యాప్‌లకు సంబంధించిన లొకేషన్ అనుమతులను మేనేజ్ చేయండి

మీ కోసం ఏదైనా చర్య తీసుకోవడానికి లేదా మీకు సమాచారాన్ని అందించడానికి, మీ పరికర లొకేషన్‌ను ఉపయోగించుకునేలా యాప్‌లను మీరు అనుమతించవచ్చు. ఉదాహరణకు, రోజువారీ ప్రయాణానికి సంబంధించి ట్రాఫిక్‌ను చూపడానికి లేదా సమీపంలోని రెస్టారెంట్‌లను కనుగొనడానికి, మీ పరికర లొకేషన్‌ను యాప్‌లు ఉపయోగించవచ్చు.

ముఖ్యమైనది: ఈ దశలలో కొన్ని, Android 11లో, అలాగే ఆ తర్వాత వచ్చిన వెర్షన్‌లలో మాత్రమే పని చేస్తాయి. మీ Android వెర్షన్‌ను ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

మీ పరికర లొకేషన్‌ను ఉపయోగించే యాప్‌లను కనుగొనండి

  1. సెట్టింగ్‌లు  ను తెరవండి.
  2. లొకేషన్ ను ట్యాప్ చేయండి.
  3. యాప్ లొకేషన్ అనుమతులు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. ”ఎల్లప్పుడూ అనుమతించబడింది", “ఉపయోగంలో ఉన్నప్పుడే అనుమతించబడింది”, "ప్రతిసారి అడగండి", “అనుమతించబడలేదు” కింద, మీ పరికర లొకేషన్‌ను ఉపయోగించే యాప్‌లను కనుగొనండి.
  5. యాప్ అనుమతులను మార్చడానికి, దాన్ని ట్యాప్ చేయండి. ఆ తర్వాత, యాప్‌నకు సంబంధించి లొకేషన్ యాక్సెస్‌ను ఎంచుకోండి. యాప్ అనుమతుల గురించి తెలుసుకోండి.
చిట్కా: మీ విషయంలో ఈ దశలు పని చేయనట్లయితే, మీ పరికర తయారీదారు నుండి సహాయాన్ని పొందండి.

ఏదైనా యాప్ మీ పరికర లొకేషన్‌ను ఉపయోగించడాన్ని ఆపండి

మీ పరికర లొకేషన్‌ను ఏయే యాప్‌లు ఎప్పుడు యాక్సెస్ చేయవచ్చు, ఉపయోగించవచ్చు అనేది మీరు కంట్రోల్ చేయవచ్చు. ఉదాహరణకు, మీకు డ్రైవింగ్ దిశలను అందించడం కోసం మీ పరికర లొకేషన్‌ను ఉపయోగించేందుకు Google Mapsను మీరు అనుమతించవచ్చు, కానీ గేమ్ లేదా సోషల్ మీడియా యాప్‌లతో మీ లొకేషన్‌ను షేర్ చేయడానికి కాదు.

  1. మీ పరికర మొదటి స్క్రీన్‌పై ఉన్న, యాప్ చిహ్నాన్ని కనుగొనండి.
  2. యాప్ చిహ్నాన్ని నొక్కి, పట్టుకోండి.
  3. యాప్ సమాచారం ను ట్యాప్ చేయండి.
  4. అనుమతులు ఆ తర్వాత లొకేషన్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • ఎల్లప్పుడూ అనుమతించండి: ఏ సమయంలోనైనా మీ లొకేషన్‌ను యాప్ ఉపయోగించుకోగలదు.
    • యాప్ ఉపయోగంలో ఉన్నప్పుడు మాత్రమే అనుమతించండి: సంబంధిత యాప్‌ను మీరు ఉపయోగిస్తున్నప్పుడు మాత్రమే మీ లొకేషన్‌ను యాప్ ఉపయోగించుకోగలదు.
    • ప్రతిసారి అడగాలి: మీరు యాప్‌ను తెరిచిన ప్రతిసారి, అది మీ లొకేషన్‌ను ఉపయోగించుకోవడానికి అడుగుతుంది. మీరు యాప్‌ను మూసివేసే వరకు, అది మీ సెట్టింగ్‌ను ఉపయోగించుకోగలదు.
    • అనుమతించవద్దు: మీరు యాప్‌ను ఉపయోగిస్తున్నప్పటికీ, మీ లొకేషన్‌ను యాప్ ఉపయోగించుకోలేదు.
  6. మీరు లొకేషన్ యాక్సెస్‌ను అనుమతించి ఉంటే, మీరు ఖచ్చితమైన లొకేషన్‌ను ఉపయోగించండిని కూడా ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు.

