మీ పరికరాల నుండి సంప్రదింపు సమాచారాన్ని మేనేజ్ చేయండి

సైన్ ఇన్ చేసిన మీ పరికరాల నుండి మీ కాంటాక్ట్‌ల సమాచారాన్ని మీ Google ఖాతాలో సేవ్ చేయాలో లేదో మీరు ఎంచుకోవచ్చు, అలాగే మీరు తరచుగా వారిని సంప్రదిస్తారో లేదో కూడా పేర్కొనవచ్చు. మీరు ఏ పరికరాన్ని ఉపయోగిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా, Google సర్వీస్‌లు అంతటా ఈ కాంటాక్ట్‌లను సులభంగా ఉపయోగించుకోవడానికి వీలు కల్పించేందుకు ఈ డేటా వినియోగించబడుతుంది.

  1. మీ Google ఖాతాకు సంబంధించిన వ్యక్తులు & షేరింగ్ విభాగానికి వెళ్లండి.
  2. "కాంటాక్ట్‌లు" కింద ఉన్న, మీ పరికరాల నుండి సంప్రదింపు సమాచారాన్ని ఎంచుకోండి.
  3. 'మీ పరికరాల నుండి సంప్రదింపు సమాచారాన్ని సేవ్ చేయి' అనే ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

గమనిక: ఈ సెట్టింగ్, Google కాంటాక్ట్‌లు లేదా Android బ్యాకప్ వంటి ఇతర Google సర్వీస్‌ల ద్వారా కాంటాక్ట్ సమాచారం సేవ్ చేసే ప్రక్రియను ప్రభావితం చేయదు. అన్ని Google సర్వీస్‌లు ఈ డేటాను సేవ్ చేయవు లేదా ఉపయోగించవు.

మీ పరికరాల నుండి సంప్రదింపు సమాచారాన్ని తొలగించండి

మీరు సెట్టింగ్‌ను ఆఫ్ చేసినప్పుడు 'మీ పరికరాల నుండి సంప్రదింపు సమాచారం' మీ Google ఖాతా నుండి తొలగించబడుతుంది. మీ పరికరాల నుండి మీ కాంటాక్ట్‌లు తొలగించబడవు.

మీ పరికరాల నుండి సంప్రదింపు సమాచారం మీకు ఎలా సహాయపడుతుంది

మీరు ఏ కాంటాక్ట్‌తో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు అనే దానిని Google గుర్తించడంలో ఈ డేటా సహాయపడుతుంది. ఉదాహరణకు, మీరు మీ Google Assistant లేదా స్మార్ట్ పరికరానికి "Ok Google, సామ్‌కి కాల్ చేయి" వంటి విషయాలు చెప్పినప్పుడు, సరైన కాంటాక్ట్‌ను ఎంచుకుని కాల్ చేయడానికి ఈ డేటా సహాయపడుతుంది.

మీ పరికరాల నుండి సంప్రదింపు సమాచారం ఎందుకు ఆన్ చేయబడింది

మీ పరికరాల నుండి సంప్రదింపు సమాచారం సెట్టింగ్ ద్వారా సేవ్ చేయబడిన డేటా, మునుపటి పరికర సమాచార సెట్టింగ్ ద్వారా సేవ్ చేయబడింది. మీ అనుభవాన్ని స్థిరంగా ఉంచడంలో సహాయం చేయడానికి, మీ 'పరికర సమాచారం' సెట్టింగ్ ఆన్‌లో ఉంటే 'మీ పరికరాల నుండి సంప్రదింపు సమాచారం' ఆన్‌లో ఉంటుంది. 'మీ పరికరాల నుండి సంప్రదింపు సమాచారాన్ని' మీరు ఏ సమయంలో అయినా ఆఫ్ చేసుకోవచ్చు.

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4940198785134300801
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false