మీరు Android డివైజ్‌లోకి లేదా Chrome బ్రౌజర్‌లోకి సైన్ ఇన్ చేసినప్పుడు, Google Password Managerతో మీ Google ఖాతా పాస్‌వర్డ్‌లు, పాస్-కీలను సేవ్ చేయవచ్చు. మీరు అదే ఖాతాతో సైన్ ఇన్ చేసిన మీ డివైజ్‌లన్నింటిలో యాప్‌లకు, సైట్‌లకు సైన్ ఇన్ చేయడానికి వాటిని ఉపయోగించవచ్చు. మీరు పాస్‌వర్డ్‌ను ఇప్పటికే సేవ్ చేసి ఉంటే, పాస్-కీలను ఆటోమేటిక్‌గా క్రియేట్ చేసేందుకు సైట్‌లు, యాప్‌లను అనుమతించడానికి కూడా మీరు ఎంచుకోవచ్చు.
మీ Google ఖాతాకు పాస్‌వర్డ్‌లు, పాస్-కీలను సేవ్ చేయండి
మీరు సైట్‌లను, యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు Google Password Manager పాస్‌వర్డ్‌లను లేదా పాస్-కీలను సేవ్ చేయడాన్ని ఆఫర్ చేస్తే, అంగీకరించాలా వద్దా అనే విషయాన్ని మీరు నిర్ణయించుకోవచ్చు.
మీ సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లు, పాస్-కీలను Androidలోని Google Password Managerలో, Chromeలో లేదా passwords.google.comలో చూడవచ్చు, మేనేజ్ చేయవచ్చు.
చిట్కాలు:
- మీ డివైజ్‌లో మీకు పలు Google ఖాతాలు ఉన్నట్లయితే, ఏ Google ఖాతాకు పాస్‌వర్డ్‌ను సేవ్ చేయాలో ఎంచుకోమని Android యాప్‌లు మిమ్మల్ని ప్రాంప్ట్ చేస్తాయి.
- మీరు Chromeకు సైన్ ఇన్ చేసి ఉంటే, మీ పాస్‌వర్డ్ ఆ Google ఖాతాకు సేవ్ అవుతుంది.
పాస్‌వర్డ్‌లను, పాస్-కీలను సేవ్ చేయడానికి ఆఫర్‌లను మేనేజ్ చేయండి
మీరు Google Password Managerను ఉపయోగించి యాప్‌లు, సైట్‌ల కోసం పాస్‌వర్డ్‌లను, పాస్-కీలను సేవ్ చేయవచ్చు. సెట్టింగ్‌లలో పాస్‌వర్డ్‌లను, పాస్-కీలను సేవ్ చేయడాన్ని Google Password Manager ఆఫర్ చేయాలా వద్దా అనేదాన్ని మీరు ఎంచుకోవచ్చు.
"పాస్‌వర్డ్‌లను, పాస్-కీలను సేవ్ చేయడాన్ని ఆఫర్ చేయడం" అనేది ఆటోమేటిక్‌గా ఆన్‌లో ఉంటుంది, మీరు దానిని ఆఫ్ చేయవచ్చు లేదా తిరిగి ఆన్ చేయవచ్చు. మీరు ఎంటర్‌ప్రైజ్ వెర్షన్ యూజర్ అయితే, ఈ సెట్టింగ్‌ను మీ అడ్మిన్ మీ కోసం మేనేజ్ చేయవచ్చు.
- మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
- ఎగువ కుడి వైపున ఉన్న మరిన్ని
పాస్‌వర్డ్‌లు, ఆటోఫిల్
Google Password Manager ఆప్షన్‌లను ఎంచుకోండి.
- ఎడమ వైపున, సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- పాస్‌వర్డ్‌లను, పాస్-కీలను సేవ్ చేసే ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.