చిట్కా: మీ పరికరం లొకేషన్‌ను ఉపయోగించకుండా యాప్‌లన్నింటినీ ఆపడానికి, learn how to turn off location settings.

ఏదైనా యాప్ మీ పరికర లొకేషన్‌ను ఎలా ఉపయోగించగలదో తెలుసుకోండి

ముఖ్య గమనిక: మీ పరికర లొకేషన్‌ను ఉపయోగించడానికి ఏదైనా యాప్‌నకు అనుమతి ఉన్నట్లయితే, అది మీ పరికర రమారమి లొకేషన్‌ను, ఖచ్చితమైన లొకేషన్‌ను లేదా రెండింటినీ ఉపయోగించవచ్చు.

  1. మీ పరికర మొదటి స్క్రీన్‌పై ఉన్న, యాప్ చిహ్నాన్ని కనుగొనండి.
  2. యాప్ చిహ్నాన్ని నొక్కి, పట్టుకోండి.
  3. యాప్ సమాచారం ను ట్యాప్ చేయండి.
  4. అనుమతులు ఆ తర్వాత మరిన్ని More ఆ తర్వాత అన్ని అనుమతులు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. "లొకేషన్" కింద, యాప్ రిక్వెస్ట్ చేసిన లొకేషన్ రకాన్ని మీరు కనుగొనవచ్చు. మీరు "లొకేషన్"ను కనుగొనలేకపోతే, మీ పరికర లొకేషన్‌ను ఈ యాప్ అడిగి ఉండదు.

ఈ రకమైన లొకేషన్ యాప్‌ల కోసం రిక్వెస్ట్ చేయవచ్చు:

  • రమారమి లొకేషన్: మీ పరికరం దాదాపు 3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందని ఈ యాప్ చెప్పగలదు.
  • ఖచ్చితమైన లొకేషన్: మీ పరికర ఖచ్చితమైన లొకేషన్‌ను ఈ యాప్ చెప్పగలదు.

Why apps ask you to change location settings

  • "[కొనసాగించడానికి / మెరుగైన ఎక్స్‌పీరియన్స్ కోసం], మీ పరికరం లొకేషన్ ఖచ్చితత్వాన్ని” ఉపయోగించాల్సి ఉంటుంది": యాప్‌నకు సంబంధించి లొకేషన్ ఆఫ్‌లో ఉండవచ్చు లేదా ఇప్పటికే ఆన్ చేసి ఉండవచ్చు, అయితే మీ పరికర లొకేషన్‌ను మెరుగ్గా కనుగొనడానికి, మరిన్ని సెట్టింగ్‌లను లేదా సెన్సార్‌లను ఆన్ చేయాల్సిందిగా యాప్ మిమ్మల్ని అడగవచ్చు.
    • Wi-Fi కనెక్షన్: Wi-Fiని ఆన్ చేయమని లేదా Wi-Fi నెట్‌వర్క్‌ల కోసం చూడమని మీ పరికరాన్ని అనుమతించాల్సిందిగా, యాప్ మిమ్మల్ని అడగవచ్చు. "లొకేషన్ ఖచ్చితత్వం" ఆన్‌లో ఉన్నప్పుడు Wi-Fi కోసం స్కాన్ చేయడం అనేది మీ పరికర లొకేషన్‌ను మరింత ఖచ్చితంగా కనుగొనడంలో సహాయపడుతుంది.
    • లొకేషన్ ఖచ్చితత్వం: మీ పరికర లొకేషన్‌ను మరింత ఖచ్చితంగా కనుగొనడానికి యాప్‌లను అనుమతించండి. లొకేషన్ ఖచ్చితత్వం మీ లొకేషన్‌ను ఎలా మెరుగుపరుస్తుందో తెలుసుకోండి లొకేషన్ ఖచ్చితత్వాన్ని Google లొకేషన్ సర్వీస్‌లు అని కూడా అంటారు.

Change other location settings

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

12286036351831903564
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
false
false
false
false