు మీరు ఆటోమేటిక్ అలర్ట్‌లను పొందుతారు.

పాస్‌వర్డ్ హెచ్చరికను ఆన్ చేయండి
  1. Google Chromeలో, మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. Chrome స్టోర్‌కు వెళ్లి, పాస్‌వర్డ్ హెచ్చరికను డౌన్‌లోడ్ చేయండి.
  3. స్క్రీన్‌పై కనిపించే సూచనలను ఫాలో అవ్వండి.
  4. ప్రారంభించడానికి మీ Google ఖాతాకు మళ్లీ సైన్ ఇన్ చేయండి.

పాస్‌వర్డ్ హెచ్చరిక అనేది Chrome బ్రౌజర్‌కు మాత్రమే పని చేస్తుందని గుర్తుంచుకోండి.

గమనిక: మీరు Google Workspace అడ్మినిస్ట్రేటర్ అయితే, ఇక్కడ మీ సంస్థ పాస్‌వర్డ్ హెచ్చరికను ఎలా ఉపయోగించవచ్చో అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

పాస్‌వర్డ్ హెచ్చరికను ఆఫ్ చేయండి
  1. Google Chromeలో, మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. పైన కుడి వైపున, మరిన్ని మరిన్నిను ఎంచుకోండి.

  3. మరిన్ని టూల్స్‌ను ఎంచుకోండి.
  4. ఎక్స్‌టెన్షన్‌లను ఎంచుకోండి.
  5. ఎక్స్‌టెన్షన్‌ల లిస్ట్‌లో పాస్‌వర్డ్ హెచ్చరికను కనుగొనండి.
  6. తీసివేయండి తీసివేయండిను ఎంచుకోండి.
పాస్‌వర్డ్ హెచ్చరిక ఎలా పని చేస్తుంది

మీరు పాస్‌వర్డ్ హెచ్చరికను ఆన్ చేసిన తర్వాత, Google యేతర సైట్‌లకు సైన్ ఇన్ చేయడానికి మీ Google ఖాతా పాస్‌వర్డ్ ఏ సమయంలో ఉపయోగించబడినా మీరు అలర్ట్‌ను పొందుతారు.

మీరు అలర్ట్‌ను విస్మరించవచ్చు లేదా చర్య తీసుకోవచ్చు. ఉదాహరణకు, మీ ఖాతా సమాచారం వేరెవరి దగ్గరైనా ఉందని మీరు భావిస్తే, మీ పాస్‌వర్డ్‌ను మార్చండి.

పాస్‌వర్డ్ హెచ్చరిక మీ పాస్‌వర్డ్ లేదా కీస్ట్రోక్‌లను శాశ్వతంగా స్టోర్ చేయదని లేదా ఎవరికీ పంపదని గుర్తుంచుకోండి.

మీ Google ఖాతాను సురక్షితంగా ఉంచడం గురించి మరింత తెలుసుకోండి.

మీరు మీ Google ఖాతా పాస్‌వర్డ్‌ను ఎప్పుడు ఉపయోగించవచ్చు?

Gmail, YouTube, Chrome, Play వంటి Google-సంబంధిత యాప్‌లు, సర్వీస్‌లకు సైన్ ఇన్ చేయడానికి మీరు ఇప్పటికీ మీ Google ఖాతా పాస్‌వర్డ్‌ను ఉపయోగించవచ్చు. Google యేతర సైట్‌లో అదే పాస్‌వర్డ్‌ను ఉపయోగించడం వలన పాస్‌వర్డ్ హెచ్చరిక ట్రిగ్గర్ అవుతుంది.

మీరు మీ అన్ని ఖాతాలకు ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, మీ Google ఖాతా పాస్‌వర్డ్‌ను మార్చాల్సిందిగా మేము సిఫార్సు చేస్తున్నాము. లేకపోతే, మీ ఖాతాలలో ఒకటి చోరీకి గురైతే, అన్ని ఖాతాలు చోరీకి గురి కావచ్చు.

పాస్‌వర్డ్ హెచ్చరికకు సంబంధించి ప్రశ్నలు ఉన్నాయా? ఇక్కడ చెక్ చేయండి.

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
18314018503090632781
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false