ఆటోమేటిక్ పాస్-కీ క్రియేషన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి
మీరు Google Password Managerలో సేవ్ చేసిన పాస్‌వర్డ్‌తో యాప్ లేదా సైట్‌లోకి సైన్ ఇన్ చేసినప్పుడు, అది మీ కోసం ఒక పాస్-కీని క్రియేట్ చేయవచ్చు. ఇలా జరిగినప్పుడు, మీ కోసం పాస్-కీ క్రియేట్ అయ్యిందని మీకు తెలియజేయడానికి Google Password Manager నోటిఫికేషన్‌ను చూపుతుంది.
- Androidలో పాస్-కీలతో యాప్‌లు, సైట్లలో సైన్ ఇన్ చేయడం గురించి మరింత తెలుసుకోండి
- పాస్-కీలు అంటే ఏమిటి, వాటిని ఉపయోగించి మీ Google ఖాతాలోకి సైన్ ఇన్ చేయడం ఎలా అనే దాని గురించి మరింత తెలుసుకోండి
- Chromeలో పాస్-కీలను ఎలా మేనేజ్ చేయాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి
ఆటోమేటిక్ పాస్-కీ క్రియేషన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి:
- మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
- ఎగువ కుడి వైపున, మరిన్ని
పాస్‌వర్డ్‌లు, ఆటోఫిల్
Google Password Manager ఆప్షన్‌లను ఎంచుకోండి.
- ఎడమ వైపున, సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- వేగంగా సైన్ ఇన్ చేయడానికి పాస్-కీని ఆటోమేటిక్‌గా క్రియేట్ చేయండిని ఆన్ లేదా ఆఫ్ చేయండి.
నిర్దిష్ట సైట్‌లు లేదా యాప్‌ల కోసం పాస్‌వర్డ్‌లను సేవ్ చేయడానికి ఆఫర్‌లను మేనేజ్ చేయండి
నిర్దిష్ట సైట్‌లకు ఎప్పటికీ పాస్‌వర్డ్‌లను సేవ్ చేయకుండా ఉండే ఆప్షన్‌ను మీరు ఎంచుకోవచ్చు. పాస్‌వర్డ్‌ను సేవ్ చేయమని మీకు ప్రాంప్ట్ వచ్చినప్పుడు, ఎప్పటికీ వద్దును ఎంచుకోండి. ఆ పాస్‌వర్డ్‌ను సేవ్ చేయడం కోసం వచ్చే ఆఫర్ మీకు మళ్లీ కనిపించదు.
పాస్‌వర్డ్‌లను సేవ్ చేయడాన్ని ఎప్పటికీ ఆఫర్ చేయని సైట్‌లను మీరు చూడవచ్చు లేదా మేనేజ్ చేయవచ్చు:
- మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
- ఎగువ కుడి వైపున ఉన్న మరిన్ని
పాస్‌వర్డ్‌లు, ఆటోఫిల్
Google Password Manager ఆప్షన్‌లను ఎంచుకోండి.
- ఎడమ వైపున, సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- "తిరస్కరణకు గురైన సైట్‌లు, యాప్‌లు" కింద, పాస్‌వర్డ్‌లను సేవ్ చేయమని ఆఫర్ చేయని వెబ్‌సైట్‌లను కనుగొనండి. సైట్‌ను తీసివేయడానికి, తీసివేయండి
ని ఎంచుకోండి.
ఆటో సైన్ ఇన్‌ను మేనేజ్ చేయండి
మీరు సేవ్ చేసిన సమాచారంతో మీరు ఆటోమేటిక్‌గా సైట్‌లు, యాప్‌లకు సైన్ ఇన్ చేయవచ్చు. మీరు సైట్ లేదా యాప్‌లోకి సైన్ ఇన్ చేసే ముందు, Google Password Manager మీ నిర్ధారణ కోసం అడగాలనుకుంటే, ఆటోమేటిక్‌గా సైన్ ఇన్ చేయండిని ఆఫ్ చేయండి.
- మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
- ఎగువ కుడి వైపున ఉన్న మరిన్ని
పాస్‌వర్డ్‌లు, ఆటోఫిల్
Google Password Manager ఆప్షన్‌లను ఎంచుకోండి.
- ఎడమ వైపున, సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- ఆటోమేటిక్‌గా సైన్ ఇన్ చేసే ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.