పోగొట్టుకున్న Android పరికరాన్ని కనుగొనండి, సురక్షితం చేయండి, లేదా ఫ్యాక్టరీ రీసెట్ చేయండి

మీరు Android పరికరాన్ని లేదా Wear OS వాచ్‌ను పోగొట్టుకున్నట్లయితే, మీరు దాన్ని రిమోట్‌గా కొనుగొనవచ్చు, లాక్ చేయవచ్చు, లేదా ఫ్యాక్టరీ రీసెట్ చేయవచ్చు. మీరు Find My Device యాప్‌తో ఫ్రెండ్‌కు వారి పోగొట్టుకున్న పరికరాన్ని కనుగొనడంలో, లాక్ చేయడంలో లేదా ఫ్యాక్టరీ రీసెట్ చేయడంలో సహాయపడవచ్చు.

మీ పరికరానికి మీరు Google ఖాతాను జోడించినట్లయితే, Find My Device ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. ఆటోమేటిక్‌గా, మీ పరికరం "అధిక ట్రాఫిక్ గల ప్రాంతాలలోని నెట్‌వర్క్‌తో మాత్రమే" సెట్టింగ్‌కు సెట్ చేయబడి ఉంటుంది, తద్వారా అది ఎన్‌క్రిప్ట్ చేసిన ఇటీవలి లొకేషన్‌లను Googleతో స్టోర్ చేస్తుంది, అలాగే క్రౌడ్‌సోర్స్ ఆధారిత Android పరికరాల నెట్‌వర్క్‌లో భాగంగా మీవి, ఇంకా ఇతరుల ఆఫ్‌లైన్ పరికరాలు రెండింటినీ కనుగొనడంలో సహాయపడుతుంది. పరికరంలో మొదట యాక్టివేట్ చేసిన ఖాతాకు, మీ పరికరం యొక్క అత్యంత ఇటీవలి లొకేషన్ అందుబాటులో ఉంటుంది.

చిట్కా: మీ Wear OS పరికరాన్ని కనుగొనడానికి, లాక్ చేయడానికి, లేదా ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి, దాన్ని Wi-Fiకి లేదా మొబైల్ డేటాకు కనెక్ట్ చేయండి.

పోగొట్టుకొన్న Android పరికరాన్ని కనుగొనడానికి సిద్ధంగా ఉండండి.

Android పరికరాన్ని సురక్షితంగా ఉంచడానికి లేదా ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి, మీ పరికరం ఇలా ఉందని నిర్ధారించుకోండి:

  • పవర్ ఉందని
  • మొబైల్ డేటాకు లేదా Wi-Fiకి కనెక్ట్ అయి ఉందని
  • Google ఖాతాకు సైన్ ఇన్ చేసి ఉందని
  • Find My Device ఆన్‌లో ఉందని
  • Google Playలో కనిపిస్తుందని
మీరు 2-దశల వెరిఫికేషన్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, 2-దశల వెరిఫికేషన్ బ్యాకప్‌లకు వెళ్లండి.

పరికరాన్ని రిమోట్‌గా కనుగొనండి, లాక్ చేయండి, లేదా ఫ్యాక్టరీ రీసెట్ చేయండి

ముఖ్య గమనిక: ఫ్యాక్టరీ రీసెట్ చేసిన తర్వాత మీరు పరికరాన్ని కనుగొంటే, దాన్ని మళ్లీ ఉపయోగించడానికి మీకు మీ Google ఖాతా పాస్‌వర్డ్ అవసరం. పరికర రక్షణ గురించి తెలుసుకోండి.

