కుక్కీలు ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి

బ్రౌజర్‌లో (Chrome లేదా Safari లాంటివి) మీ Google ఖాతాను ఉపయోగించడానికి, ఒకవేళ మీరు ఇప్పటికే కుక్కీలను ఆన్ చేసి ఉండకపోతే వాటిని ఆన్ చేయండి.

ముఖ్యమైనది: కుక్కీలు ఆఫ్ చేసి ఉన్నాయని మీకు మెసేజ్ వస్తే, మీ ఖాతాను ఉపయోగించడానికి వాటిని మీరు ఆన్ చేయాల్సి ఉంటుంది.

Chrome యాప్‌లో

కుక్కీలు ఆటోమేటిక్‌గా ఆన్ చేయబడి, ఎప్పటికీ ఆన్ చేసి ఉంటాయి. కుక్కీలను ఎలా క్లియర్ చేయాలో తెలుసుకోండి.

Safari యాప్‌లో

  1. కుక్కీలను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి సూచనలను ఫాలో అవ్వండి.
  2. 5 నిమిషాలు ఆగి, Safari యాప్‌ను తెరవండి.

ఇతర బ్రౌజర్ యాప్‌లలో

సూచనల కోసం, మీ బ్రౌజర్‌కు సంబంధించి సపోర్ట్ వెబ్‌సైట్‌ను చెక్ చేయండి.

కుక్కీలు ఎందుకు సహాయకరం

మీరు సందర్శించే సైట్‌ల ద్వారా రూపొందించబడిన ఫైల్‌లను కుక్కీలు అంటారు. బ్రౌజింగ్ సమాచారాన్ని సేవ్ చేయడం ద్వారా అవి మీ ఆన్‌లైన్ అనుభవాన్ని సులభతరం చేస్తాయి. కుక్కీలతో, సైట్‌లు వీటిని చేయగలుగుతాయి:

  • మిమ్మల్ని సైన్ ఇన్ చేసి ఉంచుతాయి
  • మీ సైట్ ప్రాధాన్యతలను గుర్తుంచుకుంటాయి
  • స్థానికంగా సందర్భోచితంగా ఉండే కంటెంట్‌ను మీకు అందిస్తాయి

మా సర్వీస్‌లను మెరుగుపరచడానికి మేము కుక్కీలను ఉపయోగిస్తాము. మరింత తెలుసుకోవడానికి, మా గోప్యతా పాలసీని చదవండి.

సమస్యలను పరిష్కరించండి

మీరు మీ Google ఖాతాను ఉపయోగించలేకపోతూ, కుక్కీలు ఆఫ్ చేయబడి ఉన్నాయని మెసేజ్ అందుకుంటే:

  1. కుక్కీలను ఆన్ చేయడానికి పైన తెలిపిన దశలను ఫాలో అవ్వండి.
  2. మళ్లీ సైన్ ఇన్ చేయడానికి ట్రై చేయండి.

ఇప్పటికీ మీకు ఎర్రర్ మెసేజ్ వస్తున్నట్లయితే, పరిష్కరించే అవకాశం ఉన్న కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి. ప్రతిదాన్ని ట్రై చేసి, ఆ తర్వాత సైన్ ఇన్ చేయడానికి ట్రై చేయండి.

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10908290996551047166
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false