Find My Device యాప్‌ను ఉపయోగించండి
  1. మరొక Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Find My Device యాప్ ‌ను తెరవండి.
  2. సైన్ ఇన్ చేయండి.
    • ఒకవేళ మీ స్వంత పరికరాన్ని పోగొట్టుకున్నట్లయితే: [your name]‌గా కొనసాగించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • ఒకవేళ మీరు ఫ్రెండ్‌కు సహాయం చేస్తుంటే:, గెస్ట్‌గా సైన్ ఇన్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేసి, ఆపై మీ ఫ్రెండ్‌ను సైన్ ఇన్ చేయనివ్వండి.
  3. లిస్ట్ చేసిన పరికరాల నుండి, మీరు కనుగొనాలనుకుంటున్న పరికరాన్ని ఎంచుకోండి. పోగొట్టుకున్న పరికరానికి నోటిఫికేషన్ వెళ్తుంది.
  4. మీరు కనుగొనాలనుకుంటున్న Android పరికరం కోసం లాక్ స్క్రీన్ PINను అందించమని మిమ్మల్ని ప్రాంప్ట్ చేయవచ్చు. Android 9 లేదా పైన వెర్షన్‌లకు ఇది వర్తిస్తుంది. మీరు కనుగొనాలనుకుంటున్న పరికరం PINను ఉపయోగించకున్నా, లేదా Android 8 లేదా అంతకు ముందు వెర్షన్‌లలో రన్ అవుతున్నా, మీ Google పాస్‌వర్డ్ కోసం మిమ్మల్ని ప్రాంప్ట్ చేయవచ్చు.
  5. మ్యాప్‌లో, మీరు పరికర లొకేషన్ గురించి సమాచారాన్ని పొందుతారు.
    • పోగొట్టుకున్న పరికరానికి నావిగేట్ చేయడానికి, దిశలను పొందండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
      • ఈ సోర్స్‌ల నుండి మీ లొకేషన్ అంచనా వేయబడుతుంది:
        • GPS: మీ లొకేషన్‌ను దాదాపు 20 మీటర్‌ల వరకు తెలుసుకోవడానికి మేము శాటిలైట్‌లను ఉపయోగిస్తాము. మీరు భవనాల లోపల లేదా అండర్‌గ్రౌండ్‌లో ఉన్నప్పుడు, GPS కొన్నిసార్లు ఖచ్చితమైన ఫలితాలు ఇవ్వదు.
        • Wi-Fi: సమీపంలోని Wi-Fi నెట్‌వర్క్‌ల లొకేషన్ మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి మాకు సహాయపడుతుంది.
        • సెల్ టవర్‌లు: మొబైల్ డేటాకు మీ కనెక్షన్ కొన్ని వేల మీటర్‌ల వరకు ఖచ్చితంగా ఉంటుంది.
      • మీ లొకేషన్ ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడం ఎలాగో తెలుసుకోండి.
    • పరికరం 10 మీటర్‌ల లోపు ఉన్నట్లయితే, మీరు మీ పరికరానికి దగ్గరగా వచ్చినప్పుడు మీకు ఆకారం కనిపించవచ్చు: సమీపంలో ఉన్నవి కనుగొనండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. ఇది అప్‌డేట్ అవ్వడానికి కొన్ని సెకన్ల సమయం పట్టవచ్చు.
      • మీ లొకేషన్ పిన్ చుట్టూ డిస్‌ప్లే అయ్యే వ్యాసార్థం, లొకేషన్ ఖచ్చితత్వంపై మా విశ్వాసానికి సూచన.
    • మీ పరికర ప్రస్తుత లొకేషన్‌ను కనుగొనలేకపోతే, అందుబాటులో ఉంటే, అది చివరిగా గుర్తించబడిన లొకేషన్‌ను మీరు కనుగొనవచ్చు.
  6. మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి:
    • సౌండ్‌ను ప్లే చేయడం: మీ పరికరం నిశ్శబ్ద మోడ్‌కు లేదా వైబ్రేషన్‌కు సెట్ చేసి ఉన్నప్పటికీ, 5 నిమిషాలు పూర్తి వాల్యూమ్‌లో రింగ్ అవుతుంది.
      • సౌండ్‌ను ప్లే చేయడానికి, వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లను ఆన్ చేయాలి, ఇయర్‌బడ్స్ కేస్ వెలుపల ఉండాలి.
    • పరికరాన్ని సురక్షితం చేయడం: మీ PIN లేదా పాస్‌వర్డ్‌తో పరికరాన్ని లాక్ చేస్తుంది. మీరు లాక్‌ను సెట్ చేసి లేకపోతే, ఒక దాన్ని సెట్ చేయవచ్చు. వేరొకరు మీ ఫోన్‌ను మీకు తిరిగి అందిస్తున్నప్పుడు వారికి సహాయపడటానికి, మీరు లాక్ స్క్రీన్‌కు మెసేజ్‌ను లేదా ఫోన్ నంబర్‌ను జోడించవచ్చు.
    • మీరు కనుగొనలేని పరికరాన్ని తొలగించడానికి: మీ పరికరాన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి, రీసెట్ చేయడానికి, లేదా తీసివేయడానికి దశలను ఫాలో అవ్వండి.
మీ పరికరాన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేయండి, రీసెట్ చేయండి, లేదా తీసివేయండి

మీరు మీ పరికరాన్ని కనుగొనలేకపోతే దానిలోని డేటాను తొలగించవచ్చు.

ముఖ్య గమనిక: ఈ దశలు మీ పరికరంలోని మొత్తం డేటాను శాశ్వతంగా తొలగిస్తాయి, కానీ SD కార్డ్‌లను తొలగించకపోవచ్చు. పరికరాన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేసిన తర్వాత, Find My Deviceలో దాని లొకేషన్ అందుబాటులో ఉండదు.

మీరు వెబ్‌లో Find My Deviceను ఉపయోగించవచ్చు, Android పరికరాన్ని లేదా ఫ్రెండ్‌కు చెందిన Android పరికరాన్ని గెస్ట్ మోడ్‌లో ఉపయోగించవచ్చు:

  1. పరికరంలో, Find My Device యాప్ ను తెరవండి.
  2. మీరు రీసెట్ చేయాలనుకుంటున్న లేదా తీసివేయాలనుకుంటున్న పరికరాన్ని లేదా యాక్సెసరీని ఎంచుకోండి.
  3. సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • Android పరికరాన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి: పరికరాన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • యాక్సెసరీని తొలగించడానికి: పరికరాన్ని తీసివేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
చిట్కా: మీరు Find My Deviceతో మళ్లీ యాక్సెసరీని ఉపయోగించాలనుకుంటే, Find My Deviceలో దాన్ని మళ్లీ సెటప్ చేయడానికి, మీరు బ్లూటూత్ సెట్టింగ్‌లకు వెళ్లవచ్చు.
మీ Wear OS వాచ్‌తో పరికరాన్ని కనుగొనండి

Wear OS స్మార్ట్‌వాచ్‌కు కనెక్ట్ చేసి ఉన్న మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌ను మీరు పోగొట్టుకుంటే, మీ వాచ్‌తో దాన్ని కనుగొనవచ్చు. మీ వాచ్‌తో ఫోన్‌ను ఎలా కనుగొనాలో తెలుసుకోండి.

మీ Android పరికరం IMEI నంబర్‌ను కనుగొనండి

పరికరాన్ని డిజేబుల్ చేయడానికి, మీ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ మీ పరికరం IMEI నంబర్‌ను ఉపయోగించవచ్చు. మీరు పరికర IMEI నంబర్‌ను మీ ఫోన్ సెట్టింగ్‌లలో లేదా Find My Deviceతో కనుగొనవచ్చు.

ముఖ్య గమనిక: Google Pixel Tablet వంటి కొన్ని పరికరాలకు IMEI నంబర్‌లు ఉండవు.

Find My Device యాప్‌తో మీ పరికరం IMEIని కనుగొనడానికి:

  1. Find My Device యాప్ ను తెరవండి.
  2. మీరు కనుగొనాలనుకుంటున్న పరికరాన్ని ఎంచుకోండి.
  3. గేర్ చిహ్నం ను ట్యాప్ చేయండి.

వెబ్ బ్రౌజర్‌లో మీ పరికరం IMEIని కనుగొనడానికి:

  1. android.com/find‌కు వెళ్లండి.
  2. పరికరం పక్కన, చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
యాక్సెసరీ పోయినట్లు మార్క్ చేయండి

మీరు మీ యాక్సెసరీని కోల్పోయినట్లు మార్క్ చేసినప్పుడు, లాక్ స్క్రీన్‌పై ఫోన్ నంబర్‌ను, ఈమెయిల్ అడ్రస్‌ను, మెసేజ్‌ను ఉంచవచ్చు. మీరు యాక్సెసరీని పోగొట్టుకున్నారని ఎవరైనా గుర్తించినప్పుడు ఆ వ్యక్తి కూడా మీ కాంటాక్ట్ సమాచారాన్ని యాక్సెస్ చేయగలరు. తద్వారా మీ పరికరాన్ని మీకు తిరిగి ఇవ్వగలరు.

మీరు మీ యాక్సెసరీని కనెక్ట్ చేయడానికి ఉపయోగించే Android పరికరానికి సమీపంలో ఉన్నప్పుడు మీ యాక్సెసరీ ఆటోమేటిక్‌గా గుర్తించబడినట్లు మార్క్ చేయడం జరుగుతుంది.

చిట్కా: Find My Device నెట్‌వర్క్‌లో లొకేషన్‌ను గుర్తించిన తర్వాత మేము మీకు నోటిఫికేషన్ కూడా పంపుతాము.
పోగొట్టుకున్న యాక్సెసరీని లేదా ట్రాకర్ ట్యాగ్‌ను గుర్తించి దాని ఓనర్‌కు తిరిగి ఇవ్వండి

Find My Device యాప్‌లో ఎవరైనా పోగొట్టుకున్నట్లు మార్క్ చేసిన వారి యాక్సెసరీని తిరిగి ఇవ్వడంలో మీరు సహాయం చేయవచ్చు.

  1. మీ Android పరికర స్క్రీన్‌ను అన్‌లాక్ చేయండి.
  2. Android 12 లేదా అంతకు ముందు వెర్షన్‌లో, లొకేషన్ ఆన్‌లో ఉందని నిర్ధారించుకోండి. లొకేషన్‌ను ఆన్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
    • మీరు లొకేషన్‌ను ఆన్ చేసినప్పుడు మీ పరికర లొకేషన్‌ను ఇతర యాప్‌లకు, సర్వీస్‌లకు కూడా అందుబాటులో ఉంచవచ్చు.
  3. ఐటెమ్‌ను మీ ఫోన్ లేదా టాబ్లెట్ వెనుక భాగంలో పట్టుకోండి.
  4. పరికర ఓనర్ కాంటాక్ట్ సమాచారాన్ని లేదా మెసేజ్‌ను పంపినట్లయితే, మీరు దాన్ని మీ స్క్రీన్‌పై కనుగొనవచ్చు.

మరింత సహాయాన్ని పొందండి

మీరు పోగొట్టుకున్న, లేదా దొంగిలించిన పరికరాన్ని కనుగొనలేకపోతే, మీ Google ఖాతాను ఎలా సురక్షితం చేసుకోవాలో తెలుసుకోండి.

సంబంధిత రిసోర్స్‌లు

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16124146003796698087
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false